రూపం తెచ్చిన మార్పు…6 (పెద్ద కథ) ప్రొద్దున వెంకటేష్ ని కారులో తీసుకు వెళ్ళి ఆఫీసులో దింపిన తరువాత, కారు తీసుకుని జోసఫ్ ఇంటికి వచ్చేయాలి!
అమల బయటకు వెళ్ళుంటే పిలుచుకు రావాలి.
మధ్యలో వెంకటేష్ ఎక్కడకన్నా వెళ్ళాలంటే కారు తీసుకుని వెళ్ళాలి!
సాయంత్రం మూడు గంటల తరువాత పిల్లవాడిని స్కూల్ నుండి తీసుకు రావాలి. తిరిగి వెంకటేష్ ఆఫీసుకు వెళ్ళాలి!
ఇదే జోసఫ్ యొక్క ప్రతి రోజు డ్యూటీ కార్యక్రమం.
ఆ రోజు ఎప్పుడులాగానే పిల్లాడ్ని తీసుకు వచ్చాడు జోసఫ్ !
"జోసఫ్ కొంచం సేపు ఉండు! మేము స్విమ్మింగుకు వెళ్ళాలి. మమ్మల్ని తీసుకు వెళ్ళి వదిలేసి, ఒక గంట తరువాత రా!" … మోహన్ రావ్, జోసఫ్ తో చెప్పాడు.
"అయ్యగారితో చెప్పి వస్తాను"
"దేనికి?"
"జీతం ఇచ్చేది ఆయనే కదా. ఆయన దగ్గర చెప్పాల్సిన బాధ్యత నాకుంది!"
వెంకటేష్ కి ఫోన్ చేసి చెప్పాడు జోసఫ్.
"తీసుకు వెళ్ళి దింపు! అక్కడే ఉండి మళ్ళీ వాళ్ళను తీసుకు వచ్చి దింపిన తరువాత వస్తే చాలు. నాకు ఆరు గంటలకు కారు వస్తే చాలు!" --చెప్పాడు వెంకటేష్
"సరే సార్"
మోహన్ రావ్ ని, పిల్లాడ్ని ఇద్దర్నీ ఎక్కించుకుని బయలుదేరాడు జోసఫ్. వాళ్ళను స్విమ్మింగ్ పూల్ దగ్గర దింపినప్పుడు జోసఫ్ కి ఆ ఐడియా తట్టింది! 'సెల్ ఫోన్’ తీసి ఎవరితోనో మాట్లాడాడు.
"అవును! అతని నిర్లక్ష్యం వలన పిల్లాడ్ని పారేస్తే, భూకంపమే వస్తుంది! అందులో సుందరి కూడా కలిసి బయటకు వెళ్ళిపోవాలి. త్వరగా 'రా'!"
కారులో ఎక్కి కూర్చుని వెనక్కి వాలి రిలాక్స్ అయ్యాడు జోసఫ్.
పిల్లల విభాగంలో పిల్లాడు స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాడు. మోహన్ రావ్ కొంచం దూరంగా కూర్చున్నాడు.
పిల్లాడు రబ్బరు ట్యూబు లోపల దూరి నీళ్ళల్లో తేలుతున్నాడు.
ఆ కిరాయి వాడు కారుకు దగ్గరగా వచ్చి జోసఫ్ కు విష్ చేశాడు.
"అదిగో అటు చూడు! పసుపు టోపి...బ్లూ రంగు రబ్బర్ ట్యూబు తో తేలుతున్నాడు చూడు! ఆ పిల్లాడే! నల్ల చొక్కా వేసుకుని విసిటర్స్ గ్యాలరీలో కూర్చున్నతను ఆ పిల్లాడి తండ్రి! ఇక నీదే పని!"
"సరే! ఆ మనిషి యొక్క చూపును మార్చండి"
"నువ్వు స్విమ్మింగ్ పూల్ లో దిగు! నేను చూసు కుంటా!"
వచ్చినతను, బట్టలు మార్చుకుని, పెద్దవాళ్ళు స్విమ్మింగ్ చేసే చోట దిగాడు!
జోసఫ్ తన సెల్ ఫోన్ తీశాడు, మోహన్ రావ్ నెంబర్ కు డయల్ చేశాడు.
మోహన్ రావ్ సెల్ ఆన్ చేశాడు.
"ఆ డ్రైవర్ కుర్రాడ్ని పట్టివ్వటానికి ఒక మంచి సంధర్భం వచ్చింది మోహన్ రావ్ సార్"
"మీరెవరు మాట్లాడేది?"
"అది అంత ముఖ్యం కాదు! నిన్ను అవమాన పరుస్తున్న అతనిపై నువ్వు పగ తీర్చుకోవాలా? అక్కర్లేదా?"
"మీరు మాట్లాడేది వినబడటం లేదు! ఉండండి నేను బయటకు వచ్చి మాట్లాడుతాను!"
మోహన్ రావ్ సెల్ ఫోన్ తో బయటకు వచ్చాడు.
మోహన్ రావ్ బయటకు వెళ్ళటం చూసి, స్విమ్మింగ్ పూల్ ల్లో ఉన్న కిరాయి మనిషి హుషారయ్యాడు.
"నువ్వు తేలుతూనే కదా వస్తావు? ఎక్కడ తెలితే ఏమిటి? రా! ధైర్యంగా రా!"
పిల్లాడు తేలుకుంటూ వచ్చాడు.
"హాయి! బాగుందే!లోతుగా ఉన్న చోట స్విమ్ చేసేనని అమ్మతో చెప్పాలి!"
కిరాయి మనిషి మునిగాడు. నీళ్ళ లోపలకు వెళ్ళి ఊపిరి బిగబెట్టాడు. ఒక సూది తీసుకుని పిల్లాడు తేలుతున్న రబ్బర్ ట్యూబును గుచ్చాడు!
గాలి బయటకు వచ్చి, రబ్బర్ ట్యూబులో నీళ్ళు జేర, అది నీళ్ళల్లోకి దిగటం మొదలు పెట్టింది.
కిరాయి మనిషి మెల్లగా వెనక్కి వెళ్ళి, పైకి వచ్చాశాడు.
ఎవరూ ఏదీ గమనించలేదు!
అంతలొ జోసఫ్ ఫోను మాట్లాడి ముగించాడు.
అక్కడ ఉండటం మంచిది కాదని కారు తీశాడు.
మాట్లాడిన తరువాత మోహన్ రావ్ ఉత్సాహంతో లోపలకి వచ్చాడు. పిల్లలు స్విమ్మింగ్ చేసే చోట పిల్లాడు కనిపించలేదు!
బాగా చూశాడు. గుండె గుభేల్ మన్నది! స్విమ్మింగ్ పూల్ బయట, అన్ని చోట్లా చూశాడు. పిల్లాడు లేనే లేడు!
స్విమ్మింగ్ చేస్తున్న ఇంకో పిల్లాడి దగ్గరకు వెళ్ళి గుర్తులు చెప్పి అడిగాడు. ఆ పిల్లాడికి అర్ధం కాలేదు!
చీకటి పడుతున్న సమయం, చలికాలం కనుక అందరూ పైకొచ్చారు. కానీ పిల్లాడు రాలేదు. మోహన్ రావ్ వణికిపోయాడు.
"నా పిల్లాడు, నీలి రంగు రబ్బర్ ట్యూబుతో తేలుతూ ఉండేవాడు! మీరు చూశారా?"
ఎవరికి తెలియలేదు!
వెతికే సమయం అరగంట దాటింది. మోహన్ రావ్ కి ఆందోళన పెరిగింది. నీలి రంగు ట్యూబ్ మెల్ల మెల్లగా పైకి వస్తుంటే మోహన్ రావ్ హడలిపోయి అటు చూశాడు. పిల్లాడి కాలు కనబడింది!
బెదిరిపోయి మోహన్ రావ్ స్విమ్మింగ్ పూల్ లోకి దిగాడు. లోతుకు వెళ్ళి చెయ్యి జాపితే పిల్లాడు చిక్కాడు! పైకి ఎత్తేడు. భారంగా ఉన్నది. బాగా నీళ్ళు తాగుతున్నాడు!
పిల్లాడితో మోహన్ రావ్ కారు ఉండే చోటు దగ్గరకు వచ్చాడు. అప్పుడు పిల్లాడి తల వెనక్కి వాలింది.
గజగజ లాడిపోయాడు మోహన్ రావ్!
విషయం బయటకు పొక్కాగా జనం చేరారు. "త్వరగా ఆసుపత్రికి తీసుకు వెళ్ళండి!"
కారు లేదు! ఒకరు ఆటో తీసుకు వచ్చారు.
మోహన్ రావ్ పిల్లాడితో లోపలకు ఎక్కాడు. సహాయానికి ఇద్దరు తోడు వెళ్ళారు.
పదిహేను నిమిషాలలో హాస్పిటల్లో ఉన్నాడు. పిల్లాడ్ని లోపలకు తీసుకు వెళ్ళారు.
పది నిమిషాల తరువాత డాక్టర్ బయటకు వచ్చాడు.
"సారీ సార్! పిల్లాడు చనిపోయి ఇరవై నిమిషాలు అవుతోంది!"
మోహన్ రావ్ కి కళ్ళు బైర్లు కమ్మాయి-- స్పృహ కోల్పోతున్నట్టు అనిపించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి