రూపం తెచ్చిన మార్పు…7 (పెద్ద కథ) ఇంటికి ఫోన్ వచ్చింది. అమల ఎత్తింది. వార్త విన్న వెంటనే గట్టిగా 'అయ్యో' అని అరిచింది.
సుదర్శనమూర్తి పరిగెత్తుకు వచ్చారు. "ఏమ్మా? ఎందుకు అలా అరిచావు?"
"నాన్నా! స్విమ్మింగ్ పూల్ కు వెళ్ళిన పిల్లాడు నీటిలో మునిగి చనిపోయాడట! ఫోన్ వచ్చింది!"
"ఏం చెబుతున్నావమ్మా నువ్వు?"
ఆయన గట్టిగా అరవటంతో సుందరి వచ్చింది. ఇద్దరూ విషయం చెప్పి అల్లాడి పోగా,-- సుందరి అలాగే శిలలాగా నిలబడిపోయింది. ఆమె అలాగే ఒరిగిపోగా, అమల పట్టుకుంది.
సుదర్శనమూర్తి వెంటనే ఫోన్ చేసి వెంకటేష్ కి చెప్పాడు. ఉక్కిరిబిక్కిరి అయ్యి హాస్పిటల్ కు పరిగెత్తేడు. ఆ కుటుంబమే నీరసించి పోయింది!
తరువాతి రెండు గంటలలో హాస్పిటల్ ఫార్మాలిటీస్ ముగిసి, పిల్లాడి బాడీని ఇంటికి తీసుకు వచ్చారు.
సుందరి ఏడుపును ఎవరూ ఆపలేకపోయారు.
'నా బుజ్జీ! నన్ను వదిలి ఎలా వెళ్ళావురా? నీకెలా మనసు వచ్చింది?' అని వెక్కి వెక్కి ఏడ్చింది...అందరూ ఏడుస్తున్నారు.
గుంపు చేరింది!
మోహన్ రావ్ ఒక మూలలో నిలబడ్డాడు. ఎల జరిగిందని మోహన్ రావ్ ని అడిగారు. అతను వివరిస్తుంటే ..........
సుందరి ఆవేశంగా లేచి వచ్చింది.
"హంతకుడా! నా పిల్లాడ్ని చంపిన పాపివి నువ్వేరా".
"అలా చెప్పకు సుందరీ! పిల్లాడికి తండ్రిని నేను"
"లేదు! నువ్వు తండ్రివి కావు! యముడివి! పిల్లాడ్ని సరిగ్గా పట్టించుకోకుండా చంపేశావు! తమ్ముడూ! వెంటనే పోలీసులను పిలు! ఈ పాపాత్ముడిని పట్టుకుని ఉరి స్థంభం ఎక్కించండి! నాకు నా పిల్లాడు కావాలి...కావాలి!"
దయ్యం పట్టిన దానికి మల్లే ఆమె అరుస్తుంటే, ఎవరూ ఆమెను సమాధాన పరచలేకపోయారు!
బాడీ తీసారు!
మగవాళ్ళు శవంతో నడవగా, సుందరి అరుస్తూ, ఏడుస్తూ వాకిటి వరకు పరిగెత్తుకు వచ్చింది.
"నా పిల్లాడ్ని ఎత్తుకెళ్ళకండీ! వాడు నాకు కావాలి! కావాలి!"
ఏడ్చి, ఏడ్చి వాకిట్లో స్పృహ తప్పి పడిపోయింది. అమల వచ్చి పట్టుకుంది.
పిల్లాడ్ని శ్మశానానికి తీసుకు వెళ్ళారు. చితిపైన ఉంచి వెంకటేషే అన్ని కార్యాలు చేశాడు!
కొంచం దూరంగా నిలబడి చితి మంటను చూశాడు జోసఫ్. ఆ మంటల్లో చెల్లెలు మేరీ ముఖం కనబడుతుందేమోనని వెతికేడు. కానీ కనబడలేదు!
మొదటిసారిగా జోసఫ్ ముఖంలో విచారం కనబడింది.
మెల్లగా నడుచుకుంటూ కారు దగ్గరకు వెళ్లాడు. డోర్ తెరుచుకుని సీటులో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. చెల్లెలు రూపం కనబడింది.
‘ఏంటన్నయ్యా ఇది...పగ తీర్చుకోవలసింది వెంకటేష్ మీద. ఈ పిల్లాడ్ని ఎందుకు బలితీసుకున్నావు? నీ మనసు ఇంత నీచంగా ప్లాన్ చేస్తుందని నేననుకోలేదు. నువ్విలా చేస్తావని నేను ఊహించుంటే అసలు పగ తీర్చుకోమని నేను నిన్ను ఒత్తిడి చేసుండను. ఇక నేను నీకు కనబడను’
‘లేదు మేరీ! నేను ఆ పిల్లాడ్ని చంపమని ఆ కిరాయివాడితో చెప్పలేదు. వాడ్ని కిడ్నాప్ చేసి, ఒకరోజు ఉంచుకుని, వెంకటేష్ దగ్గర 20 లక్షలు డబ్బులడుగు. మోహన్ రావే డబ్బుకొసం ఇలా చేయించాడని నేను ఎలాగైనా వెంకటేష్ ని నమ్మిస్తానని చెప్పాను. కానీ, అతను ఎందుకిలా చేశాడో నాకు అర్ధం కావటంలేదు’
'లేదు...లేదు...లేదు’ అంటూ కలవరిస్తున్న జోసఫ్ ను తట్టి లేపి "ఇంటికి వెలదాం" అన్నాడు వెంకటేష్.
కార్యాలు ముగించుకుని అందరూ ఇళ్లు చేరుకున్నారు!
సుందరి మాత్రం అలాగే ఏడుస్తూ నీరసంగా ఒరిగిపోయింది. అమల ఆమెను ఓదార్చటానికి సకల ప్రయత్నాలు చేసింది. కానీ ఏదీ ఫలించలేదు!
వెంకటేష్ వచ్చి బ్రతిమిలాడాడు.
"అక్కయ్యా! జరిగింది జరిగిపోయింది! నువ్వు రా అక్కా. కొంచంగా ఎంగిలిపడు"
సమాధానమే లేదు!
మోహన్ రావ్ ఒక మూలగా నిలబడ్డాడు.
సుందరి అలాగే అతన్ని చూసింది. పిల్లాడు ఒక మూలలో నిలబడి 'ఆమ్మా' అని పిలుస్తున్నట్టు అనిపించింది. సుందరి హడావిడిగా లేచింది.
"ఇదిగో వస్తున్నానురా నాన్నా!"
ఆమె పరిగెత్తింది. పిల్లాడు ఇంకో చోట నిలబడున్నట్టు అనిపించి. తల విరబూసుకుని అటు పరిగెత్తింది.
"అమ్మా! నేను ఇక్కడ ఉన్నాను!"
వేరే దిక్కు నుండి పిలుస్తున్నట్టు ఒక బ్రమ.అటు పరిగెత్తింది.
సుందరీ ను చూసి కుటుంబమే భయపడ్డది. పిల్లాడు మేడ మెట్ల చివర నిలబడున్నట్టు కనబడ-- సుందరి అక్కడికి పరిగెత్తి, కాలు జారి దొర్లు కుంటూ క్రింద పడిపోయింది. వెంకటేష్, మిగిలిన వాళ్ళూ పరిగెత్తుకుంటూ వచ్చేలోపు సుందరి తలకిందలుగా, తల మీద గట్టి దెబ్బతో రక్తపు మడుగులో పడుండటంతో కుటుంబమే షాకుకు గురి అయ్యింది!
వెంకటేష్, అమల సుందరిని ఎత్తుకోగా - జోసఫ్ ఆందోళనతో కారు తీయగా -- పెద్దాయన అల్లాడి పోయాడు.
కారు బయలుదేరింది.
అది చాలా పెద్ద హాస్పిటల్!
వెంటనే ఇద్దరు వార్డు బాయ్స్ పరిగెత్తుకుని వచ్చారు. -- స్టెక్ఛర్లో సుందరిని పడుకోబెట్టి వేగంగా కదిలారు.
ఏమర్జన్సీ డిపార్టు మెంటుకు సుందరిని తీసుకు వెళ్ళారు.
డాక్టర్లు వేగంగా తమ చికిత్సను మొదలుపెట్టారు.
బయట కుటుంబం అంతా ఆందోళనతో కాచుకోనుంది. అరగంట తరువాత ఒక డాక్టర్ బయటకు వచ్చాడు.
"ఇంకో 12 గంటల సమయం దాటితే గానీ నేను ఏమీ చెప్పలేను. తలమీద బలంగా దెబ్బ తగిలింది. చాలా నెత్తురు పోయింది! మా వల్ల అయినది చేస్తున్నాము. మీరు దేవుడ్ని నమ్ముకోండి!"
డాక్టర్ వెళ్ళిపోయాడు.
ఒక నర్స్ వచ్చింది.
"ఇక్కడ గుంపు జేరకూడదు! ప్రొద్దున్నే రండి! అందరూ వెళ్ళండి!"
అందరూ ఇంటికి వచ్చాశారు.
మోహన్ రావ్ వాకిట్లో నిలబడ్డాడు. వెంకటేష్ తిరిగి చూసాడు. కోపం తలెకెక్కింది!
"జోసఫ్! ఆ మనిషిని మెడ పట్టుకుని బయటకు గెంటు! వాడ్ని చూస్తుంటే నాకు చంపేయాలన్న కోపం వస్తోంది!"
అమల వెంకటేష్ దగ్గరకు వచ్చింది.
"అలా చెప్పకండి!"
“లేదు అమల! అతను ఈ ఇంట్లోనే ఉండకూడదు!"
వెంకటేష్ గట్టిగా అరిచాడు.
మోహన్ రావ్ దగ్గరకు వచ్చాడు జోసఫ్. "ఇలా రావయ్యా!”
"ఏమిటి? మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు?"
"నీకు మర్యాద పోయి మూడు రోజులు అయ్యింది! ఈ ఇంట్లో ఇంకా నువ్వు ఉంటే, యజమాని నిన్ను చంపేస్తారు! మాట్లాడ కుండా వెళ్ళిపో!"
"నేను ఎక్కడికి వెడతాను"
"నన్ను అడిగితే? పిల్లాడ్ని చూసుకోవటానికి దిక్కులేదు. చంపేసావు! భార్య మరణ సయ్య మీద ఆసుపత్రిలో. నిన్ను ఎలాగయ్యా క్షమించగలరు? వెళ్ళిపో! ఎక్కడికైనా ఈ కుటుంబానికి కనిపించనంత దూరం వెళ్ళిపో!"
"ఒక డ్రైవర్ తరమేటంతటి హీన స్థితికి వచ్చాసేనే?"
"ఇప్పుడు కూడా పొగరు అనగలేదా? నిన్ను నేను కొట్టి తరిమే పరిస్థితి తెచ్చుకోకుండా నువ్వే వెళ్ళిపో!"
"నువ్వు ప్లాను వేసుకునే కదరా ఈ ఇంట్లోకి వచ్చావు! ఆ రోజు స్విమ్మింగ్ పూల్ కు వచ్చింది నువ్వే?"
"అవునయ్యా! నీ పిల్లాడ్ని చంపింది నేనే: మీ యజమాని దగ్గర ఈ విషయం చెప్పి చూడరా. ఇప్పుడు బయటకు వెళ్ళరా!"
"'రా'...నా"
"అవును కుక్కా!"
మోహన్ రావ్ విలవిలలాడి పోయాడు. జోసఫ్ అతన్ని పుచ్చుకుని గేటు బయటకు తోసేసి లోపలకు వచ్చాడు.
వెంకటేష్ లోపల కూర్చుని పిచ్చి పట్టిన వాడిలాగా వాగుతున్నాడు.
అమల అతన్ని ఎంత సమాధాన పరిచినా అతని వాగుడ్ని ఆపలేకపోయింది.
అమల తండ్రి దగ్గరకు వచ్చింది. ఆయన మొహంలో విరక్తి మిడిసి పడుతోంది.
"న్నాన్నా..."
“నీకు ఈ వెంకటేష్ ని ఇచ్చి పెళ్ళిచేసి ఉండకూడదమ్మా!"
"ఏమిటి నాన్నా మాట్లాడుతున్నారు?"
"ఏదో ఒక శాపం ఉందమ్మా! ఏదో ఒక సంభవం జరుగుతూనే ఉంది! ఇంట్లో ఏడుపులు, పెడబొబ్బులు ఉన్నాయి! మరణ అరుపు తగ్గలేదు! ఇంతకు ముందు మన ఇల్లు ఇలానా ఉండేది? మనకు ఇదంతా అవసరమా అమలా! ఇక మీదట ఏం జరగబోతోందో? ఎవరి కడుపు మంటో మనల్ని పట్టుకుని పీడిస్తున్నదే?"
"వదిలేయండి నాన్నా! మనిషి జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటుందని అనుకోకండి! అందులో లోటు బాట్లు ఉంటాయి!"
“ఈ పాపాలలో మనకి ప్రమేయమే లేదమ్మా!"
"మీరు ప్రశాంతంగా ఉండండి నాన్నా!"
జోసఫ్ ఆ రోజు ఇంటికి వెళ్ళలేదు. కారులోనే పడుకున్నాడు. కానీ, అతనికి నిద్ర పట్టలేదు.
తెల్లవార్లూ ఎవరూ నిద్రపోలేదు! ప్రొద్దున్నే హాస్పిటల్ కు బయలుదేరారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి