చిన్నారి చిన్న కోరిక...(కథ)...19/05/21 న ప్రచురణ అవుతుంది

ప్రపంచంలోని మరికొన్ని అత్యంత ఆధ్యాత్మిక ప్రదేశాలు...(ఆర్టికల్)...21/05/21 న ప్రచురణ అవుతుంది

ప్రేమ ఎంత కఠినమో…(పూర్తి నవల)...23/05/21 న ప్రచురణ అవుతుంది

24, మార్చి 2020, మంగళవారం

శాశ్వత మెరుపులు....(ఆసక్తి & మిస్టరీ)                                                       శాశ్వత మెరుపులు
                                                         (ఆసక్తి & మిస్టరీ)


శాశ్వత మెరుపులు: వెనిజులా దేశంలోలోని కాటటుంబో నది ప్రాంతంలో జరుగుతున్న ప్రత్యేకమైన దృగ్విషయం ఇది. ఇలా వేలాది సంవత్సరాలుగా దాదాపు రోజు విడిచి రోజు రాత్రిపూట మెరుపుల తుఫాన, రోజుకు కనీసం 10 గంటలు సేపు ఉంటుందట. కొన్ని సమయాలలో సంవత్సరం అంతా కూడా ఉంటుంది.


వెనిజులా దేశంలో వున్న ఒక ప్రాంతం… ఒక వింతైన, ఉగ్రమైన తుఫానుకు నిలయం. రాత్రి ఆకాశంలో కాంతి వంపుల యొక్క మరొక అద్భుతమైన పేలుడు, దిగువ కాటటుంబో నదిని నాటకీయంగా ప్రకాశింపచేస్తుంది.


ఇది వాయువ్య వెనిజులా యొక్క ఒక మూలలో ఉన్నది. దీనిని 'రెలాంపాగో డెల్ కాటటంబో' (నిత్య తుఫాను) అని పిలుస్తారు. ప్రత్యేకమైన ఈ వాతావరణ దృగ్విషయం సంవత్సరానికి 1.2 మిల్లియన్ల మెరుపు దాడులను ఉత్పత్తి చేస్తుంది. ఈ మెరుపులు దాదాపు 250 మైళ్ళ దూరం నుండి కనిపపిస్తాయి.

ఈ నిత్య తుఫాను మేఘాలు ప్రతిసారి ఒకే చోట, మారకైబో సరస్సు పైన ఐదు మైళ్ళ ఎత్తులో సంవత్సరానికి కనీసం 160 రాత్రులు గుమికూడి రోజుకు 10 గంటలసేపు మేరుపుల కళను ప్రదర్సిస్తుంది.


ఈ నిరంతర తుఫానులను వివరించడానికి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. అత్యధిక వేగమైన గాలులు సరస్సు మీదగా వీస్తూ మేఘాలను తోసుకువెళ్ళి ఆండియన్ పర్వతాలను ఢీ కొనడం వలన అక్కడ మేఘాలు గుముకూడుతాయి. మరికొందరు, అక్కడున్న చిత్తడి బురద నేల వలన మీథేన్ వాయువు విడుదల అవుతుంది. ఆ వాయువే ఈ మేఘాలు గుమికూడటానికి కారణం అంటున్నారు.


ఎలా చూసినా ఇది వెనిజులా ప్రజలకు గర్వించదగిన చిహ్నంగా మారింది. లోప్ డి వేగా రాసిన 'లా డ్రాగోంటియా' అనే పురాణ కవితలో ఈ మెరుపుల ప్రదర్సన గురించి ప్రస్తావించబడింది. ఇంకొకటి, 1595 లో మారకైబో నగరంపై ఫ్రాన్సిస్ డ్రేక్ ప్రయత్నించిన దాడి ఈ మెరుపుల వలన ఆగిపోయింది. అలా ఆ మెరుపులు వెనుజూలా దేశానికి సహాయపడ్డాయి.


ఈ మెరుపుల తుఫాను స్థానిక మత్స్యకారులకు సహజ లైట్ హౌస్ గా పనిచేస్తుంది, వారు ఎటువంటి సమస్య లేకుండా రాత్రి సమయంలో నావిగేట్ చేయగలరు. కొన్ని సందర్భాల్లో ఈ దృగ్విషయం కొన్ని వారాలకు ఆగిపోయింది. ఇటీవల 2010 లో అలా జరిగింది. ఇది తీవ్ర కరువు ఫలితంగా ఉంటుందని స్థానికులు ఆందోళన చెందారు, జలవిద్యుత్‌పై ఎక్కువగా ఆధారపడే దేశంలో అది విద్యుత్ కొరతకు దారితీసింది.


కానీ ఐదు వారాల నిశ్శబ్దం తరువాత కాకోఫోనీ (మెరుపుల తుఫాను) తిరిగి ప్రారంభమైంది.

1906 లో కొలంబియా మరియు ఈక్వెడార్ తీరంలో భారీ భూకంపం సంభవించిన తరువాత సునామీ సంభవించింది. అప్పుడు కూడా ఈ దృగ్విషయం కొన్ని వారాలకు ఆగిపోయింది.


కొంతమంది శాస్త్రవేత్తలు ఈ నిత్య తుఫాను కారణం భూగ్రహం పైన ట్రోపోస్పిరిక్ (Tropospheric) ఓజోన్ యొక్క అతిపెద్ద జనరేటర్ గా భావిస్తారు.
ఈ తుఫాను నిమిషానికి సగటున 28 మెరుపులను ఉత్పత్తి చేస్తుంది. అలా వదలకుండా కనీసం 10 గంటల వరకు ఉత్పత్తి చేస్తుంది. కొన్నిసార్లు గంటకు 3,600 మెరుపులను విడుదల చేస్తుంది. కొన్ని సమయాలలో అత్యంత ఉగ్రంగా రోజుకు 40,000 మెరుపులను ఉత్పత్తి చేస్తుంది.

Images Credit: To those who took the original photos. ************************************************************************************************

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి