12, మార్చి 2020, గురువారం

పువ్వులో ఒక తుఫాన...(కథ)
                                                పువ్వులో ఒక తుఫాన
                                                               (కథ)


ఇందూజాకి పెళ్ళి నిశ్చయించారని తెలుసుకున్న వెంటనే, ఆమె ప్రేమికుడు కిరణ్ విల విల లాడిపోయాడు.

'నాకు దొరకని ఇందూజా ఇంకెవరికీ దొరక కూడదు’ అని గోల పెట్టాడు. అతని స్నేహితుడు రవి కి కూడా కళ్ళు ఎర్రబడ్డాయి.

స్నేహితులిద్దరూ ఇందూజాను చంపటానికి రెడీ అయ్యారు.

అదే సమయంలో కిరణ్ ఇంటికి వచ్చింది ఇందూజా.

"కూర్చో ఇందూజా "

"పరవాలేదు...మీరు బాగున్నారా?"

"ఎలా బాగుండ గలను?"

"నా పరిస్థితి మీ దగ్గర ఇదివరకే చెప్పాను, అయినా మీరు ఇంకా పాతవి మరిచిపోలేదా?"

"క్షమించాలి ఇందూజా...నిన్ను మరిచిపోయే శక్తిని నాకు ఆ దేవుడు వల్ల కూడా ఇవ్వటం కుదరదు"

"ఇవి పిచ్చి మాటలు"

"నిజమే ఇందూజా...నువ్వు నాకు దొరకలేదనే విషయం నాకు తెలిసిన రోజే, నేను పిచ్చివాడ్ని అయిపోయాను. నాకు దొరకని నువ్వు ఇంకెవరికీ దొరకకూడదని నిర్ణయించుకున్నాను. అందువల్ల..."

"నన్ను చంపబోతావా?"

"అవును. అదే చెయ్యబోతాను. కానీ, నిన్ను నేను చంపను. వీడు చంపుతాడు. ఎందుకంటే నిన్ను చంపగలిగే శక్తి, మనసు నాకు లేదు... రవీ...ఊ...ఈమె కథను త్వరగా ముగించరా..." కిరణ్ అరిచాడు.

రవీ ఆమెను పొడవటానికి కత్తి తీసి, ఆమె దగ్గరకు వస్తున్నప్పుడు, ఆమె చేతుల్లో విరిగిన సీసా.

ఎదురుగా ఉన్న ఇద్దరూ షాకై నిలబడగా, ఇందూజా మాట్లాడింది.

"నన్ను ప్రేమించింది నువ్వు...ఓటమిలో గాయపడ్డది నువ్వు...కానీ, నన్ను చంపేది మాత్రం ఇంకొకడా? తనని ప్రేమించిన అమ్మాయిని ఇంకొకడు కన్నెత్తి చూస్తేనే, వాడ్ని కాల్చి బూడిద చేయాలనే తపన కలిగిన వాడే నిజమైన మగాడు, ప్రేమికుడు.

ప్రేమించిన అమ్మాయి ప్రాణం తీయటానికి ఇంకో మనిషిని పెట్టే నువ్వు...రేపు నీ వొంటికి వైకల్యం వచ్చిందంటే, నా మంచానికి ఇంకొకడ్ని ఏర్పాటు చేస్తావు. అంతే కదా?" ఆవేశపడింది.

"ఇందూజా...ఏదో తొందరలో..." తడబడ్డాడు కిరణ్.

"తొందర పడింది నువ్వు మాత్రమే కాదు...నేను కూడా. నీ యొక్క పరిస్థితి తెలుసుకుని, మనసు మార్చుకుని, పెళ్ళి పత్రిక ప్రింట్ అయిన తరువాత కూడా, ధైర్యంగా నిన్ను పెళ్ళి చేసుకుని హాయిగా జీవితం గడుపుదామని వచ్చాను చూడు...నా తొందరపాటుకు నన్ను నేను..."

సుడిగాలి లాగా మాట్లాడిన ఇందూజా, చేతిలో ఉన్న సీసాను వేగంగా గోడపైకి విసిరేసి వేగంగా బయటకు వెళ్ళిపోయింది.

ఆమెను ఆ ఇద్దరూ అడ్డగించలేకపోయారు.

********************************************సమాప్తం*********************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి