11, ఏప్రిల్ 2020, శనివారం

రూపం తెచ్చిన మార్పు…5(పెద్ద కథ-క్రైమ్ స్టోరీ)




                                               రూపం తెచ్చిన మార్పు…5
                                                           (పెద్ద కథ)


ఇద్దరు మగవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్ళూ వెంకటేష్ బంగళా వాకిటికి వచ్చారు!

"ఎవరండీ మీరందరూ?" అడిగాడు సెక్యూరిటీ.

"మోహన్ రావ్ అనే ఆయన ఈ ఇంట్లోనే కదా ఉన్నారు?"

"అవును!"

"మా నలుగురి దగ్గర చీటీ పెడుతున్నానని చెప్పి గడిచిన ఒక సంవత్సరం నుండి దగ్గర దగ్గర లక్ష రూపాయలు మా దగ్గర నుండి వసూలు చేశారు! ఇది నా ఇల్లు అని ఒకసారి చెప్పారు! సరే బాగా వసతి ఉన్న మనిషే కదా అని మేమూ చీటీలో చేరేము! కానీ, ఆ మనిషి మోసగాడుగా ఉంటాడేమోనని ఇప్పుడు మేము సందేహ పడుతున్నాం! ఎక్కడాయన?"

సెక్యూరిటీ ఉత్సాహపడి వాళ్ళను లోపలకు పంపాడు. వెంకటేష్ ని కలిసి వాళ్ళతో మాట్లాడేటట్టు చేశాడు.

సుందరి రావటంతో, అందరూ అక్కడ కలవటంతో కలవరం అయ్యింది.

"నేను అలాంటి చీటీ ఏదీ పెట్టలేదు! ఇది అబాండం!" మోహన్ రావ్ అరిచాడు.

"అబద్దం చెబితే పోలీసులకు వెల్తాము. మా డబ్బు రాకుండా ఇక్కడ్నుంచి కదలం! పెద్ద మనుషులుగా ఉంటూ పేదల కడుపులు కొడతారా?"

గొడవ పెద్దదయ్యింది---- సుదర్శనమూర్తి కళ్ళతో సైగ చేయగా---- అమల లోపలకు వెళ్ళి డబ్బు తీసుకు వచ్చింది. "ఇదిగోండి! ఇందులో లక్ష రూపాయలు ఉంది! ఇక ఇటుపక్కకే రాకూడదు!" అంటూ వెంకటేష్ ఇవ్వబోయాడు.

"ఇవ్వద్దు వెంకటేష్! నేను చీటీ పాటే పెట్టలేదు! నన్ను నమ్మండి!"

"చాలు బావా. నువ్వు చెప్పిన అబద్దాలు చాలు! మిమ్మల్ని మార్చనే లేము?"

వచ్చిన వాళ్ళు డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు.

సుందరి, భర్త దగ్గరకు వచ్చింది.

"బయటకు వెళ్ళిపొండి! ఇక మీదట ఈ ఇంట్లో మీరు ఉండటం కుదరదు!"

సుదర్శనమూర్తి అడ్డుపడి "తొందరపడకు సుందరి! నేను డబ్బు ఇచ్చేశాను కదా!"

"లేదు మామయ్యా! అవమానంతో నా ప్రాణమే పోతోంది! కొన్ని రోజులు భర్త లేకుండా జీవిస్తే నేనేమీ చచ్చిపోను. ఈ మనిషిని దండిచాలి!"

"వెంకటేష్! నేను తప్పే చేయలేదురా!"

"అక్కయ్య చెప్పింది న్యాయమే. మీరు ఇక్కడ ఉండొద్దు. వెళ్ళిపొండి! వెంటనే వెళ్ళిపొండి!"

"నేను ఎక్కడికి వెళ్ళను?"

"వీధిలో నిలబడండి! నాది లేకుండా పోతేనే మీకు బుద్ది వస్తుంది!"

వెంకటేష్ లోపలకు వెళ్ళిపోయాడు.

మిగిలిన వాళ్ళంతా తలో దిక్కుకు వెళ్ళారు.

మోహన్ రావ్ మాత్రం ఒంటరిగా నిలబడ్డాడు. మెల్లగా నడుచుకుంటూ వాకిలి చేరాడు.

అక్కడ విషపూరిత నవ్వుతో జోసఫ్ నిలబడున్నాడు.

'ఇది వీడి పనేనా?' మోహన్ రావ్ కి చురుక్కున గుండెలో ఒక ముళ్ళు గుచ్చుకుంది!

                                                       ******************

జోసఫ్ కారు నడుపుతున్నాడు.

వెంకటేష్ కోపంతో ఉగిపోతున్నాడు.

"ఆఫీసుకు వెళ్ళద్దు జోసఫ్! మనసే బాగుండలేదు!"

"ఎక్కడికి వెళ్ళను సార్?"

"తెలియటం లేదు జోసఫ్?"

"మీ బావగారి విషయంతో మనసు సరిలేదా సార్?"

"అవును జోసఫ్! తన పరువు కోసం అక్కయ్య బావను వెళ్ళిపొమ్మంది! కానీ ఆయన లేరని ఇంట్లో కూర్చుని బాధపడుతోంది! నేనేం చేయను? నా మామగారి దగ్గర నాకు ఏం మర్యాద ఉంటుంది జోసఫ్?"

"సార్....నెనొకటి చెప్పనా?"

"చెప్పు జోసఫ్!"

"ఆయన్ని లోపలకు రమ్మని పిలవండి! ఒక పిల్లాడు కూడా ఉన్నాడు! ఆ పిల్లాడికి నాన్న అవసరం కాదా? క్షమించి వదిలేయండి సార్...పాపం"

"జోసఫ్! నీకు ఎంత మంచి మనసు?"

"సార్! తోడ పుట్టినది అక్కయ్య! ఆమె భర్తను విడిచిపెట్టగలదా?"

"సరే! ఆ మనిషిని ఎక్కడ వెతికేది?"

"సాయంత్రం బ్రాందీ షాపుకు వస్తారు! నేను చూసాను"

"కర్మ! కష్టపడటం చేత కాదు! వైన్ షాప్ కు పోవాలా?"

"సరే సార్! తాగేసి రోడ్డు మీద నిలబడి ఇష్టం వచ్చినట్టు వాగినా మనకే కదా అవమానం? స్నేహం అంటే వదిలేయచ్చు.ఎందుకంటే అది మనం వెతుక్కున్నదే! బంధుత్వం, దేవుడు ఇచ్చింది! అది ఎంత కష్టంగా ఉన్నా, వదిలేయ లేము సార్".

వెంకటేష్ ఆశ్చర్యపోయాడు.

"ఎంత బాగా మాట్లాడావు జోసఫ్?"

ఆ రోజు సాయంత్రం ఏడు గంటలకు వైన్ షాపు వాకిట్లో మోహన్ రావ్ నిలబడుంటే, వెంకటేష్ వెళ్ళి అతన్ని పిలిచాడు.

"నన్ను ఇంట్లోంచి తరిమింది మీ అక్కయ్య. అది వచ్చి పిలిస్తే గానీ నేను రాను. అంతవరకు నేను ఇక్కడే ఉంటాను"

"మీ భార్య వైన్ షాపు వాకిటికి వస్తే ఎవరికి అవమానం? ఏమ్మాట్లాడుతున్నారు మీరు?"

"ఓ అలా ఒకటుందో?"

"త్వరగా బండిలోకి ఎక్కండి?"

వెంకటేష్ కారులోకి ఎక్కాడు మోహన్ రావ్.

కారు బయలుదేరింది.

"ఇతనే ఇంకా డ్రైవరా? ఇంకా తీసేయలేదా?"

"నోరు ముయ్యండి! మిమ్మల్ని ఇంటికి తీసుకురావాలని చెప్పిందే అతను. అతను చాలా మంచివాడు. మీరు ఎంత చెప్పినా, ఏం చెప్పినా అతన్ని ఉద్యోగంలో నుండి తీయను....అర్ధమయ్యిందా?"

కారు ఆగింది. మోహన్ రావ్ దిగాడు.

లోపలకు వచ్చిన వెంకటేష్, "అక్కా! నువ్వు వాకిట్లోకి వచ్చి బావను లోపలకు రమ్మని పిలు!"

వేరే దారి లేక సుందరి వచ్చి పిలిచింది.

పిల్లాడు పరిగెత్తుకుని తండ్రి దగ్గరకు వచ్చాడు. మోహన్ రావ్ వాడ్ని ఎత్తుకుని ముద్దాడాడు!

"నేను నీకోసమే తిరిగి వచ్చాను! లేకపోతే వచ్చే వాడినే కాదు!"

"నాన్నా! రేపు స్విమ్మింగుకు వెళదామా?"

"నువ్వు స్కూలు నుండి వచ్చిన వెంటనే తీసుకు వెడతాను"

సుదర్శనమూర్తి, అమల అతన్ని పట్టించుకోనే లేదు!

మోహన్ రావ్ లోపలకు వచ్చి తన భార్య దగ్గర "పెద్దాయన, అమల నన్ను పట్టించుకోలేదు!"

"వాళ్ళు మీ మీద ఉంచిన మర్యాద ఎప్పుడో పోయింది!"

"అయితే ఇంకెందుకు నేను ఈ ఇంట్లో ఉండాలి?"

"అంత గౌరవం చూస్తే, మంచి ఉద్యోగం వెతుక్కుని, నన్నూ, మీ పిల్లాడిని తీసుకు వెళ్ళగరా?"

"నువ్వు నాతో వస్తావా?"

"మీరు మనిషిగా మారి, కుటుంబ భారాన్ని తీసుకుంటే సంతోషంగా వస్తాను. తమ్ముడే ముఖ్యమని ఉండను! కానీ, అలా జరుగుతుందని నాకు నమ్మకం లేదు!"……సుందరి వెళ్ళిపోయింది.

మోహన్ రావ్ కూడా భార్య వెనుకే వెళ్ళాడు.

వెంకటేష్ మామగారి దగ్గరకు వచ్చాడు!

"మామయ్యా! ఆ మనిషి వలన మన పరువు బజారు పాలు అవుతోంది. అందుకే పిలుచుకు వచ్చాను!"

సుదర్శనమూర్తి సమాధానం చెప్పకుండా లేచి వెళ్ళిపోయాడు.

మోహన్ రావ్ తిరిగి రావటం ఆయనకు నచ్చలేదు అనేది వెంకటేష్ కి అర్ధమయ్యింది!

వెంకటేష్ లోపలకు వచ్చాడు. అమల లేచి నిలబడుంది.

"ఈ ఇంట్లో నా మర్యాద తగ్గుతోందా అమలా?"

"లేదండి! కానీ మీ కుటుంబీకులు మిమ్మల్ని అవమాన పరుస్తున్నారు! కాలుకు చెప్పు సరిపోలేదంటే, చెప్పులు తీసి పారేయాలి!

"నీకూ నేను చేసింది తృప్తిగా లేదనుకుంటా?"

"నాన్నకు నచ్చనది ఏదీ నాకు నచ్చదు!"

అమల లోపలకు వెళ్ళిపోయింది.

వెంకటేష్ కి అవమానం అనిపించింది!

'పెళ్ళి అయినప్పుడున్న మామగారు, భార్యా కాదు వీళ్ళు! మారటం మొదలు పెట్టారు’

'ఏ పరిస్థితుల్లో అమలకు పెళ్ళి జరిగింది అనేది కూడా మరచి పోయారా వీళ్ళు?'

'నేను మాట్లాడాలా?'

'నన్ను మాట్లాడించాలని నిర్ణయించుకున్నారా?' ప్రశ్నకు పైన ప్రశ్న తలెత్తటంతో కన్ ఫ్యూజన్ లో పడ్డాడు వెంకటేష్.
                                                                                                        (ఇంకా ఉంది) ****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి