12, జూన్ 2021, శనివారం

మానవత్వం....(పూర్తి నవల)

 

                                                                                        మానవత్వం                                                                                                                                                                              (పూర్తి నవల)

 మానవత్వానికి మరోపేరు ఈ నవలలోని హీరోయిన్  యామిని

పెళ్ళి చూపులకు వస్తున్నారని తల్లి ఆఫీసుకు ఫోన్ చేసి, ఆఫీసు నుండి త్వరగా బయలుదేరి రమ్మని యామినికి చెబుతుంది.

యామిని ఇంటికి వస్తున్న దారిలో చెత్త కుండికి దగ్గరగా ఎవరో అప్పుడే పుట్టిన బిడ్డను పడేశారు. మానవత్వం నిండిన యామిని అందరూ వేడుక చూస్తూండగా, తానుగా ముందుకు వచ్చి ఆ బిడ్డను కాపాడి ఇంటికి తీసుకు వెళ్ళింది.

పిల్లను చూద్దామని వచ్చిన పెళ్ళి వారు, యామిని తల్లి, తండ్రి, మిగిలిన కుటుంబ శభ్యులు యామిని చేతులో ఉన్న పసికందును చూసి  ఆశ్చర్యపోతారు. యామిని ఎంత చెప్పినా వినకుండా అది యామిని బిడ్డేనని వాదించి తిరిగి వెళ్ళిపోతారు మగ పెళ్ళివారు.

యామినిపై నమ్మకమున్న ఆమె తల్లి-తండ్రులు, మిగిలిన కుటుంబీకులు బిడ్డను తీసుకువెళ్ళి ఏదైన అనాధ ఆశ్రమంలోనో లేక పోలీస్ స్టేషన్లోనో అప్పగించమని సలహా ఇస్తారు. తల్లి-తండ్రులు చెప్పినట్లు చేద్దామని బిడ్డను పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్ళిన యామినిని పోలీసులు అవమాన పరుస్తారు. బిడ్డను ఇంటికి తిరిగి తీసుకువచ్చిన యామినిని చూసి యామిని కుటుంబీకులు ఆశ్చర్యపోతారు. పోలీస్ స్టేషన్లో తనకు జరిగిన అవమానన్ని అందరికీ చెప్పి, ఆ పసిబిడ్డను తానే పెంచుతానని చెబుతుంది యామిని. పెళ్ళి కాని ఒక ఆడపిల్ల అలా చేయటం తప్పని పెద్దలు చెప్పినా యామిని మొండి పట్టుదల పట్టి బిడ్డను తానే పెంచుతుంది.

బిడ్డని పెంచటానికి యామిని పడ్డ అవమానాలు అంతా ఇంతా కాదు. సంఘం పెట్టే అవమానాల కంటే, తల్లి, తోబుట్టువులు, పెట్టే అవమానలే ఎక్కువ.

తల్లి-తండ్రులు, తోబుట్టువులు, సంఘం పెట్టే అవమానాలను తట్టుకుని యామిని  ఆ బిడ్డను ఎలా పెంచింది? ఆ బిడ్డ కోసం తన జీవితాన్నే అంకితం చేయాలని తెలిసి కూడా ఆ బిడ్డను పెంచిందా? లేక మధ్యలోనే ఆ బిడ్డను విడిచిపెట్టిందా?....తెలుసుకోవాలంటే ఈ  నవలను చదవండి.

నవలలో ఎన్నో టర్నింగ్ పాయింట్స్, ఎమోషనల్ సీక్వెన్స్ మిమ్మల్ని అలరిస్తుంది. కట్టి పడేస్తుంది.

మీకు సమయం ఉండి ఈ నవలను పూర్తిగా ఒకేసారి ఆన్ లైన్ లోనే చదవాలనుకుంటే ఈ క్రింది లింకును క్లిక్ చేసి చదవండి:

మానవత్వం...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2

నవలను డౌన్ లోడ్ చేసుకుని ఖాలీ దొరికినప్పుడల్లా చదువుకోవటానికి ఈ క్రింద లింకు క్లిక్ చేసి PDF ను డౌన్ లోడ్ చేసుకుని చదవండి: 

https://drive.google.com/file/d/1GBz9egKxYZPR9ro1cnKY7kUtS4vT6iVr/view?usp=sharing

ఈ నవలను పార్టులుగా చదవాలనుకుంటే ఈ క్రింది లింకును క్లిక్ చేయండి: 

15 పార్టుల సీరియల్ గా ...'మానవత్వం'....(నవల)@ కథా కాలక్షేపం

************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి