అంతరిక్షంలో గొడుగు! (ఆసక్తి)
ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో ఎండలు దంచికొట్టాయి...కొన్ని దేశాలలో ఇంకా ఎండలు దంచికొడుతున్నాయి. ఈ ఎండల రికార్డు కూడా సలసల కాగిపోతోంది. గడిచిన 20 శతాబ్ధాలలోనే హైయ్యెస్టు టెంపరేచర్ రికార్డు చేసింది ఈ సంవత్సరంలోనే . 2001 నుంచి 2022 వరకు ప్రతి సంవత్సరం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. వాతావర్ణంలో సంభవిస్తున్న మార్పుల మీద సైంటిస్టుల బృందం జరిపిన సర్వేలో భయంకరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. రానున్న రోజుల్లో భూమి మీద గ్లోబల్ వార్మింగ్ పెరగడానికి మానవుడే ముఖ్యమైన కారణమని ఈ సర్వేలో తేలింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా మంచు వేగంగా కరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2035 నాటికి హిమాలయాలలోని మంచు కరిగే శాతం 2 నుంచి 19కి పెరిగే అవకాశమున్నదట. సముద్ర మట్టాలు పెరిగి చాలా దేశాలలోని తీరప్రాంతాలు జలసమాధి అవుతాయంటున్నారు. అభివృద్ది పేరుతో మానవుడు చేస్తున్న ప్రకృతి విధ్వంశం. ఫ్యాక్టరీల కాలుష్యం, తగ్గిపోతున్న పచ్చదనం గ్లోబల్ వార్మింగుకు ప్రధాన కారణాలుగా సైంటిస్టులు చెబుతున్నారు. ప్రకృతి విధ్వంశాన్ని ఆపకపోతే ప్రపంచానికి 'ఎండ్' కార్డు తప్పదంటున్నారు సైంటిస్టులు.
"గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని ఆపలేము సరికదా, గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని తగ్గించే ప్రక్రియ కూడా అతి నెమ్మదిగానే కొనసాగుతోంది. ఎందుకంటే నిర్ధిష్టమైన సమయ వ్యవధి నిర్ణయించలేము. కారణం పర్యావరణ సమతుల్యాన్ని తిరిగి నెలకొల్పటానికి ప్రపంచదేశాలన్నీ కలిసి కట్టుగా కంకణం కట్టుకుని 'గ్లోబల్ వార్మింగ్' ప్రభావాన్ని తగ్గించే పరిష్కారాలను చేపట్టాలి. అలా అన్ని దేశాలను ఒకే తీగ మీద నడపడం చాలా కష్టం. కాబట్టి 'గ్లోబల్ వార్మింగ్' తగ్గించడానికి వేరే పద్దతి వెతుక్కోవాలి. లేకపోతే భూమికి గణనీయ స్థాయిలో ముప్పు పెరగవచ్చు"---ఇది వాతావరణ శాత్రవేత్తల హెచ్చరిక.వాతావరణానికి మానవులు చేస్తున్న హానిని ఆపలేమని తెలుసుకున్న వాతావరణ శాస్త్రవేత్తలు ఆధునిక సాంకేతికతలు ఉపయోగించి ఎన్నో పరిష్కారాలపై అధ్యయనాలు చేశారు.కొన్ని రసాయనాలను అంతరిక్షంలో జల్లటం, అత్యంత శక్తివంతమైన బాంబను ( హీరొషీమా-నాగసాకీలపై వేసిన బాంబు కంటే 2 లక్షల రెట్లు అధిక శక్తి కలిగిన) సముద్రంలో పేల్చి భూమిని సూర్యునికి కొంత దూరంగా జరపటం లాంటి ఆలొచనలను శాస్త్రవేత్తలు ప్రభుత్వాల ముందు ఉంచారు. కానీ, ఇవి రెండూ చేయలేమని తేల్చి చెప్పటంతో వేరే పరిష్కారాలపై పరిశోధనలను కొనసాగించారు వాతావరణ శాస్త్రవేత్తలు. ఎన్నో జియో ఇంజనీరింగ్ పరిష్కారాలపై దీర్ఘాలొచనలు చేస్తున్నారు.ఈ గొడుగు ఐడియాని 1989 లోనే జేమ్స్ అనే ఒక ఇంజనీర్ ప్రవేశపెట్టాడు. గొడుగు ఆకారంలో 2000 కిలోమీటర్లు విశ్తృత గాజు కవచం నిర్మించాలి. అంత బ్రహ్మాండమైన, భారీ గొడుగును చంద్రమండలం పైన మాత్రమే నిర్మించవచ్చు. అక్కడికి వెళ్ళి నిర్మించాలి. అది కుదరదు. భూమి మీద నిర్మాణం చేసి చంద్ర గ్రహానికి తీసుకు వెళ్ళాలి. ఇది కూడా సాధ్యపడే పని కాదు. అంత భారీ గొడుగును చంద్రమండలానికి తీసుకు వెళ్లటం చాలా కష్టం...అందులోనూ 1972 తరువాత చంద్రమండలానికి ర్యాకెట్లను పంపటం ఆపేశారు.ఎప్పుడైతే భారీ అద్దాల గొడుగును నిర్మించలేమని నిర్ణయించుకున్నారో కొత్త సూచనగా చంద్రుని మేఘాల ధూళి, మరియూ 55,000 వైర్ మెష్ అద్దాలతో చంద్రుని చుట్టూ గుండ్రని ఆకారంలో చిన్న చిన్న గొడుగులను నిర్మించవచ్చు అనే ఐడియా ఇచ్చారు. వీటిని కూడా చంద్ర మండాలానికి వెళ్ళే ప్రతిపాదన లేనే లేదని అగ్ర రాజ్యాలు తేల్చి చెప్పినై….ఆ తరువాతే భూమిని 'ఇప్పుడున్న చోటు నుండి జరిపితే!' అన్న ఐడియా వచ్చింది. కానీ దానికి 5 వేల మిల్లియన్ మిల్లియన్ల ఉంటే గానీ భూమిని జరుపలేమని, దానికి అయ్యే ఖర్చును తట్టుకోలేమని తెలియజేయడంతో ఈ సూచనను రద్దు చేసుకున్నారు.
చివరిగా శాస్త్రవేత్తలు ఒక ఆలొచన ముందు పెట్టారు. అదే అంతరిక్షంలో గొడుగు. ఒక గ్రాము బరువు మాత్రమే ఉండి ఎగరగలిగే 16 ట్రిల్లియన్ల అంతరిక్ష రోబోట్లను, చిన్న చిన్న రంధ్రాల మూలం పారదర్శక ఫిల్మ్ పొరతో ఒకటి చేసి, వాటిని ఒకటిగా(చిన్నగొడుగుగా మడిచి) అంతరిక్షంలోకి పంపి, అక్కడ గొడుగును విడదీసి, భూమి నుండి కంప్యూటర్స్ ఎలెక్ట్రానిక్స్ పరికరంతో ఆ గొడుగును మనకు కావలసినట్లు జరుపుకోవచ్చు.
ఈ ఆలొచనను అగ్రరాజ్య అంతరిక్ష పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు అంగీకరించారు. పరిశోధనలు మొదలైనై. అంతరిక్ష గొడుగు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. త్వరలో ఈ అంతరిక్ష గొడుగు ఆలొచన నిజ రూపం దాల్చి విజయవంతం చేయగలిగితే మానవ సముదాయానికి ఎంతో మేలు జరుగుతుంది. మానవులు గ్లోబల్ వార్మింగ్ వలన పడుతున్న కష్టాల భారి నుండి తప్పించుకోవచ్చు.
అంతరిక్ష గొడుగు ఆలొచన నిజ రూపం దాల్చి విజయవంతం కావాలని కోరుకుందాం.
Images Credit: To those who took the original credit.
************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి