14, ఆగస్టు 2019, బుధవారం

మాటే మంత్రము(కథ)

                                                 మాటే మంత్రము(కథ)

సరొజ చెంప చెల్లు మన్నది...!

మంచి నీళ్ళు తీసుకురావటానికని బిందె తీసుకుని సరొజ బయలుదేరుతున్నప్పుడు ఆమె చెంప మీద కొట్టాడు చలపతి.

ఎదురు చూడని ఆ చెంప దెబ్బ వలన సరొజ బుగ్గలు, చెవులు కందిపోయినై. కళ్ళల్లో నుండి బొటబొటా కన్నీరు దొర్లింది.

"నీకు నేను ఎన్ని సార్లు చెప్పాను! మంచి నీళ్ళు తీసుకురావటానికి నువ్వు వెళ్ళద్దు అని. నేను వెల్తాను అంటే వినవేమిటి?”

చెంపను రుద్దు కుంటూ చిరాకు పడింది సరొజ.

"నువ్వు కాలుజారి క్రింద పడితే....కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా అయితే...?"

అతను సరొజ దగ్గరున్న బిందెను లాక్కుని నడిచాడు.

అప్పుడు సరొజ ఎనిమిది నెలల గర్భిణి.

'ఈయనకు నేనంటే ముఖ్యం కాదు. ఏప్పుడు చూడు బిడ్డ...బిడ్డ... బిడ్డ...! గర్భం దాల్చిన దగ్గర నుండి ఒకటే దబాయింపు ఆదేశాలు. ఇది చెయ్యకు, అది చెయ్యకు, అలా నడవకు, ఇలా నడవకు, ఇలా పడుకోకు, అలా పడుకోకు ! అని ఆదేశాలు. అన్నిటికీ కారణం కడుపులో ఉన్న ఈ బిడ్డే'

తన కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద తనకే ఎరుగని విరక్తి కలిగింది సరొజకు.

చలపతికి పిల్లలంటే ప్రాణం. చుట్టు పక్కలున్న పిల్లలను ఇంటికి రప్పించుకుని వాళ్లతో ఆటలూ, పాటలూ, కబుర్లతోపాటూ లాలింపులు. చాక్లెట్లు, బిస్కెట్లు అని తినడానికి చాలా ఇస్తాడు.

"పిల్లల మీద ఎంత ప్రాణంగానైనా ఉండనీ! అందుకని ఎప్పుడు చూడు బిడ్డా...బిడ్డా అని నామ స్మరణం చేస్తూ ఉండాలా. నాకు మాత్రం కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రేమలేదా? ‘పనులు చేస్తూ ఉంటే సుఖ ప్రశవం అవుతుందని’ డాక్టరమ్మ చెప్పిందే. అది కూడా ఆయనకు గుర్తు లేదా?"

గర్భం దాల్చటానికి ముందు వరకు తన మీద చాలా ప్రేమగా ఉండేవారు ఆయన. ప్రతి పనికి సరొజ, సరొజ అంటూ నా చుట్టూ తిరిగేవారు.. కానీ ఇప్పుడు బిడ్డ స్మరణం తప్ప ఇంకో ధ్యాసే లేదు. అన్ని విషయాలలలొనూ మారిపోయారు! సరొజకు ఈర్ష్యగా కూడా ఉంది.

“బిడ్డ కడుపులో పెరుగుతున్నప్పుడే ఇలా అంటే....బిడ్డ పుట్టిన తరువాత మనల్ని వద్దని దూరంగా ఉంచుతారేమో?"

సరొజకు భయం పట్టుకుంది.

ఆసుపత్రి!

సరొజ, ప్రశవ నొప్పులతో గిలగిలా కొట్టుకుంటోంది. ఆమె వేస్తున్న కేకలు, అరుపులు బయట నిలబడ్డ చలపతిని టెన్షన్ పెట్టింది...!

“దేవుడా! బిడ్డకు ఏ ఆపద లేకుండా ప్రశవం జరగాలి".....మనసులోనే దేవుడ్ని ప్రార్ధించుకున్నాడు.

అప్పుడు డాక్టర్ బయటకు వచ్చి చలపతిని పిలిచేడు.

“మిస్టర్ చలపతి! ఒక్క నిమిషం ఇలా వస్తారా"

"ఏమిటి డాక్టర్?"

"ప్రశవం చిక్కుముడిలాగా అయిపోయింది. మీ భార్య ప్రశవ నొప్పులతో గిలగిలా కొట్టుకుంటోంది. పెద్ద ఆపరేషన్ చేసే బిడ్డను తీయాలి. అయితే ఒకటి! మీ భార్య లేక బిడ్డ…. ఇద్దరిలో ఎవరో ఒకరినే కాపాడగలం అనే పరిస్థితిలో మేమున్నాము"

చలపతి షాక్ కు గురి అయ్యాడు.

"డాక్టర్!"

“మీ భార్య ఈ పరిస్థితికి బాధ పడుతున్నాం. ఎవర్ని మేము కాపాడాలో మీరు త్వరగా ఒక నిర్ణయానికి వచ్చి ఇందులో ఒక సంతకం పెట్టండి”

చలపతి అదిరిపడ్డాడు.

ఒక్క నిమిషం కూడా ఆలశ్యం చేయకుండా “బిడ్డ పోయినా పరవలేదు డాక్టర్. నా భార్యను కాపాడండి. నాకు తానే ముఖ్యం" అన్నాడు.

అంత వేదనలోనూ భర్త చెప్పిన ఆ మాటలు విని సరొజ సంతోష పడింది.

ఆ సంతోషంలో గబుక్కున ప్రశవం జరిగి, ఆశ్చర్యంగా బిడ్డ బయటకు వచ్చింది......తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమంగా బయట పడ్డారు.

డాక్టర్లతో సహా అందరూ ఆశ్చర్యపోయారు.

అవును అదే నిజం... చలపతి “నా భార్యను కాపాడండి, ఆమే నాకు ముఖ్యం” అనే మాటే మంత్రంలాగా పనిచేసింది.

***********************************సమాప్తం**************************************

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి