ఇంటింటి వెన్నెలలు...(సీరియల్) (PART-10)
మరుసటి రోజు
గడిచిపోయింది. రాత్రి ఏడు గంటలకు నాన్నా, చలపతి ఇద్దరూ వచ్చారు.
మొహం కడుక్కుని,
డ్రస్సు మార్చుకుని
వచ్చిన వాళ్ళిద్దరికీ కాఫీ ఇచ్చింది జ్యోతీ.
టిఫిన్ తయారు
చేసింది సత్యా.
బజ్జీ అనే పేరుతో,
విపరీతమైన నూనెతో ఒక
'వంటకం ' ఉన్నది.
దాన్ని నోట్లో
పెట్టుకోలేకపోయారు.
ఇద్దరూ చాలా
సంకటపడ్డారు.
"కొంచం లోపలకు
రండి" - జ్యోతీ పిలవగా - చలపతి లేచి వెళ్ళాడు.
“నేను
చెప్పినట్లు ఐరవై ఐదువేలు మాత్రం తీయండి. అదే ఎక్కువ. మీ నాన్న దగ్గర ఇచ్చేయండి.
ఆయన ఈ ఫ్యామలీని రన్ చేయనివ్వండి. అంతకు మించి చిల్లి గవ్వ కూడా ఇవ్వకూడదు. మనకూ,
ఆయనకూ వంట చేస్తాను.
సత్యాకీ, ఆ
సిగ్గులేని అల్లుడికీ నేను ఏదీ చెయ్యను. అది కూడా చెప్పేయండి"
"సరే...రా!"
చలపతి బయటకు
వచ్చాడు.
"ఇదిగోండి! నా జీతం
డబ్బులు..."
"ఉండరా! దానికి
ముందు నేను మాట్లాడేస్తాను. మీ అమ్మే ఇన్ని రోజులు కుటుంబాన్ని నడిపింది. ఇప్పుడు
ఆమె ఇక్కడ లేదు. నా వల్ల ఏ బాధ్యతా తీసుకోవటం కుదరదు. దానికి కావలసిన వయసు నాకు
లేదు. పచారీ సరకులు, పాలు, కరెంటు బిల్లు, ఇంటి నిర్వాహం ఏదీ చూడటానికి నాకు సమయం లేదు. భోజనం కూడా
ఇక్కడ వద్దు! మూడుపూట్లా బయటే చూసుకుంటాను"
"ఏమిటి నాన్నా?"
“జ్యోతీ... సత్యా!
ఎవరూ కష్టపడక్కర్లేదు. నేను ప్రొద్దున ఏడింటికి వెళితే,
రాత్రి ఎనిమిదింటికే
వస్తాను. నా బట్టలు నేనే ఉతుక్కుంటాను. నేను చెత్తను వేయను. నాకు గిన్నెలతో అవసరం
లేదు. నేను ఏ.సీ. వేసుకోవటం లేదు. కాబట్టీ - నా ఒక్కడికోసం ఈ ఇంట్లో రాత్రి మటుకు
ఫ్యాను తిరుగుతుంది! అంతే!
దానికయ్యే బిల్ మహా
అయితే ఎంత అవుతుంది? స్నానాకి సోపు ఇవన్నీ కలిపితే ఐదువందలు అవుతుంది! ఈ ఇంటి
టాక్స్ కడతాను. నా పెట్రోల్ ఖర్చులూ చూసుకుంటాను -- ఏ ఖర్చూ లేని నేను నెలకి
ఐదువేలు ఇస్తాను. కుటుంబాన్ని నువ్వూ-- జ్యోతీ నడపండి. ఇందా తీసుకో!"
డబ్బును జాపారు.
చలపతి -- జ్యోతీ
దీనిని కొంచం కూడా ఎదురు చూడలేదు. ఒక్క క్షణం స్థానువు అయ్యారు. ఆయన్ని
ఎదిరించలేకపోయారు.
ఆయన చెప్పేదీ
న్యాయమే!
ఏ ఖర్చూ లేని ఆయన,
ఐదువేలు ఇవ్వటమే
చాలా ఎక్కువ.
"ఇది నా ఇల్లు!
నీ దగ్గర అద్దె అడగలేదు. న్యాయంగా చూస్తే ఐదువేలు నేను ఇవ్వకూడదు.
పరవాలేదు...ఉంచు"
సత్యా బలంగా దెబ్బ
తిన్నది.
“నిర్వాహం
నువ్వు తీసుకో! పనిమనిషిని పెట్టుకుంటావో,
మీరే వంట
చేస్తారో...చెయ్యరో, ఏ.సీ. వేసుకుని నెలకి కరెంటు బిల్లు ఎంత కడతారో నాకు
తెలియదు. లాండ్ లైను ఫోనును కూడా నేను ఉపయోగించను. ఇదే నా నిర్ణయం"
"మావయ్యా! ఇది
మీ ఇల్లు. మీరు ఇక్కడ తినకుండా ఎందుకు బయట తినాలి?"
"వద్దమ్మా! ప్రొద్దున ఐదుగంటలకు నాకు కాఫీ కావాలి. మీరు
లేవటానికి కనీసం ఏడున్నర అవుతుంది. ఎందుకు వెయిట్ చేయాలి?
సమస్యే లేదు. ఎవరి
మీదా నాకు కోపం లేదు. ఈ ఇంట్లో ఏదైనా రిపేర్ ఖర్చులు వస్తే ఇచ్చేస్తాను. కారణం...ఈ
ఇల్లు నాది! సరేనా?"
సత్యా దగ్గరకు
వచ్చింది.
"నాన్నా...నువ్వు
చేసేది కరెక్టు కాదు. మీకు అన్నీ నేను చేసి పెడతాను"
"నువ్వు
ఎవరు...ఈ ఇంట్లో నీకు ఏమిటి హక్కు?"
"నాన్నా...నేను మీ కూతుర్ని"
"నీకు పెళ్ళి
చేశాను. నువ్వు ఇక్కడికి వచ్చి వెళ్ళచ్చు. అదే పద్దతి! చెబితే వినవు! నువ్వు నా
కూతురువి. నిన్ను కొట్టి తరమలేను. దారాళంగా ఇక్కడ ఉండు. కానీ,
ఇక ఇంటి నిర్వాహం చలపతి
-- జ్యోతీ దగ్గర! వాళ్ళు భోజనం పెడితేనే నువ్వు తినగలవు.
నన్నేమీ అడగకు. రాత్రి పడుకోవటానికి మాత్రం ఇది నాకొక చోటు. అంతే! నేనే
అతుక్కోకుండా జీవిస్తున్నప్పుడు, నిన్ను నేను ఎలా భరించగలను?"
"నాన్నా! డబ్బు నా చేతికివ్వండి. కుటుంబాన్ని నేను
నడుపుతాను"
"మెట్టింటికి
వెళ్ళి నిర్వాహం చెయ్యి. నేనెందుకు నీకు డబ్బు ఇవ్వాలి?
నీ భర్త ఎందుకు
ఖలీగా కూర్చున్నాడు? అతన్ని అడుగు. నా పక్కకే రాకు! నేనొక కాఫీ తాగినా కూడా దానికి
డబ్బులిచ్చేస్తాను"
"మావయ్యా...మీరు
ఐదువేలు ఇస్తామంటున్నారు. ఆ తరువాత ఇంకా ఎందుకు మీరు డబ్బులు ఇవ్వాలి?
సత్యా ఇవ్వాలి.
ఇకమీదట ఇక్కడ ఎవరికీ ఉచిత తిండి లేదు"
"ఇది మా నాన్న
ఇల్లు"
"ఆయనే ఇక్కడ
తినబోయేది లేదు. ఆయన ఇంట్లో ఆయన ఉండటానికి ఐదువేలు ఇస్తున్నారు. నీకు నేను వంటచేసి
పెట్టలేను"
"అవసరం లేదు...నేను వంట చేసుకుంటాను"
"అదెలా? నాకూ, ఈయనకీ, ఇద్దరు పిల్లలకూ కావలసిన సరకులు, పాలు, కాయగూరలూ మాత్రమే కొంటాను. వాటిని కూడా మా రూములో పెట్టి తాళం వేసుకుంటా.
అందులో ఒక బియ్యం గింజ కూడా నువ్వు ముట్టుకోలేవు. నీకూ, నీ
భర్తకూ మేమెందుకు చేయాలి? మీ అమ్మతోనే అవన్నీ
పోయినై...అర్ధమయ్యిందా?"
"నాన్నా...నువ్వు డబ్బు ఇవ్వక్కర్లేదు"
"లేదబ్బాయ్...నాకూ
ఆత్మ గౌరవం ఉంది"
"ఇది విన్న
తరువాత కూడా కొంతమంది ఇంకా ప్రాణంతో ఉన్నారే?"
డబ్బును అతనికి
ఇచ్చారు.
"సరే...రాత్రికి
ఏం వంట జ్యోతీ?"
"ఇప్పుడు ఇంట్లో ఉన్న సరకులు రెండు రోజులకు మాత్రమే వస్తాయి.
మనకీ...మావయ్యకూ మాత్రమే నేను వంట చేస్తాను"
"ఉన్న సరకులలో
మీ చెల్లెలు ఆమెకు వంట చేసుకోవచ్చు. రెండు రోజుల తరువాత అంతా మారుతుంది. అందువలన
ఆమె సరకులు కొనుక్కుని వంట చేసుకుంటే, గ్యాసు సిలిండర్ కు సగం డబ్బులు ఇవ్వాలి. చెప్పుంచండి. మైక్రో వేవ్
ఉపయోగించినా, ఫ్రిడ్జ్, ఏసీ
వేస్తే...కరెంటు బిల్లుకూ సగం డబ్బులు ఇవ్వాలి"
"ఇవ్వకపోతే ఏం
చేస్తారు?"
"ఈ ఇంట్లో నువ్వు ఉండలేవు"
"అది చెప్పే
హక్కు మీకు లేదు. ఇది మా నాన్న ఇల్లు"
"నిర్వాహ
ఖర్చులు మా చేతికి కంటే ఎక్కువైతే ఇవ్వగలవా? నీ భర్త సంపాదించటం లేదు. రానీ ఆ మనిషిని. ఉరి వేసుకునేలాగా
అడుగుతాను"
"అడిగేస్తారా...ఆయన
అల్లుడు"
"ఎవరికే? మీ అమ్మా-నాన్నలకు! అందులో మీ అమ్మ ఇక్కడ
లేదు. తండ్రి వదిలించుకున్నాడు. ఈ ఇంట్లో నీకే హక్కు లేదు. ఎవరికి ఎవరే అల్లుడు?
సిగ్గు లేకుండా మాట్లాడుతోంది చూడు... మీరు లోపలకు రండి"
"అన్నయ్యా!
నేను నీ చెల్లెల్ని"
"బయట నిలబడి
వాగు. మీరు ఇప్పుడు లోపలకు రండి"
చలపతిని లాక్కుని
వెళ్ళి జ్యోతీ తలుపులు వేయ,
సత్యా
విరిగిపోయింది.
"నాన్నా...ఎలా
మాట్లాడుతోందో చూసారా! ఇది మీ ఇల్లు. నేను మీ కూతుర్ని. నేనిలా అవమానపడటాన్ని
చూస్తూ ఎలా మాట్లాడ కుండా ఉన్నారు?"
"సత్యా! నువ్వు, నీ అక్కయ్య, అందరూ
కలిసి సరోజాని అనరాని మాటలు అన్నప్పుడు కూడా నేను చూస్తూనే ఉన్నాను! ఎలా కష్టపడి
పని చేసింది ఆ పిల్ల! మంచితనం నిండిన ఆమెను మీరు ఎంత క్షోభ పెట్టారు. అన్నిటినీ
తట్టుకుందే...! అప్పుడు మీలో ఎవరికీ ఆమె మీద జాలి వేయలేదే?
తన కూతురికి ఒక
వస్తువు కొంటే, అందరికీ
సమానంగా చేస్తాడు రఘూ. మీరెవరైనా వాడి బిడ్డకు ఏదైనా చేశారా? సేవింగ్స్ కూడా లేకుండా తన డబ్బులు, సరోజా డబ్బులు
అన్నిటినీ కుటుంబంలో వేసేడే. అప్పుడు అతనికోసం మాట్లాడలేదే? అప్పుడు
మాట్లాడని నేను ఇప్పుడెలా మాట్లాడతాను సత్యా"
"ఇప్పుడు నా
పరిస్థితి ఏమిటి?"
"చలపతి అన్నయ్యను అడుగు! ఇక ఈ కుటుంబానికి హెడ్ జ్యోతీనే"
"వదిలిపెట్టను"
“ఇంత
చెప్పినా నువ్వు తగ్గవు, అనగవు, మారవు.
మిగిలిపోయిన అవమానాలను జ్యోతీ చూపిస్తుంది...అనుభవించు"
ఆయన లోపలకు వెళ్ళి
తలుపులు వేసుకున్నారు.
అర గంటలో హోటల్
నుండి వేడి వేడి టిఫిన్ వచ్చింది.
జ్యోతీ వచ్చి తీసుకుని లోపలకు వెళ్ళి తలుపులు
మూసుకుంది.
మనసు బయటకు
వచ్చింది.
సత్యా పూర్తిగా
విరిగిపోయింది.
పలు రోజులు అందరికీ
చేతులు నొప్పి పుడుతున్నా దోసెలు వేసిచ్చేది సరోజా. తృప్తిగా తినేసి కుటుంబమే
తేపుతారు. కొన్నిసార్లు సరోజాకి ఏమీ మిగలదు.
గిరిజా మాత్రం
కాచుకోనుంటుంది.
"పరవలేదు! అడ్జెస్టు
చేసుకుంటా అత్తయ్యా!!"
పనులు ముగిసి నిద్ర
పోవటానికి పన్నెండు గంటలు అయిపోతుంది. తెల్లవారు జామున నాలుగు గంటలకు 'అలారం'!
ఇంటి పనులు...దాంతో
పాటూ స్కూలుకు వెళ్ళే హడావిడి.
అన్నిటిని తట్టుకుని
ఇరవై గంటలు పనిచేసే సరోజా దగ్గర చిన్న విసుగు కూడా ఉండదు. కోపం రాదు. చిటపటమని ఒక
పలుకు పడదు. ఎప్పుడూ నవ్వు ముఖం.
సత్యాకి అంతా
అర్ధమయ్యింది ఇప్పుడు.
'నేను ఎప్పుడూ మహారాణిలాగా గడపాలి'
అని మనసులోనే కోట
కట్టుకుంది.
అది ఇంత త్వరగా
మట్టి కోటలాగా పడిపోతుందని ఆమె ఎదురు చూడలేదు.
ఫోను చేసినా భర్త
రాలేదు.
ఇక తండ్రి మనని పట్టించుకోరు.
వీళ్ళ దగ్గర ఇక మన
ఆటలు సాగవు. జ్యోతీ కిరాతకి. రాయిలో నుండి నార ఊడిపడొచ్చు. ఈమె దగ్గర ఏమీ జరగదు.
సత్యాకి ఏడుపు
వస్తోంది.
అదే సమయం లోపల పెద్ద
నిట్టూర్పు విడిచింది జ్యోతీ.
"ఏమండి...ఇరవై
ఐదు వేలతో కుటుంబం నడుపగలమా?"
"నాన్నఐదు వేలు ఇస్తున్నారే?"
"సరే నండీ! బడ్జెట్ వేస్తే...ముప్పైతో ఆగటం లేదు. అది
దాటుతుంది. ఇది కాకుండా ఇంటి పనులను కూడా నేనే చేయాలి. నా వల్ల కాదు. మనిషిని
పెట్టుకోవాలి"
"పెట్టుకో"
"ఈజీగా
చెబుతున్నారు...ఉమ్మడి కుటుంబంగా ఉండి నలభై ఇచ్చినా కూడా ఇంటి బాధ్యత మనకి ఉండేది
కాదు. టైము టైముకు కావలసింది రుచిరుచిగా నోటికి వచ్చేది"
"నువ్వు
కిందపడిన కాగితం ముక్కను కూడా తీసి వెయ్యవు?"
"ఏమిటి ఎత్తి చూపుతున్నారా?"
"లేదమ్మా...నిజం! నిర్వాహం నీ చేతికి వచ్చింది. నువ్వే కదా
చేసుకోవాలి?"
“మన వాటాలో ఐదువేలు ఎక్కువ ఇచ్చినా పరవాలేదు. కానీ ఇప్పుడు
మొత్త నిర్వాహం నా నెత్తి మీద!"
"అది నా తప్పు
కాదే?"
"మొదట సత్యాని తరమండి. ఆమె వలన ఖర్చు ఎక్కువ అవుతుంది"
"ఇది నాన్న
ఇల్లు! ఆమెను వెళ్ళిపొమ్మని మనం చెప్పలేము. ఒకటి చెయొచ్చు. మనం వేరు కాపురం
పెట్టేద్దాం"
"పిచ్చా మీకు.
అద్దె, మైంటనన్స్
అని ఇరవై వేలు దానికే పక్కన పెట్టాలి. నలభై...అరవై అవుతుంది. సేవింగ్స్ దెబ్బ
తింటుంది. దానికే నేను బాధపడుతున్నా...మీరు వేరే!"
"ఆమెను నేను
తరమలేను. నువ్వు త్రిమితే నేను అడ్డుపడను. ఇప్పుడు నిద్ర వస్తోంది. రేపు
మాట్లాడుకుందాం"
ఆ రోజు రాత్రి ఎవరికీ
ప్రశాంతంగా గడవలేదు.
తలరాత! తండ్రీ,
కొడుకులు బయలుదేరి
వెళ్ళిపోయారు.
జ్యోతీ...ఆమెకు,
తన పిల్లలకు మాత్రం
వంట వండుకుంది.
ఆలస్యంగా లేచి
వచ్చిన సత్యా, పిల్లకు పాలు కాచాలని ఫ్రిడ్జ్ తెరిచింది...పాలు లేవు.
"పాలు ఎక్కడ?"
"ఉన్నది రెండు ప్యాకెట్లు! ఆయనకు కాఫీ ఇచ్చి,
నేను తాగి,
మిగిలిన పాలు
పిల్లలకు ఇచ్చేశాను"
"ఏందుకు ఆ పాల
ప్యాకెట్లు తీశారు...?"
"అసలు ఫ్రిడ్జ్ లో పాల ప్యాకెట్లు లేవు. ఆయన వెళ్ళి
కొనుకొచ్చారు. ఆ రెండు ప్యాకెట్లు నావి. నీకు కావాలంటే వేరుగా కొనుక్కో"
"ఇది అరాచకం!
నా పిల్లకు ఆకలి. నువ్వూ ఒక తల్లివే కదా?"
"నీకే ఆ తెలివి ఉండాలి ! ప్రొద్దున లేస్తే పిల్లకు
ఆకలేస్తుంది. దానికి ఏం ఏర్పాట్లు చేయాలి, పాలు ఉన్నయ్యా, లేవా రాత్రే చూసుండాలి. నువ్వు బాగా నిద్ర పోయోచ్చి పంచాయతీ
పెడితే...ఇక్కడ మీ అమ్మ లేదు. నువ్వు అమ్మగా ఉండి ఆలొచించు! నా పిల్లలకోసం ఏరోజైనా
బాధపడ్డావా? నీ పిల్ల కోసం నేనెందుకు ఆలొచించాలి?"
"నువ్వు రాక్షసివి! సరోజా ఎంతో మంచిది..."
"నేను చెడ్డ
దానినే! నువ్వు మంచిదానివా? సరోజా కోసం ఇప్పుడు కరిగిపోతున్నావు! ఆమె ఇక్కడ ఉన్నప్పుడు
ఆమెను కొంచంగానా కష్టపెట్టావు? నేను ఏ పనీ చేయను. నిజమే! కానీ,
సరోజాని ఏ రోజూ
అవమానపరచింది లేదు. ఆమెకు ఎప్పుడూ టార్చర్ ఇచ్చింది లేదు. నిన్ను నీ కన్న
తల్లే...కోడలే గొప్పదని నిన్ను వదిలి ఆమెతో వెళ్ళిపోయింది. మీ నాన్న కూడా
తప్పుకున్నారు. ఇప్పుడు పాలకు కూడా దారిలేక నిలబడ్డావే! డబ్బు అప్పుగా ఇస్తాను.
వెళ్ళి పాలు కొనుక్కో. మీ ఆయన వచ్చిన తరువాత తిరిగి ఇవ్వు. సిగ్గు లేని
అల్లుడు...ఆకలి,ఆకలి అని పరిగెత్తుకు వస్తే,
కడుపు మీద వాత
పెట్టు"
డబ్బు తీసుకు
వచ్చింది.
సత్యా ఆ డబ్బును తీసుకుని
విసిరిపారేసింది.
"నీ దగ్గర
డబ్బులు తీసుకునేంతగా నేను సిగ్గు కోల్పోలేదు. అది అవసరం లేదు"
"అరే...నీకు
పరువు, మర్యాద,
రోషం కూడా ఉందా?
ఆశ్చర్యంగా ఉందే?"
"చాలు...ఆపు ! మా అమ్మ ఇంకా చావలేదు"
"కానీ,
నువ్వు చచ్చి చాలా
రోజులయ్యిందే! నాకు నీ దగ్గర మాట్లాడే సమయం లేదు. పిల్లలను స్కూలుకు పంపాలి"
లోపలకు వెళ్ళింది.
సత్యా తట్టుకోలేక,
డ్రస్సు కూడా
మార్చుకోకుండా పిల్లాడితో బయటకు వచ్చింది.
ఇద్దరూ స్నానం
చెయ్యలేదు!
తినలేదు.
రోడ్లో వెడుతున్న
ఆటోను పిలిచింది. రఘూ ఇంటి అడ్రెస్సు చెప్పి ఎక్కింది.
ఆటో బయలుదేరింది.
సత్యా ఒళ్లంతా ఒక
ఆందోళన.
అదే సమయం గిరిజా
దగ్గర అన్ని విషయాలూ చెప్పి ముగించాడు తండ్రి.
రఘూ,
సరోజా ఉన్నారు. ఆ
ఒక్క రోజు అందరూ లీవు పెట్టారు.
జరిగిందంతా చెప్పి
ముగించ.
“గిరిజా
! అక్కడ ఐదువేలు ఇచ్చాను. కటింగ్స్ పోను చేతికొచ్చిన అరవై వేలలో ఆ ఐదు పోతే,
నా చేతిలో ఖర్చులకు
ఐదు ఉంచుకున్నాను. మిగిలిన యాభై వేలు ఉన్నాయి. ఇదిగో...తీసుకో"
"ఎందుకు నా
దగ్గర ఇస్తున్నారు?"
"ఇన్ని రోజులూ నలుగురి జీతమూ నీ దగ్గరే కదా వచ్చేది?
నువ్వే కదా
కుటుంబాన్ని నడిపావు? ఇప్పుడు నడపటానికి ఏమిటి కష్టం?...పట్టు..."
"నాన్నా...నేనొకటి
చెప్పనా?"
"చెప్పు రఘూ"
“మా
ఇద్దరి జీతమూ నలభై వేలు. ఇప్పుడు నాకు జీతం పెరుగుతుంది. సరోజా ట్యూషన్స్ చెప్పి
సంపాదించే డబ్బు కలిపితే ఇంకో ఇరవై ఎక్కువవుతాయి. అది చాలు...మేము చూసుకుంటాము. ఈ
డబ్బు మొత్తాన్నీ డిపాజిట్ చేయండి. రెండేళ్ళల్లో మీకు 'రిటైర్మెంట్'! పన్నెండు లక్షలు జేరతాయి. మీ డబ్బులు మీ చేతిలో ఉంటాయి.
ఇన్ని రోజులు పనిచేసి మమ్మల్ని కాపాడారు. ఇక మీదట సేవింగ్స్-రెస్టు-ప్రశాంతత అన్నీ
మీకు కావాలి నాన్నా"
"అవును మావయ్యా! మేము మిమ్మల్ని కూర్చోబెట్టి చేయాలి. అదే పద్దతి"
"ఈ అక్కర అక్కడ
ఎవరికీ లేదమ్మా? మీ
ఇద్దరూ మీ పిల్లతో హ్యాపీగా జీవించటానికి దారి చూడండి"
"మావయ్యా!
మిగిలిన వాళ్ళలాగా మేమూ ఉండాల్సిన అవసరం లేదు. మీరంతా అలా అనుకోనుంటే...మేము అలా
లేము"
ఆయన ఆనందంతో సరోజాని
చూడ,
వాకిట్లో ఆటో వచ్చి
నిలబడింది. అందులో నుండి పిచ్చి ఆకారంతో దూకి సత్యా పరిగెత్తుకు వచ్చింది.
"రఘూ! ఆటోకి
డబ్బు లివ్వురా"
రఘూ వెళ్ళాడు. సత్యా
తిరిగి చూసింది.
"నాన్నా...మీరూ
ఇక్కడే ఉన్నారా? ఎవరూ
ఉద్యోగానికి వెళ్ళలేదా? రహస్య మీటింగు జరుగుతోందా? అందరూ కలిపి మాట్లాడుకునే అన్నీ చేస్తున్నారా?"
"చాలు సత్యా! ఇంత జరిగినా...నువ్వు నోరు మూసుకోవా?"
"అమ్మా"
"ఏమిటే అమ్మా!
ఎందుకు రహస్య మీటింగు? ఎవరికి మేము భయపడాలి? నేనుండే చోటే మీ నాన్న ఉంటారు.
నువ్వెందుకు చెదిరిన జుట్టుతో, పిచ్చి అవతారంతో వచ్చి
నిలబడ్డావు? ఆటోకి కూడా డబ్బులు లేవా?"
"సత్యా...కాఫీ ఇవ్వనా?" అడిగింది సరోజా.
"మొదట పిల్లకు
పాలు కావాలి. ఇడ్లీ వేయండి. తరువాత నేను స్నానం చేసి వెంటనే తినాలి. వింటూ
నిలబడ్డావు? వెంటనే
చెయ్యి..."
సరోజా లోపలకు
వెళ్లబోతూండగా,
"సరోజా...ఇలారా!" -- గిరిజా పిలవగా,
"ఏమిటత్తయ్యా?"
"పిల్లకు మాత్రం పాలు తీసుకురా!"
"అమ్మా...నాకూ
ఆకలేస్తోంది"
"పాలుకు కూడా
లెక్క చూసి అది నిన్ను తరిమి కొట్టుంటుంది! తలాతోకా అర్ధంకాక పరిగెత్తుకు
వచ్చావు...స్నానం కూడా చెయ్యకుండా! ఇక్కడికి వచ్చి సరోజా మీద అధారిటీ
చెలాయిస్తున్నావే? నువ్వు
మారవా?"
"నువ్వూ ఒక తల్లే కదా? చేతిలో డబ్బు లేదు. తినడానికి
ఏమీ లేదు. అడుక్కు తినే పరిస్థితికి వచ్చాను"
"ఎందుకు...? నేను నిన్ను తరమనే లేదు సత్యా”
"నాన్నా!
అందుకని రాళ్ళనూ, మట్టినీ
తినగలమా...? ఇంటిని మాత్రం పెట్టుకుని నేనేం చేయను?"
"నీ భర్త చచ్చి పోయేడటే?" -- తల్లి గిరిజా అడగగా,
"అమ్మా!" -- పెద్దగా అరిచింది సత్యా.
రఘూ, సరొజా కూడా షాకై చూశారు.
"ఒక కూతుర్ని
చూసి తల్లి అడిగే ప్రశ్నా ఇది?"
"ఇన్ని జరిగాక, పుట్టింటిని వదిలి వెళ్ళకుండా ఒక ఆడది
ఉంటే...అది విధవరాలుగా అయన్నా ఉండాలి. లేకపోతే భర్త తన్ని తరిమేసిన దానిగా ఉండాలి.
నువ్వు ఇందులో ఎవత్తివి?"
"అత్తయ్యా! వద్దు...ప్లీజ్" -- సరొజా చెప్పగా,
"ఉండమ్మా! ఇప్పుడు కూడా నేను మాట్లాడకుండా ఉండకూడదు. నేను ఈ రోజు మాట్లాడే
మాటలు దాన్ని సిగ్గు పడేటట్టు చేయాలి. లేకపోతే దీనికి ఒక ముగింపు పెట్టాలి"
"ఏంటమ్మా
చెబుతున్నావు?"
"ఈ రోజు ఇక్కడ స్నానం చేసి భోజనం చెయ్యి. కానీ ఇక మీదట నువ్వు ఇక్కడికి
రాకు! అది మీ నాన్న ఇల్లు. అక్కడ నుండి నిన్ను ఎవరూ తరమలేరు. ఇది సరొజా
ఇల్లు"
" రఘూ
నా అన్నయ్య"
"సారీ సత్యా!
నాకు సరొజానే ముఖ్యం. ఆమెను అవమానపరచిన వాళ్ళకు ఈ ఇంట్లో చోటు లేదు. నిన్ను ఇక్కడ
చేర్చలేను"
సత్యా
బెదిరిపోయింది.
వాకిట్లో 'బైకు ' వచ్చి
నిలబడింది.
సత్యా భర్త విశ్వం
లోపలకు వచ్చాడు.
"రండన్నయ్యా!"
-- సరొజా తప్ప అతన్ని ఇంకెవరూ స్వాగతించ లేదు. సత్యా భర్త దగ్గరకు పరెగెత్తుకు
వచ్చింది.
"ఎందుకు ఇక్కడికి
వచ్చారు...అక్కడకు వెడితే బేవర్సు భోజనం దొరకలేదని ఇక్కడకు పరిగెత్తుకు వచ్చారా?"
"ఏమిటే వాగుతున్నావు?"
"అందరూ నన్ను హీనంగా చూస్తున్నారు. అవమానం చివర్లో ఉన్నాను. ఈ అవమానం
నిజానికి నాకు కాదు. మీకే! మీ భార్యను నేను...చేతిలో డబ్బులేక...తిండి దొరక్క
బిచ్చగత్తెలాగా బిడ్డతో నిలబడున్నా. ఇద్దరన్నయ్యలూ తరిమి కొడుకుతున్నారు. కన్న
తల్లి ఆదరణ చూపటం లేదు. తండ్రి చేతులు కడుక్కున్నాడు. నేనెక్కడికి వెడతాను?"
"నేనా నిన్ను నీ పుట్టింటికి వెళ్ళి కూర్చోమన్నాను? నువ్వు మా అమ్మను రాసి రంపాన పెట్టావు!
ఆవిడ దగ్గర ఉండటానికి నువ్వు ఇష్టపడలేదు. ఇంట్లో పనులు చేయవు! తిండి తిని, నిద్రపోయి,
పంచాయతీ పెట్టటానికి, అధికారం చెలాయించటానికి
నీకు పుట్టిల్లు అనుకూలంగా ఉన్నది! నువ్వేకదా పుట్టిల్లు నిరంతరమని హక్కుగా ఇక్కడే
కూర్చున్నావు! ఇదే సుఖమని నమ్మి జీవిత కాలమంతా రాజ్యమేలుదామనుకున్నావు! ఆ తరువాత
నేనేం చేయను?"
"ఒక్క నిమిషం అల్లుడూ !" -- తండ్రి అడ్డుపడ్డాడు.
"ఏమిటి మావయ్యా?"
"తప్పంతా ఆమె పైనే ! బద్దకస్తురాలుగా ఉంటూ, తిని,
నిద్రపోయి, పుట్టింటి మనుషులనే అవమానపరచి
రాజ్యం ఏలింది. దానికి మేము అనుమతి ఇచ్చింది మొదటి తప్పు. ఎత్తి చూపి తట్టి
తరిమేసుండాలి.మొదటి నేరస్తురాలు సత్యా! రెండవ నేరస్తులు ఆమెను కన్న మేము. మూడవ
నేరస్తులు...మీ అమ్మ. ఏ బాధ్యత ఆమె తీసుకోలేదు. తనకు కొడుకు మాత్రం ఉంటే చాలని అనుకుంది
ఆమె. బాధ్యతల నుండి పూర్తిగా తప్పుకున్నారు ఆమె. అందరికంటే పెద్ద నేరస్తులు
మీరే!"
"మవయ్యా!"
"అమ్మ, అత్తగారు, బావమరిది
అంటూ ఎంతకాలం నమ్ముతారు? భార్యా, పిల్ల
మీ మొదటి భాద్యత, వారి మీదే మీరు ఎక్కువ అక్కర
చూపించాలి. వారిని బాగా చూసుకోవటమే మీ మొదటి
డ్యూటీ. ఆమెకూ, బిడ్డకూ అయ్యే ఖర్చు మిగులుతుందని ఆనందపడుతూ
ఆ డబ్బును మీరు సేవింగ్స్ చేయటం అతిపెద్ద నేరం"
"నాన్నా..."
కూతురు ఏడ్చింది.
"అల్లుడని
చెప్పి నెత్తి మీద పెట్టుకోలేము సత్యా. ఆయనే మాట్లాడాలి. ఆడదిగా పుట్టిన ప్రతి
ఒక్కరికీ పుట్టిల్లు సుఖమే. అది వదిలేసి మెట్టింటికి రావాలనిపించదు. శరీరమూ, మనసూ మొండికేస్తుంది...వదలదు. మగాడు దాన్ని
ఖండించాలి. విడమరిచి చెప్పాలి. పుట్టిల్లు లాంటి ఒక స్వర్గమూ ఉండదు...కొంతకాలం
తరువాత అదే పెద్ద నరకమూ అవుతుంది. మిగిలిన వాళ్ల దయతో జీవించాల్సిన అసహ్యమైన
జీవితం. తల్లీ, తండ్రీ ఎంతకాలం మీ భాధ్యతను స్వీకరించగలరు?
నీ భార్యా, పిల్లలను ఇంకొకరి నీడలో
అట్టేబెడితే, మిమ్మల్ని మంచి మగాడని సమాజమే ఒప్పుకోదు. ఈ
రోజు ఆమె ఉన్న ఈ పరిస్థితికి మీరే కారణం"
"నేను పిలిస్తే, అది రావటం లేదే?"
"అలాగైతే కొట్టి లాకెళ్ళండి..."
"నాన్నా!"
"భర్తను
గౌరవించని దానికి తాళి ఎందుకు? అది విప్పేసి, ఎక్కడికైనా వెళ్లమనండి. మీ మాటలు
వినని భార్య మీకెందుకు అల్లుడూ?"
"ఆపండి నాన్నా! ఆయన్ని ఎవరూ హేళనగా మాట్లాడవద్దు. ఆయన వలన ఎటువంటి కష్టమూ
లేదు. తప్పు నాది. ఆయన్ని తప్పు చెప్పకండి. ఏమండీ...నేను మీతో
వస్తాను...బయలుదేరండి"
"ఉండండి అన్నయ్య
గారూ! ఇద్దరూ భోజనం చేసి వెళ్లండి"
"లేదు వదినా!
మేము మా ఇంటికి వెళ్ళి, నేను వంట చేసుకుని ఆ తరువాత తింటాను"
"వదిలేయి సరొజా!
అదే ఒళ్ళు వంచి పని చేయాలని ఇప్పుడే నిర్ణయం తీసుకుంది. దాన్ని చెడపకు. వదులు.
వెళ్ళనీ!"
"ఇక
పుట్టింటికి రాను. నాకూ పరువు ఉంది. నా భర్త సంపాదనతో గంజి తాగినా
చాలు...నేనొస్తాను"
అదే చెదిరిపోయిన
జుట్టుతో అతని బైకులో ఆమె ఎక్కగా, బైకు బయలుదేరింది.
అందరూ లోపలకు
వచ్చారు.
అల్లుడు ఎలా
ఇక్కడికి వచ్చారు.
"నేను ఫోనులో
అంతా చెప్పాను అత్తయ్యా? అందుకే అన్నయ్యగారు వచ్చారు"
"మంచి పని
చేశావు! ఇక ఈ అద్దె ఇల్లు ఎందుకు? మనింటికి వెళ్ళిపోదాం"
"లేదు గిరిజా! చలపతి
అక్కడే ఉండనీ. వీళ్ళు ఇక్కడే ఉండనీ. నువ్వూ, నేనూ మారి మారి ఉందాం. ఇద్దరి కొడుకులకూ సహాయం చేద్దాం. 'ఉమ్మడి' తప్పు లేదు...సరిగ్గా ఉన్నంత వరకూ! అది
చెదిరిపోతే...మళ్ళీ చేరకూడదు. చేరినా సరిగ్గా రాదు. అప్పుడే బంధుత్వం గంభీరంగా
ఉంటుంది...నిలబడుతుంది! ఇక భోజనం రెడీ చెయ్యి సరొజా. పాయసం చెయ్యి. మంచి జరిగింది
కదా. సంతోషంగా తిందాం!"
"రామ్మా! కలిసే
వంట చేద్దాం"
కోడలు సరొజా చేతులు
పుచ్చుకుని సంతోషంగా వంట గదిలోకి దూరింది గిరిజా!
**************************************************సమాప్తం******************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి