2, మార్చి 2020, సోమవారం

ఈ బొమ్మలో ఏముంది?...(మిస్టరీ)



                                              ఈ బొమ్మలో ఏముంది?  
                                                            (మిస్టరీ)


మీరు మూఢ నమ్మకాలకు దూరంగా ఉంటున్నా...ఈ బొమ్మను మాత్రం ముట్టుకోకూడదు. ఒకవేళ మీరు ఈ బొమ్మను ముట్టుకుంటే జీవితాంతం మీరు దురదృష్టవంతులైపోతారు.

నమ్మకం లేని వారు గానీ, పొరపాటున గానీ ఎవరైనా ఈ బొమ్మను ముట్టుకుంటారేమోనని ఈ బొమ్మను ఒక అద్దాల పెట్టెలో బంధించి అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో ఉన్న న్యూ ఇంగ్లాండ్ నగరంలో 'వారెన్ అక్కెల్ట్ మ్యూజియంలో' ఉంచారు.


మనవాతీతమైన శక్తులను కనుగొనడంలో నిపుణులైన వారెన్ దంపతులు వారి సహాయాన్ని కోరి వచ్చే దురదృష్టవంతులకు కష్టాలను కలిగించే వారి వద్ద ఉండే మానవాతీతమైన శక్తులు కలిగిన వస్తువులను కనుగొని వాటి బారి నుండి వాళ్ళని విముక్తులను చేయడమే కాకుండా ఆ మానవాతీత శక్తులు కలిగిన వస్తువులను వారితో తీసుకువెళ్ళి వాటిని వారి ఇంటి కింద ఉన్న ఒక గదిలో ఉంచి అవి తిరిగి బయటకు పోకుండా ఆ గదికి తాళాలు వేసి కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడదే వారి పేరుతో ఒక మ్యూజియంగా నడపబడుతోంది. అక్కడున్న వస్తువులలోని మానవాతీతమైన శక్తిని పారదోలేసినా వాటిని ముట్టుకోవటమో, పట్టుకొవటమో చేయవద్దని అక్కడ హెచ్చరిక ప్రకటనలు రాసుంటాయి.

1952 లో వారెన్ దంపతులు న్యూ ఇంగ్లాండ్ 'సైకిక్ రీసెర్చ్ సెంటర్’ అనే పేరుతో ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పరచి మానవతీతమైన శక్తుల గురించి విస్తృతమైన పరిశోధనలు జరిపి మానవాతీతమైన శక్తులను కనుగొనడంలోనూ వాటిలోని మానవాతీతమైన శక్తిని తీయడంలోనూ వారికి వారే సాటి అని నిరూపించుకున్నారు. అప్పటి ప్రజలు వీరిని గొప్ప వ్యక్తులుగా నమ్మారు. ఇప్పటి ప్రజలూ నమ్ముతున్నారు.


ఇక ఈ బొమ్మ సంగతికి వద్దాం. ఆ మ్యూజియంలోనూ ప్రజలందరినీ భయపెట్టించే సంఘటనగానూ ఈ బొమ్మ అప్పుడూ ఇప్పుడూ ప్రజలను ఆకర్షిస్తోంది. ఎంత ఆకర్షణ అంటే ఈ బొమ్మకు సంబంధించిన సంఘటనను 2 సార్లు సినిమాగా తీశారు. దానికి కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.


ఈ బొమ్మ పేరు అనబెల్లే. 1970 లో డోనా అనే అమ్మాయికి అమె తల్లి ఈ బొమ్మను కొనిచ్చింది. డొనా చదువు నిమిత్తం హాస్టల్ రూములో ఉండేది. తల్లి ఇచ్చిన బొమ్మను కూడా తనతోపాటూ రూముకు తీసుకు వచ్చింది. డోనాకు, ఆంగే అనే ఒక స్నేహితురాలు రూం మేట్ గా ఉండేది. మొదట్లో ఈ బొమ్మను మామూలు బొమ్మలాగానే అనుకుని వారు తమ రూములో అలంకరణగా ఉంచుకున్నారు. కొద్ది రోజుల తరువాత ఆ బొమ్మ తానుగా కదలసాగింది. కదలడం అంటే, బొమ్మ వారు ఉంచిన చోటులో కాకుండా కిందపడి ఉండటం గమనించారు. ఇద్దరూ కాలేజీకి వెళ్ళి రూముకు తిరిగి వచ్చినప్పుడు ఆ బొమ్మ అలా ఉండటం గమనించారు. బొమ్మ గాలికి పడి ఉండవచ్చు. కాలేజీకి వెళ్ళే హడావిడిలో మన కాళ్ళు తగిలి ఆ బొమ్మ దూరంగా వెళ్ళి ఉండవచ్చు అని సాధారణంగా తీసుకున్నారు. మరికొద్ది రోజులకు ఆ బొమ్మ కదలికలు ఎక్కువైనాయి. ఇద్దరూ కాలేజీ నుండి వచ్చిన తరువాత ఆ బొమ్మ వీరు పడుకునే పరుపు మీద పడుకోనుండటం గమనించారు. ఇద్దరూ ఆశ్చర్యపోయినా ఆ విషయాన్ని పెద్దగా తీసుకోలేదు. వీరిద్దరికీ 'లో' అని ఒక స్నేహితుడుండేవాడు. అతనికి మాత్రం ఈ బొమ్మ నచ్చేది కాదు. ఈ బొమ్మలో ఏదో చెడు ఉందని, తప్పు ఉన్నదని చెప్పేవాడు. కానీ ఆ ఇద్దరు మహిళలూ అప్పటికే ఆధునిక స్త్రీలు కాబట్టి స్నేహితుడు చెప్పిన దానిని చెవిన వేసుకోలేదు. రాను రాను బొమ్మ చేసే పనులు ఎక్కువయ్యేయి. కాలేజీ నుండి తిరిగి వచ్చిన వారిద్దరికీ ఒక రోజు తమ రూములో కొన్ని రంగు కాగితం ముక్కలు కనబడ్డాయి. ఏమిటా అని తీసి చూశారు. కొన్ని కాగితాల మీద 'మాకు సహాయం చేయండి’ అని రాసున్నాయి. మొదటిసారిగా స్నేహితులిద్దరూ ఆశ్చర్యపోయారు. భయపడ్డారు. కారణం వారి గదిలో రంగు కాగితాలే లేవు. ఈ రంగు కాగితాలు ఎక్కడి నుండి వస్తున్నాయి. ఎవరు రంగు కాగితాలతో వీటిని రాసి వారి గదిలో పడేసుంటారని ఆలోచించారు. ప్రతిరోజూ ఏవో ఎదురుచూడని విషయాలు జరుగుతున్నాయి.

ఒకరోజు డొనా తన గదికి ఆలస్యంగా వచ్చింది. అప్పుడు ఆ బొమ్మ తన పరుపు మీద పడుకోనుండటం, చేతికి నెత్తురు రావడం కనిపించింది. దగ్గరకు వెళ్ళి చూసిన డోనాకు ఎర్రటి ద్రవం ఏదో ఆ బొమ్మ చేతి నుండి కారుతూనే ఉన్నది. భయపడిన డోనా, స్నేహితుడు 'లో' కి విషయం చెప్పి సహాయపడమన్నది. మొదట వారిద్దరూ వారి అపార్ట్ మెంట్ యజమానిని కలిశారు. విషయం చెప్పిన తరువాత యజమాని తాను అపార్ట్ మెంటు కట్టే ముందు అక్కడున్న ఖాలీ స్థలంలో అనెబెల్లా అనే ఒక అమ్మాయి శవం ఉండేదని, అయితే ఎలా చనిపోయిందీ, ఆ అమ్మాయి ఎవరూ అనేది తెలియదని చెప్పేడు.


ఆ తరువాత వారు ఒక చర్చ్ ప్రీస్టును తీసుకువచ్చారు. అతను బొమ్మను చూసి ఈ బొమ్మలో ఆత్మ ఉన్నదని, అయితే అది ఏమీ చేయదని చెప్పేడు. డోనా బొమ్మ ఉంచుకోవడానికి అంగీకరించింది. ఆమె స్నేహితుడికి మాత్రం అది నచ్చలేదు. అప్పటి నుండి 'లో' కి కలలు రావడం, రాత్రిపూట ఎవరో తన గొంతు పిసకటం లాంటి అనుభూతి కలిగేది. అతని శరీరంపై అక్కడక్కడా గీతలు కనబడేవి. కానీ రెండు రోజుల తరువాత గీతలు మాయమయ్యేవి.


అప్పుడు ఇద్దరూ కలిసి వరెన్ దంపతులు దగ్గరకు వెళ్ళి విషయం తెలిపారు. వారు వచ్చి ఆ బొమ్మను పరిశీలించి ఆ బొమ్మను ఒక ఆత్మ ఆవహించిందని, కానీ ఆత్మలు బొమ్మలను ఆవహించవని, బహుశా డోనాను ఆవహించడానికి వచ్చి ఉంటుందని తెలిపారు. వారి అనుమతి తీసుకుని ఆ బొమ్మను పట్టుకుపోయి తమ గదిలో బంధించారు. కానీ ఆ బొమ్మ మళ్ళీ డోనా రూముకు వచ్చేది. అందుకని వారెన్ దంపతులు ఆ బొమ్మను ఒక అద్దాల పెట్టెలో ఉంచి తాళం వేశేరు. ఆ బొమ్మ ఎవరి దగ్గరుంటే వారికి కష్టాలు తప్పవని తమ పరిశోధనలో తెలుసుకున్నారు.

ఈ నిజమైన కథను, మరికొంత కల్పిత కథనంతో ఇప్పటికి రెండు సినిమాలు తీశారు. ఒకటి 'ది కాంజ్యూరింగ్', రెండవది ‘అనెబెల్లా’.

Image Credit: To those who took the original *****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి