26, ఏప్రిల్ 2021, సోమవారం

మానవత్వం...(సీరియల్/నవల)...PART-6

 

                                                                                  మానవత్వం                                                                                                                                                            (సీరియల్/నవల)

                                                                                      PART-6

జీవిత బాటలో ఎదురయ్యే ఒక్కొక్క అడ్డు రాయిని---నువ్వు మైలు రాయిగా దాటి వీరవనితలాగా నడిచి ముందుకు వెళ్ళిపో మహిళా!

"...త్త...య్యా! అత్తయ్యా చెప్పు..." అంటున్న రమాదేవిని చూసి నవ్వింది మూడేళ్ళ జయ.

"రమా అత్తయ్య"

"ఓసి నా బంగారమే" అంటూ జయను అమాంతం ఎత్తుకుని ముద్దాడింది రమాదేవి. అప్పుడు కాలింగ్ బెల్ మోగింది.

"ఎవరు?"

"నేనే"- యామిని గొంతు వినగానే, రమాదేవి చేతులలో నుంచి ఒక్క సారిగా జారింది జయ.

"అమ్మ వచ్చింది...అత్తయ్యా త్వరగా తలుపు తెరు"

"అమ్మను చూడాలా?" అంటూ తలుపు తెరిచిన వెంటనే...బయట నిలబడున్న యామిని కాళ్ళను చుట్టేసుకుంది జయ. కూతురును గబుక్కున ఎత్తుకుని రమాదేవి వైపు చూసింది యామిని.

"ఏం రమా... జయ బాగా అల్లరి చేసిందా?"

"...... జయ 'గుడ్' గర్ల్! బుద్దిగా ఆడుకుంటూనే ఉంది. అక్కా... జయ ఎంత అందంగా మాట్లాడుతోందా తెలుసా?"

"హు..మూడేళ్ళు అవుతోందే! సరే రమా...రాత్రికి వంట చేయాలి. వెళ్ళిరానా?"

"సరే అక్కా"

" జయా బుజ్జీ...ఆంటీకి 'టాటా' చెప్పు..."

"టాటా...అత్తా రేపు వస్తాను"

"గుడ్ బై రా బంగారం"- రమాదేవి నవ్వుతూ చెయ్యి ఉపింది. యామిని తన ఇంటి తలుపులు తెరుచుకుని లోపలకు వెళ్ళింది.

రమాదేవిని తలుచుకున్న యామిని మనసు రమాదేవి గురించి గొప్పగా బావించంది. ‘ఆమే గనుక లేకపోతే ఆఫీసులోనూ, జయను చూసుకోవటంలోనూ చాలా శ్రమ పడేదాన్ని

మొదటి నాలుగు రోజులు వాళ్ళున్న కాలనీకి దగ్గరున్న పిల్లల శిశుసంరక్షక కేంద్రంలో జయను ప్రొద్దున వదిలేసి సాయంత్రం తీసుకురావటం చేసేది యామిని. కానీ, నాలుగే రోజుల్లో పక్కింట్లో కాపురం ఉంటున్న రమాదేవి బాగా పరిచయమవడం...ఇద్దరూ కలిసిపోవడం జరిగింది.

'పెళ్ళై నాలుగేళ్ళయినా పిల్లలు పుట్టకపోవడంతో తల్లిని కాలేకపోతున్నానే అన్న బాధ ఆమె మాటల్లో బాగా కనబడటంతో, యామిని మనసు బారమయ్యింది. ‘ దేముని ఆటలను ఏమని చెప్పాలి? పిల్లలకోసం పరితపిస్తున్న వాళ్ళకు పిలలను ఇవ్వకుండా, పిల్లలు అవసరం లేని చోట పిల్లలను ఇచ్చి....రోడ్డు మీద విసిరిపారేయిస్తున్నాడే?’

తరువాత వారంలో రమాదేవి నోరు తెరిచి అడిగేసింది.

"అక్కా...నేను ఇంట్లో ఖాళీగానే ఉన్నాను. పిల్లను ఎందుకు శిశుసంరక్షక కేంద్రంలో వదుల్తున్నావు? నా దగ్గర ఇచ్చి వెళ్ళండి"

"అది కాదు ఉమా...నీకెందుకు అనవసరమైన శ్రమ అని...?"

"ఇందులో నాకేం శ్రమ వుంది? ప్రొద్దున ఏడు గంటలకు వెడితే, రాత్రి తొమ్మిదింటికి వస్తారు నా భర్త. అంతసేపు వూరికినే కూర్చుంటే పిచ్చి పట్టినట్లు అవుతోంది. అందుకే అడిగాను"

"అది కాదు రమా...ఇది పసి పిల్ల. మాటి మాటికి టాయ్ లెట్ వెల్తుందే..."

"నేను శుబ్రంగా ఉంచుకుంటాను...దీనికంతా అదృష్టం కావాలి"

"మీ ఆయన ఏమీ చెప్పరా?"

నా గోల భరించలేక ఆయనే నాకు ఐడియా ఇచ్చారు. మిగిలిన పిల్లలతో కలిసి జయ కష్టపడటం కంటే.... జయను నేను చేసుకుంటాను! నాకూ కొంచం హాయిగా ఉంటుంది. లేకపోతే నా మనసు నన్ను వేధిస్తుంది"అన్నది రమాదేవి. ఒక ఆడదానిగా రమ మనసు పడే ఆవేదనను అర్ధం చేసుకో గలిగింది యామిని.

యామినికి కూడా శిశుసంరక్షక కేంద్రంలో పాపను వదిలిపెట్టి వెళ్ళటానికి మనసులేదు! తల్లి ప్రేమ దొరకాలనే కదా పాపను వదలకుండా కాపాడింది. కానీ, ఉద్యోగాన్ని వదలనూ లేదు. ఇంటద్దె, తిండి, పిల్ల సంరక్షణ అని అన్నింటికీ ఆమె జీతం కావాలే! అందువలన వేరే దారి లేక శిశుసంరక్షక కేంద్రంలో వదిలి వెళ్ళింది.

రమ యొక్క కోరిక విని సగం మనసుతో వొప్పుకుంది. కానీ, రెండే రోజుల్లో రమ....జయకి ఇంకో తల్లిగా మారిపోగా, యామిని మనసు ప్రశాంతత పొందింది. రోజు నుండి రోజు వరకు ప్రొద్దున్నంతా రమ సంరక్షణలోనూ, రాత్రిపూట యామిని కౌగిట్లోనూ పెరగడం మొదలుపెట్టింది జయ.

"అమ్మా..."

"ఏం నాన్నా...?"

" రోజు రమ అత్త దగ్గర నేను , , , ....లు రాయటం నేర్చుకున్నాను"

"నిజంగానా? నా తల్లికి రాయటం వచ్చిందా?"

"బాగా రాస్తాను. అత్త, పాటలు కూడా నేర్పిస్తోంది తెలుసా? తరువాత...ఒకటి...రెండూ అన్నీ చెబుతాను"

నా బంగారమే! నా బిడ్డ పెరిగింది. ఇక స్కూల్లో చేర్చొచ్చే?"

"నేను స్కూలుకు వెళ్ళాలి. కొత్త 'బ్యాగ్' కావాలి"

"తరువాత, కాళ్ళకు...’షూ’...మెడకుటై’! కొత్తవాటర్ బాటిల్"--ముద్దు ముద్దు మాటలతో ఆరాటంగా చెప్పగా, యామిని ఆలొచనలో పడింది. ' స్కూల్లో చేర్చాలి?'

స్కూల్లో చేర్చటానికి వెళ్ళినప్పుడు తరువాతి సమస్య మొదలయ్యింది. అప్లికేషన్లో తల్లి పేరును మాత్రమే ఆమె రాసి ఇవ్వటంతో...ఫారం తీసుకున్న స్టాఫ్ అది చూసి కళ్ళు పెద్దవి చేసింది.

"ఏంటమ్మా... పాప తండ్రి పేరు రాయకుండా వదిలేశారు?"

"సారీ...ఆయన లేరు"-- అని యామిని చెప్పటంతో స్టాఫ్ యామినిని పైకీ క్రిందకూ స్కాన్ చేసింది.

"చనిపోయారా?"

"లేదు"

"మరి?"

"పాపకు అమ్మా-నాన్నా అన్నీ నేనే"

"అలా అంటే?"

"అదంతే!"

"...ఇల్లీగల్ చైల్డా?" అన్న స్టాఫ్ ముకంలో హేళన కనబడంతో......

స్టాఫ్ ను దీర్గంగా చూసింది యామిని.

"ఏం చెప్పారు...?"

"అదేనమ్మా... తప్పైన రీతిలో వచ్చిన పాపే కదా?"

"ఒక కరెక్షన్...తప్పైన తండ్రికి, తల్లికి జన్మించిన పరిశుద్దమైన పాప"

" వివరణ అంతా 'హెచ్.ఎం' సార్ దగ్గరకు వెళ్ళి చెప్పండి"-అంటూ నిర్లక్ష్యంగా అప్లికేషన్ను యామిని చేతికే ఇచ్చింది.

యామిని కొంచం కూడా దిగులు పడలేదు. కుడి చేత్తో స్టాఫ్ తిరిగి ఇచ్చిన అప్లికేషన్ ఫారం ను తీసుకుని, ఎడం చేత్తో కూతుర్ను పటుకుని హెడ్ మాస్టర్ను కలిసింది. వివరాలు చెప్పిన తరువాత ఆయన ముఖం మారింది.

"అలాగైతే...మరెందుకు పాప తొలిరాత బాక్స్ లో ' వై ' అని రాసారు?"

"అది నా పేరులోని మొదటి అక్షరం సార్..."

"! అది మంచి విషయమేనండీ. కానీ, మాకు అన్ని వివరాలూ కావాలే"

"అలాగైతే ఇలాంటి పిల్లలందరూ చదువుకోనేలేరా సార్"

"అలా కాదమ్మా! వాళ్ళందరికీ 'గార్డియన్పేరుంటే చాలమ్మా..."

"అంటే...వాళ్ళందరినీ 'అనాధఅని ముద్ర వేసే చదివించాలా? వీళ్ళతో చదువుకునే తోటి పిల్లలు వీళ్ళను వేరు చేసి చూస్తే...వీళ్ళ మనసు ఎంత బాధ పడుతుంది"

"సారీ...దీనికి నేను ఏం చేయను? వీళ్ళందరూ వాళ్ళకని ప్రత్యేకంగా ఏర్పాటై యున్న స్కూల్లో చేరి చదివితే పిల్లల మధ్య బేధాలు ఏర్పడవు. మీరు కావాలంటే అలాంటి స్కూల్లో..."

"కుదరదు! నేను పాపను నా పాపగనే పెంచుతున్నాను. అలాగే చదివించుకుంటాను"

"అలాగైతే మీరు మాకు సరైన వివరాలు ఇచ్చే కావాలి"

"ఇప్పుడేమంటారు? మీకు పాప తండ్రి పేరు కావాలి....అంతే కదా?"

"అవును!"

"ఒక్క నిమిషం!"--అన్న యామిని కూతురు వైపు తిరిగింది.

"జయా బుజ్జీ..."

"ఏంటమ్మా?"

"మనమందరం ఎవరి పిల్లలం?"

"దేముడి పిల్లలం!"

"వెరీ గుడ్....నీకు దేముడంటే ఇష్టం"

"కృష్ణుడు"

అయితే నువ్వు, కృష్ణుడి పాపవేగా?"

"అవును"

"సరి"- అంటూ తండ్రి పేరు 'కృష్ణుడుఅని రాసి ఇచ్చింది. హెడ్ మాస్టర్ నోరు వెళ్ళబెట్టాడు.

"ఏంటమ్మా ఇది?"

"మార్పులు తానుగా రావు సార్...మనమే మార్చాలి"-అని యామిని అన్నప్పుడు తనకు తెలియకుండానే నవ్వాశాడు హెడ్ మాస్టర్.

స్కూల్ చదువుతో పాటూ ప్రపంచ స్నేహ బంధాలనూ, మంచి క్రమ శిక్షణను, దైవ భక్తిని, పరోపకారం, స్వీయ రక్షణ కళలను కూతురికి నేర్పించింది యామిని.

జయాకు ఐదేళ్ళు వచ్చిన తరువాత స్వీయ రక్షణ కళ నేర్పే పాఠశాలకు పంపింది. రోజు నేర్చుకు వచిన కళను యామిని దగ్గర చేసి చూపిస్తుంది జయ. ఉప్పొంగిపోయిన యామిని చప్పట్లు కొట్టి కూతుర్ను ఉత్సాహ పరుస్తుంది. అటు చదువునూ ఇటూ లోక జ్ఞానాన్నీ నేర్చుకోవటంలో జయ చురుకుదనం చూసి యామిని గర్వపడేది.

మగవారి నుండి దూరంగా ఉండాలని హెచ్చరించింది. స్కూల్లో, బస్సులో రోజూ జరుగుతున్న విషయాలను కూతురు చెబుతుంటే వినేది.

'తల్లితండ్రులకు, పిల్లలకు మధ్య ప్రేమాభిమానాలు మాత్రమే కాకుండా స్నేహపూరిత బంధం ఉండాలి. అదే పిల్లలను చెడు దార్లలోకి పోకుండా అడ్డుకుంటుంది. ఏదిజరిగినా తల్లి-తండ్రులకు చెప్పడం, వాళ్లతో కలిసి ఆలొచించడం' సంతోషాన్ని, మంచి ఆలొచనలను పంచుతుంది అనేది యామిని నమ్మకం.

సుమారు పదిహేను సంవత్సరాల తరువాత, ఒకరోజు సాయంత్ర వేలలో... ట్యాంక్ బండ్ పార్కులో నడుస్తున్నప్పుడు దివాకర్ తన కుటుంబంతో కలిసి ఎదురు వచ్చాడు.

"నువ్వు యామినివే కదా?" - అని అడిగిన అతన్ని గుర్తుపట్టింది. అతనితో ఒక ఆమె, ఇద్దరు పిల్లలూ ఉన్నారు. పెద్ద పిల్ల జయ కంటే ఒక వయసు చిన్నదిగా కనబడింది.

"ఏమిటి యామిని....నన్ను ఇంకా గుర్తుపట్టలేదా?"

"గుర్తుపట్టాను...ఇది నీ భార్యా?"

"అవును"

"ఈమె దగ్గర నన్ను ఎవరని పరిచయం చేస్తావు?"

దివాకర్ తడబడుతుంటే, అతని భార్య కొంచం కన్ ఫ్యూజ్ అయ్యి "ఎవరికి?" అని అడిగింది.

"తెలిసినవాళ్ళు" అంటూ భార్యతో గబుక్కున దివాకర్ చెప్పడం విన్న యామిని నిర్లక్ష్యంగా అతనివైపు ఒకసారి చూసి ముందుకు అడుగు వేసింది.

"యామిని! అమ్మాయి రోజు...."

"నా కూతురే"-నొక్కి చెప్పి, కూతురు జయతో కలిసి అడుగులువేసింది.

జయ తల్లి వంక చూసింది.

"అమ్మా..."

"హూ"

"ఎవరమ్మా అంకుల్?"

"తెలిసినాయన...ఎప్పుడో చూసిన జ్ఞాపకం"--చెప్పింది యామిని.

చలనం లేని సమాధానం, మనసులో ఎలాంటి బాధ, ఆత్రమో ఏర్పడక పోవటం యామినినే ఆశ్చర్యపరచింది.

అంతకంటే ఆశ్చర్యం.....కొన్ని సంవత్సరాల తరువాత, కూతుర్ను వెతుక్కుని ఇంటి వాకిట్లో కాచుకోనున్న యామిని తల్లి సరోజ.

కన్న తల్లిని చూసినప్పుడు మనసులో ఏర్పడ్డ ఏదో తెలియని భావం, కళ్ళల్లో చేరిన నీళ్ళు ఆమెకు తెలియకుండానే "అమ్మా..." అన్నాయి.

                                                                                                        Continued...PART-7

************************************************************************************************

                                                                                                                                                                                                                                                      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి