9, జనవరి 2020, గురువారం

ఆలయం(సీరియల్)...PART-2




                                                ఆలయం(సీరియల్)
                                                           (PART-2)


ప్రసాద్ తన కుర్చీలో కూర్చుని 'కంప్యూటర్లో' తన చూపులను కేంద్రీకరించాడు. అతని యొక్క అకౌంట్స్ ను...కావలసినంత వరకు 'రిపోర్టు’ తయారు చేసి 'ప్రింట్' తీయాలి. ప్రసాద్ ఆ పనిమీద ఉన్నప్పుడు తలుపు తెరుచుకుని అతని 'ఏ.సీ’ గదిలోకి వచ్చాడు రాజేష్ కుమార్.

రాజేష్ కుమార్, ప్రసాద్ యొక్క సహ ఉద్యోగి. వచ్చినతను వూరికే కూర్చోలేదు. ఫ్యాక్టరీలో జరుగుతున్న తప్పు ఒప్పులను చర్చించడం మొదలుపెట్టాడు.

"ప్రసాద్!"

"ఊ"

"కొంచం ఇటు చూడు ప్రసాద్ "

"నేను ఇప్పుడు 'బిజీ' గా ఉన్నాను. ఏదున్నా సరే లంచ్ టైములో మాట్లాడుకుందాం"

“అప్పుడూ మాట్లాడుకుందాం సరే. కానీ, ఇప్పుడు నేను మాట్లాడ దలచుకున్నది మాట్లాడి వెళ్ళిపోతాను"

"నేను ప్రశాంతంగా పని చేయడం నీకు ఎప్పుడూ నచ్చదే..."

"అదెలా? మనకి మన చుట్టూతా అందరూ మనలాగానే ఉండాలే!"

"ఈ సిగ్గులేని విషయాన్ని బహిరంగంగా ఒప్పుకుంటున్నావా?"

"ఇది సిగ్గులేని విషయం కాదు ప్రసాద్. ఇదే యథార్థం. ఏ ఫ్యాక్టరీలోనైనా నీలాగా ఉండే వ్యక్తులు ఒకరో...ఇద్దరో నే ఉంటారు...కానీ నూటికి తొంబై మంది నాలాంటి వ్యక్తులే ఉంటారు"

"అదేమో నిజమే. సరే...ఏమిటి విషయం? త్వరగా చెప్పి ఇక్కడ్నుంచి వెళ్ళు...నాకు చాలా పనుంది"

"సరేరా. అయ్యగారు నీకు ఒక ఆశ్చర్యమైన విషయం చెప్పబోతారు. బాగా విను!"

"నువ్వు నోరు తెరుస్తే అన్నీ ఆశ్చర్యమే. ఇందులో వేరుగా ఒక ఆశ్చర్యమా?"

“అవన్నీ మామూలైనవి. కానీ, ఇది స్పెషల్ ఆశ్చర్యం..."

"సరేరా... త్వరగా చెప్పి తగలడు"

"చెప్పేస్తాను…మన 'కంపనీ'కి కొత్తగా ఒక 'పి.ఆర్.ఓ' వచ్చారు."

"అంటే...'పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్’?"

"'పి.ఆర్.ఓ'కి ప్రపంచమంతా అదే అర్ధం అనుకుంటా"

"కొత్త 'పి.ఆర్.ఓ' వస్తారని తెలుసు. కానీ, వచ్చి జాయిన్ అయ్యారని తెలియదు. సరే...ఇప్పుడు దానికేమిటిట?"

"దానికేమిటనా అడుగుతున్నావు? మనిషిని చూశావా...చూసి వచ్చిన తరువాత ఆ మనిషి గురించి చెప్పు. ఇంతటితో ఆఫీసు వార్తలు సమాప్తం. ఆశ్చర్యకరమైన మరికొన్ని వార్తలతో మిమ్మల్ని మళ్ళీ అలరించటానికి లంచ్ టైములో క్యాంటీన్లో కలుస్తాను....టొంటడైన్..."

---- రాజేష్ కుమార్, ప్రసాద్ గదిలో నుండి బయటకు వెళ్లాడు.

వెంటనే కొత్త 'పి.ఆర్.ఓ' ను కలిసి విష్ చేయాలని, తనని పరిచయం చేసుకోవాలని నిర్ణయించుకున్న ప్రసాద్ ఆయన్ని కలవటానికి ఆయన రూముకు వెళ్ళినప్పుడు అక్కడ అతనికి ఒక ఆశ్చర్యం ఎదురైయ్యింది.

రాజేష్ కుమార్ చెప్పినట్లే ఆ 'పి.ఆర్.ఓ' ఉండటం దారుణం. షాక్. స్పెషల్ ఆశ్చర్యం.

చిన్నగా తెరిచున్న ఆఫీసు రూము అవతల వైపు ఉన్న ఆ మనిషి, ఆఫీసు రూములోనే ఒక చిన్న మద్యం బాటిల్ తీసి మూత తెరిచి ఏదో 'టానిక్' తాగుతున్నట్టు తాగుతున్నాడు.

ప్రసాద్ కు గుండె గుభేలుమంది!

ఆలయం లాంటి 'కంపెనీ' లోపల ఆఫీసు టైములో మద్యం!

అందులోనూ భాద్యత గల ఒక అధికారి!!!!

                                                                          ఇంకా ఉంది.....Continued in PART-3.

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి