14, జూన్ 2021, సోమవారం

మాస్కు వేసుకోండి లేదా జైలుకు వెళ్ళండి...(ఆసక్తి)

 

                                                           మాస్కు వేసుకోండి లేదా జైలుకు వెళ్ళండి                                                                                                                                                           (ఆసక్తి)

నినాదము 1918-కాలిఫోర్నియాలో స్పానిష్ ఫ్లూ యొక్క సెకండ్  వేవ్ సమయంలో చాలా మార్పు తెచ్చిందట. మరోవిధంగా చెప్పాలంటే స్పానిష్ ఫ్లూ ను ఆపగలిగిందట.

పై ఫోటో, 1918 లో స్పానిష్ ఫ్లూ యొక్క 2 వేవ్ అప్పుడు తీసింది. కాలిఫోర్నియాలోని పౌరుల బృందం మాస్క్ ధరించడం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నది.

కొన్ని రాష్ట్రాలు పౌరులను నిర్బంధించాయి(క్వారంటైన్ చేశాయి). కొన్ని రాష్ట్రాలు పౌరులు ఫేస్ మాస్క్లు ధరించడం తప్పనిసరి చేశారు. అదే సమయంలోఅన్ని వినోద ప్రదేశాలు, ప్రజలు గుంపుగా చేరే షాపులను, ఇతర చోట్లనుమూసివేసారు. అదే సంవత్సరం అక్టోబర్లో శాన్ఫ్రాన్సిస్కోలో ఆమోదించిన ఒక చట్టం ప్రకారం, రాష్ట్ర వ్యాప్తంగా అంటువ్యాధులు 50,000 దాటిన రోజున, గుడ్డ ముఖ కవచాన్ని ధరించని ఎవరైనా 5 డాలర్ల నుండి 100 డాలర్ల వరకు జరిమానా కట్టడమే కాకుండా మరియు 10 రోజుల జైలు శిక్ష అనుభవించ వలసి ఉంటుంది.

అధికారిక సలహా ఇలా నొక్కి చెప్పింది: “మాస్క్ ధరించి మీ ప్రాణాలను రక్షించుకోండి! మాస్క్ 'ఇన్ ఫ్లు ఎంజాను అడ్డుకుంటుందని 99% రుజువు అయ్యింది”. ప్రకటనల ప్రచారాలు మరియు చిరుగంటల దండోరాలు దీనికి మద్దతు ఇచ్చాయి: “చట్టాలను పాటించండి మరియు గుడ్డ మాస్క్ ధరించండి. మీ దవడలను వైరస్ దాడి నుండి రక్షించండి”  

స్పానిష్ ఫ్లూ, దీనిని 1918 'ఫ్లూ మహమ్మారి' అని కూడా పిలుస్తారు, ఇది హెచ్ 1 ఎన్ 1 ఇన్ ఫ్లు ఎంజా- వైరస్ వల్ల కలిగే అసాధారణమైన ప్రాణాంతక 'ఇన్ ఫ్లు ఎంజా' మహమ్మారి. ఫిబ్రవరి 1918 నుండి 1920 ఏప్రిల్ వరకు, ఇది 500 మిలియన్ల మందికి- సమయంలో ప్రపంచ జనాభాలో మూడవ వంతు మందికి-నాలుగు వరుస తరంగాలతో సోకింది.

మరణాల సంఖ్య సాధారణంగా 17 మిలియన్ల నుండి 50 మిలియన్ల మధ్య ఉన్నట్లు అంచనా వేయబడింది, ఇది మానవ చరిత్రలో అత్యంత ప్రాణాంతక మహమ్మారిలో ఒకటిగా నిలిచింది.

మొదటి ఛాయాచిత్రంలోని వ్యక్తులు ప్రచారంలో ఒక భాగం, లేదా - “మాస్క్ ధరించండి లేదా జైలుకు వెళ్లండిఅనే సంకేత పఠనాన్ని కలిగి ఉంటారు - ముఖ్యంగా దీనికి మద్దతుదారులు.


మాస్కుల సరఫరా పెద్ద సమస్యగా మారింది. కాబట్టి అమెరికాలో చర్చిలు మరియు కమ్యూనిటీ గ్రూపులు సామూహికంగా మాస్క్ తయారీ సెషన్లను నిర్వహించాయి.

నవంబర్ చివరి రోజు మధ్యాహ్నం ఆర్డర్ను ఎత్తివేసినప్పుడు, ఒక విజిల్ వినిపించింది మరియు శాన్ఫ్రాన్సిస్కో క్రానికల్ ఇలా పేర్కొంది. ప్రజలు తమ మాస్కులను విసిరి కాలిబాట నెలను మాస్క్ అవశేషాలతో నిండిన కాలిబాటలుగానూ మరియు మాస్కుల గుంటలుగానూ--కఠినమైన సమాయానికి గుర్తుగా విడిచారు.

చట్టం యొక్క సడలింపు అకాలమని నిరూపించబడింది. వ్యాధి యొక్క మూడవ తరంగంలో మరణాల సంఖ్య మళ్లీ పెరిగినందున - కొత్తగా ఏర్పడిన యాంటీ-మాస్క్ లీగ్ యొక్క నిరసనలు ఉన్నప్పటికీ - తప్పనిసరి మాస్కు ధరించడం తరువాతి సంవత్సరం ప్రారంభంలో మరో ఆరు వారాల పాటు తిరిగి ప్రవేశపెట్టబడింది.

మాస్కు వేసుకోవటం వలన వైరస్ మహమ్మారి ఆట తగ్గి అంటువ్యాధి సమస్య, మరణాల శంఖ్య గణనీయంగా తగ్గటంతో, తప్పక ముసుగు ధరించాలనే ఆర్డర్ను అలాగే ఉంచారు

కాబట్టి కోవిడ్-19 వైరస్ ను అడ్డుకొవటానికీ, దాని అభివ్రుద్దిని పూర్తిగా తగ్గించటానికి మాస్కులు ధరించటం చాలా ముఖ్యం.

ఎన్ని రోజులు అనే ప్రశ్నను పక్కనపెట్టి ప్రజలందరూ మాస్కులు వేసుకుని సహకరిస్తే, మహమ్మారిని తరిమికొట్టటం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే, రోజుల్లో(టీకా రెడీ చేయటానికి సుమారుగా ఏడు,ఎనిమిది సంవత్సరాల సమయం కావలసి వచ్చింది)టీకాలే లేకుండా స్పానిష్ ఫ్లూ మహమ్మారిని చాలావరకు తరిమికొట్టగలిగారు అంటే, రోజు, మనం టీకాలు ఉండి చేయలేమా?

Images Credit: To those who took the original photos.

***********************************************************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి