20, మార్చి 2020, శుక్రవారం

దేవుని హస్తం?...మిస్టరీ




                                                         దేవుని హస్తం?
                                                              (మిస్టరీ)

                                             అంతరిక్షంలో దేవుని హస్తం!?

మనం ఇదివరకే దేవుని కంటి చిత్రాలను చూశాము...ఇప్పుడు మనకు దేవుని హస్తం యొక్క మొదటి చిత్రం చూస్తున్నాము.

దేవుని హస్తం: అంతరిక్షంలోని లోతైన ప్రదేశంలో సూపర్నోవా యొక్క అద్భుతమైన ఎక్స్-రే చిత్రాన్ని నాసా శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

మతం మరియు ఖగోళ శాస్త్రం తరచూ ఒకదానికొకటి ఒకే విషయాన్ని అంగీకరించక పోవచ్చు, కాని కొత్త నాసా ఎక్స్-రే చిత్రం "దేవుని హస్తం" ను పోలి ఉండే ఒక ఖగోళ వస్తువును కనుగొన్నది.

విశ్వంలో ఒక నక్షత్రం పేలినప్పుడు, ఆ పేలుడులో నుండి అపారమైన మేఘంలాంటి పదార్థం బయటకు వచ్చినప్పుడు విశ్వంలో "హ్యాండ్ ఆఫ్ గాడ్" ఫోటో ఉత్పత్తి చేయబడింది. ఇది నాసా యొక్క న్యూక్లియర్ స్పెక్ట్రోస్కోపిక్ టెలిస్కోప్ అర్రే, లేదా న్యూస్టార్ అనే అధిక శక్తి గల ఎక్స్-కిరణాలలో మెరుస్తూ, ఫోటోలో నీలం రంగులో కనబడింది. గతంలో నాసా యొక్క చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ తక్కువ-శక్తి ఎక్స్ రే -కిరణాలను ఉపయోగించి చిత్రించినప్పుడు ఆకుపచ్చ మరియు ఎరుపు భాగాలుగా కనబడింది.

దేవుని హస్తం: 12 మైళ్ల వ్యాసం కలిగిన చిన్న, దట్టమైన వస్తువు, 150 కాంతి సంవత్సరాల వరకు విస్తరించి ఉన్నది.

"న్యూస్టార్ టెలెస్కోప్ తన యొక్క ప్రత్యేక దృక్పథంతో, అత్యధిక శక్తి గల ఎక్స్ రే-కిరణాలతో పేలిన నక్షత్రం నుండి వెలువడిన అపారమైన మేఘంలాంటి పదార్థంను బాగా అధ్యయనం చేసి ఆ పధార్ధ ప్రాంతాలను సరికొత్త వెలుగులో చూపిస్తోంది " అని పసాదేనాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన న్యూస్టార్ టెలిస్కోప్ యొక్క ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ఫియోనా హారిసన్ ఒక ప్రకటనలో చెప్పారు.

నాసా యొక్క స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ నుండి వచ్చిన ఈ పరారుణ చిత్రం హెలిక్స్ నెబ్యులాను చూపిస్తోంది. ఇది కాస్మిక్ నక్షత్రం. ఖగోళ శాస్త్రవేత్తలు దాని స్పష్టమైన రంగులు మరియు ఒక పెద్ద కంటికి విలక్షణమైన పోలికల ఆకారం కలిగియుండతంతో దాన్ని కన్నుతో పోల్చారు. కుంభం రాశిలో 700 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నిహారిక, గ్రహాల నిహారిక అనే వస్తువుల వర్గానికి చెందినది ఇది. 18 వ శతాబ్దంలోనే కనుగొనబడిన ఈ రంగురంగుల అందాలకు వారి పెట్టిన పేరు దేవుని కన్ను.

ఈ కొత్త చిత్రం, ఒక సూపర్నోవాలో పేలిన ఒక నక్షత్రం యొక్క దట్టమైన అవశేషాలచే ఉత్పత్తి చేయబడిన, తిరుగుతున్న వాయువు(పల్సర్ విండ్). దీనిని PSR B1509-58 (సంక్షిప్తంగా B1509) అని పిలుస్తారు, ఇది సెకనుకు 7 సార్లు తిరుగుతుంది, ఇది నక్షత్రాల పేలుడు సమయంలో బయటకు వచ్చే పదార్థాలు కలిగినది. ఈ కణాలు సమీపంలోని అయస్కాంత క్షేత్రాలతో సంకర్షణ చెందుతున్నప్పుడు, అవి చేతి ఆకారంలో ఎక్స్-రే వెలుగును ఉత్పత్తి చేస్తాయి. (తిరుగుతున్న వాయువు ప్రకాశవంతమైన తెల్లని ప్రదేశానికి సమీపంలో ఉంది, కానీ దానిని చూడలేము, నాసా అధికారులు తెలిపారు).

విసర్జించిన పదార్థం వాస్తవానికి హస్తం ఆకారాన్ని చూపిస్తోందా లేదా పల్సర్ యొక్క కణాలతో దాని పరస్పర చర్య ఆ విధంగా కనిపించేలా చేస్తుందో లేదో శాస్త్రవేత్తలకు తెలియటం లేదు.

"హస్తం ఆకారం దృష్టి భ్రమా, కాదా, అని మాకు తెలియదు" అని మాంట్రియల్‌ లోని మెక్‌గిల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాత్రవేత్త హాంగ్‌జున్ అన్ ఒక ప్రకటనలో తెలిపారు. "న్యూ స్టార్ టెలెస్కోప్ మూలంగా చూస్తే, హస్తం పిడికిలిలా కనిపిస్తోంది. ఇది మాకు కొన్ని ఆధారాలు ఇస్తోంది."

ఈ ఆశ్చర్యకరమైన చిత్రాన్ని నాసా యొక్క చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ తీసింది, ఇది భూమి యొక్క ఉపరితలం నుండి 360 మైళ్ళ చుట్టూ ఉన్న కక్ష్యలో ఉంది. ఇక్కడ చిత్రీకరించిన పేలుడు వాస్తవానికి 17,000 సంవత్సరాల క్రితం జరిగిందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Image Credit: To those who took the original photos.
***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి