విచిత్ర మనుషులు (పూర్తి నవల)
ఒక నిజమైన
సంఘటనే ఈ నవలకు పునాది. నాగరాజు లాంటి స్వార్ధపరుడైన మగవాడి దగ్గర తెలిసో, తెలియకో
పెళ్ళి బంధం ద్వారా చిక్కుకున్న ఒక స్త్రీ కథ ఇది.
నిజానికి
అతను ఆమెను కూడా తన జీవితం నుండి తరిమేశాడు. కానీ, కధలో
ముగింపును కొంచంగా మార్చి, నేను వాడి కథను ముగించాను.
పెళ్ళి
జీవితం అనేది కొందరికి రెడ్ కార్పెట్ పరచి స్వాగతించే బృందావనం. కొందరికి బురద
నీటి ఊబిలో కాలు పెట్టిన పరిస్థితి.
PART-1
కొట్టి పడేసినట్లు
నిద్రపోతోంది మహేశ్వరి. చుట్టూ వస్తువులు, కట్టి పడేసిన సంచులు, చుట్టిపెట్టిన కొత్త పరుపులు. చుట్టూ తిరుగుతున్న బంధువుల
గుంపు, ఇన్నిటికి
మధ్యలో అలసిపోయి నిద్రపోతున్న ఆమెను చూసి కొందరు బంధువులు వెక్కిరింపు నవ్వుతో
ఆమెను చూశారు.
ఒక ముసలి అత్త ఆమెను
చిన్నగా చేత్తో తట్టిలేప, దొర్లి దొర్లి లేచిన ఆమె,
చుట్టూ చూసింది.
"ఏమ్మా పండూ,
అల్లుడు నిన్ను
రాత్రంతా నిద్రపోనివ్వలేదని ఇలాగా ఒళ్ళు తెలియక నిద్రపోతూ అందరికీ తెలియచేయటం!
రాత్రి జరిగిందా జరగలేదా అని నలుగురూ జుట్టు పీక్కోవాలే?
నిద్ర వచ్చినా
నిద్రపోకూడదు?" ముసల్ది పక పకా నవ్వగా,
మహేశ్వరి మొహం
సిగ్గుతో ఎరుపెక్కింది.
"అది
సరే...అల్లుడు ప్రేమగా ఉన్నారా? లేక, అందులో మాత్రం ఆవేశంగా ఉన్నాడా...?
ఏదైనా మాట్లాడేడా...?"
వణుకుతున్న స్వరంతో
అడిగింది ముసల్ది.
"ప్రేమగానే
ఉన్నారు"
"ఏం మాట్లాడారు?"
"అదంతా నీకెందుకు?"
ఈ పూర్తి నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
విచిత్ర మనుషులు…(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2
ఈ నవలను ఒకేసారి చదవలేని వారు ఈ క్రింది PDF లింకుపై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకుని చదవుకోవచ్చు.
https://drive.google.com/file/d/1xjIvV10Ufmlm660cMGivRx9wKffT18Oo/view?usp=drive_link
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి