నిద్ర పోవటానికి ముందు ఏదైనా ఒక పుస్తకంలో పది పేజీలన్నా చదివి, దాని గురించి ఆలొచించుకుంటూ నిద్రపోవటం ప్రసాద్ కు అలవాటు.
"లైటు ఆపండి...వెలుతురు ఉంటే నేను ఎలా నిద్రపోవాలట?"--అని పది నిమిషాలకు ఒకసారి ప్రసాద్ భార్య గొణుగుతూ ఉంటుంది. ఆ రోజు అతను పుస్తకం చదవలేదు. నిద్రా రాలేదు. చేతులు కట్టుకుని, కాళ్ళు జాపుకుని అలాగే కూర్చున్నాడు.
రోజూ నిద్ర పోయేముందు ఒక గ్లాసు పాలు తాగుతాడు ప్రసాద్. ప్రసాద్ భార్య పాల గ్లాసుతో వచ్చింది. భర్త తీవ్రమైన ఆలొచనలో ఉండటం గమనించింది. ఇరవై సంవత్సరాల దాంపత్యం...'అతను ఎలాంటివాడు?' అనేది అమెకు ఎప్పుడో నేర్పింది.
ఇలా ఉన్నాడూ అంటే అతని మనసులో ఏదో ఒక నవలకు కావలసిన వృత్తాంతము తిరుగుతూ ఉండాలి. లేకపోతే సమాజ తాకిడి ఏదైనా ఏర్పడుండొచ్చు అనేది ఆమెకు తెలుసు.
భార్య అందించిన పాల గ్లాసును తీసుకుని తాగకుండా అలాగే చేతిలోనే ఉంచుకున్నాడు ప్రసాద్. ఆమె అతన్ని కెలకటం మొదలుపెట్టింది.
"ఏమండీ...?"
"హూ..."
"పాలు తాగండి..."
"ఓ...పాలుందా నా చేతిలో"
"సరిపోయింది...చేతిలో పాల గ్లాసు ఉన్నది కూడా తెలియనంత మాయలో పడేసిన ఆ ఆలొచన ఏమిటో?"
"ఏమీలేదు మాలతీ..."
"మీరే ఇంతకు ముందు అన్నారు...'ఏమీలేదని ఎవరైనా అన్నారంటే అందులో ఎన్నో విషయాలున్నాయని అర్ధం!' అని"
"నాలోనూ చాలా విషయాలు ఉన్నాయి! వాటి భారాన్ని ఎంతవరకు నేను తట్టుకోగలనన్నదే తెలియటంలేదు"
"ఏ విషయాన్నైనా మనసువిప్పి చెప్పుకుంటే...దానికొక దారి దొరుకుతుందని మీరే ఒక కథలో రాశారు"
"ఇది 'కంపనీ' విషయం మాలతీ...నీతో మాట్లాడినందు వలన ఒక్క ప్రయోజనమూ ఉండదు"
"అదెలా మీకు తెలుసు?"
"ఏమిటి మాలతీ నువ్వు...నేను చెప్పే సమస్యలను మొదట నువ్వు సరిగ్గా అర్ధం చేసుకోగలవో లేదో అనేదే నాకు సందేహం. ఆ తరువాత...నేను మాట్లాడిన తరువాత నా ఆందోళన నీకూ అంటుకుంటే. ఇది అవసరమా నీకు?"
"ఏమండి...'బెటర్ హాఫ్' అని నాకు ఇంకో పేరు ఉంది. సంతోషాన్ని మాత్రమే పంచుకునే మనిషిని నేను కాదు. ఏదైనా సరే సరదాగా నాతో చెప్పండి..."
---- మాలతీ అతన్ని వదిలేలా లేదు. అతను కూడా ఆమెతో అంతకంటే వాదించకుండా ఆమెదగ్గర తన మనో భారాన్ని పంచుకోవటం ప్రారంభించాడు.
"'కంపనీ'! ముందు లాగా లేదు. ఇప్పుడు కంపనీలో అవినీతి ఎక్కువగా ఉన్నది!"
"ఏమిటీ? అవినీతా?...అంటే కంపెనీ ఇప్పుడు పెద్ద ఎత్తున అభివృద్ది చెందుతోంది అని అర్ధం"
"నేనొకటి చెబితే, నువ్వొకటి చెబుతున్నావే మాలతీ..."
“ఛ ఛ...నేను నిజమైన కారణాన్నే చెప్పేను. 'నువ్వు ఏలా ఉండాలని అనుకుంటావో...అలాగే మారుతావు!' అనే సామెతకూడా ఉన్నదండి. మనం ఇప్పుడు ఎక్కడండీ మంచిగా ఆలొచిస్తున్నాము? మనం వింటున్న విషయాలు కూడా తప్పుతప్పుగానే కదా ఉంటున్నాయి? ఇప్పుడంతా సాధనల గురించి మాట్లాడటంకంటే వేధనలు, అవినీతి, హత్య, మానభంగాలు, దొంగతనాలు....వీటి గురించే కదా ఎక్కువ మాట్లాడుతున్నాం. ఏదైతే మనల్ని ఎక్కువగా భాదిస్తుందో...అలాగే కదా మనం మారుతాం"
--- మాలతీ చాలా సహజంగా....అదే సమయం బాగా నొక్కి చెబుతూ ఒక కొత్త కోణంలో మాట్లాడింది.
"చాలు మాలతీ...నీ ఇష్టం వచ్చినట్టు వాగకు! 'మనం' అని నిన్నూ, నన్నూ ఎందుకు చేరుస్తావు? ఎటువంటి అవినీతి ఇంతకు ముందు నేను ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడూ చెయ్యలేదు, రేపూ చెయ్యను, ఎప్పుడూ చెయ్యను”
----అతను కోపగించుకోవటం మొదలుపెట్టాడు.
"అరే ఏమిటండీ మీరు...కోపగించుకున్నారా? నేను మిమ్మల్ని చెప్పలేదు. ఈ సమాజాన్ని చెప్పాను"
"అది నేను అసలు ఒప్పుకోను. తప్పుకు ఇలా కారణం కనిపెట్టి తప్పించుకోవటం తప్పుల్లోనే పెద్ద తప్పు"
"అది నాకూ తెలుసు. కానీ, నేను చెప్పిందే నిజం. దీన్ని ఎలా మార్చగలమో మనం ఆలొచించాలి. అది సరే...అసలు అవినీతికి పాల్పడింది ఎవరు?...అందులోనూ 'మిస్టర్ క్లీన్’ అయిన మీకు తెలిసేటట్టు"
"నువ్వు ఏం చెప్ప దలచుకున్నావు?"
"అదేమిటంటే...ఈరోజుల్లో దొరికిపోయేంత తేలికగా ఎవరూ తప్పు చేయటంలేదు. ఇది 'కంప్యూటర్’ యుగం. రుజువు వదిలిపెట్టకుండా ఎలా తప్పు చేయాలో 'కంప్యూటర్’ ఎక్కువగానే చెప్పిచ్చింది. అందుకే అలా అడిగాను"
"నువ్వు చెప్పేది నిజమే. నేను తెలుసుకున్న ఏ విషయానికీ ఒక్క 'రుజువు' కూడా లేదు. నా బాధకు అదీ ఒక కారణమే....”
“అవును నేను తెలియక అడుగుతున్నాను. మీరు మీ 'కంపనీ'లో ఒక 'స్టోర్ కీపరా?' లేక...మీరే 'చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టరా'?"
"తరువాత నువ్వు ఏం చెప్పబోతావో నాకు తెలుసు.'మీ పనిని మీరు కరెక్టుగా చెయ్యండి...అవినీతి గురించి బాధ పడాల్సింది యజమాని. మీకు ఎందుకు ఈ అక్కర్లేని పని!' అని అడగబోతావు?..........అవునా? "
ఇంకా ఉంది.....Continued in PART-5**************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి