15, జనవరి 2020, బుధవారం

ఆలయం(సీరియల్)...PART-5



                                              ఆలయం(సీరియల్)
                                                         (PART-5)


"పరవాలేదే...సరిగ్గా అర్ధం చేసుకున్నారే!"

"నువ్వు చెప్పేది వాస్తవమే మాలతీ. ఒక విధంగా ఇది అనవసరమైన పనే. అనవసరమైన బాధ కూడా....!. 'మనం మన పనిని కరెక్టుగా చేసుకుంటూ వెళదాం. తప్పు చేసిన వాళ్లను ఆ దేవుడే ఒకరోజు ధండిస్తాడు అనుకుంటూ మామూలుగా వెళ్ళటం నా వల్ల కాదు. ఒక రచయతగా - కళ్ల ఎదురుకుండా జరుగుతున్న అన్యాయాన్ని,అవినీతిని చూస్తుంటే నా రక్తం ఉడికిపోతోంది"

"తెలుసు...చివరగా 'నేను జస్ట్ ఒక స్టోర్ కీపర్ మాత్రమే కాదు...సమాజ సంరక్షణ కలిగిన రచయతను అనే కదా చెప్పబోతారు...అందులోనూ మీ యజమానిని దేవుడు కంటే ఎక్కువగా చూస్తున్నారు కాబట్టే ఇలాంటి విషయాలను మీరు మామూలుగా తీసుకోలేరని నాకు తెలుసు. సరే...మిమ్మల్ని ఒకటడుగుతా కోపగించుకోకూడదు..."

"ఏమిటది మాలతీ?"

"ఈ అవినీతిని ఎదిరించి పోరాడబోతారా?"

"ఎదిరించక...?"

"ఎలా ఎదిరిస్తారు?"

"దాని గురించే ఆలొచిస్తున్నాను. అది మాత్రమే కాదు మాలతీ. ఇలాంటి అవినీతిని జరగకుండా ఆపి ఒక మంచి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పరచాల్సిన 'పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్’ రే ఒక పెద్ద తాగుబోతుగా ఉన్నాడే. ఆయన మధ్యం తాగటం నా కళ్ళార చూశానే"

"మీరే ఒక కథలో...మధ్యం తాగటం ఒక బలహీనం. అదేమంత పెద్ద నేరం కాదు! అని రాసారు. మీకే తెలుసు...మామూలు 'హై స్కూలు’ పిల్లలు కూడా ఇప్పుడు సర్వ సాధారణంగా మధ్యం తాగుతున్నారు. మధ్యం తాగటాన్ని ఎందుకు ఒక పెద్ద విషయంగా మాట్లాడుతున్నారు?"

"ఏది చెప్పినా నా కథను చూపి సమాధానం చెబుతున్నావే మాలతీ. నేను చెప్పేది పూర్తిగా విని మట్లాడు. మురికి కాలువ నీళ్ళను పరిశుభ్రం చేసే వాళ్ళూ, శ్మశానంలో పీనుగులను తగలబెట్టే వాళ్ళూ, మార్చూరీలో శవాల మధ్య తిరిగే వాళ్ళు...వీళ్లంతా కష్టపడటానికి మధ్యమే ఒక సరైన విరుగుడు మందు అనుకుంటున్నారు. అది లేకపోతే మా కర్తవ్యం నెరవేర్చడం కష్టం అని వాళ్ళు అనుకోవడం కూడా నాకు తెలుసు. కానీ, ఒక భాద్యత గల అధికారి తాను భాద్యత తీసుకున్న మొదటి రోజే ---తన ఆఫీసులోనే మధ్యం తాగటం ఎంత పెద్ద తప్పో తెలుసా?"

-- వెంకట్ ప్రసాద్ "తెలుసా?" అని ఆవేశంగా అడిగి ముగించినప్పుడు గోడ గడియారం పదకొండు గంటలు కొట్టింది. అది కొట్టి ముగించనీ అని మౌనంగా కాచుకున్న మాలతీ ఆ తరువాత,

“మీరు అనవసరంగా బయటకు వెడుతున్న పామును అడ్డగించి ఇంట్లోకి పోనిస్తున్నారు..." అన్నది.

"నువ్వేం చెబుతున్నావు మాలతీ...?"

"మాట్లాడకుండా పడుకోండి! ఇలాంటి అనవసరమైన బాధలను మూటకట్టి కిటికీలో నుంచి పారేయండి. మన అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. వాడికి 'ఫీజు’ కట్టాలి. 'ఎల్.ఐ.సీ’డ్యూ, ‘టెలిఫోన్ బిల్లు’ చాలా అవసరాలు ఉన్నాయి. పత్రిక వాళ్ళు కథ పంపంచమని అడిగారు. వాళ్ళకు కథ రాసి ఇవ్వండి. నాలుగు డబ్బులైనా వస్తాయి. ఇవన్నీ వదిలేసి ఇలా మీరు బాధ పడుతుంటే...వ్యాధులే వస్తాయి" -- కాళ్ళ క్రింద ఉన్న తన దుప్పటి తీసుకుని కప్పుకుని...తాను చెప్ప దలుచుకున్నది చెప్పేసి పడుకుంది మాలతీ.

ప్రసాద్ కు వొళ్ళు మండింది.

పెళ్ళికాక ముందు 'నీకెందుకురా ఊళ్ళో వాళ్ల గొడవలన్నీ?' అని ప్రసాద్ వాళ్ళ అమ్మ అడిగేది. ఇప్పుడు ఆ చోట భార్య!

వ్యక్తులు మాత్రం మారారు.

కానీ రాగం మారనేలేదు.

అతనిలో కడుపు మంటతో పాటూ ఆవేశమూ చోటు చేసుకుంది.

మరుసటి రోజు!

'ఆఫీసు క్యాంటీన్లో' ప్రొద్దున టిఫిన్ తింటున్నప్పుడే ప్రసాద్ చెవులు కొరకటం మొదలుపెట్టాడు ట్రబుల్ కింగ్ రాజేష్ కుమార్.

"మావా...ఏమిట్రా డల్ గా ఉన్నావు?"

"........."

"నిన్ను నవ్విస్తాను చూస్తావా?"

".........”

"రేయ్...ఇది క్రికెట్ 'సీసన్’. ఒక 'ఎస్.ఎం.ఎస్’ వచ్చింది…… చెప్పనా?"

"..........."

"రేయ్...నోరు తెరవకపోయినా ఒక 'ఊ' అనొచ్చు కదా?"

"సారీ రాజేష్ కుమార్. నేను నీ దగ్గర నుండి ఎటువంటి మాట వినే మనో స్థితిలో లేను. 'ప్లీజ్' నన్ను విడిచిపెట్టు"

"అదెలా...నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తాను. నువ్వు వింటే విను,లేకపోతే మానేయి. అది నీ ఇష్టం. మన 'క్యాంటీన్’ కొసం కొన్న 'టీ' పొడి పర్చేస్ లో మాత్రం క్యాంటీన్ మేనేజర్ డేవిడ్ యాభై వెల రూపాయలు నొక్కేశాడు. తెలుసా నీకు?"

"అవును...అతను ఒక ఫూల్ చూడు. నీ లాంటి వ్యక్తిని ఎదురుకుండా పెట్టుకుని...'చూసారా యాభై వేలు’ నొక్కేస్తున్నను చూడండి. అన్నాడా?..."

"పోరా ఇడియట్…….. నాకు ఎలా తెలుసో చెబుతా విను....

                                                                       ఇంకా ఉంది.....Continued in PART-6 ***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి