26, ఆగస్టు 2019, సోమవారం

మరణం తరువాత జీవితం.... (ఆసక్తి)

                                             మరణం తరువాత జీవితం

ఇంగ్లాండ్ దేశంలోని సౌత్ ఆంప్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జరిపిన అతిపెద్ద శాస్త్రీయ అధ్యయనంలో మరణం తరువాత జీవితం గురించిన మొదటి సూచన దొరికిందని చెబుతున్నారు. వైద్య మరణం తరువాత మరణించిన వ్యక్తి కొద్ది నిమిషాల వరకు ప్రస్తుత జీవిత అవగాహనతో ఉంటాడు అనడానికి మొదటి సాక్ష్యం దొరికిందని వారు తెలియజేశారు. గతంలో ఇది అసాధ్యం అని భావించారు.


మరణం అనేది అనివార్య పరిణామం. కానీ శాస్త్రవేత్తలు మరణం తరువాత జీవితం ఉన్నదని చెప్పటానికి కావల్సిన సూచన దొరికిందని చెబుతున్నారు. అందువలన మరణం గురించిన బాధ అవసరం లేదని, ఎందుకంటే మరణం తరువాత ఇంకో జీవితానికి వెడతారనేది అర్ధం చేసుకోవలని తెలుపుతున్నారు.

ఒక వ్యక్తిలో మరణించిన తరువాత శరీరం వెలుపల ఏర్పడే అనుభవాల గురించి ఎప్పుడూ జరగనటువంటి అతిపెద్ద వైద్య అధ్యయనంలో మరణించిన వ్యక్తి కొద్ది నిమిషాల వరకు ప్రస్తుత జీవిత అవగాహనతో, ప్రస్తుత లోకంలో ఉంటాడు అనే విషయాన్ని కనుగొన్నారు. ఈ మధ్య వరకు ఇది విస్తృత వివాదస్పద విషయంగా ఉండటంతో దీనిని (మరణం తరువాత జీవితం) విశ్వాసము లేని విషయంగానే పరిగణించారు.


   కానీ సౌత్ ఆంప్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొద్ది సంవత్సరాల క్రితం హార్ట్ అటాక్ తో బాధపడుతున్న 2000 మంది రోగులను అమెరికా, ఇంగ్లాండ్ మరియూ ఆస్ట్రియా దేశాల 15 ఆసుపత్రులలో అధ్యయనం చేశారు. ఇందులో 40 శాతం మంది వైద్య పరంగా చనిపోయి డాక్టర్ల చేత గుండే ఒత్తిడి వైద్యముతో(కార్డియో పల్మనరీ రిసిపిటేషన్) బ్రతికి బట్ట కట్టారు. అందులో ఒక రోగి తాను తన శరీరం నుండి పూర్తిగా వెళ్ళిపోయి ఆసుపత్రి రూము చివరలో నిలబడి తన గుండెను డాక్టర్లు కార్డియో పల్మనరీ రిసిపిటేషన్ చేస్తున్న దానిని చూసినట్లు గుర్తు చేసుకున్నాడు.

                                                       డాక్టర్ స్యామ్ పార్నియా

57 సంవత్సరాల సామాజిక కార్యకర్త అయిన ఇతను డాక్టర్లు/నర్సులు తనపై చేసిన చర్యలను వివరంగా వివరించాడు. వారు వాడిన యంత్రాల యొక్క ద్వనిని కూడా వివరించాడు.

"హృదయము కొట్టుకోవడం మానేసిన తరువాత మెదడు పనిచేయదని మాకు తెలుసు" సౌత్ ఆంప్టన్ మాజీ పరిశోధన శాస్త్రవేత్త, న్యూయార్క్ స్టేట్ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగానూ, ఈ అతిపెద్ద శాస్త్రీయ అధ్యయన జట్టు యొక్క నాయకుడైన డాక్టర్ స్యాం పార్నియా అన్నారు.(డాక్టర్ స్యాం పార్నియా చనిపోయిన వారిని కార్డియో పల్మనరీ రిసిపిటేషన్ తో కొద్దిసేపట్లో బ్రతిగించగలరు అనే పేరు తెచ్చుకున్న డాక్టర్). ఈయన, పునరుజ్జీవన పరికరాల ఉపయోగ పరిశోధనలో అత్యంత పురోగతి సాధించిన శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. ఈయన సాధించిన పరికరాల ఉపయోగ పరిశోధన మూలంగా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో హార్ట్ అటాక్ రోగులు మరణం నుంచి తప్పించుకున్నారు.


"కానీ ఈ ప్రత్యేక ఉదాహరణలో, గుండె ఆగిపోయిన మూడు నిమిషాల వరకు స్పృహతో కూడిన అవగాహన కొనసాగిందని తెలుస్తోంది. ఎందుకంటే మామూలుగా గుండె ఆగిపోయిన 20-30 క్షణాలలో మెదడు పనిచేయడం మానేస్తుంది"

"ఈ రోగి రూములో తన మీద జరిగిన ప్రయత్నాలన్నింటినీ పూర్తిగా వివరించాడు. అందులోనూ ముఖ్యంగా ఒక యంత్రంలో నుండి 3 నిమిషాలకు ఒకసారి మాత్రమే వచ్చే 'బీప్' శబ్ధాన్ని అతను వివరించాడు"


"అతను చెప్పేది చాలా నమ్మదగినదిగానే ఉన్నది. అతను చెప్పినవన్నీ అతని మీద ఉపయోగించబడ్డాయి"

ఇతని వివరణను పక్కన పెడితే 40 శాతంలో మిగిలిన వారు మరణ సమయంలో ఏదో ఒక అవగాహన అనుభవించినట్లు తెలిపారు. చాలా అనుభవాలను స్పష్టంగా తెలియజేయకపోయినా వారి వివరణలో నేపధ్యాలు ఉద్భవించాయి. అసాధారణ ప్రశాంతతను కొందరు చెప్పగా, మరికొందరు సమయం అయిపోవడం లేక పెరగడం జరిగిందని తెలిపారు. కొందరు ప్రకాసవంతమైన కాంతిని చూశామని, కొందరు బంగారు మెరుపును చూశామని, మరికొందరు సూర్యుని వెలుతురు చూశామని తెలిపారు. కొంతమంది భయం వేసిందని, నీటిలో మునిగిపోతున్న అనుభవం కలిగిందని, నీటిలో నుండి ఎవరో పైకి లాగుతున్న అనుభూతి కలిగిందని తెలిపారు.


13 శాతం మంది తమ శరీరం నుండి విడిపోతున్నట్లు, కొంతమంది పైకి వెడుతున్నట్లు అనిపించిందని తెలిపారు.

"మిగిలిన వారు కూడా ఏదో ఒక అవగాహన కలిగి ఉంటారు. కాకపోతే వైద్యం కోసం డాక్టర్లు ఇచ్చిన మత్తు మందు మరియు ఇతర మందుల వలన కొన్ని అనుభూతులను వారు మరిచిపోయి ఉంటారు" అని డాక్టర్ పర్నియా నమ్ముతున్నారు.

లక్షలాది మంది మరణంకు సంబంధించిన స్పష్టమైన అనుభవాలు అనుభవించి ఉంటారని అంచనాలు సూచిస్తున్నా శాస్త్రీయ అధారం సందిగ్ధంలో ఉంటోంది. ఈ అనుభవాలను న్యాయపరచటానికి మరికొన్ని పరిశోధనలు అవసరం. నాటింగ్ హాం ట్రెంట్ విశ్వవిద్యాలయ మనస్తత్వ వేత్త డాక్టర్ డేవిడ్ విల్డే ప్రస్తుతం శరీరం వెలుపల జరిగినట్లు చెప్పినటువంటి పరిమాణాలను అనుసంధానం చేస్తూ మరణం తరువాత జీవితం గురించిన అనుభవాలలో ఒక దానితో మరొకదానిని పోల్చే నమూనా తయారుచేస్తున్నారు. ఈ వివాదాస్పదమైన విషయం గురించి మరికొన్ని పరిశోధనలు జరపటానికి ఇది ప్రొత్సహిస్తుందని ఆయన చెబుతున్నారు.

*************************************END****************************************

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి