సంస్కారం (కథ)
మనసు మంచి నడవడిని కలిగి ఉండటాన్ని హృదయ సంస్కారం అంటారు. ... కోపం లేకపోవడం, సామరస్యంతో ఉండటం, త్యాగ భావన ఉండటం, అతి ప్రవర్తన లేకుండటం, ఎవరి మనసు నొప్పించకుండా ఉండటం, మానవ సంబంధాలను దెబ్బతీయకపోవడం, ప్రతీకారం లేకుండటం కూడా సంస్కారామే.
ఈ కథలో హీరోయిన్ సురేఖ కి అతి సన్నిహితురాలైన స్నేహితురాలుకి పెళ్ళి సెటిల్ అవుతుంది. పెళ్ళి రోజు దగ్గర పడుతున్నా స్నేహితురాలి ఇంటి నుండి సురేఖకి పెళ్ళి శుభలేఖ ఇవ్వలేదు. స్నేహితురాలి పెళ్ళికి తానే దగ్గరుండి అన్ని పనులు చేయాలని తాపత్రయపడ్డ సురేఖకి పెళ్ళి శుభలేఖ అందకపోవడంతో నిరాస పడుతుంది. ఆ కాలనీలో సురేఖ చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లో వాళ్ళందరికీ పెళ్ళి శుభలేఖ ఇచ్చిన సురేఖ స్నేహితురాలి కుటుంబం సురేఖకు ఎందుకు పెళ్ళి శుభలేఖ ఇవ్వలేదు? కారణం తెలుసుకోవాలంటే ఈ కథ చదవండి.
ఇంటి బయట మోటర్ సైకిల్ ఆగిన శబ్ధం వినబడటంతో కిటికీలో నుండి బయటకు తొంగి చూసింది సురేఖ.
మోటర్ సైకిల్ స్టాండు వేస్తూ కనిపించాడు ఆమె భర్త సాగర్.
"పిల్లలూ,
బయలుదేరండి...బయలుదేరండి! అంకుల్ వచ్చాశారు"....తన ఇంట్లో ఆడుకుంటున్న ఇరుగు పొరుగు ఇళ్ళలోని పిల్లలను పంపించే ప్రయత్నంలో పడింది సురేఖ.
సాగర్ లోపలకు వచ్చాడు.
"హాయ్ అంకుల్..." చెప్పింది ఒక పిల్ల. "బై అంకుల్" అన్నది ఇంకో పిల్ల.
ఇలా జరగటం ఆ ఇంట్లో కొత్తేమీ కాదు. సాగర్, సురేఖ దంపతులు ఆ కాలనీలోని ఆ ఇంటికి అద్దెకు వచ్చిన రోజు నుండి అదే తంతు. ఇప్పటికి రెండు సంవత్సరాలు అయినా సురేఖ తన అలవాటును మానుకోలేదు.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
సంస్కారం...(కథ)@ కథా కాలక్షేపం-1
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి