11, జనవరి 2020, శనివారం

ఆలయం(సీరియల్)...PART-3



                                                ఆలయం(సీరియల్)
                                                           (PART-3)


క్రిష్ణా నది ఒడ్డున కూర్చున్న ప్రసాద్ కు, ఆఫీసు రూములోనే మద్యం తాగుతున్న ఆ అధికారి యొక్క మొహం కళ్ళ ముందుకు వస్తూ, పోతూ ఉన్నది.

"ఇలాంటి ఒక చెడు అలవాటున్న ఒక వ్యక్తి ఎలా ఒక అధికారిగా నడుచుకోగలడు?" అనే ప్రశ్న ప్రసాద్ మనసును వెధిస్తున్నది.

ప్రసాద్ దేవుడుగా తలచుకుంటున్న 'చైర్మన్’ శంకరయ్య గారు, తాగుడుకు మాత్రమే కాదు...అన్ని చెడు అలవాట్లకూ దూరంగా ఉండటమే కాకుండా, ఆ అలవాట్లన్నీ తప్పు అని గట్టిగా చెబుతారు. 'శరీరాన్ని ఆరొగ్యంగా ఉంచుకోవాలంటే క్రమశిక్షణ అవసరం!' అని చెబుతారు. దాన్ని తన జీవితంలోనూ ఆచరణలో పెడుతూ వచ్చారు.

చూడటానికి యాభై ఏళ్ళ వ్యక్తి లాగానే ఉంటారు. కానీ, ఆ యౌవన రూపానికీ, శరీర దారుఢ్యానికీ కారణం ఆయన చేపట్టిన క్రమశిక్షణే. కానీ, ప్రసాద్ స్నేహితులు'నా దగ్గర కూడా కోట్ల కోట్ల డబ్బుంటే నేను కూడా తలతలమని మెరిసిపోతాను...'అని ఆయనకు వ్యతిరేకంగానే మాట్లాడుతారు.

డబ్బుగల వారు మెరిసిపోవటానికీ, క్రమశిక్షణతో ఆరొగ్యంగా ఉన్నవారు మెరిసిపోవటానికీ గల తేడా ప్రసాద్ కు బాగానే తెలుసు. ప్రసాద్ భార్య కూడా శంకరయ్య గారి ఫోటో చూసి...మీ 'చైర్మన్’ మంచి శరీర దారుఢ్యం గలవారూ అంటూ సరైన మాటలతో సూచిస్తుంది.

క్రమశిక్షణతో ఉంటే శరీర దారుఢ్యం ఏమిటి....అన్నీ వెతుక్కుంటూ వస్తాయి అనడానికి శంకరయ్య గారు ఒక ఉదాహరణ. అలాంటి మనిషి యొక్క సంస్థలో...మధ్యం అలవాటున్నఒక అధికారి!

ప్రసాద్ కు ఆఫీసులోనే మధ్యం తాగుతున్న ఆ అధికారి మొహం మాటి మాటికీ గుర్తుకు వస్తూ క్షోభ పెడుతోంది. గుడికి వచ్చిన చోట కూడా కనకదుర్గ అమ్మవారిపైన మనసును కేంద్రీకరించలేకపోయాడు. ఒక వార పత్రిక యాజమాన్యం దగ్గర నుండి చిన్న కథ ఒకటి పంపించమని ఫోన్ కూడా వచ్చింది.

మామూలుగా క్రిష్ణా నది ఒడ్డున కూర్చుంటే ప్రసాద్ కు కథలకు కావలసిన ఐడియాలు దొరుకుతాయి. ఒకసారి ఒక పెద్దాయన క్రిష్ణా నది ఒడ్డున కూర్చున్న ప్రసాద్ దగ్గరకు వచ్చి, కన్న బిడ్డలు అతన్ని కొట్టి బయటకు పంపించేసేరని చెప్పి ఏడుస్తూ చెయ్యి జాపాడు. పది రూపాయలు తీసుకున్న తరువాతే ప్రాసాద్ ను వదిలిపెట్టాడు. గంట తరువాత ఇంటికి తిరిగి వెడుతున్నప్పుడు ఆ పెద్దాయన ప్లాట్ ఫారం మీద మధ్యం మత్తులో తూలుకుంటూ నడిచి వెళ్లటం ప్రసాద్ కళ్ళకు కనబడింది. తాగటం కోసమే ఆయన అలాంటి అబద్దం చెప్పాడు అనేది ఆ క్షణమే ప్రసాద్ కు అర్ధమయ్యింది.

ప్రసాద్ వరకు మొసం పోవటమూ నచ్చదు; మోసగించటమూ నచ్చదు. ఆ క్షణం అతనికి వచ్చిన కోపానికి కొలతే లేదు. మరుసటి రోజు ప్రసాద్ క్రిష్ణా నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు ఆ పెద్దాయనను చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు. గబుక్కున ఆయన చేయి పుచ్చుకుని సరసరమని ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ ప్రసాద్ పెద్దాయన గురించి చెప్పింది ఎవరూ పట్టించుకోలేదు.

“మీరే సార్ జాగ్రత్తతో వ్యవహరించాలి! దీని కోసం అతన్ని పట్టుకుని జైల్లో పెడితే...జైల్లోనే బిచ్చం అడుక్కుంటాడు. ఇది అవసరమా? వదిలేయండి సార్. ఒక రోజు కాకపోతే...మరొక రోజు తాగేసి క్రిందపడిపోయి...ఏ లారీ క్రిందనో, బస్సు క్రిందనో పడి చస్తాడు. అదే వీళ్లకంతా ఒక ముగింపు" అన్నాడు, కానిస్టేబుల్.

చక్కటి బాధ్యత గల సమాధానం!?. ప్రసాద్ కు పోలీసుల నిజమైన మొహం తెలియటం అలాంటి సందర్భాలతొనే ప్రారంభమైంది!

ఆ తరువాత పోలీసులు చెప్పినట్లు జరగటమే ఘోరం!

ఆ తాగుబోతు పెద్దాయన సిటీ బస్సు చక్రాల క్రింద రక్తపు ముద్దలా పడున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రసాద్ కు గుండే గుభేలు మన్నది. ‘కానిస్టేబుల్ చెప్పింది ఫలించిందా? లేక తన వల్ల ఆ తాగుబోతు పెద్దాయన్ని కాపాడటం కుదరలేదా? ఎందువల్ల ఇలా జరిగింది?’ అనే ప్రశ్నలు, వాటి తాకిడి కలిపి ప్రసాద్ దగ్గర ఒక చిన్న కథగా తయారయ్యింది.

కానీ, కథలో ప్రసాద్ మంచి మార్పు చేశాడు. తాగుబోతు పెద్దాయనను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళి అప్పగించలేదు. దానికి మారుగా ఆయన్ని తీసుకువెళ్ళి తన ఇంటి తోటమాలిగా పెట్టుకున్నాడు.

పెద్దాయన కూడా తనకొక కొత్త జీవితం దొరికిందన్న ఆనందంతో...తోటమాలి పనిని ఒక పరిహారంగా తీసుకున్నాడు.

ఆ కథకు ఐదువేల రూపాయలు బహుమతిగా లభించింది. జీవితంలో అతను చూసే సంఘటనలతో ఇలాంటి పలు మంచి కథలు రూపొందాయి. ఆఫీసులోని తాగుబోతు అధికారి కూడా ప్రసాద్ కు, ఒక కథకు కథాంశం అవబోతాడా? లేక...'కంపెనీ' కి ఒక ఎరువుగా ఉపయోగపడతాడా అనేది మాత్రం కన్ ఫ్యూజన్ గానే ఉన్నది.

                                                                     ఇంకా ఉంది.....Continued in PART-4

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి