జోక్స్, మీకు తెలుసా? జీవిత సత్యాలు-14....26/02/24న ప్రచురణ అవుతుంది

జ్ఞానోదయం: ‘అందరూ దేవుళ్ళే’ (ఆద్యాత్మిక కథ-2)...27/02/24న ప్రచురణ అవుతుంది

జోక్స్, మీకు తెలుసా? జీవిత సత్యాలు-15.....@ యూట్యూబ్......28/02/24న ప్రచురణ అవుతుంది

20, ఏప్రిల్ 2021, మంగళవారం

మానవత్వం...(సీరియల్/నవల)...PART-3

 

                                                                                 మానవత్వం                                                                                                                                                             (సీరియల్/నవల)

                                                                                     PART-3

ఒకే వేటుతో హృదయాన్నిరక్త నాళాలనూ మాత్రమే కాదు....మనో నిబ్బరాన్నీమనోశక్తిని కూడా నరికి పారేయగల శక్తి గల ఆయుధం మనుష్యుల నాలుక!

"నీకు తెలుసుకదా తలపోయేంత పని ఉన్నా ఒక్క రోజు కూడా 'లీవుపెట్టదు. ఇప్పుడు ఎవత్తో కన్న బిడ్డకోసం రెండు రోజులుగా ఆఫీసుకు వెళ్ళకుండా ఇంట్లోనే వుంటూ ఏమేమి పనులు చేస్తోందో తెలుసా? దానికి స్నానం చేయించటం, బట్టలు మార్చటం, టైము టైముకు పాలు కాచి ఇవ్వటం...ఒక నిమిషం కూడా దాన్ని తన ఒడిలో నుండి కిందకు దింపలేదు. మరి ప్రేమ ఏమిటో"- టెలిఫోనులో పెద్ద కూతురి దగ్గర నిట్టూర్పుతో చెబుతున్న తల్లి మాటలను పట్టించుకోకుండా బిడ్డ వొంటిని గుడ్డతో సున్నితంగా తుడుస్తోంది యామిని.

పసి వొంటి మీద మడతలు మారినై. మృదువైన చర్మం మీద 'పౌడర్పూసి, నుదుటి మీద బొట్టు పెట్టింది. బిడ్డ కళ్ళు ఆమె ముఖాన్నే ఆశ్చర్యంగా చూస్తూ వుండగా ...మెల్లగా నవ్వింది.

"ఏమిట్రా నాన్నా....ఏమిటి చూస్తున్నారు? ఆకలేస్తోందా...పాలు తాగుదామా?"

"వెఱ్ఱి ముఖమా? దానికి ఆకలేస్తోందో లేదో, ఎపూడూ పాలు పడుతూనే ఉన్నావు! కన్న బిడ్డను కూడా ఇలా చూసుకోరు. పసిబిడ్డ 'బురదలో పుట్టిన తామర లాగా బాగానే ఉన్నది"

"రేయ్ బంగారం! నువ్వు తామరలాగా ఉన్నావట...మీ అమ్మమ్మ చెబుతోంది"

"ఏయ్... ఎవత్తో కన్న బిడ్డకు నేను అమ్మమ్మనా?"

"అమ్మా, ఒకటి నాతో మాట్లాడు...లేదంటే అక్కయ్యతో మాట్లాడు. అంతే కానీ ఇలా ఇద్దరి దగ్గరా మాట్లాడుతూ ఎందుకు ఫోన్ బిల్లు పెంచుతావు?"

"అన్నీ నాకు తెలుసు...నువ్వు నీ పనిచూసుకో"

"ఏమిట్రా బంగారం...అమ్మమ్మ ఎప్పుడూ చిటపటలాడుతూ ఉంటోంది అని ఆలోచిస్తున్నావా? ఆవిడకు ఈర్ష్య. నువ్వు ఆవిడ కంటే అందంగా ఉన్నావుగా...?"

"మా టైము ఎలా ఉందో చూసావా కుమారీ...నేను శనేస్వరాన్ని చూసి ఈర్ష్య పడుతున్నానట. అక్రమ సంబంధం వలన పుట్తిందని పారేసిందో...లేక ఆడపిల్లగా పుట్టిందని పారేసిందో...? దీన్ని చూసి ఈర్ష్య పడాలా?"----అన్న తల్లిని కోపంగా చూసింది యామిని.

"ఏమ్మా...తెల్లావారిన దగ్గర నుంచి రాత్రి పొద్దుపోయేదాకా అదే మాటలు, చెప్పిందే చెపుతావు? మీరు మాట్లాడేది పసిబిడ్డకి అర్ధమవుతుందా? పసిబిడ్డ తిరిగి మాట్లాడగలదా? మరెందుకు తప్పు తప్పుగా మాట్లాడుతూ మీ పాపాలను పెంచుకుంటారు?”

సరోజ కోపంగా ' ఫోన్పెట్టేసి యామిని దగ్గరకు వచ్చింది.

"ఇప్పుడు నేను తప్పుగా ఏం మాట్లాడేనే?"

"తప్పే...నువ్వు ఇలా మాట్లాడటం చాలా తప్పు"

"నువ్వు చేసేది మాత్రం కరెక్టా? బయట నేను తల ఎత్తుకు తిరగలేకపోతున్నాను"

"అంత పెద్ద పాపం నేనేం చేశాను?"

ఎవత్తో విసిరి పారేసినపాపపు మూటనుఇలా ఇంట్లోకి తీసుకొచ్చావే...ఇది పాపం కాదా?"

"ఏమ్మా...ఒక ప్రాణాన్ని కాపాడటం పాపమా?"

"బాగా కాపాడావులే! నీ మూలంగా మన కుటుంబ గౌరవం గాలిలో కలిసిపోయింది. ప్రశాద్ వాళ్ళ అత్తగారు ' ఫోన్లో మాట్లాడిన మాటలకు ఇంకొకరైతే దేంట్లోన్నా దూకి చస్తారు. నువ్వు దీన్ని ఎప్పుడు బయటకు పంపిస్తావో అప్పుడు వాళ్ళు మీ వదినని మనింటికి పంపిస్తారట"

"ఏమ్మా! వదిన మనింటికి రావటానికీ, పాపకూ ఏమిటమ్మా సంబంధం?"

"అదికూడా నేనే చెప్పాలా?...ఊరందరినీ పిలిచి అత్తగారింట్లో శ్రీమంతం చేసుకుని, పుట్టింటికి వెళ్ళి బిడ్డని కన్నది మీ వదిన. పాప ఏదైనా రాకూడని వ్యాధితో వచ్చుంటే?"

"అమ్మా..."

పాప ఇక్కడుంటే, వదిన ఎలా తన బిడ్డను ఇంటికి తీసుకు వస్తుంది? నీకు నువ్వు చేసేదే కరెక్ట్. మిగిలినవాళ్ళ గురించి ఆలొచిస్తావా...ఆలొచించుంటే ఇలాంటి పని చేస్తావా?"--- సరోజ మాట్లాడుతుంటే యామినికి తల నొప్పిగా అనిపించింది.

రెండు రోజులుగా జరుగుతున్న వివాదంతో మనసు భారమై...సమాధానం చెప్పటానికి మనసు లేక...పాపను తీసుకుని తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. వేడినీళ్ళు పోసి పాలు కలిపింది.

"రారా బుజ్జీ...పాలు తాగేసి మీరు కాసేపు నిద్ర పొండి. నేను స్నానం చేసి వస్తాను...సరేనా?" అంటూ పాపను వొళ్ళో పడుకోబెట్టుకుని పాల బాటిల్ ను పాప నోటికి అందించింది.

యామిని ముఖాన్నే చూస్తూ బాటిల్ లొని పాలను తానుగా తాగటం మొదలుపెట్టింది పాప. యామిని పాపను చూసి నవ్వుతూ పాప తలమీదున్న పట్టు రంగు వెంట్రుకలను సరిచేస్తుంటే, దిండు క్రింద ఉన్న సెల్ ఫోన్ మోగింది.

ఫోన్ తీసింది.

దివాకర్!

మౌనంగా చెవి దగ్గర పెట్టుకుంది.

"హలో!"

“……..”

"నీతో కొంచం మాట్లాడాలి"

"మాట్లాడు"

"ఫోనులో కాదు. నేరుగా. లీవు చెప్పి రా. నేను టాంక్ బండ్ పార్కులో మనం ఎప్పుడూ కలుసుకునే చోట ఉంటాను. "

"ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను"

"ఎందుకని...అఫీసుకు వెళ్ళలేదా?"

"పాపను వదిలేసి ఎలా వెళ్ళటం? కాబట్టి లీవు పెట్టేను"

"పాపా...?" అది ఇంకా నీదగ్గరే ఉన్నదా?"

"అవును..."

"ఏం పని చేస్తున్నావు యామినీ?" ఫోన్లోనే కోపంగా అరిచాడు. యామినీ మొహం చిట్లించుకుంది.

"ఏమిటి దివాకర్....నువ్వు కూడా మా అమ్మలాగా మాట్లాడుతున్నావు?"

"ఇంకెలా మాట్లాడమంటావు? ఇక్కడ నేను నీకొసం మా అమ్మతో పొరాటం చేస్తున్నాను. నువ్వేంట్రా అంటే సమస్యను పక్కనే పెట్టుకున్నావు? ఎప్పుడు దాన్ని విసిరి పారేస్తావు?"

"ఏమిటి దివాకర్...పాపాలు పెరగను పేరగను...మంచి చేసేవాళ్ళందరూ పాపాత్ములుగా కనబడుతున్నారా? ఒక బిడ్డను కాపాడినందువలన అందరూ నేనేదో పాపం చేసినట్లు మాట్లాడుతున్నారు. ‘విసిరి పారేసైఅని నిర్లక్ష్యంగా చెబుతున్నావు! అంటే... బిడ్డ యొక్క తల్లి చేసిన పాపాన్నే నన్నూ చేయమని చెబుతున్నావా?"

పాపమో-పుణ్యమో...ఇప్పుడు మనకి మన జీవితమే ముఖ్యం. మొదట అది అర్ధంచేసుకో"

"సారీ... నేను నీలాగా స్వార్ధంగ ఆలొచించలేను"

"యామినీ?"

"నేనూ, స్వార్ధపరురాలిగా ఉండుంటే రెండు సంవత్సరాలకు ముందు దెబ్బలతో రోడ్డు మీద పడున్న నిన్ను కాపాడి ఆసుపత్రిలో చేర్పించే దానిని కాను. ‘ఎవరో పడున్నారు...నాకెందుకులే' అని వెళ్ళిపోయేదాన్ని. అలా వెళ్ళానా...? నిన్ను కాపాడలా...?"

"........................."

అప్పుడు నీకు నా సహాయ గుణం నచ్చింది. ఇప్పుడెలా నచ్చకుండా పోయింది? ఉద్యోగంలో జేరి నాలుగు డబ్బులు వెనుక వేసుకునేటప్పటికి మానవత్వం చచ్చిపోయిందా?"

"మూర్ఖంగా మాట్లాడకు! సహాయం చేయటాన్ని తప్పు అని చెప్పటంలేదు. కానీ, ఇలా ఇంట్లోకి తీసుకు వచ్చి ఉంచుకున్నావే?"

అది పువ్వు లాంటిది. పాపం. పుట్టిన వెంటనే తల్లిని విడిపోయింది. మరణం వరకు వెళ్ళి తిరిగి వచ్చింది. రెండు రోజులైనా బిడ్డను నా పరామర్శలో ఉంచుకుని కాపాడాలని అనుకున్నాను. అది తప్పా?"

"అర్ధం లేకుండా మాట్లాడకు! ఇప్పటికే మా అమ్మ నీమీద కోపంగా ఉన్నది. నేనే ఎంతో పోరాడి ఆమెను నమ్మించాను. ఇంకా నువ్వు..."

"నమ్మించావా?"

"అవును"

"ఏమని...?"

" బిడ్డ నీ బిడ్డ కాదని"

"వో! అప్పుడే.... బిడ్డ నా బిడ్డే అని మీ అమ్మ తీర్మానించేసిందా?"

"అమ్మను ఎందుకు తప్పు పడతావు? నువ్వు చేసిన కార్యం అలాంటిది! పెళ్ళి చూపుల రోజున కూడా నువ్వు ఆఫీసుకు లీవు పెట్టలేవా?"

ఆఫీసులో పని ఎక్కువ. నువ్వు హటాత్తుగా పెళ్ళిచూపులకు వస్తున్నావని చెప్పావు? హటాత్తుగా ఆఫీసుకు లీవు వేయగలనా? నా పనులన్నీ సగంలో ఆగిపోయున్నాయి"

"ఇప్పుడు మాత్రం ఎలా లీవు పెట్టగలిగావు?"

"అదోచ్చి..."

"అవును...నాకు తెలియక ఆడుగాతున్నాను. నీకెందుకు బిడ్డ మీద అంత ఇంటరెస్టు?"

"నాకూ హృదయం ఉంది. దాంట్లొ ఇంకా తడి ఉంది. కష్టపడుతున్న వాళ్ళకు సహాయపడాలనే జాలి ఉంది"

"అలాగైతే నీ హృదయంలో నేను లేనా?"

"వూరికే సినిమా డైలాగులు మాట్లాడకు! ప్రమాదంలో చిక్కుకున్న నిన్ను కాపాడినందుకు...నువ్వు నన్ను ఇష్టపడ్డావు. నీ నిజాయతి అప్ప్రోచ్ నాకు నిచ్చింది. 'పెద్దలు అమోదిస్తే' మనం పెళ్ళిచేసుకుందాం అని మాట్లాడుకుని నిర్ణయించుకున్నాం. నేను నిర్ణయంలో నుంచి మారలేదు. నువ్వూ, మీ వాళ్ళూ నన్ను అర్ధం చేసుకోకుండా కోపగించుకుని వెళ్ళిపోయారు"

"వెళ్ళీపోక...! నువ్వు ఏం కార్యం చేసుకొచ్చి నిలబడ్డావో నీకు అర్ధం కాలేదా?"

"నాకు అర్ధం కాలేదు. ఒక చిన్న ప్రాణాన్ని కాపాడినందుకు ఎందుకు ఒక హత్య చేసి వచ్చినట్లు ఆందోళన పడతావు?"

"వితండావాదం చేయకు. చివరగా ఏం చెప్పదలుచుకున్నావు?"

"చివరగా ఏం చెప్పదలచుకున్నానా?”

అవును. నీకు బిడ్డ ముఖ్యమా? లేక...నేను ముఖ్యమా?"

"దివాకర్...!"

బిడ్డే ముఖ్యమనుకుంటే నన్ను మర్చిపో. నేను కావలనుకుంటే... నిమిషం బిడ్డను ఎక్కడన్నా పారేసిరా. నీ నిర్ణయం వెంటనే తెలుసుకోవాలి" అతను ఖచ్చితంగా చెప్పేటప్పటికి, యామిని మనసు చెదిరింది. నోటి నుండి పాలు కారుతున్నా, అమాయకంగా పడుకోనున్న పాప ను చూసింది.

'ఆదరించబడ్డ చోట, ఆప్యాయమైన పరామర్శింపులో బద్రంగా ఉన్నాముఅనుకుంటూ హాయిగా నిద్రపోతోంది. పాలు కారుతున్న బుగ్గలను మృధువుగా తుడిచింది. చిన్న బెదురుతో కళ్ళు తెరిచి చూసింది పాప. యామిని ముఖం కనబడగానే ప్రశాంతంగా మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయింది.

దూది లాంటి మెత్తని వేళ్ళతో తన వెళ్ళను పట్టుకున్న పాను చూసి యామిని హృదయం కరిగింది. మాతృత్వ భావము ఆమెలో కలిగింది. ఎడం చేత్తో పాపను హత్తుకుంటున్నప్పుడు దివాకర్ గొంతులో కఠినత్వం తెలిసింది.

"ఏయ్...లైన్లో ఉన్నావా...లేవా"

"ఉన్నాను...చెప్పు"

"నిర్ణయం నువ్వే చెప్పాలి"

"నేను కొంచం ఆలొచించుకోవాలి"

"ఎందుకు?"

"నువ్వు చెప్పినట్లు పాపను వెంటనే ఎక్కడా విడిచిపెట్టలేను. కొంచం..."

"అయితే...నీకు నేను అక్కర్లేదు?"

"నేను అలా చెప్పలేదు. ఎందుకు అవసరపడతావు?"

"నేను నెలే దుబాయ్ కి వెళ్ళితీరాలి. అంతలోపు మనం పెళ్ళిచేసుకోవాలి. ఆలొచించిటానికి టైము లేదు. ఇప్పుడే నిర్ణయం చెప్పు

పెళ్ళి చేసుకున్న వెంటనే దుబాయ్ కి వెళ్ళాలా? కానీ...నాకు 'పాస్ పోర్ట్' అదీ లేదే?"

"నీకెందుకు 'పాస్ పోర్ట్'? అమ్మావాళ్ళతొనేగా నువ్వు ఉండబోయేది? నేను ఒక్కడ్నే దుబాయ్ వెల్తున్నాను. ఒక మూడు సంవత్సరాలు మాత్రమే. తరువాత ఇక్కడకొచ్చి వ్యాపారం మొదలుపెట్టాలి.నేను వచ్చేంతవరకూ నువ్వే నా కుటుంబాన్ని చూసుకోవాలి"

"...అన్ని నిర్ణయాలూ నువ్వే తీసేసుకున్నావా?"

"అవును! నువ్వు ఉద్యోగం మానేయి యామిని. ఇళ్ళు, అమ్మా-నాన్నలను చూసుకొవటానికే నీకు టైము చాలదు. అలాంటప్పుడు ఉద్యోగానికి ఎలా వెడతావు? ఇద్దరికీ కలిపి నేను సంపాదిస్తున్నాను కదా...?"

దివాకర్ మాట్లాడుతూ వెల్తుంటే... యామిని గట్టిగా కళ్ళు మూసుకుని ఆలొచించింది. కొద్ది నిమిషాల తరువాత చటుక్కున కళ్ళు తెరిచింది. దివాకర్ ఇంకా లైన్ లోనే ఉన్నాడు.

"సారీ...నా వల్ల కాదు"

"ఏది నీ వల్ల కాదు?"

"ఇప్పుడు చెప్పిన రెండింటినీ విడిచిపెట్టటం నా వల్ల కాదు"

" రెండూ...?"

"పాపనూ, ఉద్యోగాన్నీ రెండిటినీ విడిచిపెట్టలేను. నువ్వు నీ ఇష్టమొచ్చినట్లు నిర్ణయం తీసుకున్నా సరే. 'గుడ్ బై'!" అంటూ కచ్చితంగా చెప్పేసి ఫోన్ కట్ చేసింది.

                                                                                                                         Continued...PART-4

************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి