18, ఏప్రిల్ 2021, ఆదివారం

మానవత్వం...(సీరియల్/నవల)...PART-2

 

                                                                                మానవత్వం                                                                                                                                                            (సీరియల్/నవల)

                                                                                    PART-2

     పొగిడే వాళ్ళు పొగడనీ...తిట్టే వాళ్ళు తిట్టనీనీ దారిలో ధైర్యంతో -నువ్వు ధైర్యంగా వెళ్ళిపో మహిళా

"ఏమిట్రా ఇది...టైము ఆరు అవుతోంది. నాలుగు గంటలకే ట్రైన్ ఎక్కిందని చెప్పారు. ఇక్కడున్న హై టెక్ సిటీ నుండి యూసఫ్ గూడా రావటానికి రెండు గంటలా అవుతుంది?"

దివాకర్ తల్లి పార్వతి గట్టిగా అడగటంతో...చేతులు పిసుక్కుంది సరోజ. వాకిట్లోనే నిలబడి కూతురు రాకకోసం ఎదురుచూస్తున్న తండ్రి రామారావుకు దివాకర్ తల్లి మాటలు వినబడటంతో హడావిడిగా లోపలకు వచ్చాడు.

"కోపగించుకోకండి...'ట్రైన్లో ఏదైనా లోపం వచ్చుంటుంది. అబ్బాయిని పంపించాను. ఇప్పుడు వచ్చాస్తారు"

" మాటే ఒక గంట నుండి చెబుతున్నారు. కానీ, అమ్మాయీ రాలేదు...వెతకటానికి వెళ్ళిన అబ్బాయీ రాలేదు" రామారావును నిలదీసింది దివాకర్ తల్లి.

"సమస్య ఏమిటో తెలియలేదేఉండండి. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయమంటానుదివాకర్ తల్లితో చెప్పి, భార్య వైపు తిరిగిసరొజా... మళ్ళీ ఇంకొసారి 'ఫోన్చేసి చూడు"- తండ్రి రామారావు ఆదుర్దాగా చెప్పాడు.

ఈలోపు దివాకర్ ముందుకు వచ్చి "నేనూ యామినికి 'ఫోన్ట్రై చేస్తునే ఉన్నా అంకుల్. సమాధానమూ లేదు"

"ఏమిటి బాబూ చెబుతున్నావు?" కంగారుగా అడిగాడు రామారావు.

"స్విచ్ ఆఫ్ చేసుకోనుంది" అని చెబుతున్నప్పుడు అతని గొంతు, ముఖమూ మారింది. రామారావు నీరసంగా భార్యను చూశాడు.

"ఒకవేల "ఫోన్లో 'చార్జ్' అయిపోయుంటుందేమో?" మెల్లగా చెప్పింది సరోజ.

"మనిషి మనిషికీ ఏదో ఒకటి చెబుతున్నారు. ఇదంతా నాకు సరి అనిపించటం లేదు. ఇది జరిగే పని కాదు. అందరూ లేవండి వెళ్దాం" కుర్చీలో నుండి లేస్తూ అన్నాడు దివాకర్ తండ్రి.

సరోజ గాబరా పడింది.

"కొ..కొంచం సేపు ఉండండి ఇప్పుడు వచ్చేస్తుంది..."

"ఏమ్మా... మాకు పనీ పాటా లేదనుకున్నారా? సాయంత్రం ఆరు గంటలకు నా మేనమామ మనుమురాలికి బారసాల ఫంక్షన్ ఉంది. అది వదిలేసి ఇక్కడే కూర్చుంటే....రేపు మా వాళ్ళ మొహాలు మేము చూడక్కర్లేదా?"

"... అదికాదండీ..."

"ఇలా చూడండి. ఏదో మా అబ్బాయి ఆశపడ్డాడు కదా అని ఇక్కడికి వచ్చాము…..కానీ, జరుగుతున్న తంతు చూస్తుంటే మీ అమ్మాయికి మా అబ్బాయి అంటే ఇష్టం లేదు లాగుందే?"

."అయ్యో...అలాగంతా లేదమ్మా"

"కాకపోతే ఏమిటమ్మా..? అమ్మాయిని చూడటానికి వస్తున్నాం అని మీకు తెలుసు. లీవు పెట్టి ఇంట్లో ఉండమని చెప్పుండాలి. మీరు చెప్పలేదు. సరే...ఫోన్ చేస్తే మాట్లాడుతుందీ అని అనుకుంటే ఫోను ఎత్తటమే లేదు. ఎలాగో ఆఫీసు నుండి బయలుదేరి, ట్రైన్ ఎక్కి వస్తోంది అని చెప్పేరు...మేమూ నమ్మాము. కానీ, ఇంతవరకు ఇంటికి వచ్చి చేరలేదు. 'ఫోన్ను 'స్విచ్' ఆఫ్ చేసిపెట్టింది. దీనికంతా ఏమిటి అర్ధం? మీ అమ్మాయికి సంబంధం ఇస్టంలేదని తెలుస్తోంది

"అమ్మా" అంటూ నోరు తెరవబోయిన కొడుకును చూపులతోనే వారించింది దివాకర్ తల్లి.

"నువ్వు ఉరికే ఉండరా. ఉద్యోగానికి వెళ్ళే ఆడపిల్ల మనకు కరెక్టు కాదు. వద్దు అని చెప్పానా...విన్నావా? ' అమ్మాయే కావాలని ఒంటికాలుమీద నిలబడి మమ్మల్ని పిలుచుకొచ్చావు...ఇప్పుడేమైందో చూడు"

"అదికాదమ్మా! వచ్చే దారిలో ఏదైన సమస్య వచ్చుంటుంది...వచ్చిన తరువాత అడిగితేనే కదా నిజం తెలుస్తుంది?"

"నోరు ముయ్యరా! పెళ్ళి చూపులకే ఇంత ఆలశ్యంగా వచ్చే అమ్మాయి, రేపు మన ఇంటికి వచ్చిన తరువాత ఎలా ప్రవర్తిస్తుందో? ఇది మనకు సరిపడదు...బయలుదేరు"

"అమ్మా..."

"దివాకర్…. నీ ఇస్టాన్ని గౌరవించి మేము వచ్చాము. కానీ, అమ్మాయి మనల్ని గౌరవించటంలేదే? ఎందుకు ఆలశ్యమవుతోందో కనీసం ఫోనులో చెప్పచ్చు కదా. అదికూడా చేయలేని అమ్మాయి నీకెందుకురా? నీకేం తక్కువ...వేరే అమ్మాయి దొరకదా?" తండ్రి కూడా బయలుదేరటానికి సిద్దం అవగా...వేరు దారిలేక కుర్చీలోంచి లేచాడు దివాకర్.

రామారావు బాగా కలత చెందాడు.

"బాబూ...అవసరపడకండి. నా కూతురు ఇప్పుడు వచ్చేస్తుంది"

"ఇలా చూడండి. విదేశాలలొ పనిచేసే అల్లుడ్ని వదలకూడదని మీరు తహతహలాడుతున్నారు. కానీ, కుటుంబానికి తగిన అమ్మాయి మాకు కావాలికదా?" దివాకర్ తల్లి చెప్పింది.

సరోజకి కోపం వచ్చింది.

"ఇలా చూడండి...మగపెళ్ళి వాళ్ళు, ఇళ్ళు వెతుక్కుంటూ వచ్చేరే అని మిమ్మల్ని కూర్చోపెట్టి ఇంతసేపు మాట్లాడుతున్నాము. అంతేగానీ మీ అబ్బాయికోసమో...అతని విదేశీ ఉద్యోగం కోసమో కాదు"

"సరొజా"

"మీరు వూరుకోండి. బయటకు వెళ్ళిన అమ్మాయి ఇంటికిరావటానికి అటు ఇటూ అవుతుంది. ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నారే , రేపు అమ్మాయి వాళ్ళింటికి వెడితే ఇంకా ఏమేమి మాట్లాడతారో? ఈవిడ మాటలు మంచిగా లేవు. సంబంధం పోతే పోనివ్వండి"

"చూసావారా దివాకర్!...మనకు ఇది అవసరమా? అమ్మాయి మాత్రమే కాకుండా...తల్లి కూడా కలిసి మనల్ని అవమానిస్తున్నారు

"ఇదిగో చూడండి... మర్యాదగా మాట్లాడితే అందరికీ మంచిది"

"సరొజా…...ప్రశాంతంగా ఉండు"

"ఎందుకు ప్రశాంతంగా ఉండాలి? రెండు గంటల ముందే ఆఫీసు నుండి ఇంటికి బయలుదేరిన అమ్మాయి ఇంకా ఇంటికి ఎందుకు రాలేదని మనం టెన్షన్ పడుతుంటే, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూశారా? ఆడపిల్లను కంటే అన్నిటికీ సర్ధుకుపోవాలా? వాళ్ళకే ఇంకో అమ్మాయి దొరుకుతున్నప్పుడు...మన అమ్మాయికి వెరే అబ్బాయి దొరకడా? మా అన్నయ్య కొడుకు ఉన్నాడు...దర్జాగా ఉంటాడు. బోలెడంత సంపాదిస్తున్నాడు"

"విన్నావారా దివాకర్ ...ఆల్ రెడీ పెళ్ళికొడుకు రెడీగా ఉన్నాడట. ఇక చాలు. ఇక ఒక క్షణం ఇక్కడ ఉండకూడదు. ఉంటే మన పరువు, మర్యాదలు తిసేస్తారు" అంటూ దివాకర్ తల్లి లేచి బయటకు వచ్చింది. ఆమె తరువాత దివాకర్, మిగిలిన వారు బయటకు వచ్చారు.

అప్పుడు అక్కడికి తన మోటార్ సైకిల్ మీద వచ్చాడు యామిని తమ్ముడు ప్రసాద్.

కొడుకును చూసిన వెంటనే పరిగెత్తుకొచ్చాడు రామారావు.

"ప్రసాద్, యామిని ఏదిరా?"

"అరగంట సేపు రైల్వే స్టేషన్ లోవైట్చేసి చేశాను. రాలేదు నాన్నా. ‘ఫోన్చేసి చూశానులైన్దొరకలేదు"

"అయితే ఒకసారి ఆఫీసుకు వెళ్ళి చూసొస్తావా?"

"వెళ్ళేసే వస్తున్నాను. నాలుగు గంటలకు ముందే బయలుదేరిందట"

"అప్పుడు...నా కూతురు...ఎక్కడకి వెళ్ళుంటుంది?"

రామారావు, సరోజ తల్లడిల్లిపోగా...దివాకర్ తల్లి ఎగతాలిగా నవ్వింది.

"మంచి కుటుంబంరా ఇది. ఒక పెళ్ళికొడుకును రెడీగా ఉంచుకున్న విషయాన్ని దాచి, మనల్ని పిలిచి అమ్మాయిని చూసుకోమని చెప్పింది తల్లి . కానీ ఇప్పుడు కూతురు పెళ్ళికొడుకును వెతుక్కుంటూ వెళ్ళిందో తెలియటంలేదే?"

"హలో మర్యాదగా మాట్లాడండి" కోపంతో అరిచాడు ప్రసాద్.

"మర్యాదా? అదేమిటో మీకు తెలుసా? అమ్మాయిని సరిగ్గా పెంచటం చేతకానివాళ్ళు...మర్యాద గురించి మాట్లాడటమా?"

జవాబుగా మీనాక్షి కోపంగా అరవగా

సమస్య పెద్దదై వీధిలోని వాళ్ళంతా గుమికూడి వేడుకగా చూస్తుంటే...ఆటోలో వచ్చి దిగింది యామిని.

"అమ్మా.... యామిని వచ్చేసింది"

దివాకర్ అరుపుతో అందరూ మౌనంగా వెనక్కి తిరిగి చూశారు. సరోజ అధిరిపడ్డది. చేతిలో ఒక బిడ్డతో వచ్చి దిగిన కూతుర్ను చూసిన మిగిలినవారు ఆశ్చర్యపోయారు. దివాకర్ తల్లి కళ్ళు పెద్దవి చేసుకుంది.

"దివాకర్ ఏమిట్రా ఇది....ఈమె పెళ్ళికూతురా?"

"అవునమ్మా"

"ఏమిటి...బిడ్డతో వచ్చింది?"

అది తెలియదమ్మా...! యామినీ ఏమిటిది? ఎవరీ బిడ్డ? ఇంతసేపు ఎక్కడికెళ్ళావు?"

"దివాకర్ ... బి"

"దాని బిడ్డే అయ్యుంటుంది"

"...మ్మా" అన్నాడు దివాకర్.

" కుటుంబంలో ఏదీ సరిలేదురా. ఏదో మన మంచి టైము...తాంబూళాలు పుచ్చుకోక ముందే అన్నీ బయటపడ్డాయ్. మనకు అసహ్యమంతా వద్దు….నువ్వు కార్లోకి ఎక్కు"

దివాకర్ బలవంతంగా కారులోకి ఎక్కాడు. మిగిలినవాళ్లంతా ఎక్కిన తరువాత కారు బయలుదేరింది.

యామిని ఏమీ అర్ధం కాక నిలబడ్డది.

కొన్ని క్షణాల తరువాత దివాకర్ తల్లి చెప్పిన మాటలను అర్ధం చేసుకున్న యామిని ఆశ్చర్య పడుతూ తల్లివైపుకు తిరిగి.

"అమ్మా! వాళ్లెందుకు అలా మాట్లాడి వెడుతున్నారు?"

"ఏయ్...ఏమిటే ఇది... ఎవరే బిడ్డ?"

"అమ్మా...నేను రైలు దిగి వచ్చేటప్పుడు..." అని చెబుతున్న కూతుర్ని హడావిడిగా ఇంటిలోపలకు లాక్కొచ్చాడు రామారావు

వీధిలో అంతవరకు వేడుక చూస్తున్న గుంపు, చెదరి వెళ్ళిపోయింది.

ఇంటిలోపలకు వెళ్ళి వెక్కివెక్కి ఏడుస్తోంది సరోజ.

"ఎవరి బిడ్డే ఇది?" కూతుర్ని అడిగాడు తండ్రి రామారావు.

విషయం చెప్పింది యామిని.

"ఏమే! నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎవరో బిడ్డను విసిరిపారేస్తే నీకేమొచ్చింది? పీడను ఇక్కడికెందుకు తీసుకువచ్చావు?” ఉగ్రంగా లేచింది తల్లి సరోజ.

"అమ్మా...?"--తల్లిమాటలతో అదిరిపోయింది యామిని.

"ఏమిటే అమ్మా? ఏమీ లేకుండానే దివాకర్ వాళ్ళ అమ్మ వెయ్యి మాటలు మాట్లాడి వెళ్ళింది. ఇప్పుడు చేతిలో బిడ్డతో వచ్చి నిలబడ్డావు. బుద్దిలేదా నీకు? పెళ్ళీడుకు వచ్చిన ఆడపిల్ల ఇలా చెతిలో ఒక బిడ్డతో వచ్చి నిలబడితే ఊరు ఏం చెబుతుంది?"

"ఇందులో ఊరు చెప్పేందుకు ఏముందమ్మా? నేను ఏం తప్పుచేశాను? బిడ్డ పాపం అమ్మా. మురికి కాలవ పక్కన ఒక కవర్ లో అనాధగా...చీమలు పాకుతూ...ఎలా ఏడుస్తూ పడుందో తెలుసా? నిమిషం బిడ్డను ఎలాగైనా కాపాడాలని అనిపించింది. అందుకే ఆసుపత్రికి ఎత్తుకు పరిగెత్తాను. ఇది తప్పా?"

"అది తప్పు కాదమ్మా. ఆసుపత్రిలో చేర్చిన తరువాత పోలీసులకు చెప్పి, వాళ్ళకు అప్పగించేసుండాలి. అక్కడితో మన బాద్యత ముగిసిపోతుంది. కానీ, నువ్వేం చేసేవు... బిడ్డను ఇక్కడికి తీసుకు వచ్చావు. అదే తప్పు....కాబట్టి, బిడ్డను ఇటివ్వు. నేనూ, అన్నయ్య పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఇచ్చేసి వస్తాం"...తండ్రి రామారావు చెయ్యి చాచాడు...ఇవ్వనన్నట్టు తల ఊపింది యామిని.

"వద్దు నాన్నా"

"వద్దా!??"

"ఇప్పుడు వద్దు నాన్నా! ఇప్పటికే బిడ్డ చావుతో పోరాడి, 'ఆక్సిజన్ఇవ్వబడి బ్రతికి వచ్చింది. డాక్టర్ మందులు ఇచ్చాడు. గంట గంటకూ మందూ, అరగంటకు ఒకసారి చలార్చిన పాలు ఇవ్వాలి. రేపు కూడా ఆసుపత్రికి తీసుకురమ్మన్నారు"

"వొసేయ్! నీకు నిజంగానే పిచ్చి పట్టింది. మాట్లాడకుండా బిడ్డను నాన్న దగ్గర ఇచ్చి పంపించు" అదమాయించింది తల్లి సరోజ.

"లేదమ్మా...ఇప్పటికే రాత్రి అయ్యింది. టైములో తీసుకు వెళ్ళి ఇస్తే వాళ్ళు ఎప్పుడు శరణాలయంలో చేరుస్తారో? ఒక వేల రాత్రంతా 'స్టేషన్లోనే ఉండిపోతే? బిడ్డకు ఇవ్వాల్సిన మందు, పాలూ టైము టైముకు ఎవరిస్తారు?"

"దాని గురించి నీకెందుకే బాధ?"

"అమ్మా... ఒక తల్లిగా ఉన్న నువ్వు ఇలా మాట్లడొచ్చా? బిడ్డకు ఆకలేస్తుంది. పాల 'పౌడర్కొనుక్కొచ్చాను. కాచి ఇచ్చి, మందు పోయాలి. దానికి ముందు వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయించాలి"

"యామినీ..."

"ప్లీజ్ నాన్నా! కష్టపడి కాపాడి, మనకెందుకులే అని వదల లేక పోతున్నాన్ను. రెండు రోజులు ఉంచుకుని...ఆరొగ్యం సరైన తరువాత వెళ్ళి వదిలేసి వద్దాం"

"బుద్ది లేనిదానా! ఉరి గురించి తెలియని అయోమయంగా ఉన్నావు కదే...ఊళ్ళో జనం నాలిక మీద నరాలు లేకుండా మాట్లాడతారే?"

"ఉరు ఇంకేం చేస్తుందమ్మా? బిడ్డను ఈగలు, చీమలు, దోమలు మూగుతున్నప్పుడు వేడుక కదా చూసింది. 'ఎవరు కన్న బిడ్డో...ఎలా కన్నదో?' అంటూ నోట్లో నాలిక లేకుండా మాట్లాడుతూ నిలబడ్డది. ఇంకేం చేసింది?"

"అయ్యో...భగవంతుడా! దీని బుద్ది ఎందుకు ఇలా పోతోంది? ప్రశాద్...మొదట పీడను తీసుకు వెళ్ళి బయట ఎక్కడన్నా విడిచిపెట్టి రారా"

"అమ్మా..." యామిని ఆవేశంగా అరిచింది.

"ఏమే నేను చెప్పినదాంట్లో ఏమిటే తప్పు?"

"తప్పమ్మా! ఎవరో ఇద్దరు అవసరపడి, కోరికలు అణుచుకోలేక చేసిన తప్పుకు బిడ్డ ఏంచేస్తుంది? దేవుడూ, పిల్లలూ ఒకటే అని చెప్పిన నీ నోటితో బిడ్డను 'పీడఅని ఎలా చెబుతున్నావు?"

"యామినీ?"

" బిడ్డ తల్లి చేసిన అదే తప్పు నేను చేయను. బిడ్డను ఎవరికీ ఇవ్వను"- కన్న బిడ్డను తల్లి గుండెలకు హత్తుకున్నట్టు యామిని బిడ్డను హత్తుకుంటుంటే బెదిరిపోయి నిలబడ్డారు యామిని తల్లి తండ్రులు.

                                                                                                        Continued...PART-3

************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి