14, ఏప్రిల్ 2021, బుధవారం

విదేశ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుపెట్టారు?...(ఆసక్తి)

 

                                           విదేశ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుపెట్టారు                                                                                                                             (ఆసక్తి)

స్విట్జర్లాండ్-ఫ్రాన్స్ సరిహద్దుల్లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత సైన్స్ రీసెర్చ్ సంస్థల్లో ఒకటైన యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్(సీఈఆర్ఎన్) అత్యంత జటిలమైన యంత్రాలు ఉపయోగిస్తుంది.

                     ఈ యూరప్ అణు కేంద్ర పరిసరాల్లో శివుడి నటరాజ విగ్రహం ఏర్పాటుచేశారు.

విశ్వమంతా శివ తాండవం:

విశ్వం అనంతంగా పుడుతూ,నాశనమవుతూ ఉంటుందని చెప్పిన ఏకైక ప్రాచీన మతం హిందూ మతం మాత్రమే. విశ్వం పుట్టుకకు సంబంధించి వీరి కాలగణన నేటి ఆధునిక కాస్మోలజీ వేస్తున్న లెక్కలకు చాలా దగ్గరగా ఉంది. వారు బ్రహ్మ యొక్క ఒక పగలు, రాత్రి కలిపి 8.64 బిలియన్ సంవత్సరాలని చెప్పారు. ఇది ఆధునిక ఖగోళ శాస్త్ర అంచనాలకు దగ్గరగా ఉంది.” ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ అన్నారు.

జూన్ 18, 2004 తేదీన జెనీవాలోని 'సెర్న్' (యూరోపియన్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ పార్టికల్ ఫిజిక్స్) పరిశోధనాలయం వద్ద రెండు మీటర్ల ఎత్తైన నటరాజ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పరిశోధన కేంద్రంతో ఉన్న అనుబంధం దృష్ట్యా భారత ప్రభుత్వం విగ్రహాన్నిసెర్న్కు బహుకరించింది.

                                                                         ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగన్.

భారత ప్రభుత్వం శివ విగ్రహాన్ని బహూకరించడం, శాస్త్రవేత్తలు దానిని తమ ఆవరణలో ప్రతిష్ఠించుకోవడం వెనుక సుస్పష్టమైన తాత్త్వికత, శాస్త్రీయ దృష్టి గమనార్హం. సెర్న్ పరిశోధన కేంద్రంలో పరమాణు కణాలపై పరిశోధన జరుగుతోంది. పరమాణువులోని సూక్ష్మ అంశాలు నిరంతరం జరిపే శక్తి తాండవానికి ప్రతిరూపంగా నటరాజ రూపంలో జరిగే శివతాండవం మన భావనకు అందుతుంది.

సెర్న్ కేంద్రంలోనిలార్జ్ హాడ్రాన్ కొలైడర్అనే భారీ పరికరం సహాయంతో శాస్త్రవేత్తలుదైవ కణం” (హిగ్స్ బోసాన్) ఉనికిని గుర్తించారు. ఉప పరమాణు కణాలు, పరమాణువులు,అణువులు - వీటన్నింటికీ ద్రవ్యరాశినిచ్చేదే దైవ కణంలేదాహిగ్స్-బోసాన్ కణం’.

1972లో ఫ్రిట్జఫ్ కాప్రా అనే భౌతిక శాస్త్రవేత్త ఒక పత్రికలో వ్రాసిన వ్యాసంలో మొదటిసారిగా ఉపపరమాణు కణాల శక్తి తాండవాలను శివతాండవంతో పోల్చాడు. తర్వాత తను వ్రాసిన తావో ఆఫ్ ఫిజిక్స్అనే ప్రఖ్యాత గ్రంథంలో విషయాన్ని మరింత వివరించాడు.

సెర్న్ లో నటరాజ విగ్రహం క్రింద ఫలకం మీద ఫ్రిట్జఫ్ కాప్రా మాటలను ఉల్లేఖించారు.

సంస్థ అధికారిక వెబ్సైట్లో.. "మన చుట్టూ ఉన్న ప్రతిదానినీ తయారు చేసే కణాల ప్రాథమిక నిర్మాణాన్ని మేం పరిశీలిస్తాం. ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత క్లిష్టమైన సైన్స్ పరికరాలను మేం ఉపయోగిస్తుంటాం" అని ఉంది.

                                                                                  భౌతిక శాస్త్రవేత్త ఫ్రిట్జఫ్ కాప్రా.

'గాడ్ పార్టికల్అనే హిగ్స్ బోసన్ ఉనికిని కూడా కేవలం ఒక ఊహగా భావించారు. 2012లో లార్జ్ హైడ్రాన్ కొలైడర్ అనే ఒక పార్టికల్ ఎస్కలేటర్ను ఉపయోగించిగాడ్ పార్టికల్ఉందని సీఈఆర్ఎన్ ధ్రువీకరించింది.

మానవ నాగరికత చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉన్న సంస్థ పరిసరాల్లో హిందూ దేవుడు శివుడి నటరాజ విగ్రహం ఉంది.

సీఈఆర్ఎన్ వెబ్సైట్లో విగ్రహం గురించి ప్రస్తావించారు:

యూరోపియన్ దేశం కాకపోయినప్పటికీ భారత్ దాదాపు ఆరు దశాబ్దాలుగా సీఈఆర్ఎన్ సభ్యుడుగా ఉంది. భారత ప్రభుత్వం విగ్రహాన్ని దౌత్య కారణాలతోనే సీఈఆర్ఎన్కు ఇచ్చింది. దీని వెనుక శాస్త్రీయ కారణాలేవీ లేవు.

సీఈఆర్ఎన్ తన సైట్లోహిందూ మతంలో శివుడు చేసిన నటరాజ నృత్యం శక్తికి లేదా జీవశక్తికి ప్రతీకగా నిలిచింది. నటరాజు విశ్వ నృత్యం, ఉప-పరమాణు కణాల కాస్మిక్ డాన్స్ ఆధునిక అధ్యయనం మధ్య ఒక రూపంగా భారత్ శివుడు విగ్రహాన్ని ఎంచుకుందిఅని వివరించింది.

ఇది భారత ప్రభుత్వం ద్వారా తయారైన ఒక విగ్రహం. ఎలాంటి వాస్తవాలు లేదా తార్కిక సమర్థన, శాస్త్రీయ కారణాలు లేకుండానే ఎన్నో ఏళ్ల నుంచీ దీనిని అక్కడ ఉంచారు. సీఈఆర్ఎన్లో ఉన్న ఎన్నో కళాఖండాల్లో నటరాజ విగ్రహం కూడా ఒకటి అని చెప్పారు.

Images Credit: To those who took the original photos

************************************************************************************************

ఇవి కూడా చదవండి:

పువ్వులో ఒక తుఫాన(కథ)

వెన్నెల(కథ)

************************************************************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి