26, మార్చి 2020, గురువారం

ఆర్గానిక్…(కథ)                                                           ప్రకృతి
                                                              (కథ)


"ఇవి 'ఆర్గానిక్' పండ్లే కదా?"

ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళిన శేఖర్, తన చేతిలో ఉన్న సంచీని భార్య సరోజకు అందించిన వెంటనే అడిగింది. అవి ద్రాక్ష పండ్లు.

ఆమె వేడిగా వేడిగా కాఫీ తీసుకు వచ్చి ఇచ్చింది. కాళ్ళూ-చేతులూ-మొహమూ కడుక్కుని...ఆమె అందించిన కాఫీ తాగుతూ చెప్పాడు........

"అవును...ఫోనులోనే పదిసార్లు చెప్పాను. ఇప్పుడు పూర్తిగా ఇంట్లోకి రాక ముందే అడుగుతున్నావు. ఇవి 'ఆర్గానిక్' పండ్లే! కానీ నువ్వు ఇంత పెద్ద 'ఆర్గానిక్' పిచ్చిదానివిగా ఉండకూడదు సరోజా" అన్నాడు.

"ఆర్గానిక్ కే నండి శరీరానికి మంచిది. కృతిమంగా తయారు చేసింది ఏదైనా సరే ఆరోగ్యానికి హాని చేస్తుందండి. అందులోనూ ఇప్పుడు పంటలకు వేస్తున్న రసాయన ఎరువులు, రసాయన పురుగుల మందూ వేసి పండించేది ఏదీ మంచిది కాదు. మన శరీరానికి చాలా ప్రమాదకరం.

ఆ కాలంలో మన తాతా-అమ్మమ్మలు తొంబై ఏళ్ళకు పైన ఆరొగ్యంగానే ఉన్నారే...ఎలా? ప్రకృతి రీతిగా పండించిన పంటలను తినటం వలనే. ప్రకృతితో ఒకటిగా జీవించారు. మన తరం వాళ్ళో ఏది పడితే అది తిని, ముప్పై - నలభై ఏళ్ళకే బి.పి., సుగర్ అంటూ వ్యాధిగ్రస్తులవుతున్నారు”

ఆమె చెప్పింది విని, శేఖర్ భార్యకు చేతులెత్తి నమస్కరించాడు.

"ఒసేయ్ అమ్మడూ...చాలు నీ ఉపన్యాసాలు! నన్ను వదిలి పెట్టు" ---భర్త శేఖర్ అలా చెప్పేటప్పటికి నవ్వుకుంటూ లోపలకు వెళ్ళింది సరోజ.

సరోజకు ఏదైనా సరే 'ఆర్గానిక్' గానే ఉండి తీరాలి. హోటల్లో తినడానికి వెళ్ళినా 'ఆర్గానిక్' హోటల్ కే వెళ్ళాలి అని చెప్తుంది. 'గ్రామంలో పెరిగింది. అది ప్రకృతే కదా?' అని శేఖర్ తనని తాను సమాధాన పరుచుకుంటాడు.

తినే ఆహారంలోనే మాత్రం కాదు...అన్నీ ప్రకృతిగా ఉంటేనే ఆమెకు నచ్చుతుంది. ప్లాస్టిక్ పువ్వులు, ప్లాస్టిక్ ఆకులు, ప్లాస్టిక్ బొమ్మలూ, పూసలు...ఏదీ పక్కకు రాకుడదు.

"సృష్టి యొక్క మొత్త అందాన్నీ, సంతోషాన్నీ ప్రకృతిలోనే చూడగలం, అనుభవించగలం. కృతిమంలో ఏముంది? ఒక పువ్వు యొక్క వాసన, అందం ప్లాస్టిక్ పువ్వులో ఉన్నదా?" అంటుంది.

ఆమె చెప్పేది నిజమే కనుక, ఆహారానికి సంబంధించిన వస్తువుల ఖర్చు ఎక్కువైనా, ఆరొగ్యం విషయం కాబట్టి పెద్దగా పట్టించుకునేవాడు కాదు శేఖర్.

వంట గదిలోకి వెళ్ళిన సరోజ పండ్లను కడిగి తీసుకు వచ్చింది.

"రేపు హాస్పిటల్ కు వెళ్ళాలి...మీకు గుర్తుందా?" కడిగిన ఆ పండ్లను భర్త శేఖర్ పక్కన పెడుతూ అన్నది.

పెళ్ళై ఐదు సంవత్సరాలు పూర్తి అయినా ఇంకా వాళ్ళకు సంతాన భాగ్యం లేదు. అన్ని పరీక్షలూ చేయించుకుని రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు!

“జ్ఞాపకం ఉంది విమలా. ప్రొద్దున పదింటికి రమ్మన్నారు"

"నాకు ఇప్పుడే దఢ దఢగానూ...ఆందోళనగానూ ఉన్నదండి. డాక్టర్ ఏం చెప్పబోతారో అన్న భయం ఎక్కువగా ఉన్నది"

"నాకు కూడా అలాగే ఉన్నది! కానీ, మన చేతుల్లో ఏముంది చెప్పు? సంతాన భాగ్యం, దేవుడిచ్చేది. ధైర్యంగా ఉండు. మనం ఎవరికీ ఏ చెడూ చేయలేదు. దేవుడు మనల్ని పరీక్షించడు"--ఆమెకు ధైర్యం చెప్పినా, అతని మనసులోనూ భయం ఎక్కువగానే ఉన్నది!

వాళ్ళకు పెళ్ళి జరిగి ఇదిగో...ఇన్ని సంవత్సరాలు అయ్యింది. అతనికీ సరే, ఆమెకూ సరే...త్వరగా పిల్లల్ను కనాలని ఆశ. మొదటి ఆరు నెలలు గడిచినప్పుడు ఇద్దరూ పెద్దగా బాధ పడలేదు. కొన్ని రోజులే కదా అయ్యింది. కొందరికి రెండు, మూడు సంవత్సరాలు అయిన తరువాత పుడుతున్నారే!'అని సమాధనమై ఉన్నారు.

కానీ, అతని అమ్మగారు, చుట్టాలు మాత్రం వాళ్ళను చూసినప్పుడల్లా చాటుమాటుగా అడుగుతారు. అయినా కానీ, ఏదో ఒకటి చెప్పి తప్పించుకునే వారు.

ఒక సంవత్సరం తరువాత అతని తల్లి ఓపన్ గానే గొణగటం మొదలు పెట్టింది. "మాకు పెళ్ళైన ఒక సంవత్సరంలోనే నువ్వు పుట్టావు. మన వంశంలో అందరూ అంతే! సరోజ కడుపులో ఒక జన్యువు కూడా ఉండలేక పోతోందే? నా మనవుడ్నో—మనవరాలునో నేను ఎప్పుడు బుజ్జగిస్తానో?" అన్నది.

"మీ కాలం వేరు...మా కాలం వేరు. ఇప్పుడేమయ్యింది...ఒక సంవత్సరమేగా అయ్యింది! అంతలో ఏమిటి అవసరం? ఓర్పుగా ఉండు. కొన్ని రోజులు సంతోషంగా ఉండి, ఆ తరువాత కంటాము" అని చెప్పి వాళ్ళమ్మ గొణిగినప్పుడల్లా ఆమె నోరు నొక్కేస్తాడు శేఖర్.

మూడు సంవత్సరాలు పూర్తవబోతున్నాయి. వాళ్ళకే ఒక భయం వచ్చింది. గుడికి వెళ్ళటం, పరిహారాలు చేయటం అని ప్రారంభించారు. ఫలితం దక్కలేదు.

ఆ ఊరిలోనే, ఆ ఊరికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీసుకు శేఖర్ ని మార్చటంతో, అతనూ, సరోజ మాత్రం ఇళ్ళు చూసికుని వచ్చేశారు. అందువల్ల భందువుల విచారింపుల నుండి తప్పించుకున్నారు.

ఎన్ని పరిహారులు చేసినా ఫలితం దక్కకపోవటంతో, చివరి ప్రయత్నంగా డాక్టర్ను కలవాలని ఇదిగో...చెకప్ చేయించుకున్నారు. దాని రిజల్ట్స్ రేపు రాబోతోంది.

శేఖర్ కి రాత్రంతా నిద్రలేదు. సరోజ యొక్క పరిస్థితి గురించి చెప్పనే అక్కర్లేదు. ఆమెకు ఓదార్పుగా మాట్లాడుతూ ఉన్నాడు శేఖర్.

మరుసటిరోజు ప్రొద్దున కరెక్టుగా పది గంటలు. డాక్టర్ ముందు ఉన్నారు. వాళ్ళ ఇద్దరిలోనూ గుండె దఢ ఎక్కువయ్యింది.

'డాక్టర్ ఏం చెప్పబోతారో?' అని ఆయన ముఖంవైపు చూస్తూ కూర్చున్నారు. 'దేవుడా...ఏదైనా సరే మంచి వార్తగా చెప్పాలి -- మనసులోనే వేడుకున్నారు.

అన్ని టెస్టుల రిజల్ట్స్ చూసిన డాక్టర్ ముఖం కొంచం ముడుచుకుని చిన్నదయ్యింది. "మిస్టర్ శేఖర్...ఐయామ్ సారీ టు సే దిస్! మీ భార్యకు పిల్లలు పుట్టే చాన్స్ 99 శాతం లేదు"

డాక్టర్ చెప్పింది విన్నవెంటనే నెత్తి మీద పిడిగు పడినట్టు అయ్యింది. శేఖర్ భార్య సరోజను చూశాడు. ఆమె పరిస్థితి గురించి చెప్పాలా? స్థానువైపోయింది.

"కష్టంగానే ఉంటుంది. నేను చెప్పింది మీరు అంగీకరించే కావాలి. ఈయన ఇలా చెప్పేడే ఇంకో డాక్టర్ దగ్గరకు వెల్దాము అని అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకండి. మీ రిజల్ట్స్ ను ముగ్గురు స్పేషలిస్టులకు పంపి ఏదైనా చేయగలరేమో నని ట్రై చేశాను. అందరూ ఒకే మాట." డాక్టర్ క్లియర్ గా, ఓపన్ గా చెప్పాడు.

కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న వాళ్ళిద్దరూ మనసుకు బలం తెచ్చుకున్నారు.

"ఇంకేమీ చేయలేమా డాక్టర్?" ఆవేదనతోనూ, బాధతోనూ అడిగారు.

"ఎందుకు చేయలేము? మీలాంటి వాళ్ళ కోసమే వరప్రసాదంలాగా ఉన్నదే 'టెస్ట్ ట్యూబ్ బేబీ'. అదే...కృతిమ గర్భం. ఆ విధానంలో ఖచ్చితంగా పిల్లలు కనొచ్చు" అన్నారు.

జాలిగా చూశారు.

"థాంక్యూ డాక్టర్. దీని గురించి ఇంట్లో వాళ్ళందరితో కలిసి ఆలొచించి మిమ్మల్ని కలుస్తాను" --- చెప్పేసి ఇద్దరూ లేచారు. నిదానంగా కారు ఉంచిన చోటువైపుకు నడిచారు. సరోజ కళ్ళల్లో నీళ్ళు.

"డాక్టర్ చెప్పింది విన్నావుగా సరోజా! ఏం చేద్దాం? కృతిమ పద్దతిలో బిడ్డను కందామా?"

ఇంటికి వచ్చిన వెంటనే సరోజను అడిగాడు శేఖర్.

భర్తను ఒక్క నిమిషం అదొలా చూసిన సరోజ చెప్పింది: "ఖచ్చితంగా కృతిమ పద్దతి వద్దండి. ఎంతో మంది పిల్లలు అనాధ ఆశ్రమాలలో ఉన్నారు. ప్రకృతి పద్దతిలో పుట్టిన ఆ పిల్లలలో ఒకర్ని దత్తతు తీసుకుని పెంచుకుందాం. సొంత వాళ్ళు గానీ, చుట్టాలుగానీ లేని ఒక బిడ్డకు జీవితం ఇచ్చినట్టూ అవుతుంది. మనకీ సంతోషంగా ఉంటుంది"

అలా చెప్పిన భార్య సరోజను చూసి గర్వ పడ్డాడు శేఖర్.

ఎందుకంటే: అప్పుడు కూడా ‘ఆర్గానిక్’ ఆనే లక్ష్యాణ్ని ఆమె వదిలిపెట్ట దలచుకోలేదే?

********************************************సమాప్తం*********************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి