6, జనవరి 2021, బుధవారం

విమాన సేవలను మొదలుపెట్టిన నిత్యానందా?...(న్యూస్)

 

                                                         విమాన సేవలను మొదలుపెట్టిన నిత్యానందా?                                                                                                                                                      (న్యూస్)

     పరారీలో ఉన్న గాడ్మాన్ నిత్యానంద ఆస్ట్రేలియా నుండి కైలాసాకు విమాన సేవలను ప్రారంభించాడట.

అత్యాచారం, మహిళల అక్రమ నిర్బంధం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ, ఏడాది కాలంగా పరారీలో ఉన్నా వివాదాస్పద నిత్యానందస్వామి...కైలాస పేరుతో ప్రత్యేక హిందూ దేశాన్ని ఏర్పాటుచేసినట్టు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస్ను 2020 ఆగస్టులో ప్రారంభించాడు. ఇదిలా ఉండగా... దీవిలో ఏర్పాటు చేసిన కైలాస దేశానికి సందర్శకులకు వీసాల జారీ ప్రారంభించినట్టు తాజాగా ప్రకటించాడు. కైలాస పేరిట ఈమెయిల్ ఐడీ కూడా సృష్టించిన నిత్యానంద.. వీసాకు దీని ద్వారా దరఖాస్తు చేయాలని సూచించాడు.

పరారీలో ఉన్న స్వామీజీ సొంతంగా దేశాన్నే ఏర్పాటు చేసుకున్నారని చెబుతున్నారు. దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ దేశం నుంచి దీవి కొనుగోలు చేసారని... దీవిని దేశంగా మార్చేశారని చెబుతున్నారు. కానీ, ఈక్వెడార్ దేశం తాము దీవినీ ఎవరికీ అమ్మలేదని చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా తన దేశమైన కైలాసాను ఒక దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి నిత్యానందా రిక్వెస్ట్ పెట్టుకుంటారట.

కైలాస దేశానికి సొంత క్యాబినెట్ ఉందని, ఇందులో ఆరోగ్య శాఖ, రాష్ట్ర విభాగం, సాంకేతిక విభాగం, జ్ఞానోదయ నాగరికత విభాగం, విద్యా శాఖ, మానవ సేవల విభాగం, హౌసింగ్ విభాగం, వాణిజ్య విభాగం, ఖజానా విభాగం ఉన్నాయని తెలిపింది. రిషభ ధ్వజ- కైలాస జెండాలో నిత్యానందతో పాటు దేశ జాతీయ జంతువు నంది కూడా ఉంది.

ఆస్ట్రేలియా నుంచి కైలాస దీవికి గరుడ పేరిట ఛార్టర్ విమాన సర్వీసులను ప్రారంభించినట్లు నిత్యానంద వెల్లడించారట. కైలాస దేశం ఎక్కడున్నదీ స్పష్టంగా తెలియకపోయినా... దీవి ఆస్ట్రేలియాకు సమీపంలో ఉన్నట్లు భావిస్తున్నారు. కైలాస దీవిలో ఎవరికైనా వసతి కల్పిస్తారని, అయితే కేవలం మూడు రోజులకు మించి ఉండటానికి అనుమతించమని నిత్యానంద పేర్కొన్నారట. కైలాస దేశాన్ని సందర్శించాలనుకుంటే ఆస్ట్రేలియా వరకు సొంత ఖర్చులతో రావాలని, అక్కడ నుంచి తామే స్వయంగా దీవికి తీసుకెళతామని ఆఫర్ ఇచ్చారట.దీవికి వచ్చేవారిని పరమశివుని సందర్శించడానికి అనుమతిస్తామని నిత్యానంద పేర్కొవడం గమనార్హం. ఆగస్టు 2020 నెలలో రిజర్వుబ్యాంకు ప్రారంభించిన వీడియోను నిత్యానంద విడుదల చేశారట. కైలాస దీవిలో ఇంగ్లీషు, సంస్కృతం, తమిళభాషలను అధికారిక భాషలుగా గుర్తించినట్లు వార్తలు వెలువడ్డాయి. పలు దేశాలలో హిందూ మతాన్ని నిశ్చయంగా పాటించే హక్కును కోల్పోయిన ప్రజలంతా కలిసి కైలాస దేశాన్ని ఏర్పాటుచేసినట్టు  పేర్కొన్నారట. 

పరిమిత సంఖ్యలో మాత్రమే సందర్శకులను అనుమతిస్తామని, కైలాసాలో ఉచిత ఆహారాం మరియు బస వసతులు ఇస్తుంది. కాని ప్రజలు వారి సందర్శన సమయంలో ఒక్కసారి మాత్రమే  నిత్యానందను కలవడానికి లేదా చూడటానికి అనుమతించబడతారట.

ఏదేమైనా, కైలాసా ప్రధానమంత్రి మరియు / లేదా మంత్రివర్గం ఆమోదించిన వారికి మాత్రమే, వీసాలు ఇవ్వబడి కైలాసా దేశం ప్రవేశాన్ని అనుమతిస్తుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ‘మాఅని పిలువబడే ఒక ప్రముఖ దక్షిణ భారత సినీ నటి, దేశానికి 'ప్రధానమంత్రి' అని పేర్కొన్నట్టు తెలిపింది.

సహజంగానే, తన కారణానికి ఉదారంగా విరాళం ఇచ్చిన నిత్యానందకు తెలిసిన భక్తులు మాత్రమే ద్వీప దేశాన్ని సందర్శించడానికి అర్హులు అనేది కూడాతెలిపారు

Image Credits: to those who took the original photos.

ఇవి కూడా చదవండి: 

టెలిస్కోప్ కు చిక్కుకున్న అంతరిక్ష సీతాకోకచిలుక(ఆసక్తి)

అంగారక గ్రహంలో మనుష్యులు?(ఆసక్తి)

************************************************************************************************

3 కామెంట్‌లు: