24, ఏప్రిల్ 2021, శనివారం

మానవత్వం...(సీరియల్/నవల)...PART-5


                                                                                  మానవత్వం                                                                                                                                                            (సీరియల్/నవల)

                                                                                      PART-5

 మనసులో దృడత్వంధైర్యము ఉంటే ఎదురుపడే కష్టాలను తుచ్చంగా భావించి వాటిని చేదిస్తూ వెళ్ళగలిగితేనీవల్ల ఎదగడం కుదురుతుంది మహిళా! 

కుటుంబ శభ్యులందరూ కలిసి ఒక చోట కూడి ఎవరికి తోచిన సలహా వారు ఇస్తున్నా, వాటిని పట్టించుకోకుండా బయలుదేరటానికి సిద్దమయ్యింది యామిని. బట్టలను సూట్ కేసులో సర్ధుతున్న ఆమె భుజం పట్టుకుని ఆవేశంగా తనవైపు తిప్పాడు పెద్ద కొడుకు సుధాకర్.

"మేమందరం ఇంత దూరం చెబుతున్నా, ఏమీ పట్టించుకోకుండా నీపాటికి నువ్వు బయలుదేరటానికి అర్ధమేమిటే?"

"ఇంత జరిగిన తరువాత- ఇంట్లో ఉండలేను అనేదే అర్ధం"

"ఓహో...అంత దూరం వెళ్ళిపోయావా? ఎక్కడికి వెల్దామని నీ ఉద్దేశం?"

"ఎక్కడికో వెల్తాను! విశాలమైన ప్రపంచంలో ఏదో ఒక మూలలో నాకూ, నా బిడ్డకు చోటు లేకుండానా పోతుంది?"

"విన్నారా నాన్నా మీ కూతురు చెప్పేది?"

"వింటూనే ఉన్నాను. ఇంకా ఏమేమి వినాలని నుదుటి మీద రాసుందో?"

"ఇలా చెబితే ఎలా మామయ్యా? ఇంట్లో నుండి వెళ్ళేది ఇదొక్కత్తే కాదు... కుటుంబ పరువు, మర్యాద కూడా"

"అవి ఎప్పుడో పోయినై? ఇంకా ఏముంది పోవటానికి?" అన్నది చిన్న కోడలు.

"ఆడపిల్లకు ఎందుకింత పట్టుదల? ఎవరో కని పారేసిన బిడ్డ కోసం...మొత్త కుటుంబాన్నీ దులిపేసుకుని వెళ్ళేంత ధైర్యం ఎక్కడ్నుంచి వచ్చింది?"

"ఇంకెక్కడ నుండి వస్తుంది? చేతిలో చదువు ఉంది. మంచి ఉద్యోగం ఉంది. ఇవి ఉంటే ధైర్యం రాకుండా ఉంటుందా?"

"అదేమిటి...చదువుకుంటేనో, ఉద్యోగ్యం చేస్తేనో మాత్రమే మాకు ధైర్యం వస్తుందా? చదువు, ఉద్యోగం లేకపోయినా నా వల్ల బిడ్డను కాపాడటం కుదురుతుంది" చెప్పింది యామిని.

"ఎలా కాపాడుతావు?"

"ఉద్యోగానికి వెళ్ళే సంపాదించుకోవాలా? కూలీ పనిచేసుకుని కూడా సంపాదించుకోవచ్చు. బిడ్డ కొసం పనైనా చేస్తాను"

"నువ్వు చేస్తావే! సంపాదిస్తే మాత్రం చాలా? ఒక్కదానివే ఎలా జీవిస్తావే? అందులోనూ మెడలో తాలి లేకుండా చేతిలో ఒక బిడ్డతో వెళ్ళి నిలబడితే...ఎక్కడా నీకు ఇల్లు దొరకదు. ఒకవేల దొరికినా... సమాజం నిన్ను ప్రశాంతంగా వదులుతుందా...ప్రశ్నలు అడిగే చంపేస్తుంది"

"హూ...కన్నవాళ్ళూ--ఇన్ని సంవత్సరాలు నాతొనే పెరిగిన తోడబుట్టిన వాళ్ళూ...మీరే ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు, సమాజం అడగబోయే ప్రశ్నలకు బాధపడితే కుదురుతుందా?” ఎదురు ప్రశ్న వేసింది యామిని.

"నీ మీద మాకు ప్రేమాభిమానాలు ఉన్నందువలన... నిన్ను ప్రశ్నలు అడిగే హక్కు మాకు ఉంది

"మీ ప్రేమాభిమానాలు నాకు అర్ధం కాక కాదు. అదే ప్రేమాభిమానాలు నా బిడ్డ మీద నాకు ఉన్నది"

"అదేమిటి నీ బిడ్డ...నిజంగా నువ్వే కన్నట్లున్నావే?" అంటూ అడిగిన ప్రశాద్ భార్య వైపు కోపంగా చూసింది యామిని.

"మీ చేతిలో ఉన్న పాప మా అన్నయకే పుట్టిందని మీరు చెబితే, నేనూ పవిత్రమైన దానినే అనేదీ నిజం"

"యామినీ!"

"ఎందుకన్నయ్యా అరుస్తావు? కోపం వస్తోందా? ఇదే కోపం నీ భార్య నన్ను అన్నప్పుడు రాలేదే?"

"అది..."

"చెప్పన్నయ్యా! ఎందుకు తటపటాయిస్తావు? అప్పుడైతే...మీరందరూ నన్ను నమ్మటం లేదు కదూ?"

"పిచ్చిదానిలా మాట్లాడకు! ఎవత్తో కన్న బిడ్డకోసం నువ్వెందుకే ఇలా అవమానపడతావు? అమ్మ చెప్పేది వినవే. బిడ్డ నీకు వద్దే. మాట్లాడకుండా మా అన్నయ్య కొడుకును పెళ్ళిచేసుకో. ఎంతమంది పిల్లలైనా కను. సంతోషంగా ఉండు. ఇది మాత్రం నీకు వొద్దు"

"క్షమించమ్మా! పెళ్ళి-బంధుత్వాలు...వీటి పైన నాకున్న నమ్మకం, పూర్తిగా పోయిందమ్మా. 'నువ్వు నా భార్యగా వస్తే చాలు. అది తప్ప ఇంకేదీ నాకు ముఖ్యం కాదుఅని చెప్పిన దివాకర్ నన్ను అర్ధంచేసుకోలేదు. మీ అన్నయ్య కొడుకు మాత్రం అర్ధం చేసుకుంటాడా?"

"..........................."

"వద్దమ్మా! తెలిసో-తెలియకో...ఇది నా బిడ్డే అని అందరూ చెప్పేశారు. నాకు తెలియకుండానే నేనూ బిడ్డను నా బిడ్డగా స్వీకరించాను. ఇక ఇదే నా జీవితం. మిగిలిన నా జీవితాన్ని దీని తోనే జీవిస్తాను"

"ఎందుకే అలా మాట్లాడుతున్నావు? నేను చెప్పేది విను. వయసులో ఉన్న ఆడది ఒంటరిగా కాలం గడపలేదే"

"గడపగలనమ్మా! ఈలోకంలో అందరూ చెడ్డ వాళ్ళు కారు.. చాలామంది మంచివాళ్ళూ ఉన్నారు"

"ఇలా చూడు...ఇలా డైలాగులు మాట్లాడుకుంటూ వెళ్ళి, రేపే 'తప్పైపోయిందిఅంటూ వచ్చి నిలబడతావు..."

"కచ్చితంగా నిలబడను. బాగా జీవిస్తాను. వెయ్యి బంధాలున్నా నేను అనాధను. అనాధకు అనాధే బంధువు. ఇక బిడ్డ నా బిడ్డ. నేను పెంచి పెద్ద చేస్తాను. ఇది చనిపోవడానికి పుట్టిన బిడ్డ కాదు...ఏదో సాధించటానికి పుట్టిన బిడ్డ"

"......................."

"ఏం బంగారం! నాశనం అయిపోతాం అని మాట్లాడిన వీళ్ళ ముందు మనం మంచిగా జీవించి చూపించాలి. జీవితంలో సాధించి చూపించాలి. నువ్వు...సాధించటానికే పుట్టావు. నువ్వెప్పుడూ జయిస్తూనే ఉంటావు.అందువలన నీ పేరు జయ... జయ.... జయ!" పిల్ల చెవిలో మూడు సార్లు పేరును ఉచ్చరించింది. పిల్ల వొళ్ళు పులకరించింది.

పాపను తన గుండెలకు హత్తుకుని, సర్ధుకున్న సూట్ కేసును తీసుకుని బయలుదేరటానికి సిద్దమయ్యింది....తల్లి సరోజ వచ్చి మళ్ళీ అడ్డుకుంది.

"యామినీ...ఏమిటే ఇది? నువ్వు నిజంగానే వెళ్ళి పోతావా?"

"అమ్మా....నేనూ, జయ ఇక్కడుంటే నీ కొడుకూ, కూతురూ వెళ్ళిపోతారు. మిమ్మల్ని చూడటానికి కూడా ఎవరూ రారు. నీకు, నాన్నకు తీరని అవమానం. వీటన్నిటికంటే నేను వెళ్ళిపోవడమే మంచిది"

"నువ్వు వెళ్ళిపోతే మాత్రం అవమానం జరగదా?"

"నాకు ముగ్గురు పిల్లలే అని చెప్పమ్మా" అంటూ వెళ్ళిపోతున్న యామినిని చూస్తూ సుధాకర్ అరిచాడు.

"పో...పో! ఎవరో అనాధ బిడ్డకోసం మమల్ని వదిలించుకుని పోతున్నావు కదూ...రేపు అది పెరిగి పెద్దదైన తరువాత నిన్నూ ఇలాగా వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు తెలుస్తుంది బంధు ప్రేమ అంటే ఏమిటో. నేను చెప్పేది జరుగుతుందో, లేదో చూడు"

"హు...చూద్దాం"

"ఏమండీ! నిజంగానే వెడుతోందండి. వద్దని చెప్పండి. అయ్యో వెలుతోందే... ఏమండీ చెప్పండి..." సరోజ అల్లలాడిపోయింది.

"వెళ్ళనీ...వదిలేయ్! అదే చెప్పింది కదా మనకి ముగ్గురు పిల్లలని"

"ఏమండీ?"

"నీళ్ళు తీసుకురా...తల తడుపుకోవాలి"

తండ్రిమాటలు స్పష్టంగా చెవిలో పడినా...తిరిగి చూడకుండా బయటకు నడిచింది యామిని. వీధిలో ఖాళీగా వెడుతున్న ఆటోను ఆపి అందులో ఎక్కింది. ఇంతకు మునుపే స్నేహితురాలి సహాయంతో ఏర్పాటు చేసుకున్న 'వుమన్స్ హాస్టల్వైపుకు బయలుదేరింది...ఆమె జీవిత ప్రయాణం.

తరువాతి సమస్య ఆఫీసులో మొదలయ్యింది. మధ్యాహ్నం లంచ్ టైములో అందరూ అమె చుట్టూ గుమికూడారు.

"ఏం యామిని...ఇంటి నుండి వచ్చాశావుటగా? ఇప్పుడు ఒంటరిగానా ఉంటున్నావు?"

"లేదే...నా పాపతో పాటూ ఉంటున్నా"

"నీకెందుకీ అక్కర్లేని పని? పెద్ద చదువు చదువుకున్నావు...ఇలా మూర్ఖంగా చేశావే?"

"ఏది మూర్ఖం?"

"రోడ్డులో పడున్న బిడ్డకోసం నువ్విలా రోడ్డుకు వచ్చాశావే....?"

"ఏం యామిని...నువ్వేమన్నా నిన్నుమదర్ తెరసాఅనుకుంటున్నావా? రోడ్డు మీద పడున్న బిడ్డల్నందరినీ తీసుకుని పెంచబోతావా?”

"అదేకదా...ఒకరోజుకు రోడ్ల మీద, చెత్త కుండీలలో బొలెడంత మంది పిల్లలను పారేస్తున్నారు. ఇక మీదట పారేయ దలచుకున్న పిల్లలను యామిని దగ్గర ఇవ్వండి అని చెప్పేద్దామా?"

"కరెక్ట్! తరువాత ఉద్యోగం వదిలేసి, ఫుల్ టైం అనాధ ఆశ్రమ యజమాని అయిపోతుంది. మంచి ఆదాయమూ వస్తుంది"

నలిని ఆటపట్టించటానికి చెప్పినా... యామిని కోపం ఆకాశాన్ని అంటింది.

"ఆపండి! మీరంతా మనుషులేనా? మనసులో బాధ లేకుండా మాట్లాడుతున్నారే...? అనాధ ఆశ్రమాలు పెరగటం, బిడ్డలను విసిరి పారేయడం గేలి చేసే విషయమా? మనమందరమూ సిగ్గు పాడాల్సిన-అవమాన పడాల్సిన విషయం"

"యామిని"

"నోరు ముయ్యి సురేష్! నీలాంటి మగవారు...ఆకలి తీర్చుకోవటానికి ఆడవారిని వెతుకుతున్నారు. బలహీనమైన, క్రమశిక్షణ లేని ఆడపిల్లలు...మీ దగ్గర మోసపోతున్నారు. అలా మీరు చేస్తున్న తప్పుకు పసిపిల్లలు బలి అవుతున్నారు.

మీలాంటి మగవారు ఆకలి తీరగానే వెళ్ళిపోతారు. కానీ గర్బం దాల్చేమని తెలుసుకున్న రోజు నుండి ఆడది ఎన్ని కష్టాలు పడుతుందో ఆలొచించుంటారా ? ఇంట్లో వాళ్ళకో, బయటి వాళ్ళకో తెలిసిపోతుందని భయపడి భయపడి కడుపులోనే చంపేయటానికి ప్రయత్నిస్తారు. సామర్ధ్యం కూడా లేని అమాయకులు...కడుపు చూపేస్తుందని భయపడి ప్రాణాలు వదిలేస్తారు.

దానికీ ధైర్యం లేని ఆడపిల్లలు, బయట తల చూపించ కుండా నేరస్తులలాగా తలదాచుకుంటూ బిడ్డను కన్న తరువాత దాన్ని ఏం చేయాలో అర్ధంకాక ఇలా విసిరి పారేస్తున్నారు. కానీ...పది నెలలు కడుపులో మోసిన బిడ్డను విసిరేటప్పుడు, ఒక తల్లిగా ఆమె ఎంత క్షోభ పడుంటుందో ఎవరైనా ఆలొచించి చూశారా?

విసిరి వేయబడ్డ బిడ్డ ఎవరి చేతికైనా దొరికిందో? కుక్క కరుచుకు పోయిందో నని ఒక్కొక్క క్షణమూ...ఏం ఆమె చివరి ఊపిరి ఉన్నంత వరకూ భయమూ, నేరం చేశానే అనే మనో క్షోభ ఆమెను కొంచం కొంచంగా నలిపేస్తుందే! నొప్పిని మీరు ఉహించగలరా? అలా ఉహిస్తే....మీవల్ల తప్పుచేయడం కుదురుతుందా?

ఆడపిల్లల శీలానికీ, క్రమశిక్షణకు పేరుమోసింది మన దేశం. కానీ, ఇప్పుడు క్రమశిక్షణ కరువయ్యింది, అన్యాయమూ, అక్రమమూ తల ఎగరేసుకుంటూ ఆడుతున్నాయి. దాని గురించి రోజైనా ఆందోళన చెందుతున్నామా? ఇలా క్రమశిక్షణ లేని తల్లితండ్రులకు పుట్టిన ఒకే ఒక నేరానికి, పాపమూ ఎరుగని పసి పిల్లలు తమ జీవితాంతమూ నేరారోపనను మోస్తున్నారే!

వీటిని తలచుకుని మనం సిగ్గుపడాలి...బాధపడాలి. ఇలా జరగకూడదని ఆశపడాలి. దీనిని ఆపటానికి మనం పోరాడాలి. అది వదిలేసి...గేలి చేస్తున్నారు"- అంటూ ఆయసపడుతూ మాట్లాడిన యామినిని చూసి....అందరూ శిలలలాగా నిలబడ్డారు.

ఒక సెలెబ్రిటీ పది మంది పిల్లలను దత్తతు తీసుకున్నదని పొగడుతారు. కానీ, అదే పనిని మీలో ఒక్కత్తి నైన నేను చేస్తే తప్పు పడుతున్నారే? తప్పైన పనిచేశానని గుమికూడి మాట్లాడుతున్నారే?"

" ప్రపంచంలో అనాధ పిల్లలే ఉండకూడదని అనుకునే దాన్ని నేను. దానికొసం నేను చేసిన చిన్న ప్రయత్నమే ఇది. వీలైతే మీరూ నలుగురు పిల్లలను కాపాడండి. వీలుపడదు అంటే నోరు మూసుకుని మౌనంగా ఉండండి. అది వదిలేసి మంచి కార్యాలు చేస్తున్న వారిని ఏవేవో పిచ్చి మాటలు చెప్పి వాళ్ళను స్వార్ధ పరులుగా మార్చకండి. మీకు చాలా పుణ్యం వస్తుంది" అంటూ చేతులెత్తి నమస్కరించింది....వాళ్ళందరూ చెదిరి పోయారు.

                                                                                                                  Continued...PART-6

************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి