తొలివలపు….(సీరియల్)
(PART-1)
సూర్యుడనే ప్రేమికుడు తన వెలుతురనే చేతులతో భూమి అనే ప్రేమికురాలుని ముట్టుకున్న సమయం.... మేలుకున్నది మానవ జాతి. బద్దకాన్ని వదలి, తమ లక్ష్య సాధన కోసం యంత్రంగా పనిచేయడం ప్రారంభించింది.
సరే రండి...మనమూ వాళ్ళతో ప్రయాణం చేద్దాం!
మనం ఇప్పుడు నిలబడున్నది హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని ఒక ముఖ్యమైన వీధిలో!
మీ 'కెమేరా' కళ్ళను రెడీగా ఉంచుకుని నన్ను అనుసరించి రండి.
చూశారా...! పెద్ద పెద్ద గాజు పెట్టెలను ఒకదాని మీద ఒకటి పేర్చిపెట్టినట్టున్న భవనాలు, ఆకాశాన్ని తాకేటట్లున్న వాటి గంభీరమైన ఎత్తు. ఉన్న వెలుతురు చాలదని రాత్రి నక్షత్రాలను చేబదులు తీసుకుని వెదజల్లిన కాంతివంతమైన షాపులు. ప్రొద్దుటి పూట కూడా తమ 'పవర్ను’ చూపిస్తున్నారట. హూ...
హైదరాబాద్ లో ప్రతి రోజూ పండుగ వాతావరణమే. నగరంలో ఎటు చూసినా ఉచితంగా కనబడే జిగేలు మనిపించే వేలకొలది అందాలు. రాత్రి అయితే ఇంద్రలోకంలో ఉండేటట్లే అనిపిస్తుంది.
అరెరే! అలా నోరు వెళ్ళబెట్టుకుని ఆగిపోయారేం? ఆగకుండా నాతో రండి. జనం'పల్లెటూరి గబ్బిలాయి’ గాళ్ళు అనే పేరు పెట్టి మిమ్మలని పక్కకు తోసేలోపు నడవటం మొదలుపెట్టండి.
ఇదిగో...మనం వెతుక్కుంటూ వచ్చిన ప్రదేశం వచ్చేసింది.
ఆకాశాన్ని అంటుకునే ఎత్తులో ఉన్న భవనాలకు మధ్య, ఎదుగుతున్న పిల్లలాగా నిలబడున్న చిన్న భవనం. భవన ముఖ ద్వారంలో 'నన్ను గమనించిన తరువాతే లోపలకు వెళ్ళాలి’ అని చిన్న గర్వంతో గంభీరంగా ఉంచబడ్డ ఆ భవనం యొక్క నేమ్ బోర్డ్.
‘గాయత్రి నర్సింగ్ హోమ్’
చెమటతో కుంకుమ బోట్టు చెరిగిపోవచ్చు. కుంభవృష్టి వర్షం కురిసినా మేము చెరిగిపోమని నేమ్ బోర్డ్ లోని ఒక్కొక్క అక్షరమూ రక్తం లాంటి ఎర్ర రంగులో వాగ్దానం చేస్తున్నట్లున్నాయి. వాచ్ మ్యాన్ ఎప్పుడూ చేసే సెల్యూట్ ను అంగీకరించి ఒకటి రెండు నిమిషాలు లోపలకు నడిస్తే ఆ భవనాన్ని చేరుకోగలం. కాంపౌండ్ గేటుకూ, భవనానికి ఉన్న మధ్య దూరంలో నిలబడున్నది ఒక మహిళ శిల. ఆ శిల జోడించిన చేతులలో నుండి వెలువడుతున్న నీరు ప్రవహించటానికి ఒక కారు వెళ్ళ గలిగేంత దారి వదలబడ్డది. మిగిలిన ప్రదేశమంతా పచ్చటి తివాచి పరిచినట్టు గడ్డి పెరిగున్నది.
'రంగులలో ఎన్ని రంగులున్నాయో తెలియనివారైతే! మమ్మల్ని చూడటానికి రండి!' అని పువ్వులు తమ భాషలో ఆహ్వానం అందిస్తున్నాయి...చల్లటి గాలి ఆ పువ్వుల ఆహ్వాన్నాన్ని ఆమొదించినట్లు క్రిందకు వచ్చి ఆ పువ్వులను పలకరించి వెడుతోంది. మొత్తానికి ఆ భవనం ప్రకృతి మరియు కృత్రిమమైన వాతావరణంతో చుట్టుముట్టి ఉన్నది. 'ఇది నర్సింగ్ హోమా? లేక నర్సరీ గార్డనా?'...మనలాగ బయట నుండి వచ్చేవాళ్ళు ఒక్క నిమిషం నిలబడి ఈ రెండురకాల వాతావరణాన్ని ఆస్వాదిస్తే వాళ్లకు ఇలాంటి ప్రశ్నే తలెత్తుతుంది.
'సరే...ఒక్క నిమిషం. హు...హూ...'
ఏమిటి చూస్తున్నారు? ఎడతెరిపిలేకుండా మాట్లాడుతున్నాను కదా, గొంతుకలో కిచ,కిచ.
సరే...లోపలకు వెళ్దామా...?
ఇది 'రిసెప్షన్'. ఇక్కడ వయసు ఊయల ఊగుతోంది. అక్కడున్న ఆ అమ్మాయలందరికీ సుమారు ఇరవై ఏళ్ళు ఉంటాయా? పమిటచెంగు జారిపోతున్నా కూడా గ్రహించకుండా దేనికోసమో వెతుకుతున్నారు. ఎంత నిజాయతీ?
అరే భగవంతుడా! దయచేసి మీ చూపులను కొంచంగా మార్చుకుని నా వెంబడి రండి.
ఇదిగో...ఇలాగే నడిచి వెడితే, 'జాగ్రత్తగా రండి...ఎదురుగా తెల్ల దుస్తులు వేసుకుని వస్తున్న ఆమె ఈ నర్సింగ్ హొమ్ నర్స్. మనసులో సినిమా హీరో అనుకుంటూ చిన్నగా రాసుకు,పూసుకుని వెల్దామనుకుంటున్నారేమో. తిరిగి వెళ్ళేటప్పుడు మీ వీపు విమానం మోత మోగుతుంది...జాగ్రత్త.
ఇంకో విషయం చెబుతాను...వినండి. ఇక్కడ చీఫ్ డాక్టర్ గాయత్రి మొదలు పనిమనిషి ఎల్లమ్మ వరకు అంతా ఆడవాళ్ళ రాజ్యమే. ఒక్క వాచ్ మ్యాన్ తప్ప. మగవాళ్ళకు ఎక్కువగా అనుమతి లేని అన్య ప్రదేశం ఇది. ఇవన్నీ చీఫ్ డాక్టర్ గాయత్రీ యొక్క ఏర్పాట్లే. గర్భిణీ స్త్రీల యొక్క భర్తలైతే తప్ప మిగిలిన మగవాళ్ళకు అనుమతిలేదు. చీఫ్ డాక్టర్ గాయత్రీ గురించి ఇప్పుడు మీకు కొంచం అర్ధమై వుంటుంది అనుకుంటున్నాను.
ఇలాగే రెండు వైపులా నెంబర్లు వేసున్న రూములను దాటుకుంటూ వెళ్ళి కుడివైపుకు తిరిగి మరో ఇరవై అడుగులు నడిస్తే...అదిగో, డాక్టర్ గాయత్రి బాపిరాజు, గైనకాలజిస్ట్(స్త్రీ మరియూ శిశు సంరక్షణ నిపుణులు). 'బాధ్యత, కర్తవ్యము... ఇవి రెండూ, రెండు కళ్ళు లాంటివి’ అనేది మనకు జ్ఞాపకం చేసే విధంగా గాయత్రి యొక్క ప్రొద్దుటి పూట ఆమెలో ఉండే చురుకుదనం ఆమె పెట్టుకున్న కళ్ళద్దాలలో నుండి కూడా కనబడుతుంది.
అంతస్తు, పెద్ద గుర్తింపు వచ్చిందనే గర్వం కొంచం కూడా అమెలో కనబడదు. వైద్యసేవలకు తనని పూర్తిగా అర్పించుకున్న మరొక మదర్ తెరేసా అని ఆమెను చెప్పొచ్చు. జరిగి ముగిసిన కాలంలో ఆమె పడ్డ కష్టాలను, ఇప్పుడు జరుగుతున్న కాలంలో ఆమె అనుభవిస్తున్న సంతోషాలతో పూడ్చి పెట్టింది డాక్టర్ గాయత్రి.
సరే...సరే...చాలు. మన కథలోని హీరోయిన్ ని మీకు పరిచేయం చేశేశాను. ఇక మీరుగా ఆమె కథను తెలుసుకోండి. నేను సెలవు తీసుకుంటాను.
ఇంకా ఉంది.......Continued in:PART-2
N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)
(PART-1)
N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి