24, ఆగస్టు 2019, శనివారం

మనుషులకూ మూడో కన్ను? (మిస్టరీ)

                                         మనుషులకూ మూడో కన్ను?

పరమశివుడి మూడో కన్ను ఆగ్రహాన్ని చూపిస్తుంది. పరమేశ్వరుడి త్రినేత్రం లోకాన్నే భస్మరాశిగా మార్చేస్తుంది. త్రినేత్రం నిజమేనా? అంతుచిక్కని దేవరహస్యమా? మనుషులకూ మూడో కన్ను ఉండే అవకాశం ఉందా?

మన శరీరంలోనూ మూడో కన్ను దాగి ఉంది. మన నడకను, నడతను, జీవిత మార్గాన్ని నిర్దేశించి అడుగడుగునా ఆదేశాలిస్తూ ముందుకు నడిచేలా చేస్తుంది. మనకి జ్ఞానాన్నిస్తుంది. మన సబ్ కాన్షియస్ మైండును కంట్రోల్ లో ఉంచుతుంది. అదే పీనియల్ గ్లాండ్.


మన మెదడులో సరిగ్గా మధ్య భాగంలో ధాన్యపు గింజ ఆకారంలో ఒక గ్రంథి ఉంటుంది. అన్ని రకాల కనెక్టివ్ కణాలన్నీ ఈ గ్రంథిని చుట్టుముట్టి ఉంటాయి. దీని ఉపరితల భాగం పియల్ కాప్స్యూల్చే చుట్టి ఉంటుంది. ఇది సరిగ్గా మిడ్ బ్రైయిన్ లో ఉంటుంది. చాలా నరాల ఫైబర్లు ఇందులోకి చొరబడి ఉంటాయి. దీనివల్ల మన శరీరంలోని అన్ని రకాల చర్యలను పీనియల్ గ్రంథి నియంత్రిస్తుంది.


మీరు ఒకసారి రెండు కళ్ళూ మూసుకుని ధ్యాన ముద్రలో ఉండండి. మీ దృష్టిని రెండు కళ్ళ మధ్య ఉన్న భృకుటిపై ఉంచండి. మనసులో మీరు కోరుకున్న రూపం మీ భృకిటిపై సాక్షాత్కరిస్తుంది. మీరు మనసును, మెదడును పూర్తిగా కంట్రోల్ లో ఉంచేందుకు ఇదే ఉపయోగపడుతుంది. మనలోని ఆగ్రహాన్ని, అనుగ్రహాన్ని ఇదే నిర్ణయిస్తుంది. ఆగ్రహం వచ్చినప్పుడు మన భృకుటి ముడిపడటం మీరెప్పుడైనా గమనించారా? ఖచ్చితంగా రెండు కళ్ళ మధ్య నున్న భాగం ముడిపడుతుంది. మనలోని మూడో కంటికి ఇదే తార్కాణం.

మెలటోనియన్ ఉత్పత్తిని పీనియల్ గ్రంథి చేస్తుంది. ఇదే మన మేధస్సును, మన పనితీరుక్రమాన్ని నిర్ణయించే హార్మోన్. దేవదారు చెట్టు శంకువు ఆకారంలో ఉంటుంది. దీని కాంతిని రెటీనాలోని సెన్సిటివ్ కణాలు కనిపెడతాయ్. ఈ కాంతిని శరీరంలోని అన్ని భాగాలకు వివిధ రూపాలలో, మార్గాలలో ప్రసరింపజేస్తుంది. పైకి కనిపించే రెండు కళ్ళు బయటకు కనిపించే దృశ్యాలనే ప్రతిబింబిస్తాయి. పీనియల్ గ్లాండ్ అనేది అంతర్గత కాంతిని శక్తివంతం చేస్తుంది. అందుకనే దీన్ని మూడో కన్ను అన్నారు.


17 వ శతాబ్ధంలోనే ఫ్రాన్స్ దేశానికి చెందిన గణిత మరియు తత్వవేత్త శాస్త్రవేత్త రెనే డిస్కార్టస్ మనిషిలో ఆత్మ (జీవం) కూర్చునే చోటు పీనియల్ గ్లాండ్ లోనేనని తెలిపారు. పీనియల్ గ్లాండ్ ఎలాంటి విధులను నిర్వహిస్తుందన్న విషయాన్ని మన పూర్వీకులు ముందే నిరూపించారు. మనలోనే జ్ఞానచక్షువే త్రినేత్రంగా తేల్చారు. ఇందుకు మూలస్థానం మన రెండు కళ్ల మధ్యభాగం. అందుకే దాన్ని కూల్ గా ఉంచేందుకే మనం అక్కడ బొట్టు ఉంచుతాం. మనిషి మెదడులో పీనియల్ గ్లాండుది ఆత్మ స్థానం అని పాశ్చాత్య ఫిలాసఫర్లు సైతం ఒప్పుకున్నారు. ముందుగానే చెప్పుకున్నట్లు భౌతిక రూపంలో ఇది మాస్టర్ గ్రంథిగా ఉపయోగపడుతుంది. స్పిరుచ్యువల్ లెవెల్స్ లో మూడో కన్నుగా తెరుచుకుంటుంది. వైద్య శాస్త్రం ప్రకారం పీనియల్ గ్లాండ్ చీకటి నుంచి కాంతిని ఉత్పత్తి చేస్తుంది. ఈ గ్రంథి మనకు కావలసిన మెలటోనిన్, సెరోటోనిన్, డిఎంటి5లను పీనియల్ గ్లాండ్ ఉత్పత్తి చేస్తుంది. మనకి ప్రాణాధారం ఇవే.


నీటిలో కలుపుతున్న ఫ్లోరైడ్ మానవులలోని పీనియల్ గ్లాండ్ ను పనిచేయకుండా అడ్డుకుంటోందని, దాని వలన మానవ పరిణామాన్ని తదుపరి దశకు చేరుకోనివ్వకుండా చేసేరని/ చేస్తూనే ఉన్నారని కొన్ని మర్మ వాదాలు తలెత్తాయి.

పళ్ళు పుచ్చిపోకుండా ఉండటానికి తాగునీటిలోను, టూత్ పేస్టుల లోనూ ఫ్లోరైడ్ కలుపుతున్నామని చెబుతున్నారు. కానీ నిజానికి ఫ్లోరైడ్ ను నీటిలో కలపటానికి ఉద్దేశమే వేరని, మనిషి అధ్యాత్మిక శక్తులు పొందకూడదని ఎవరో ఈ కుట్ర పన్నేరని చెబుతున్నారు. సమూహ మెదడు నియంత్రణ కోసమే ఇదే చేపట్టేరని, ఇదే గనుక జరిగి ఉండకపోతే ప్రతి మనిషీ అధ్యాత్మిక బాటలో వెళ్ళి ప్రతి ఒక్కరూ మంచికి పాటుపడేవారని, అప్పుడు లోకం సుభిక్షంగా ఉండేదని వాదాలు వినబడుతున్నాయి.


రష్యాకు చెందిన శాస్త్రవేత్త ఇ.పెర్కిన్స్, 1954 అక్టోబర్-2 న ఐజి ఫోర్బన్ కెమికల్ ఇండస్ట్రీస్ కు ఒక లేక రాస్తూ అందులో ఈ విషయం ప్రస్తావిస్తూ ఒక మనిషి ఒక సంవత్సరం పాటు కృతిమ ఫ్లోరైడ్ ను కనుక తీసుకుంటే ఆ మనిషి శరీరకంగానూ, మానసికంగానూ వేరే మనిషిగా మారిపోతాడని తెలిపారు. ఎప్పుడైతే ఫ్లోరైడ్ మనిషి మేధస్సును తగ్గిస్తుందని చైనా ప్రభుత్వం తెలుసుకున్నదో అప్పుడే వారి దేశంలో ఫ్లోరైడ్ ను నీటిలో కలపటం మానుకున్నారు.

మనిషి తన నిజమైన శక్తిని తెలుసుకోకూడదు, ఎప్పుడూ చీకట్లోనే ఉండాలి అని నిర్ణయించింది ఎవరు?

ఫ్లోరైడ్ వలన మనిషి మేధాశక్తిని కోల్పోతాడని తెలుసుకున్నదెవరు?

ఆ కుట్రదారులెవరు?...ప్రభుత్వాలా?

కొత్త ప్రపంచ శాసనమా?

మత సంబధిత సంస్థలా అనేది ఇంకా తేలని ప్రశ్నగానే మిగిలి పోయింది.

*************************************సమాప్తం************************************

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి