26, సెప్టెంబర్ 2020, శనివారం

అంగారక గ్రహంలో మనుష్యులు...?...(ఆసక్తి)

 

                                                                       అంగారక గ్రహంలో మనుష్యులు...?                                                                                                                                                            (ఆసక్తి)

మనిషి తెలివైన జీవి అని మనం గర్వంగా చెప్పుకుంటాం. కానీ మనిషి కంటే తెలివైన జీవులు అంగారక గ్రహంలో జీవించాయని కొందరు పరిశోధకులు గట్టిగా నమ్ముతున్నారు.

డజన్లకొద్దీ అంతరిక్ష నౌకలు, ఆర్బిటార్లు, ల్యాండర్లు మరియు రోవర్లు కుజునిపై ప్రయోగించబడ్డాయి. వీటిని సోవియట్ యూనియన్, నాసా, యూరప్ మరియు జపాన్ మొదలైన దేశాలవారు, కుజుని ఉపరితలంపై వాతావరణ పరిశోధనల కోసం ప్రయోగించారు.

1975 లో నాసా వైకింగ్ కార్యక్రమం ప్రారంభించి వీటిలో గల రెండు ఆర్బిటర్లను సంధించారు. ప్రతీది ఒక ల్యాండర్ కలిగి ఉన్నది. కార్యక్రమం మొదటిసారిగా కుజుని రంగు చిత్రాలు భూమిపైకి పంపగలిగినది. అంగారక గ్రహంలో కనిపించే ప్రతి చిత్రం ఎప్పటి కప్పుడు చర్చను రేకెత్తిస్తోంది. సరికొత్త ప్రతిపాదనలకు కారణమవుతోంది.

ఇది కూడా చదవండి:  వాతావరణ నియంత్రణ జరుగుతోందా(మిస్టరీ)

1976లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) కు చెందిన వైకింగ్-1 స్పేస్ క్రాఫ్ట్ అంగారకుడి చిత్రాలను భూమికి పంపింది. చిత్రాలలో సైడోనియా అనే ప్రాంతంలో మానవ ముఖ రూపం బయటపడింది.ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన భౌగొళిక ఆకారం అని కొద్దిమంది అంటే అలా ఏర్పడింది కాదని కొందరన్నారు.

మరికొందరు మాత్రం చాలా ఏళ్ళ క్రితమే అంగారకుడిపై తెలివైన నాగరికత వర్ధిల్లిందని దాని తాలూకు ఒకానొక ఆనవాలే 'మానవ ముఖ రూపం' అని చెప్పారు. కొందరైతే రెండు మూడు అడుగులు ముందుకు వేసి 'అంగారకుడిపై ప్రాచీన నాగరికత తాలూకు ఆంశాలను దాచి పెట్టే కుట్రను నాసా చేస్తోంది అని ఆరోపించారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 'జాకీ' అనే పేరు గలిగిన మాజీ నాసా మహిళా ఉద్యోగి కోస్టు టు కోస్ట్ .ఏం అనే రేడియోకు నవంబర్-2014 లో ఇచ్చిన ఒక ఇంటర్ వ్యూలో 35 సంవత్సరాలకు మునుపే అంటే 1979 లోనే అంగారక గ్రహంపై మనుషులు నడవడం చూశానని తెలిపింది. "నాసా వారి వైకింగ్ లాండర్ అంగారక గ్రహంపై దిగి ఫోటోలు పంపుతున్నప్పుడు, ఫోటోలను స్వీకరించే టెలిమెట్రీ శాఖలో పనిచేసే దానిని. అప్పుడు ఒక వీడియోలో దట్టమైన దుస్తులలో వైకింగ్ లాండర్ వైపు కొంతమంది మనుషులు పరిగెత్తుకు రావడం చూశాను. ఆశ్చర్యపోయి, అదే విషయాన్ని పై అధికారులకు చెబుదామని పై అంతస్తుకు వెళ్ళేను. మూసిన తలుపులను ఎంత కొట్టినా తెరవలేదు సరికదా, తలుపులకు ఉన్న గాజు అద్దాలను పేపర్లతో అటువైపు నుండి ముసేశారు. ఎందుకో నాకు తెలియదు" అని తెలిపింది. ఇంటర్ వ్యూ గురించి నాసా అధికారులు ఏమీ మాట్లాడలేదు.

మార్స్ ఆర్బిటర్ కెమేరా (ఎం..సి) చిత్రించిన చిత్రాల ద్వారా  అంగారకుడిపై మరికొన్ని ఆకారాలను గుర్తించారు. ఒకచోట సీతాకోక చిలుక ఆకారం కనిపించిందిఒకచోట రోడ్డు ట్రాఫిక్ సిగ్నల్ కనబడింది. మరో చోట ఒక కొండ నత్త ఆకారం, దాన్నే మరో వైపు నుంచి చూస్తే కుక్క ఆకారం కనిపించింది. నవ్వుతున్న ముఖంతో కూడిన ఆకారం, ప్రేమ గుర్తు కూడా ఏం..సి చిత్రాల్లో కనిపించాయి.కొన్ని చిత్రాలలోని ఆకారాలు అంగారకుడిపై చెట్లు ఉన్నాయనే వాదనను లేవనెత్తాయి. అయితే శాస్త్రవేత్తలు వాదనను కొట్టిపారేస్తున్నారు. "అంగారకుడిపై ఏర్పడిన ధూళి మేఘాలు వివిధ రూపాలు ధరించి చెట్ల రూపాన్ని గుర్తుకు తెస్తున్నాయే తప్ప అక్కడ ఎలాంటి చెట్లు లేవు" అన్నారు వాళ్ళు. 2007 లో తీసిన ఫోటోలో ఒక వ్యక్తి మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్ధన చేస్తున్న ఆకారం కనిపించింది. దీని ఆధారంగా అంగారకుడిపై జీవులు ఉన్నాయనే దానికి ఇదొక నిదర్శనం అని వాదించిన వాళ్ళూ ఉన్నారు.

కొన్ని సంవత్సరాల క్రితం అంగారకుడిపై మిధేన్ వాయువు ఆనవాళ్ళు కనుగొనడంతో అంగారకుడిపై జీవుల గురించి మళ్ళీ తాజాగా వాదన మొదలైయ్యింది. అంగారకుడికి సంబంధించిన సమాచారంలో నిష్ణాతుడిగా పేరుగాంచిన ప్రొఫెస్సర్ కోలిన్ (బ్రిటన్) 'అంగారకుడిపై జీవుల ఉనికిని నిర్ధారించడానికి మీధేన్ వాయువు బలమైన నిదర్శనం' అని చెప్పారు. అంగారకుడిపై వాతావరణం లేని కారణంగా పగటి ఉష్ణోగ్రతకు, రాత్రి ఉష్ణోగ్రతకు మధ్య చాలా తేడా ఉంటుంది. ఫలితంగా అక్కడ జీవుల మనుగడకు అవకాసాలు తక్కువ అని కొందరు శాస్త్రవేత్తలు కోలిన్ నమ్మకాన్ని తోసిపుచ్చారు.

ఇది కూడా చదవండి: అలల రహదారి(మిస్టరీ)

"అంగారక గ్రహానికి ప్రత్యేకత ఉంది. అది అప్పుడప్పుడు మన భూమిని గుర్తుకు తెస్తుంది. ఏదో ఒకరోజు మనం అక్కడికి వెళ్ళే వాళ్ళమే" అన్నారు నాసా శాస్త్రవేత్త జిమ్ గార్విన్. మన భూమికి పొరుగు గ్రహమైన అంగారకుడితో ఒకప్పుడు మనకు దగ్గర బంధుత్వం ఉండేది. తరువాత అది దూరపు బంధుత్వంగా మారింది.

ఇప్పుడు మాత్రం అంగారకుడితో మనకు దగ్గరి చుట్టరికం. చుట్టపు చూపుగా రేపో మాపో మనం అక్కడికి వెళ్ళొచ్చు. సీతాకోకచిలుకతో చెలిమి చేయవచ్చు. అక్కడ సుసంపన్నమైన నాగరికత వెలిగి ఉంటే వెలుగు జాడలు వెదికి చూడవచ్చుఅంటున్నారు. వేచి చూద్దాం!

మధ్య అంటే, డిసెంబర్-13, 2019 వచ్చిన న్యూస్

అంగారకుడి ఉపరితలానికి అంగుళం కింద దాగున్న నీటి ఉనికి విస్తృతిని తెలియజేస్తూ అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఒక మ్యాపును రూపొందించింది.

భవిష్యత్తులో ఆ గ్రహం వద్దకు చేపట్టే, మానవసహిత అంతరిక్ష యాత్రకు ఇది కీలకమవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అరుణ గ్రహం వద్దకు మొదటి వ్యోమగాములను పంపినప్పుడు వారు తమ వ్యోమనౌకలో అవసరమైన అన్ని వస్తువులనూ వెంట తీసుకు వెళ్ళలేరు. నేపధ్యంలో అక్కడి వనరులను ఉపయోగించుకుంటే ప్రయోజనం ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. వనరుల్లో నీరు చాలా కీలకం. అక్కడి ల్యాండింగ్ ప్రదేశాన్ని నిర్ధరించడానికి నీటి లభ్యత ముఖ్యపాత్ర పోషించనుంది.

వ్యోమగాముల తాగు నీటి అవసరాలకు, రాకెట్ ఇంధనం తయారీకి  అక్కడి ‘ఐస్’ నే ఉపయోగించుకోవచు. దీంతో ఉపరితలం నుంచి తక్కువ లోతులో ఉన్న ఐస్ నిక్చేపాలపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. అరుణ గ్రహ కక్ష్యలో తిరుగుతున్న మార్స్ రికాన్ సన్స్ ఆర్బిటర్, మార్స్ అడిస్సీ ఆర్బిటర్ల నుంచి సేకరించిన డేటాతో తాజా మ్యాప్ ను తయారుచేశారు.

Image Credit: To those who took the original photos.

************************************************************************************************



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి