11, అక్టోబర్ 2021, సోమవారం

ప్రేమ వ్యవహారం!...(పూర్తి నవల)

 

                                                                                    ప్రేమ వ్యవహారం!                                                                                                                                                                         (పూర్తి నవల)

పెద్ద నగరాలలో  పీ.జీ అని చెప్పబడే డబ్బులిచ్చి స్టే చేసే హాస్టల్స్ ఎక్కువ. ముఖ్యంగా మహిళలకు!

అక్కడ అన్ని వసతులూ ఉంటాయి. టెలివిషన్లు, ఇంటర్ నెట్, బ్రహ్మాండమైన భోజనం అంటూ దగ్గర దగ్గర స్టార్ హోటల్ విడిదిలాగానే. బాగా సంపాదిస్తారు కాబట్టి కొందరు నిర్లక్ష్యంగా నడుచుకుంటారు. ఇంకొందరు అక్కడ కూడా తమ స్వయం మర్యాదను వదిలిపెట్టకుండా ఉంటారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. పోటీ, ఈర్ష్య, సన్నిహిత స్నేహం అని అన్నీ ఉంటాయి. మన జీవితంలో ఒక క్రాస్ కట్ రూపంలాగా ఉంటుంది.

అలాంటి నవీన వసతులతో కూడిన ఒక హాస్టల్లో మాధవి అనే ఒకమ్మాయి కొత్తగా చేరుతుంది. చేరిన రోజు సాయంత్రమే మాధవి హాస్టల్ కు  కొంత దూరంలో  విశ్వం అనే యువకుడితో చాలా సన్నిహితంగా ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది ఆమె రూమ్ మేట్ రేఖా. ఎందుకంటే అతను ఒక మోసగాడు. ఇదివరకే  రేఖా స్నేహితురాలు మథులతను ప్రేమించి మొసం చేసుంటాడు. ఈ విషయం మాధవికి చెప్పి ఆమెను అలెర్ట్ చేద్దామనుకుని మాధవికి విశ్వం గురించి చెప్పాలనుకుంటుంది. కానీ, మాధవి చెప్ప నివ్వదు. కానీ రేఖా ఎలాగైనా విశ్వం గురించి చెప్పి తన రూమ్ మేట్ ను అతని మాయలోనుండి కాపాడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ రేఖ ప్రయత్నాలు వృధా అవుతాయి. 

రేఖా చేసిన ప్రయత్నాలు ఏమిటి? అవెందుకు విజయం కాలేదు? మాధవి, విశ్వం ప్రేమ వ్యవహారం ఎటు పయనించింది? చివరికి ఏం జరిగింది?...మాధవి, విశ్వం దగ్గర నుండి తప్పించుకుందా, లేదా? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మీరు ఊహించలేని కథా అంశంతో మిమ్మల్ని అలరించే ఈ నవల చదవండి.

మీకు సమయం ఉండి ఈ నవలను పూర్తిగా ఒకేసారి ఆన్ లైన్ లోనే చదవాలనుకుంటే ఈ క్రింది లింకును క్లిక్ చేసి చదవండి:

ప్రేమ వ్యవహారం!...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2

నవలను డౌన్ లోడ్ చేసుకుని ఖాలీ దొరికినప్పుడల్లా చదవాలనుకుంటే ఈ క్రింది లింకును క్లిక్ చేసి PDF ను డౌన్ లోడ్ చేసుకోండి: 

https://drive.google.com/file/d/1lRlt8y_iJmkCce5IJOqmS57cAIsqc3zT/view?usp=sharing

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి