14, మార్చి 2020, శనివారం

అంతరిక్షంలో బెర్ముడా ట్రయాంగిల్?... (ఆసక్తి)



                                   అంతరిక్షంలో బెర్ముడా ట్రయాంగిల్?
                                                             (ఆసక్తి)                 


                        అంతరిక్షంలో కూడా బెర్ముడా ట్రయాంగిల్ ఉన్నదా?

భూమిపై ఉన్న బెర్ముడా ట్రయాంగిల్ గురించి మనమందరం విన్నాము, కాని అంతరిక్షంలో ఉన్నదాని గురించి మీరు విన్నారా?

భూమిపై ఉన్న బెర్ముడా ట్రయాంగిల్ వాయువ్య అట్లాంటిక్ మహాసముద్రం లోని ఒక ప్రాంతం. దీనినే "డెవిల్స్ ట్రయాంగిల్" అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. చాలా సంవత్సరాల నుంచీ ఈ ప్రదేశం మీదుగా ఎగిరే విమానాలు, ఆ భాగంలో ప్రయాణించే నౌకలు అనుమానాస్పద రీతిలో అదృశ్యం అవుతుండడం వలన ఇది ఒక ప్రమాదకరమైన ప్రదేశంగా పరిగణించబడింది. ఇక్కడ జరిగిన సంఘటనల గురించి అనేక కథలు, సిద్ధాంతాలు, ఊహలు ప్రచారంలో ఉన్నాయి.

Satellites - and even the ISS - have to spend as little time as possible in this disruptive zone.

సామాన్యమైన మానవ తప్పిదాలు లేదా ప్రకృతి సహజమైన భౌతిక విషయాలు ఇక్కడి ఘటనలకు సంతృప్తికరమైన కారణాలను చెప్పలేకపోతున్నాయని పలువురి భావన. కనుక గ్రహాంతర వాసులు, అసాధారణమైన ప్రాకృతిక నియమాలు ఇక్కడ పనిచేస్తున్నాయని విస్తృతమైన అభిప్రాయాలున్నాయి. ఇక్కడి ఘటనలపై విస్తారంగా పరిశోధనలు జరిగినాయి. చాలా ఘటనల గురించి ప్రజలలో ఉన్న అభిప్రాయాలు అపోహలని, వాటిని రిపోర్టు చేయడంలో అసత్యాలు కలగలిసి పోయాయని తెలుస్తున్నది. అయినాగాని, ఇతర ప్రాంతాలలో జరిగే ఇటువంటి ప్రమాదాలు లేదా ఘటనలతో పోలిస్తే ఇక్కడ జరిగినవి కొంత భిన్నంగా ఉన్నాయని, వీటికి సరైన వివరణలు లభించడం లేదని వివిధ నివేదికలలో పేర్కొనబడింది.

అంతరిక్షంలో ఒక స్థలం ఉంది, ఇక్కడ అనేక సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. బెర్ముడా ట్రయాంగిల్ మాదిరిగా కాకుండా, ఇక్కడ జరిగిన సంఘటనలు వాస్తవమైనవి మరియు చక్కగా నమోదు చేయబడ్డాయి. కొంతమంది అంతరిక్షంలోని ఆ స్థలాన్ని "బెర్ముడా ట్రయాంగిల్ ఆఫ్ స్పేస్" గా పిలుస్తారు. ఈ స్థలం యొక్క అంచు బెర్ముడాకు దక్షిణాన 1,860 మైళ్ళు (3,000 కిమీ) దగ్గర మొదలవుతుంది, కాబట్టి దీనిని "సౌత్ అట్లాంటిక్ అనోమలీ" అని పిలుస్తారు.


మొట్టమొదటిసారిగా 1958 లో కనుగొనబడిన ఈ'దక్షిణ అట్లాంటిక్ అనోమలీ' అదే సంవత్సరం అంతరిక్షంలో కనుగొనబడిన 'వాన్ అలెన్ రేడియేషన్' బెల్ట్‌ల ఉనికితో ముడిపడి ఉంది. ఇందులోని రింగ్ ఆకారపు ప్రాంతాలు, విద్యుదావిష్ట అవ్యయములు(చార్జెడ్ కణాలు). ఇవి సౌర గాలి నుండి వెలువడి మాగ్నెటోస్పియర్లో చిక్కుకున్నవి. రింగ్ ఆకారానికి బయట ఉన్న కణాలు అధిక శక్తి కలిగిన ఎలక్ట్రాన్లు. రింగ్ ఆకారానికి లోపల ఉన్న కణాలు అధిక శక్తి కలిగిన ఎలక్ట్రాన్లు మరియు అధిక శక్తి కలిగిన ప్రోటాన్లు. ఈ ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లను తీసివేస్తాయి కాబట్టి అవి అధిక మోతాదులో మానవులకు హానికరం. ఇవి, అంటే ఈ ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు...ఎలక్ట్రానిక్స్‌ పరికరాలకు కూడా హానికరమే. ముఖ్యంగా ఎక్కువగా రక్షణ లేని ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు బూడిదైపోతాయి.


అదృష్టవశాత్తూ రింగు లోపలి అణువులు సాధారణంగా భూమికి 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ లోపలి రింగు యొక్క అంచులు బ్రెజిల్ మీదుగా భూమికి 125 మైళ్ళ (200 కి.మీ) ఎత్తు దూరంలో ఉంటుంది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS-International Space Station) మరియు ఉపగ్రహాలు దాని గుండా ఎగురుతాయి కనుక చార్జెడ్ కణాలకు గురవుతాయి. ఉపగ్రహ సాంకేతికత చిన్నదిగా మరియు మరింత అభివృద్ధి చెందినవిగా ఉంటుంది కనుక 'సౌత్ అట్లాంటిక్ అనోమలీ' ప్రభావానికి లోనవుతుంది. అప్పుడు అటుగుండా వెడుతున్న ఉపగ్రహాలలో ఉన్న ల్యాప్ టాప్ లాంటి ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు పనిచేయవు. ఉదాహరణకు, హబుల్ స్పేస్ టెలిస్కోప్ దానిలోని అత్యంత సున్నితమైన సెన్సార్లు దెబ్బతినకుండా ఉండటానికి ఆ చోటికి వచ్చినప్పుడు తన పరిశోధనలు ఆపేస్తుంది.



అంతరిక్షం లో ఉన్న ఈ "బెర్ముడా ట్రయాంగిల్" సుమారు 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ వైశాల్యం కలిగినది. ఇక్కడ అంతరిక్ష కేంద్రం కంప్యూటర్లు అకస్మాత్తుగా క్రాష్ అవుతాయి, అంతరిక్ష టెలిస్కోపులు పనిచేయవు మరియు ఉపగ్రహాలు షట్ డౌన్ అవుతాయి. అంతరిక్షంలో వింత ఫ్లాషింగ్ లైట్లకు కూడా ఇదే కారణం. ఈ "బెర్ముడా ట్రయాంగిల్" ప్రాంతం ఇప్పుడు అంతరిక్షంలో కదులుతున్నట్లు కనుగొనబడింది.

అంతరిక్షం లో ఉన్న ఈ "బెర్ముడా ట్రయాంగిల్' గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాత ఉపగ్రహాలను ఆ ప్రాంత నుండి వెళ్ళకుండా చూసుకుంటున్నారు. అలాగే ISS ఆ ప్రాంతాన్ని దాటుతున్నప్పుడు దానిలో ఉన్న ఎలెక్ట్రానిక్స్ పరికరాలు ఆ ప్రాంతాన్ని దాటేటప్పుడు పనిచేయటం ఆపేస్తాయి.

Images Credit: To those who took the original photo. *****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి