26, ఫిబ్రవరి 2024, సోమవారం

జ్ఞానోదయం: ‘అందరూ దేవుళ్ళే’ (ఆద్యాత్మిక కథ-2)

 

                                                                            జ్ఞానోదయం: ‘అందరూ దేవుళ్ళే’                                                                                                                                                        (ఆద్యాత్మిక కథ-2)

స్వామి రామదాసు, ఆయన శిష్యుడు తీర్ధయాత్రలకు వెళ్తూ ఉన్నారు.

తెల్లవారు జామున నడవటం మొదలుపెట్టి, ప్రొద్దున పన్నెండు గంటలకు దారిలో ఉన్న గ్రామంలో భిక్షాటన చేసి తింటారు. ఆ తరువాత మరుసటి రోజు పగలు పన్నెండు గంటలకు తరువాత గ్రామంలో భోజనం. ఇలాగే వాళ్ళ తీర్ధయాత్ర నడుస్తున్నది.

ఒక రోజు వారు మిట్ట మధ్యాహ్నం సమయంలో వాళ్ళు ఒక గ్రామానికి చేరుకున్నారు. గ్రామ సరిహద్దులోనే ఒక గుడి కనబడ, అక్కడే ఆగపోయారు.

"గ్రామంలోకి వెళ్ళి భిక్షాటన చేయాలి కదా?" అని అడిగాడు శిష్యుడు.

"వద్దు...మనం జపం చేసి ఇక్కడే ఉందాం భగవంతుడు భొజనానికి ఏర్పాటు చేస్తాడు చూడు..."అన్నారు రామదాసు స్వామి.

గురువుగారి మాటల్లో శిష్యుడికి నమ్మకం లేదు. వేరే దారి లేక రామదాసు గారితో కలిసి, నామ జపం చేయటం ప్రారంభించాడు.

సమయం పోతున్నదే తప్ప, ఎవరూ రాలేదు. ఏ దారి తెలియలేదు. శిష్యుడు ఆకలితో వంకర్లు పోయాడు.

కొద్ది సమయం తరువాత గుడికి వచ్చిన ఒకాయన, వీళ్ళను చూసి "మీకు ఇంకా బిక్ష అవలేదు లాగుంది..." అన్నారు.

"ఇంకా భిక్ష అవలేదు. కానీ ఊరిలోకి వెళ్ళి అడిగే ఆలొచనే లేదు. దేవుడు తానుగా ఎవరినైనా పంపిస్తేనే తినేది అన్న నిర్ణయంలో ఉన్నాము..." అన్నారు రామదాసు.

"భగవంతుడే నన్ను మీ దగ్గరకు పంపించి ఉంటాడని అనుకోండి. సన్యాసులైన మీకు భిక్ష చేసి పెడితే, నాకు చాలా సంతోషం. కానీ నేనేమో జాతిలో బట్టలు కుట్టే వాడిని. నేను గనుక భిక్ష వేస్తే, మీరు ఒప్పుకుంటారా?" అని అడిగారు వచ్చినతను.

"అయ్యా...సన్యాసులమైన మాకు జాతి బేదాలు లేవు. మాకు అందరూ దేవుళ్ళుగానే అనిపిస్తారు. ప్రతి వ్యక్తికీ భిక్ష వేసేది ఆ దేవుడే. కానీ ఆయన తిన్నగా వేయరు. ప్రతినిధితో వేయిస్తాడు. దేశ ప్రజలందరికీ భిక్ష వేసే ప్రతినిధి ఆహారం పండించే రైతు, వాళ్ళు ఏ జాతికి చెందిన వారో ఎవరికైనా తెలుసా? " అన్నారు రామదాసు.

బట్టలు కుట్టే అతను సంతోషం తట్టుకోలేకపోయాడు. స్వామి రామదాసు గారినీ, ఆయన యొక్క శిష్యుడునీ, తన ఇంటికి తీసుకు వెళ్ళి వాళ్ళకు భిక్షమిచ్చాడు.

భిక్ష ముగిసిన తరువాత, గురువు, శిష్యుడు బయలుదేరి తిరిగి గుడికి వెళ్లారు.

"భగవంతుడు ఈ రోజు మనల్ని వెతికి, భోజనం పంపారు చూసావా...మనకి ఇవ్వటానికి ఆలస్యమైనందువలన, భిక్ష ఇవ్వటానికి భగవంతుడు ఇష్టపడటం లేదు అని అనుకోకూడదు..." అన్నారు రామదాసు.

భగవంతుడు మనల్ని కాపాడతాడు; ఎవరినైనా పంపి మన కష్టాలను తీరుస్తాడు!

**************************************************సమాప్తం***************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి