8, ఆగస్టు 2019, గురువారం

'రింగింగ్' రాళ్ళు!.......(ఆసక్తి)

                                                  

                                                         'రింగింగ్' రాళ్ళు                                                

సంగీతం విశ్వమంతా వ్యాపించి వున్నది. ప్రకృతిలో సంగీతం మిళితమై జీవన గమనంలో భాగమైపోయింది. మానవ వ్యవస్థను శబ్ధంతో ప్రభావితం చేయడం ప్రకృతి లక్షణం. సంగీతం, శబ్ధం ఆధారంగా ఉంటుంది. సంగీతం, భావోద్వేగాల ఆధారంగా ఉంటుంది. శభ్దం దైవంతో సమానం. ఎందుకంటే, ఉనికికి ఆధారం ప్రకంపనలో ఉంది. అదే శబ్ధం. దీనిని ప్రతి మానవుడు అనుభవించగలడు.

సంగీతం వల్ల వ్యాధులు త్వరగా నయమవుతాయని, పశువులు పాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాయని, పంటలు ఎక్కువగా పండుతాయని ఆధునికి పరిశోధకుల భావన. సంగీత రసాన్ని శిశువులు, పశువులతో పాటూ పాములు కూడా విని ఆనందిస్తాయని మనందరికీ తెలుసు.

ప్రకృతి అందించిన అలాంటి సంగీతం(శబ్ధం) గురించే ఇక్కడ తెలుసుకోబోతున్నాము.

సంగీతం కేవలం వినోదానికే కాకుండా వికాసానికి కూడా ఒక అవకాశంగా ఎలా మలుచుకోవచ్చో బహుశ ఇలాంటి మిస్టరీ చోట్ల నుండే తెలుసుకున్నారేమో.

ఒక రాతి మీద కొడితే మనకు వినబడే శబ్ధం మందమైన 'దబ్' లేక ‘పగులు’ గానో ఉంటుంది గానీ కచ్చితంగా చెవికి ఇంపుగా ఉండే 'రింగింగ్' శబ్ధం మాత్రం రాదు. కానీ చెవులకు ఇంపుగా ఉండే శబ్ధం అందించే రాళ్ళు ఉన్నాయంటే మీకు ఏమనిపిస్తోంది?..... ఆశ్చర్యంగా ఉంది కదూ!


128 ఎకరాల బండరాళ్ళ స్థలం మధ్యలో 7-8 ఎకరాలలో సంగీత శబ్ధాన్నిచ్చే రాళ్ళు దాగి ఉన్నాయి.

అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని Rocking Rocks County Park లో దాగివున్న ఈ బండరాళ్ళను మరో రాతితోగానీ, సుత్తితోగానీ కొడితే గణగణమని లోహ ధ్వని వినబడుతుంది. శతాబ్ధాలుగా అక్కడ నివసించే స్థానికులకు ఈ రాళ్ళ గురించి తెలుసు. 1700 సంవత్సరంలో అక్కడ స్థిరపడేందుకు వచ్చిన తెల్ల జాతి మనుష్యులకు అక్కడి స్థానికులు ఈ రాళ్ళ గురించి చెప్పారు.


ఆ రాళ్ళలో నుండి వినిపించే ధ్వనిని వింటే ఆశ్చర్యపోతూ 'నిజంగా ఇవి రాళ్ళేనా?' అని ఎవరికైనా అనిపిస్తుంది. అవి నిజానికి బోలు/లోహ ధ్వనిని వినిపిస్తాయి. ఈ వింత, సైన్స్ శాస్త్రవేత్తలను, భూగర్భ శాస్త్రవేత్తలను తికమకపరచింది. ఆ రింగింగ్ రాళ్ళపై ఎన్నో పరిశోధనలు చేసారు. కానీ ఆ రాళ్ళ నుండి వస్తున్న ఇంపైన ధ్వనికి కచ్చితమైన కారణం తెలుసుకోలేకపోయారు.

1965లో పెన్సిల్వేనియాకు చెందిన భూగర్భ శాస్త్రవేత్త Richard Faas అక్కడున్న కొన్ని రాళ్ళను తన ప్రయోగశాలకు తీసుకువెళ్ళి పరిశోధనలు జరిపారు. ఒక్కొక్క రాయిని కొడుతున్నప్పుడు, ప్రతి ఒక్కొక్క రాయి తక్కువ ఫ్రీక్వెన్సీ (frequency) ధ్వనిని వినిపిస్తోంది. ఇది మానవ చెవులకు వినబడదు. నిజానికి ఆ రాళ్ళలో నుండి వినిపించే ఆ తక్కువ ఫ్రీక్వెన్సీ ధ్వని, ఆ రాళ్ళు తమకు తాము తెలుపుకుంటునే అభిప్రాయాలు. అన్ని రాళ్ళూ కలిపి తెలియపరుచుకునే అభిప్రాయాలే మనకి వినబడుతున్న ధ్వని అని ఆయన తన పరిశోధనలో తెలుసుకోగలిగాడట.


భూగర్భ శాస్త్రవేత్త Richard Faas రాళ్ళు వినిపిస్తున్న ధ్వనిని, స్వభావాన్ని గుర్తించ గలిగారు గానీ ఆ రాళ్ళ యొక్క ప్రత్యేకత ఏమిటో వివరించలేకపోయారు. మామూలుగా అన్ని రాళ్ళలాగానే, అక్కడున్న రాళ్ళు కూడా అగ్నిపర్వత పధార్ధమైన డయాబస్ తో తయారై ఉన్నాయి. అంటే, ఐరన్ మరియు మరికొన్ని కఠినమైన ఖనిజాలా మిశ్రమం. కానీ ఈ రాళ్ళలోని ఖనిజాల మిశ్రమ కూర్పే ఈ రాళ్ళను మామూలు రాళ్ళ కంటే వేరుగా చూపుతోందట. రాళ్ళలో నుండి వినిపించే ధ్వని వలన మాత్రమే ఈ రాళ్ళు ప్రత్యేకత సంపాదించుకోలేదు. దానికి మరొక కారణం ఉన్నది. ఈ రాళ్ళ పొలం, కొండ క్రింద ఏర్పడలేదు. కొండపైన ఏర్పడింది. కాబట్టి ఈ రాళ్ళ పొలం, కొండ చెరియలు విరిగినందు వలన ఏర్పడలేదు. మరైతే ఆ రాళ్ళు ఎలా వచ్చాయి?


ఈ రాళ్ళ పొలంలో చాలా విచిత్రమైన విషయం ఇంకొకటుంది. ఇక్కడ వృక్షాలో, మొక్కలో పెరిగిన సూచనలు ఏమీ లేవు. అంతెందుకు, ఇక్కడ క్రిమి కీటకాలు కూడా లేవు. 10 అడుగుల లోతుకు ఉండే ఈ చోటు చుట్టూ అడవి ప్రాంతం కన్నా ఈ ప్రాంతం ఎక్కువ వేడిగా ఉంటుంది. ఇక్కడ నివాసం ఉండటానికి వసతి లేదు. ఆహారం దొరకటానికి దారే లేదు. దిక్సూచికలు ఈ ప్రాంతంలో పనిచేయవని కొందరు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో రేడియేషన్ లేదు, అసాధారణ ఐస్కాంత శక్తి,, వింత విద్యుదయిస్కాంత శక్తి సూచనలు లేవు. కాబట్టి అతీంద్రియమైన శక్తులు ఉన్నాయనే వాదనకు తావు లేదు.



ఈ సంగీత రాళ్ళ విషయంలో మరొక మిస్టరీ ఏమిటంటే, అక్కడున్న సంగీత రాళ్ళలో ఒకదాన్ని తీసుకుని, దాన్ని మరొచోటికి తీసుకు వెళ్ళి దాని మీద కొడితే సంగీతం వినబడదు. ఈ రాళ్ళను ప్రశంసించడానికి మనకు వాటి వెనుక ఉన్న సైన్స్ గురించి తెలుసుకోవలసిన అవసరమేముంది. ఈ రింగింగ్ రాక్ పార్క్ ప్రపంచవ్యాప్తంగా వేలకొలది పర్యాటకులను ఆకర్షిస్తోంది. వాళ్ళందరికీ రాళ్ళను కొట్టే అవకాశం దొరకటం లేదు, కానీ, కొంతమంది ఈ రాళ్ళను సంగీతసాధన పరికరాల్లాగా ఉపయోగించుకుంటూ ఆడుకుంటున్నారు.

****************************************END**********************************

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి