4, ఆగస్టు 2019, ఆదివారం

చీటింగ్ పోలీస్(నవల)…..PART-13

                                    చీటింగ్ పోలీస్(నవల)…..PART-13

చాలాసేపు అరిచిన తరువాత కళ్ళు తెరిచింది సుధా...ఆమెకోసం ఆశ్చర్యం కాచుకోనుంది.

బుల్లెట్ తగిలింది...ఆ సంస్థ నాయకుడి కాలుకి. అతను ఇప్పుడు కాళ్ళు జాపుకుని నేలకు చతికిలపడి ఉన్నాడు. తుపాకి అతనికి గురి పెట్టి ఉన్నది.

ప్రమోద్ తన దగ్గరున్న చిన్న కత్తిని ఎగరేస్తే...ప్రతాప్ తన కట్ల ను తెంపుకుని బయటపడ్డాడు.

"ఏం చేస్తున్నావ్...?".....నాయకుడు ఆందోళనగా అడిగాడు.

"చూస్తే తెలియటం లేదా? నిన్ను కాల్చటానికి తుపాకీ గురిపెట్టాను...కనిపించటంలేదా?"

"ఇది నమ్మకద్రోహం"

"ద్రోహం గురించి ఎవరెవరు మాట్లాడాలి అనే వ్యవస్తే లేకుండా పొయింది"- ప్రతాప్ కలగుచేసుకుంటూ చెప్పాడు.

"ఏమిటి ఆశ్చర్యంగా ఉందా...డబ్బు చూపించి నువ్వు ప్రమోద్ ని కొని, నీ మాటకు వాడిని ఆడించావు! కానీ మేము ఏంచేశేమో తెలుసా? పది నిమిషాలే తీసుకున్నాము. అంజలిని మాట్లాడమన్నాము. నీ డబ్బుకంటే, ఆమె ప్రేమకు బలం ఎక్కువ. అదే వాడిని మాపక్కకు మార్చింది.

ఆ బాంబును ఎలా డీ ఆక్టివేట్ చేయాలో చెప్పేశాడు. చివరి క్షణంలో ఆ బాంబును డిస్ పోస్ చేయటం కంటే...మీ గుంపును వేర్లుతో సహా పీకిపారేయటం ముఖ్యం అనే నిర్ణయానికి వచ్చాము. బాంబు పేలిన చోటులో ఉన్న వెలకట్టలేని మిషన్లను పక్కనున్న ఇంకో చోటుకు తరలించాము. మీ వాళ్ళ ముందు బాంబును పేలేటట్టు చేశాడు. భవనం మాత్రం పేలుడు వలన మసైపోయింది.

మీరూ ప్రమోద్ ని పూర్తిగా నమ్మారు. మా తరువాతి ప్లాను, నామీద కోపం వచ్చినట్టు నటించి....నన్నూ, సుధా ను ఇక్కడికి లాకొచ్చాడు. ఇప్పుడు మీరు...మా తుపాకి గురిలో నిలబడున్నారు..."

"వాళ్ళను కాల్చిపారేయండి"-నాయకుడు అరిచాడు.

అందరూ అటూ ఇటూ చూశారు.

"ఏమిటి వెతుకుతున్నారు...మీ తుపాకీలనా? అరే...బుద్ది తక్కువ వెధవల్లారా! డాన్స్ చేస్తున్నప్పుడు మీ ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి మీకు డాష్ ఇచ్చిందే...అప్పుడే ఒక్కొక్కరి తుపాకీని వేరు వేరు చోట్లలో తొసేశింది. ఇప్పుడందరూ నిరాయుధ ప్రాణులు. మీలాగా ఎక్కువసేపు మాట్లాడి...మీరు తప్పించుకోవటానికి చాన్సే ఇవ్వను. నాకు నాయకుడు మాత్రం చాలు. మిగిలిన కిరాయి గూండాలు అవసరంలేదు"

ఏకే-47 రైఫిల్ తీసుకుని అక్కడున్న టెర్రరిస్ట్ గూండా లందరినీ కాల్చి పారేశాడు. ఆ చోటంతా నెత్తుటి ప్రవాహ మయ్యింది.

"సారీ సుధా. నిన్ను ఈ ప్లాన్ లోకి తీసుకువచ్చే ఐడియా మాకు లేదు. వాడే ఇరకాటంలో పెట్టాడు. ఈ ప్లానును...డి.జి.పి., నేను, కమీషనర్ తరువాత ప్రమోద్. మేము నలుగురం కలిసి వేసిన ప్లాన్"

"నాకు కనీసం చిన్న సిగ్నల్ అయినా ఇవ్వాల్సింది?"

"ఎన్ని సార్లో నీకు సైగలు చేశాను. నీ మట్టి బుర్రకు అర్ధమయితే కదా?"

"యూ...యూ......"

"ఏయ్...మన ప్రాబ్లం గురించి తరువాత మాట్లాడుకుందాం. నాకు కొంచం పనుంది. ఈ పాటికి పోలీసులు ఈ చోటుకు వచ్చుంటారు. బహుశ సరైన చోటు ఎక్కడుందో తెలుసుకోవటంలో కష్టపడుతూ ఉంటారు. నువ్వెళ్ళి వాళ్ళకు వయర్ లెస్ సిగ్నల్ ఇచ్చిరా"

"సరే" అని చెప్పి వెళ్ళిపోయింది సుధా.

"ఏమిటి నాయకుడా ఆలొచిస్తున్నావు?...ఇప్పుడు నువ్వొక్కడివే మిగిలావు. నీదగ్గర చాలా ప్రశ్నలు అడగాలి. మేము అడిగే ప్రశ్నలకు చక్కగా జవాబులు చెబితే నీకు మంచిది.--- నాయకుడి తలకు ప్రతాప్ తుపాకి గురిపెట్టగా, ప్రమోద్ అతని మాటలను సెల్ ఫోన్ లో రికార్డు చేయటం మొదలుపెట్టాడు.

****************************************

సుధా ఆ కారు చీకట్లో, దట్టమైన ఆడవిలో జీపును ఏదో ఒక నమ్మకంతో నడుపుతోంది. వచ్చిన దారి గుర్తు పెట్టుకోవాలని అక్కడక్కడ కొన్ని కొండగుర్తులను బుర్రకు ఎక్కించుకుంటూ వెళ్ళింది.

పదిహేను నిమిషాల ప్రయాణం తరువాత పోలీస్ విజిల్ వినబడింది. ఆ వైపుకు జీపును వేగంగా నడిపింది. ఆమెను చూసిన తరువాత పోలీసు బలగాలలోని అధికారులకు ఆందోళన తగ్గింది.

జీపులో వచ్చినా, ఒలింపిక్ పోటీలలలో పరిగెత్తినట్టు ఆయసపడుతోంది సుధా.

పోలీసు బలగాల అధికారి కమీషనర్ రత్న కుమార్ కు అన్నీ వివరించింది.

అదే జీపులో కమీషనర్ ఎక్కి కూర్చున్నాడు.

వెళ్ళవలసిన దారిని గుర్తుపెట్టుకోవటం వలన సుధా ఆ పోలీసు బలగాన్ని గుడారం దగ్గరకు తీసుకువెళ్ళింది.

పోలీసు బలగాలు అక్కడకి చేరుకున్నప్పుడు అక్కడున్న గుడారాలన్నీ మంటల్లో తగలబడుతున్నాయి.

డిటెక్టివ్ ప్రతాప్ ముందు ముఠా నాయకుడు శవమై పడున్నాడు.

"మిస్టర్ ప్రతాప్. ఏమైంది...?"

"వాడి దగ్గర వాగ్మూలం తీసుకుంటున్నాము. అప్పుడు అతని గుడారంలోని వయర్ లెస్ ఫోన్ లో చిన్న శబ్ధంతో సిగ్నల్ వెలిగింది. ముఖ్యమైన విషయం దొరకవచ్చు అనుకుని ప్రమోద్ లోపలకు వెళ్ళాడు. ఆ సమయంలో నాయకుడు తన పక్కన పడున్న గ్రేనేడ్ ను తీసి విసిరాడు.

ప్రమోద్ ఆ గ్రేనేడ్ పేలుడులో మరణించాడు. అంతే కాదు...అది బాంబుల గిడ్డంగి కావటంతో ఆ గుడారాలన్నీ మంటల్లో మసైపోయినై. కోపంతో నాయకుడిని కాల్చిపారాశాను. అందులో అతను కూడా మరణించాడు"

"ఏదైనా సమాచారం దొరికిందా....?"

"ఇదిగోండి...సాధ్యమైనంతవరకు తీసుకున్నాం. ఈ ఘటనలు జరిగి ఉండకపోతే మొత్త సమాచారాన్ని లాగుంటాము"- క్యాసెట్టును డి.జి.పి కి అందజేశాడు.

"ప్రమోద్ మరణం కొంచం బాధపెడుతున్నా, ఈ టెర్రరిస్ట్ సంస్థ నాశనం అయినందుకు తృప్తిగా ఉంది. వెల్ డన్ మిస్టర్ ప్రతాప్. మిమ్మల్ని అభినందించడానికి వాక్యాలే లేవు. సుధా...మొదట నీకు ధన్యవాదాలు చెప్పాలి"- డి.జి.పి తన అభినందనను తెలిపాడు.

కొద్ది రోజులలో లోనే, ప్రతాప్ యుక్క డిటెక్టివ్ ఏజన్సీ కి భారదేశంలో గొప్ప పేరు లభించింది.

'భారతం మా బానిస’ అనే టెర్రరిస్ట్ సంస్థకు సహాయం చేసిన గ్రాడ్యువేట్ లను కాపాడటానికి ఎంతో ప్రయత్నం జరిగింది. కానీ భారత ప్రభుత్వం కఠినంగా ఉండటంతో వాళ్ళందరికీ చట్టం విధించిన శిక్షలను అమలుచేశారు. దీనికొసం రెండు కోట్ల రూపాయలు బహుమతిగా పొందిన డిటెక్టివ్ ప్రతాప్ ఆ డబ్బును ఆ గ్రాడ్యువేట్ల కుటుంబాలకు అందించాడు.

సుధాకు కు ప్రతాప్ పైన ఇప్పుడు ప్రేమ, గౌరవం రెట్టింపు అయ్యింది.

ప్రమోద్ ప్రేమికురాలు అంజలి ఒంటరి అయిపోయింది...డిటెక్టివ్ ప్రతాప్ ఆమెను తీసుకు వచ్చి కొన్నిరోజులు తన ఇంట్లో ఆశ్రయమిచ్చాడు.

భర్తమీద నమ్మకం ఎంతున్నా, సుధా యొక్క గుణం ఆమెను అనుమాన పడేట్టట్టు చేసింది.

ఒకరోజు ప్రతాప్ ఇంట్లో లేనప్పుడు, చాలాసేపు మ్రోగుతున్న సెల్ ఫోన్ ను తీసి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది సుధాకు.

"హలో... నేను రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాట్లాడుతున్నాను. ప్రతాప్ గారు ఉన్నారా?"

"లేరు. నేను ఆయన భార్యను. విషయమేమిటో చెప్పండి"

"జమీందార్ భవనాన్ని కొనే విషయంగా సారు మాట్లాడారు. ఆయన చెప్పిన డెబ్బై కోట్లకు పార్టీ ఓకే చెప్పారు. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందామని అడగమన్నారు”

"సరే...నేను ఆయనతో చెప్తాను"- ఫోన్ పెట్టేసింది.

"డెబ్బై కోట్లా...ఇంత డబ్బు ఆయనకెక్కడిది?" -ఆమె బుర్ర కన్ ఫ్యూజన్ కు లోనయ్యింది.

ప్రతాప్ యొక్క ఆన్ లైన్ బ్యాంకింగ్ పాస్ వర్డ్ తెలిసుండటంతో కంప్యూటర్ నొక్కింది.

కొద్ది క్షణాలలో కంప్యూటర్ ఆన్ అయ్యి బ్యాంకు ఖాతాతో కనెక్ట్ అయ్యింది...ప్రతాప్ బ్యాంక్ అకౌంటులో ఆ రోజు బ్యాలన్స్ ఎంతో చూపింది. అది చూసిన సుధాకు ఒక్క నిమిషం గుండె ఆగిపోయింది.

మొత్తం తొంబై కోట్ల రూపాయలు ఉన్నాయి.

Continued & Last:PART-14

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి