ఆకాశం నుండి విచిత్రమైన శబ్ధాలు దేవతలు వాయుస్తున్న గాలి వాద్యం?
ఈ సంవత్సరం, అంటే 2019 జనవరిలో అనేక దేశాలలోని ప్రజలు ఆకాశం నుండి విచిత్రమైన, చెవులు చిల్లులు పడే గాలి వాద్యం (Trumpet) శబ్ధాలు విన్నామని చెప్పటంతో తిరిగి ఈ విచిత్రమైన శబ్ధాల గురించిన చర్చ మొదలయ్యింది.
అనేక దేశాలలోని ప్రజలు ఆకాశం నుండి విచిత్రమైన, చెవులు చిల్లులు పడే గాలి వాద్యం (Trumpet) శబ్ధాలు విన్నామని/వింటున్నామని ప్రభుత్వాలకు చెబుతున్నారు. వాద్య బృందంలొ వందమందికి పైగా ట్రంపెట్ ను ఒకేసారి వాయిస్తే ఎంత శబ్ధం వస్తుందో అంత శబ్ధం వినబడుతోందని ప్రజలు తెలియజేశారు. ఆ వాద్య శబ్ధం ఎక్కడి నుండి వస్తోందో తెలుసుకుని తమకు వివరించాలని, తమ భయం పోగొట్టాలని, తాము భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని వాపోతున్నారు.
"ఒక దశాబ్ధ కాలానికి పైగా వినబడుతున్న ఈ శబ్ధాన్ని గురించి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవటం లేదు" అని డైలీ మైల్ పత్రిక ప్రపంచ ప్రభుత్వాలను ప్రశ్నిస్తోంది.
ఈ విచిత్ర సంఘటన మొదటిసారిగా 2008లో బెలారస్ దేశంలో వినబడినట్లు, దానిని రికార్డు చేసి ‘యూ ట్యూబ్’ లో ఉంచాడు ఒక వ్యక్తి. కానీ దానిని మోసపూరితమైనదిగా వివరిస్తూ ప్రభుత్వాలు కొట్టిపారేశాయి.
అదే సంవత్సరం అమెరికా దేశంలోని ఒక వ్యక్తి అదే వాద్య శబ్ధాన్ని తానూ విన్నట్లు పత్రికలకు తెలుపుతూ బెలారస్ లో వినిపించిందని చెబుతున్నది మోసపూరితం కాదు అని తెలిపాడు.ఆ తరువాత జర్మనీ, కెనడా, రష్యా దేశాలలోని ప్రజలు కూడా అదే శబ్ధం విన్నట్లు తెలిపారు. 2011లో రష్యా, 2012లో అమెరికా, కెనడా, 2013లో ఇంగ్లాండ్ దేశాలలొ ఈ వాద్య శబ్ధం విన్నట్లు అక్కడి ప్రజలు తెలిపారు.
జర్మనీలో శబ్ధం ఏర్పడినప్పుడు రికార్దు అయిన తరంగాల గ్రాఫ్.
జూన్-2013లో కెనడాలో ఈ వాద్య శబ్ధాన్ని విన్న Kimberly Wookey అనే ఒక మహిళ, శబ్ధం వినబడగానే రికార్డింగ్ చేయడం మొదలుపెట్టి, ఆ వాద్య శబ్ధం వినబడుతున్నప్పుడల్లా రికార్డు చేస్తూ, అదే సంవత్సరం మే నెల 7 వ తారీఖున విన్న ఒక విచిత్ర శబ్ధాన్ని కూడా రికార్డు చేసి ‘యూ ట్యూబు’లో ఉంచుతూ ప్రభుత్వానికి కూడా ఒక కాపీ అందించింది.
Kimberly Wookey మరియు Aaron Traylor అనే ఇరువురు పంపిన రికార్డింగ్స్ విని శాస్త్రవేత్తలు, ప్రభుత్వ ఆదేశాలతో తమ పరిశొధనలు మొదలు పెట్టారు. వారి పరిశోధనలు ఎటువంటి వివరణ ఇవ్వలేకపోయాయి.
2012లో టెక్సాస్ నగరంలో చాలామంది ప్రజలు ఈ శబ్ధం విన్నారు. ఆకాశం వైపు చూశారు. భయంతో బిగుసుకుపోయారు.
ఓక్లహామా విశ్వవిద్యాలయానికి చెందిన భూగర్భ శాస్త్రవేత్త David Deming ఈ శబ్ధం గురించి తన పరిశోధనలలో, తన పుస్తకాలలో ఎప్పటి నుంచో రాస్తూనే ఉన్నారు. 'ఒక మర్మమైన, కనుగొన సాధ్యం కాని ఒక వాద్య శబ్ధాన్ని ప్రపంచ జనాభాలో 2 నుండి 10 శాతం మంది వింటున్నారు. ఈ శబ్ధాలు బహుశ టెలిఫోన్ ట్రాన్స్ మిషెన్ వలన గానీ లేక అమెరికా నౌకాదళం తమ జలాంతర్గామి ట్రాన్స్ మిషన్ కోసం ఏర్పరుస్తున్న శబ్ధం అయ్యుండొచ్చు" అని ఆయన రాశారు.
కెనడా దేశంలో శబ్ధం ఏర్పడినప్పుడు రికార్దు అయిన తరంగాల గ్రాఫ్.
అమెరికా ప్రభుత్వం “ఆ శబ్ధం మా నౌకాదళానికి సంబంధించిది కాదు. అయినా అదే శబ్ధం ప్రపంచంలోని పలుచోట్ల వినబడుతున్నది. కానీ ఆ శబ్ధాలు రేడియో సిగ్నల్స్ కు సంబంధించినవి కూడా కాదు" అని తెలుపుతూ నాసా శాస్త్రవేత్తలను ఈ శబ్ధం గురించి పరిశోధించమన్నది.
"భూమికి సహజ రేడియో ప్రసరణలు చేసే ప్రక్రియ ఉన్నది. చెవులకు బదులు, మనుష్యుల చెవుల దగ్గర ఆంటెనాలుంటే భూ గ్రహం చేసే విశేషమైన సమన్వయ శబ్ధాలను వినవచ్చు. వీటినే మేము సర్ధుబాట్లు, ఈలలు, గొళాకార శబ్ధ వలయాలు అంటాము" అని శాస్త్రవేత్తలు వివరణ అందించారు. భూమి ఎప్పుడూ శబ్ధతరంగాలను ప్రసరిస్తూనే ఉంటుంది. మనమే వాటిని గ్రహించలేము. ఉదాహరణకు పిడుగులు తీసుకోండి. అవి ఎంత శబ్ధాన్ని ప్రసరిస్తాయో మీకందరికీ తెలుసు కదా. అలాగే భూమి కూడా శబ్ధ తరంగాలను ప్రసరిస్తూనే ఉంటుంది.
భూకంపాలు, అంటే భూమి క్రింద ఉండే టెక్టానిక్ ప్లేట్లు జరుగుతున్నప్పుడు ఇల్లాంటి శబ్ధమే వస్తుంది. అప్పుడు భూకంపాలు ఏర్పడతాయని అర్ధం కాదు. భూమి తాను కూర్చునే సీటును(ప్లేటును) సర్దుకుంటున్నది అని అర్ధం. అగ్నిపర్వతాలలో జరుగుతున్న ప్రక్రియ, తుఫానలు తీరం దాటు తున్నప్పుడు గాలి శబ్ధం...ఇవన్నీ భూమిలోని సహజ రేడియో ప్రసరణలు" అని Southern Methodist University in Dallas కు చెందిన భూకంప శాస్త్రవేత్త Brian W Stump తెలిపారు.
"ఇవేవీ నమ్మేటట్లు లేవు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు వాటి గురించి ప్రజలకు ముందే చెప్ప వచ్చుగా. ఎవరూ భయపడకుండా ఉండేవారు కదా. శబ్ధాలను రికార్డు చేసి, వీడియోలు తీసి ప్రభుత్వాలకు తెలిపిన తరువాత, తమ పరిశోధనలను మొదలు పెట్టారు. అందులోనూ 2013 నుండే ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకుని పరిశోధనలు జరిపారు. అప్పుడే ఫలితాలు దొరికిపోయాయా? ఈ వాద్య శబ్ధం 2008 నుండి ప్రపంచంలోని పలుచోట్ల వినబడింది. ఎందుకు అప్పుడే దీని గురించిన పరిశోధనలు మొదలుపెట్ట లేదు? ప్రభుత్వాలు ఇస్తున్న సమాధానాలు అమోదయోగ్యమైనవిగా లేవు" అంటూ పలు చోట్ల ప్రజలు తమ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలకు సరిగా వివరించలేని ఈ వాద్య శబ్ధం గురించిన అనుమానం ప్రజలలో ఒక మిస్టరీగానే ఉంటోంది. ఈ శబ్ధాలను వినాలంటే యూట్యూబ్ లో Strange Sounds in Sky అని సెర్చ్ చేస్తే ఈ మిస్టరీకి కావలసిన బోలెడు వీడియోలు మీరు చూడవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి