2, ఆగస్టు 2019, శుక్రవారం

చీటింగ్ పోలీస్(నవల)…..PART-12

                              

                                    చీటింగ్ పోలీస్(నవల)…..PART-12

అరగంట తరువాత ఎగుడు దిగుడులుగా ఉన్న వీధిలోకి దూరింది జీప్.

"పోలీసులు మనల్ని వెంబడిస్తూ వచ్చే అవకాశం ఉంది. అందువలన జీపును ఒక పక్కగా ఆపండి. ఎవరైనా వస్తున్నారా అని చూద్దాం..."

"పోలీసులే కాదు, ఇంకెవరూ కూడా ఇక్కడకు రాలేరు.. ఒక వేల వచ్చినా మనం ఉండే చోటును కనుక్కోలేరు. నువ్వు ఆదుర్దా పడకుండా రా"

ఒక గుడారం దగ్గరకు వెళ్ళి ఆగింది జీపు.

సంస్థకు కూలీలుగా పనిచేస్తున్న ఇద్దరూ వెర్రి ఉత్సాహంతో క్రిందకు దిగారు. ప్రమోద్, విజయం సాధించిన నాయకుడిలా ప్రతాప్ ను, సుధానూ తోసుకుంటూ వెళ్ళి అసలు నాయకుడి కాళ్ళ దగ్గర పడేటట్టు తోశాడు.

అక్కడ జరిగిందంతా చెప్పారు. నాయకుడికి మహా సంతోషం. ప్రమోద్ ను కావలించున్నాడు.

"శభాష్! నిన్ను సాదారణ వ్యక్తి అనుకుని భయపడ్డాను. కానీ, నువ్వు నీ తెలివితేటలను మరోసారి మాకు చూపించావు. చాలా ధ్యాంక్స్. అడుగు...నీకేం కావాలి?"

"ఈ దేశానికి చెందినంత వరకు నేనొక తీవ్రవాదిని. అందుకని నన్ను కంటికి కనిపించనంత దూరానికి పంపండి"

"ఎందుకు అలా వెళ్ళలి? మా సంస్థకు నీలాంటి తెలివిగలవారు కావాలి. నువ్వు ఇక్కడే ఉండు"

ప్రమోద్ ఆలొచించాడు.

"అన్నీ చేతులు దాటి పోయినై. మంచివాడుగా జీవించటానికి విధి నన్ను వదిలిపెట్టటం లేదు" తనలో తానే మాట్లాడుకున్నాడు ప్రమోద్.

"అవును...ఎందుకు వీళ్ళిద్దరినీ లాకొచ్చారు? అక్కడే కాల్చిపారేసుండొచ్చుగా?" అడిగాడు నాయకుడు.

"లేదు...నా ఈ కష్టాలన్నిటికీ కారణం ఇతనే. వీడు అంత సులభంగా చావకూడదు"

"అంతపెద్ద కేటుగాడా...?" --చెబుతూ ప్రతాప్ చొక్కా పుచ్చుకుని ఒక్క చేతితో పైకెత్తాడు.

"ఏయ్...సాలా..."--అతను మాట్లాడటం ముగించక ముందే అతని ముఖంపైన ఉమ్మేసి, కోపంతో అతన్ని క్రిందకుతోసి, పొత్తికడుపులో తన బూట్స్ కాలితో తన్నాడు ప్రతాప్.

నొప్పి పుట్టినా దాన్నీ కప్పి పుచ్చుకుని పైకిలేచాడు అతను.

"వాడ్ని కొట్టి మీరెందుకు కష్టపడతారు బాస్? అతని స్విచ్ ఇక్కడుంటే"- ప్రమోద్, సుధా ను చూపాడు.

"అందమైన అమ్మాయి..." మురికి పళ్లతో నవ్వాడు.

"ఇప్పుడు చూడండి...అక్కడ ఎలా నొప్పి పుడుతుందో"- చెబుతూ పూజ చెంపలపై లాగి కొట్టాడు ప్రమోద్.

అమె బాధతో అరవగా...ప్రతాప్ నీరసంగా అరిచాడు.

మళ్ళీ ఆమెను కొట్టాడు ప్రమోద్...ఆమె క్రింద పడిపోయింది.

"ఇప్పుడు చూశారా...ఇంతకు ముందుకంటే ఇప్పుడెలా గిలగిలా కొట్టుకుంటున్నాడో"

"ఈ సంతోషాన్ని పండుగ చేసుకుందాం. విందుకు ఏర్పాటు చేయండి" కిరాయి అసిస్టంట్లకు ఆదేశించాడు. వాళ్ళూ పెద్దగా అరుచుకుంటూ తమ ఆనందాన్ని తెలిపారు

"రా ప్రమోద్...సంతోషాన్ని పండుగ చేసుకుందాం"

"దేనికోసం...?"

"ఎంతపెద్ద పనిని చేసొచ్చావు నువ్వు! నిన్ను సంతోషపెట్టద్దా?"

"ఇతను అనుభవించే బాధే నాకు పరిపూర్ణ సంతోషం. మిగిలినవి ఏవీ నాకు సంతోషాన్ని ఇవ్వవు"

"వీళ్ళను ఎప్పుడైనా హింసించవచ్చు...రా"

ఒక గది తలుపు తెరిచి చూపిస్తే...అక్కడొక వైన్ షాపు ఉన్నది.

"ఒక వైన్ షాపులో ఉన్నంత సరుకా?...ఇదెలా సాధ్యం?"

"భారతదేశంలో డబ్బులు పారేస్తే అన్నీ దొరుకుతాయి"

ప్రమోద్ చుట్టూ చూశాడు. "విందు అని చెప్పారు...ఉత్త మందేనా? పొందు లేదా?"

"ఈ అడవిలోకి ఎవరొస్తారు?"

"ఇక్కడొక అమ్మాయిని తీసుకువచ్చాముగా? ఆమెను తీసుకువచ్చి సినిమా బానిలో ఆడిపించండి...తీసుకురండి అమెను"

ప్రమోద్ చెప్పిందానిని అందరూ ఆమొదించారు.

నాయకుడు చెయి ఊపడంతో...సుధాను వాళ్ళ ముందుకు తొశారు. కాళ్ళూ-చేతులూ వెనక్కి కట్టేసిన కారణంగా ప్రతాప్ ఒక మూలకు తోయబడ్డాడు.

అక్కడున్న పాత గ్రామఫోన్ ఆన్ చేయగా, అందులో నుండి బూతుపాటలు మొదలైనై.

సుధాకు ఏంచేయాలో తెలియలేదు. ప్రతాప్ వైపు చూసింది. అతను. నోటిలోంచి రక్తం కారటం వలన ముడుచుకు పడుకున్నాడు.

"ఆడటమే మంచింది..అప్పుడే మరికొంతసేపటివరకు ఎలాంటి విపరీతానైన్నా ఆపగలం. ఇంతలో ప్రతాప్ కు ఏదైనా ఐడియా రావచ్చు"

అక్కడ ఉత్సాహం మొదలయ్యింది. మందు లోపలకు వెళ్ళటంతో అందరూ ఆడటం మొదలుపెట్టారు. అది డాన్సా...లేక మందు వలన చిందులా అనేది కనుక్కోవడం కష్టం.

సుధా ఆడుతున్న డాన్స్ స్టెప్పులతో ప్రమోద్ కూడా స్టెప్పులు వేస్తూ డాన్స్ లో కలుసుకున్నాడు.

డాన్స్ ఇరవై నిమిషాలకు పైనే కొనసాగింది. సంస్థకు చెందిన వాళ్ళు స్వర్గంలో తేలుతున్నారు. విందు చివరి దశగా ప్రమోద్ చప్పట్లు కొడుతూ డాన్స్ చేయటంతో అందరి చూపూ అతనిపై పడింది.

"ఈ విందు ఇప్పుడు చాలా సంతోషంగా జరుగుతోంది. ఈ విందు ముగింపు ఇంకా సంతోషంగా మారటానికి వీడిని కాల్చి చంపబోతున్నాను"

అందరూ కోరస్ గా అరిచారు. పరిగెత్తుకొచ్చిన సుధాను రెండు బండ చేతులు ఆపినై.

"నీకెందుకంత అవసరం?...అతని తరువాత నువ్వే..."

"దాన్ని ఉండనివ్వండి...వాడ్ని లాక్కురండి"

ఆదేశానికి తలవంచి ఇద్దరు కిరాయి బండ మనుషులు మత్తులో తూలుతూ ప్రతాప్ ను తీసుకువచ్చి ప్రమోద్ ఎదురుగా నిలబెట్టారు.

ఆ గుంపు నాయకుడిని చూశాడు ప్రమోద్. అతనిదగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. రివాల్వర్ను ప్రతాప్ తల వెనుక పెట్టాడు.

"జరపండి..."--నాయకుడు అనుమతి ఇచ్చాడు.

మరుక్షణం రివాల్వర్ మీట నొక్కగా...దానిలో నుండి 'బుల్లెట్' దూసుకుని పోయింది.

సుధా కేకలు ఆ చొట పూర్తిగా మారుమోగింది.

Continued: PART-13

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి