6, ఆగస్టు 2019, మంగళవారం

చీటింగ్ పోలీస్(నవల)…END--PART-14

                               

                           చీటింగ్ పోలీస్(నవల)....చివరి భాగం

సుధా తన బుర్రను ఎంత గోకున్నా అది ఒకే సమాధానం చెప్పింది.

ఖచ్చితంగా ఏదో ద్రోహం చేశారు. లేకపోతే ఈయనకి ఇంత డబ్బు దొరికే చాన్సే లేదు.

ప్రతాప్ స్నానం ముగించుకుని తల తుడుచుకుంటూ వచ్చాడు.

"ఈరోజు టిఫెన్ చాలా రుచిగా ఉన్నట్లుందే. వాసన్ ముక్కును వదలటంలేదు"

"వెళ్ళి డ్రస్సు మార్చుకు రండి...తిందాం" కోపంగా చెప్పింది.

"ఇలా వస్తే టిఫిన్ పెట్టవా ఏమిటి?"--నవ్వుతూ అడిగాడు.

లోపలకు వెళ్ళి కొత్త డ్రస్సు వేసుకుని మెరిసిపోతూ వచ్చి డైనింగ్ టెబుల్ కు వచ్చి కూర్చున్నాడు.

ఇడ్లీలు ప్లేట్లో పెట్టింది. రుచి అనుభవిస్తూ తినడం మొదలుపెట్టాడు.

రెండో ఇడ్లీ ముక్కను నోటి దగ్గరకు తీసుకు వెడుతున్నప్పుడు అడ్డుపడింది "రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఫోన్ చేశాడు. జమీందార్ భవనాన్ని కొంటున్నట్లు తెలుస్తోంది"

పొలమారింది. పక్కనున్న గ్లాసులోని మంచి నీళ్ళను ఒకే గుక్కలో తాగాడు.

సుధా వదలలేదు.

"డెబ్బై కోట్లకు బేరం కుదిరింది. మీకు అంత డబ్బు ఎక్కడిది?"

ఆమె చూపంతా అతని మీదే ఉన్నది.

"నీదగ్గర అబద్దం చెప్పదలుచుకోలేదు. కానీ దయచేసి ఈ ఒక్క విషయాన్ని మాత్రం చూసి చూడనట్లు ఉండిపో"

"లేదు...నాకు తెలిసే కావాలి. మీరు ఇంతకు ముందులాగా ఏదో పెద్ద తప్పు చేస్తున్నారని అనుకుంటా. మీ బ్యాంక్ అకౌంట్ చూశాను. దాంట్లో తొంబై ఎనిమిది కోట్లు నాలుగు రోజులలో డెపాజిట్ చేయబడింది."

"ఇది ఎవరినీ మోసం చేసి సంపాదించింది కాదు. మోసం చేసి సంపాదించినదైతే బ్యాంకు ఖాతాలో జమ అవుతుందా?”

"అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. నా ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పండి. మీకు ఇంత డబ్బు ఎలా వచ్చింది?"

"చెప్తాను. నా బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయబడ్డ కోట్ల కొలది రూపాయలు మనదేశం నాకు బహుమతిగా రెండుకోట్లు ఇచ్చినట్లే ఆ ముఠా నాయకుడిని ప్రాణాలతో పట్టిచ్చినా, చంపేసినా వివిధ దేశాలు బహుమతలు ప్రకటించి ఉంచాయి. ఆ ముఠా నాయకుడిని చంపిన నన్ను మన ప్రభుత్వ సీక్రెట్ సర్వీస్ సంస్థ మూలం తెలుసుకుని, వాళ్ళు ప్రకటించిన బహుమతి డబ్బును నాకు పంపించారు. ఈ డబ్బు మొత్తానికీ నాకు పన్ను మినహాయింపు ఇచ్చింది మన ప్రభుత్వం. ఎందుకంటే ఈ డబ్బు మొత్తాన్నీ నేను నా జమీందారి భవనం కొనుక్కుని, దాన్నీ అనాధ శరణాలయంగా ఏర్పాటు చేసి సుమారు వెయ్యి మంది పిల్లలను మంచి పౌరులుగా తయారు చేయబోతాను. అందులో సహాయపడటానికి ప్రమోద్, ఆ ముఠా నాయకుడి వలలో చిక్కుకుని బయటపడ్డ మరో ముగ్గురు నాతో ఉంటారు…..” అంటూ మాటను సాగదీస్తూండగా.

డి.జి.పి.,కమీషనర్, వీళ్ళ తరువాత ముఠా నాయకుడి వలలో చిక్కుకుని బయటపడ్డ ముగ్గురు, బాంబు పేలుడ్లో చనిపోయాడని చెప్పిన ప్రమోద్ వచ్చి అక్కడున్న సోఫాలో కూర్చున్నారు.

జరుగుతున్నది కలా లేక నిజమా అనేది తెలియక తికమక పడుతున్నది సుధా.

"మీరు 'డబుల్ గేం' ఆడేరు ప్రతాప్….. ప్రమోద్ ని, ఈ ముగ్గురు నేరస్తులనూ చట్టం కళ్ళకు చనిపోయినట్లు చూపించి...ప్రాణాలతో వదిలేసి, ఇప్పుడు మీ కోసం వాళ్ళను వాడుకుంటున్నారు.

మీకు ఇచ్చిన బహుమతి డబ్బును వాళ్ల కుటుంబాలకు మీరు ఇచ్చేసినప్పుడు మిమ్మల్ని గొప్ప వ్యక్తి అనుకున్నాను. కానీ మీరిప్పుడు చేసింది దేశ ద్రోహం. వీళ్ళతో పాటూ మిమ్మల్ని కూడా ఖైదు చెయ్యబోతాను" " చెప్పాడు డి.జి.పి.

“నా వరకు నేను న్యాయంగానే ఉన్నాను డి.జి.పి సార్. ఆ తీవ్రవాద సంస్థ వలన ఇప్పటివరకు మనదేశానికి ఏర్పడిన నష్టం ఐదువందల నలబై కోట్లు. ఆ సంస్థను కనుక్కోవటానికి మీరు ఏర్పాటు చేసిన స్పెషల్ స్క్వాడ్ ఖర్చు ముప్పై కోట్లు. ఆ సంస్థ ఇంకా ఉండుంటే మనదేశానికి పలుకోట్లు నష్టం వచ్చుండేది.

కానీ వీళ్ళ వలన మనకి, దేశానికీ ఎంత లాభమో చూడండి. ఒక్క పైసా ఆదాయం ఎదురు చూడ కుండా. వాళ్ళ ప్రాణాలను లెక్క చేయక ఆ సంస్థ ముఠాను పట్టుకొవటానికి వీళ్ళందరూ సహాయపడ్డారు. అందువలన వీళ్ళను నేరస్తులుగా పరిగణించకుండా వదిలేసింది మన ప్రభుత్వం... ఇదిగోండి దానికి సంబంధించిన లెటర్" అంటూ ఒక భారత ప్రభుత్వ లేకను డి.జి.పి.కి చూపించాడు ప్రతాప్.

"ఈ విషయాన్నీ మీరు అప్పుడే చెప్పుంటే మాకు ఎంతో శ్రమ తప్పేది ప్రతాప్"

"చెప్పకూడదని కాదు సార్...కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వలన చెప్పలేదు"

"నేను ఒక స్టేట్ డి.జి.పి ని. నా రాష్ట్రంలోనే ఆ తివ్రవాద సంస్థను ఎలిమినేట్ చేశారు. నా దగ్గరే సెక్యూరిటీ రీజనా?"

"సార్...మీ టీం అక్కడికి రాక ముందే భారత ప్రభుత్వ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అక్కడికి వచ్చారు. వీళ్ళ ముగ్గురునీ రౌండ్ అప్ చేసి వాళ్ళతో పాటూ తీసుకు వెళ్ళారు. రెండు రోజుల తరువాత నన్ను కాంటాక్ట్ చేసి విషయాలన్నీ తీసుకున్నారు...మేము ఏ విషయమూ ఎవరితోనూ చెప్పకూడదని ఆదేశించారు"

ఇంతలో డి.జి.పి ఫోన్ మోగింది. ఫోన్ లో అవతల ఇండియన్ సీక్రెట్ సర్వీస్ చీఫ్.

"ఎస్ మిస్టర్ ప్రతాప్ ఈ రొజే మనిద్దరం డిల్లీ వెడుతున్నాం. ఇదేలాగ మరొ సంస్థ గురించిన సమాచారం వచ్చింది. దాన్ని వేర్లతో సహా పీకిపారేయటానికి మిమ్మల్ని స్పేషల్ ఏజెంటుగా నియమించింది భారత ప్రభుత్వం....దాని గురించి మాట్లాడాలట?"

"ఓ...ఎస్" ప్రతాప్ బలంగా తల ఊపాడు.

అందరూ ప్రతాప్ కు కంగ్రాట్స్ చెప్పారు...సుధా కూడా.

“ఇక మనం ఆ బంగళాలో ఉండాలా?”

"మనం జీవించటానికని కొన్న బంగళా కాదది. మా అమ్మగారికి నేనిచ్చిన ప్రామిస్ కోసం కొన్నాను...పేద పిల్లలకు అర్పణం చేయాల్సిన బంగళా అంటూ నా దగ్గర ప్రామిస్ చేయించుకున్నది. ఆమె ఆశపడినట్లు ఇప్పుడు ఆ బంగళాను అనాధ శరణాలయంగా మార్చాను...ఆ డబ్బంతా దానికే. అందులో నుంచి ఒక్కపైసా కూడా నేను తీసుకోలేదు"

"నిజంగానా?"

"నీమీద ప్రామిస్"

మాట్లాడుతున్నప్పుడే కళ్ళు తిరిగి పడిపోయింది సుధా. ప్రతాప్ నీళ్ళు తీసుకు వచ్చి ఆమె మొహం మీద జల్లాడు.

డాక్టర్ కు ఫోన్ చేశాడు.

పది నిమిషాలలో డాక్టర్ వచ్చాడు......"మీరు తండ్రి కాబోతున్నారు"

స్పృహలోకి వచ్చిన సుధా మొహం సిగ్గుతో నిండుకుంది.

"మేము వెళ్ళి...మళ్ళీ వచ్చే వారం వస్తాం" అని చెప్పి డి.జి.పి.,కమీషనర్, ప్రమోద్ మరియూ ఆ నలుగురు యువకులూ తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు.

*****************************సమాప్తం ******************************

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి