వీళ్ళ ప్రేమ గురించి ఎలాగో తెలుసుకున్న శాంతి తండ్రి ప్రభాకర్ రావ్ గారు, తన కారును శ్రీరామ్ కు దగ్గరగా తీసుకువెళ్ళి ఆపాడు.కారు తలుపు తీసుకుని కిందకు దిగాడు.
"నువ్వేనా శ్రీరామ్...?"
"అవును సార్... మీరు"
"నేను శాంతి నాన్నను. నీ మనసులో ఏమనుకుంటున్నావు? నువ్వు కష్టపడి, చెమటోడ్చి ముప్పై రోజులకు సంపాదించే డబ్బు, శాంతి యోక్క మూడురోజుల ఖర్చుకు కూడా సరిపోదు తెలుసా? అలాంటప్పుడు అమెను ప్రేమించటం నీకు అన్యాయంగా తెలియటం లేదూ...?"
"నేనూ, శాంతి ఒకరినోకరు ప్రాణానికి ప్రాణంగా..."
"ఏమిటి కాకరకాయ ప్రేమ! ఇకమీదట శాంతిని చూడటమో, మాట్లాడటమో...అంతెందుకు తలచుకోవటమో చేయకూడదు. శాంతికి సంబంధాలు చూస్తున్నాము. అతి త్వరలో అమెరికా వెళ్ళి 'సెటిల్’ అవబోతోంది. అందువల్ల..." అంటూ, కారు డోర్ తెరిచి ఒక బ్యాగ్ తీసారు.
"ఇందులో ఐదు లక్షలు ఉన్నాయి. తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో. ఈ నిమిషం నుండి నా కూతుర్ని ఏ కారణంగానూ కలుసుకోకూడదు. ఈ ఊర్లోనే ఉండకూడదు. ఇందా తీసుకో..." అన్నారు ప్రభాకర్ రావ్ గారు.
'ఈ డబ్బు తీసుకుంటే ప్రేమకు మర్యాద ఏముంది? ఇంతవరకు ఒకరు లేకుండా మరొకరం లేమనుకుంటూ, నిజంగా ప్రేమించుకున్న ప్రేమ అబద్దం అయిపోదూ?
ఇది పెట్టుకుని ఊరు వదిలి వెళ్ళిపోవాలా? ఇది నావల్ల ఎలా కుదురుతుంది?
ఇంట్లో ఆరొగ్యం బాగలేని తల్లి. చిన్న జీతంతో కుటుంబ భారాన్ని మోస్తూ నన్నూ ఒక మనిషిగా తీర్చి దిద్దిన నాన్న. చదువుకుంటున్న తమ్ముడు. పెళ్ళి వయసులో చెల్లి...వీళ్ళందరినీ వదిలిపెట్టి ఈ డబ్బుతో వెళ్ళి ఎన్ని రోజులు నేను ప్రశాంతంగా ఉండగలను? నా కుటుంబం కష్టపడుతున్నప్పుడు నేను మాత్రం ఉల్లాసముగా ఊరు తిరగటం? తప్పు...చాలా పెద్ద తప్పు’
"ఏమిటి శ్రీరామ్ ఆలొచిస్తున్నావు...ఇదిగో తీసుకో... ఈ డబ్బు చాలదనుకుంటే ధైర్యంగా చెప్పు, మరో పది లక్షలు కలిపి ఇస్తాను" డబ్బు సంచీని జాపాడు.
ఆయన గొంతు విన్న తరువాత తన దీర్గ ఆలొచన నుంచి బయటపడ్డాడు శ్రీరామ్.
"సారీ సార్... నా ప్రేమను డబ్బుకు ఆమ్మటానికి నాకు ఇష్టంలేదు. నాది నిజమైన ప్రేమ. అన్ని ప్రేమలూ గెలవాలనే చట్టం ఏమీ లేదు. ఓడొపోవటంలో ముగిసినా నా ప్రేమ నిజమైనది. ప్రేమికురాలు నన్ను వదిలిపెట్టి వెళ్ళినా పరవాలేదు. నా మనసును నేను మార్చుకోను. అదే సమయం ఇంకమీదట ఏ విధంగానూ శాంతి యొక్క జీవితంలో క్రాస్ చేయను"
"ఇప్పుడు నాకు నా కుటుంబమే ముఖ్యం. ఇన్నిరోజులు నన్ను పెంచి, పోషించి, చదివించి ఒక మనిషిగా తీర్చి దిద్దిన తల్లి-తండ్రులను వదిలిపెట్టి, సొంత వాళ్ళను మరిచి...ఏక్కడికో వెళ్ళి జీవించడం నాకు ఇష్టంలేదు. నేను వస్తాను"....చేతులెత్తి నమస్కరించి బయలుదేరాడు శ్రీరామ్.
అప్పుడు --
కారు వెనుక డోర్ తెరుచుకుని క్రిందకు దిగింది శాంతి.
ఆశ్చర్య పోయాడు శ్రీరామ్.
"చూశావా నాన్నా...? 'నా శ్రీరామ్ ఎంత మంచివాడో, మా ప్రేమ నిజమైనదీ అని ఎన్నిసార్లు చెప్పినా మీరు వినకుండా ఆయనకు 'టెస్ట్' పెట్టి చూశారు. ఇప్పుడు అర్ధమయ్యిందా...?"అన్నది.
"అవునమ్మా...నువ్వు చెప్పింది నూటికి నూరు శాతం నిజమ్మేనమ్మా..." అన్న శాంతి తండ్రి, శ్రీరామ్ ను చూసి “చాలా ధ్యాంక్స్ తమ్ముడూ..." అన్నాడు సంతోషంగా.
"సార్...”
"సాధారణ కుటుంబానికి చెందినవాడివి. చిన్న ఉద్యోగంలో ఉన్నావు. కష్టమైన కుటుంబ పరిస్థితి. ఇలా ఉన్నా నేను ఇచ్చిన డబ్బుకు ఆశపడక 'ప్రేమ పోతే పోనీ' అని కుటుంబాన్ని అభిమానించే నీ ప్రేమ బావనను గౌరవిస్తున్నాను. ఖచ్చితంగా నా కుతురుని బాగా చూసుకుంటావు అనే నమ్మకం నా మనసులో బలంగా కూర్చుంది. డబ్బును ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. కాని ప్రేమ, అభిమానాం , కుటుంబాలలో వంశపారంపర్యంగా రావాలి. నిజంగానే నువ్వు చాలా గొప్పవాడివి..."
శ్రీరామ్ సిగుపడ్డాడు.
"అరె...మీ చేతులిలా ఇవ్వండి..." అని శ్రీరామ్ చేతులు పట్టుకుని షేక్ హ్యాండ్ ఇస్తుంటే, శ్రీరామ్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి