మొదటి పర్యావరణ అనూకూల స్కైస్క్రేపర్
పర్యావరణ విధ్వంసం దాదాపు అందరికీ తెలిసిన విషయం.పర్యావరణ పరిరక్షణ ప్రపంచ సమస్యగా తయారై కూర్చుంది. పర్యావరణ సమస్యలు పర్యావరణాన్ని పరాయి ఆవరణంగా భావించడం వల్లనే బహుముఖ సమస్యగా మారింది. నింగి, నేల, నీరు అన్నిటిపైనా కాలుష్యం తన ప్రతాపం చూపుతోంది. కాలుష్యాన్ని దేశ అభివృద్ధికి చెల్లిస్తున్న మూల్యంగా కొందరు అభివర్ణిస్తున్నారు.
పారిశ్రామికీకరణ ద్వారా ఎంతో విలువైన ప్రకృతి సంపదకు నష్టం వాటిల్లడమే కాకుండా, వ్యర్ధ పదార్ధాలు విడుదల వలన పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. గాలి, నీరు, నేల పర్యావరణానికి, వృక్షాలు, జంతువులు తదితర జీవరాశులు జీవ్యావరణానికి సంబంధించినవి. ఇవి పరస్పర ఆశ్రితాలు. జీవ్యావరణం మనుగడ పరిశుభ్రమైన పర్యావరణంపై ఆధారపడి ఉంటుంది. అయినా, మనిషి పర్యావరణానికి చేస్తున్న హాని అపారం.
ఇది తెలుసుకున్న మానవ జాతి, జాతి సంరక్షణకు ముఖ్యత్వం ఇస్తోంది. దీని కోసం ప్రపంచ దేశాలన్నీ కలిసి ఎన్నో ప్రణాళికలు సిద్దం చేశాయి. పర్యావరణ విధ్వంసానికి కారణమైన వాటినే పర్యావరణ సంరక్షణకు అనుకూలంగా ఉండేటట్లు చేయాలని నిర్ణయించుకున్నాయి. ప్రణాళికలో తయారుచేయబడే అన్ని ఉత్పత్తులూ పర్యావరణ అనుకూల ఉత్పత్తులుగా ఉండాలని, తొలుతు భవన నిర్మాణాలు పర్యావరణ సంరక్షణకు అనుకూలంగా ఉండేటట్లు నిర్మించాలని అన్ని దేశాలు నిర్ణయించుకున్నాయి. అందులో భాగమే గ్రీన్ ఎనర్జీ.(గాలి నుండి మరియు సూర్యరశ్మి నుండి ఉత్పత్తి చేసే కరెంటు...అంటే భవనాలు, ముఖ్యంగా స్కైస్క్రేపర్స్ తమ భవనానికి కావల్సిన కరెంటును భవనమే ఉత్పత్తి చేసుకోవాలి. భవనం కట్టడానికి కాంక్రీట్ వాడుతారు గనుక, ఆ కాంక్రీట్ నుండి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించడానికి భవనానికి కావలసిన చల్లదనం భవన నిర్మాణంలోనే అమర్చుకోవాలి).
చాలా భవనాలు పర్యావరణ అనుకూలం...గ్రీన్ ఎనర్జీ ఫ్రెండ్లీగానే కట్టేమని/కడుతున్నామని భవన నిర్మాణవేత్తలు ప్రకటనలు చేస్తున్నా, చైనా దేశం లోని, గువాన్ జువా నగరంలోని 71 అంతస్తులు కలిగిన ముత్యాల నది టవర్(Pearl River Tower), ప్రపంచంలోనే మొట్టమొదటి అత్యంత పర్యావరణ అనుకూల భవనంగా ప్రపంచ భవన నిర్మాణ వేత్తల(Architects) ప్రకటించారు. అమెరికాలోని చికాగో నగరానికి చెందిన భవన నిర్మాణ వేత్తలు స్కిడ్ మోర్, ఓవింగ్స్ అండ్ మెరిల్ అనే సంస్థ ఈ టవర్ను డిజైన్ చేస్తూ, ఈ టవర్ను పూర్తి పర్యావరణ అనుకూల భవనంగా నిర్మించడానికి డిజైన్ చేశారు. అంటే ఈ భవనం నుండి పర్యావరణ కాలుష్యానికి దారితీసే వ్యర్ధ పదార్ధాలు రాకూడదని, పూర్తి గ్రీన్ ఎనర్జీ ఫ్రెండ్లీగా ఉండేటట్లు డిజైన్ చేశారు. ఈ భవన నిర్మాణవేత్తల అసలు ఐడియా ఏమిటంటే ఈ భవనం మూలంగా తయారయ్యే గ్రీన్ ఎనర్జీ, భవనానికి పోనూ మిగిలిపోయే గ్రీన్ ఎనర్జీని అక్కడి కరెంటు ఉత్పత్తిదారులకు అందివ్వాలని అనుకున్నారు. కానీ వారి కలలు పూర్తికాకుండానే ఉండిపోయింది. దీనికి కారణం అక్కడి ప్రభుత్వం. ప్రైవేటుగా తయారుచేయబడ్డ కరెంటును ప్రభుత్వానికి అమ్మకూడదు. అందువలన కరెంటు ఉత్పత్తికి భవనంలో అమర్చవలసిన టర్బైన్ల సంఖ్యను భవన నిర్మాణవేత్తలు తగ్గించారు. భవనం వరకు వారు వేసిన సంఖ్య తప్పు అవడంతో పూర్తిచేయబడ్డ ఈ భవనం బయటి కరెంటును వాడుకోవలసి వస్తోంది.కానీ అది మిగిలిన ఇలాంటి నిర్మాణ భవనాల కంటే 60 శాతం తక్కువగానే వాడుతోంది.
ఈ ముత్యాల నది టవర్ మామూలు కరెంటును వాడకుండా ఉండాలని, భవనానికి కావలసిన కరెంటును భవనమే ఉత్పత్తిచేసుకోవాలని, 309 మీటర్ల(1016 ఆడుగులు)ఎత్తుకు, మలచిన పెద్ద ముఖాలను అమర్చారు.(ఈ ముఖాలను మీరు ఫోటోలో చూడవచ్చు). బయట నుండి భవనంలోకి వచ్చే గాలి అందులో( ఆ ముఖాలలో) నుండి 4 ద్వారముల ద్వారా భవనములో అమర్చబడ్డ యాంత్రీక అంతస్తులకు వెళ్ళి అక్కడి నుండి భవన నిర్మాణం ద్వారా భవనములో అమర్చబడ్డ టర్బైన్లకు చేరి అక్కడ కరెంటు ఉత్పత్తి చేసుకుని ఆ భవన మొత్తానికీ కరెంటు అందిస్తుంది. అంతేకాక ద్వారముల గుండా వచ్చే గాలి భవన నిర్మాణంలో అమర్చిన రెండు వెలుపలి పొరలలో తిరుగుతూ భవనాన్ని చల్లగా ఉంచుతుంది. అంతే కాకుండా భవన మొత్తం వెలుపలి భాగంలో అతిపెద్ద సౌర ఫలకాలను అమర్చారు. దీనిని నుండి సూర్యరశ్మి మూలంగా కూడా కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఈ సౌర ఫలకాలు ఫోటో వోల్వోటిక్ బ్యాటరీలు కలిగి ఉండటం వలన సూర్యరశ్మి వేడిని బద్రపరుచుకుని, రాత్రి పూట మరియూ సూర్యరశ్మి లేనప్పుడూ కరెంటు ఉత్పత్తికి ఉపయోగపడుతుంది.
2006లో భవన నిర్మాణం మొదలై 2011లో పూర్తి అయ్యింది. చైనా దేశం తీసుకున్న వాగ్ధానం (2020 లోపు కాలుష్యానికి ముఖ్య కారణమైన కార్బండ యాక్సైడ్ ను 45 శాతం వరకు తగ్గిస్తామని) అమలులో పెడుతున్నారని నిరూపించుకోవడానికి ఈ భవన నిర్మాణం ఒక ముఖ్య సంకేతం.
************************************END***********************************
N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)
N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి