31, డిసెంబర్ 2021, శుక్రవారం

పవిత్ర…(సీరియల్)...PART-7

 

                                                                                  'పవిత్ర'…(సీరియల్)                                                                                                                                                                          PART-7

ఇంటికి వచ్చిన - తరువాత కూడా స్వాతి ఆలొచనలతో నవ్వు మొహంతో ఉన్న కూతుర్ని ఆశ్చర్యంగా చూసింది స్వరాజ్యం.

“పవిత్రా”

“ఏంటమ్మా?”

“తమ్ముడు రాలేదా?”

“వాడు ఎం.డి తో బయటకు వెళ్ళాడు. రావటానికి ఆలశ్యమవుతుందని చెప్పాడు”

“సరే...నువ్వు కాళ్ళూ చేతులూ కడుక్కురా. కాఫీ ఇస్తాను”

“లేదమ్మా. మనో రానీ” -- నవ్వు ముఖంతో చెప్పిన కూతురు దగ్గరకు వచ్చింది స్వరాజ్యం.

“పవిత్రా. ఈ రోజు ఆఫీసులో ఏదైనా మంచి జరిగిందా?”

“అవునమ్మా. మనం అనుకోనివి అన్నీ జరిగింది”

“అంటే?”

“అమ్మా. ఈ మనోగాడు మనకు తెలియకుండా ఏం పని చేసాడో తెలుసా?”

“మనోనా...ఏం చేసాడు?”

“మన దగ్గర పెద్ద ముని లాగా పెళ్ళి వద్దు అని మాట్లాడి, లడ్డూలాంటి ఒకమ్మాయిని ‘సెలెక్ట్’ చేసుకున్నాడు”

“ఏంటమ్మాయ్ చెబుతున్నావు?”

“అవునమ్మా...ఆ అమ్మాయి నన్ను చూడటానికి మా ఆఫీసు దగ్గరకు వచ్చింది”

స్వరాజ్యం మొహం మారింది. “ఎవరది?”

“అది సస్పెన్స్. రానీ...వాడి నోటంబడే చెప్పిస్తాను” పవిత్ర నవ్వుతూ చెప్పేటప్పుడు కారులో వచ్చి దిగాడు మనోహర్.

“ఏమిటి పవిత్రా...కారులో వచ్చి దిగుతున్నాడు మనో?”

“ఏం.డి. కారై ఉంటుంది. డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది” -- అంటూ తల్లితో కలిసి బయటకు వచ్చిన పవిత్ర...ఆశ్చర్యపోయింది.

బయట గేటును వెడంగా తెరిచి కారును లోపలకు రమ్మని చెబుతున్నాడు మనో.

“ఇంకొచ్చు రావచ్చు. చాలు ఆపండి”

“మనో...ఏమిట్రా? ఎవరి కారురా ఇది?”

“ఒక్క నిమిషం అమ్మా. డ్రైవర్ అన్నా...మీరు బయలుదేరండి. ప్రొద్దున ఎనిమిదిన్నర కల్లా వస్తే చాలు”

“ఓ.కే. సార్” -- అంటూ తెల్ల డ్రస్సు వేసుకుని కారు డ్రైవ్ చేసుకోచ్చిన అతను, కారు తాళం చెవులను ఇచ్చి బయటకు వెళ్లగా...గేటును మూసి, గొళ్ళెం పెట్టి, ఉత్సాహంగా వెనుతిరిగాడు మనో.

గందరగోళ చూపులతో చూస్తూ నిలబడ్డ తల్లిని, ప్రేమగా భుజాల మీద చేతులు వేసి రెండుచేతులతో లాక్కుని ఇంట్లోకి వచ్చాడు.

“ఏయ్...ఏమిట్రా ఇదంతా?”

“చెబుతాను...రండి. అవును...నాన్న ఎక్కడ?”

“నాన్న ఒక పెళ్ళికి వెళ్లారు. ఏమిటి విషయం?”

“సరే...ఇలా వచ్చి నిలబడండి” -- అని పూజ గదిలోకి వచ్చి నిలబడి -- తన చేతిలో ఉన్న తాళంచెవుల గుత్తిని తల్లి చేతికి ఇచ్చాడు.

“ఇదిగో నమ్మా”

“ఏమిట్రా ఇది?”

“రేపటి నుండి మీ అమ్మాయి -- గౌరవనీయులైన పవిత్రా గోపాలకృష్ణ, మా అడయార్ బ్రాంచీ ఆఫీసుకు సి.ఈ.ఓ.గా జాయిన్ కాబోతోంది”

“ఏ.మి.టీ.?” -- ఇద్దరి మొహాలూ ఆనందంతో వికసించగా, మనోహర్ గర్వంగా నవ్వాడు.

“ఊ...దానికోసమే మా ఆఫీసు ఈ కారు ఇచ్చారు. ఇకపై అక్కయ్య నాతో టూ వీలర్లో రానక్కర్లేదు. దర్జాగా మహారాణిలాగా కారులో వెళొచ్చు”

“మ... నో...”

“అవునక్కా. ఈ రోజు ఏం. డి., నేనూ, జె.ఎండి., బోర్డ్ మెంబర్లు, సి.ఈ.ఓ (ఆపరేషన్స్) అందరూ అడయారు ఆఫీసులోనే ఉన్నాము. నీ ప్రమోషన్ పూర్తిగా కంపెనీ మేనేజ్ మెంట్ తీసుకున్నది. వాళ్ళు నీ పేరు అనౌన్స్ చేసినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను”

“ఏం చెబుతున్నావు? ఆ ఆఫీసులో సి.ఈ.ఓ గా ఉండే గణపతి రావ్ గారు?”

“ఆయనకి ఆరొగ్యం బాగో లేనందున వాలింటరీ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారట. ఇంతవరకు ఆ పదవికి ఎవర్ని వెయ్యాలో కన్ ఫ్యూజన్లో ఉన్నారట. రెండు రోజుల ముందు ఆర్.ఎస్. కంపెనీతో డీల్ ఫైనల్ చేశావే...ఒక ప్రాజక్ట్. ఆ తెలివితేటల్ని చూసి బోర్డ్ నిన్ను సెలెక్ట్ చేసిందట”

“నేనింకా నమ్మలేకపోతున్నారా. నా కంటే సీనియర్లు ఉన్నారే! వాళ్ళని వదిలేసి...ఎలా?”

“అక్కా...ఇది గవర్నమెంట్ కంపెనీ కాదు. ప్రైవేట్ కంపెనీ...ఇందులో సీనియర్-జూనియర్ ముఖ్యం లేదు. ఒక నిర్వాహాన్ని ఎలా విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్లగలరో...ఆ నిర్వాహ వివేకం ఎవరికి ఉందో, వాళ్లనే కదా పెద్ద పోస్టులో ఉంచగలరు?”

“అది సరే...కానీ...”

“నీ దగ్గర తెలివితేటలు ఉన్నాయక్కా. సాధించాలనే లక్ష్యం ఎక్కువగా ఉంది. నిజాయతీ ఉంది. ఇంకేం కావాలి?”

“అవును పవిత్రా...నీ మీద నమ్మకం లేకుండానా ఇంత పెద్ద బాధ్యత నీకిస్తారు? నువ్వు బాగా వస్తావమ్మా. నీకిచ్చిన బాధ్యతను చక్కగా చేస్తావు...” తల్లి యొక్క మనస్పూర్తి దీవెనలతో సంతోషంలో మునిగిపోయింది పవిత్ర.

“థ్యాంక్స్ అమ్మా”

“అక్కా...ఇంకో ముఖ్యమైన విషయం”

“ఏమిటది?”

“దగ్గర దగ్గర ఒక నెల రోజులు ఆ బ్రాంచీని నిర్వాహం చేసే సరైన వ్యక్తి లేకపోవటంతో...అక్కడ పనులన్నీ అలాగే ఉండి పోయినైట. సగం మంది టైముకు రావటం లేదట. వచ్చినా ఏ పనీ సరిగ్గా చేయటం లేదట. ఇలా ఎన్నో ప్రాబ్లంస్ . అన్నిటినీ నువ్వే సరి చేయాలి. ఇది నీకొక ఛాలెంజ్ గా ఉంటుందని అనుకుంటున్నాను...సరిచేస్తావుగా?”

“ఖచ్చితంగా...” పవిత్ర స్వరంలో కనబడ్డ నమ్మకం చూసి సంతోష పడ్డాడు తమ్ముడు మనో.

“నేనూ ఈ విషయమే ఏం.డీ దగ్గర చెబుతూ వచ్చేను. అక్కా...ప్రొద్దున ఎనిమిదింటి కల్లా డ్రైవర్ వస్తాడు. నువ్వు వెంటనే బయలుదేరాలి”

“నువ్వు?”

“నేను ఎప్పుడూ లాగానే వెల్తాను.  నా రూటు వేరు. నీ రూటు వేరు. నువ్వు ఇక మీదట ఒంటరిగా నిలబడి సాధించబోతావక్కా”

“ఖచ్చితంగా సాధిస్తాను. నాకు ఆ నమ్మకం ఉంది”

“ఆమ్మా...సంతోషమైన ఈ రోజును మనం పండుగ చేసుకోవద్దా?”

“ఖచ్చితంగా చేసుకోవాలిరా”

“అయితే వెంటనే వంట గదికి వెళ్ళండి. మాకు ఇష్టమైన మైసూర్ పాక్ చేసి తీసుకురండి”

“సరేరా”

“అమ్మా...ఒక్క నిమిషం...”

“ఏమిటి పవిత్రా?”

“ఈ రోజు ఒక స్వీటు కాదమ్మా...రెండు స్వీట్లు చెయ్యబోతాం”--అన్నది తమ్ముడ్ని చూస్తూ.

“రెండా!?”

“అవును...ఒకటి నా ఉద్యోగ ప్రమోషన్. ఇంకొకటి అమ్మ పదవి పెరిగినందుకు”

“అమ్మ పదవి పెరిగిందా? ఏంటక్కా  చెబుతున్నావు?”

“అవును మనో...అమ్మకు అత్తగారనే పదవి దొరకబోతోంది...అది కూడా అతి త్వరలోనే...”

“అక్కా...”-- మనో మొహం మారింది. పవిత్ర నవ్వింది.

“ఊ...అమ్మాయిని చూసేసాము. వచ్చే ఆదివారం మనం పెళ్ళి చూపులకు వెడుతున్నాము. నిశ్చయం చేసుకోబోతాము. వచ్చే మూహూర్తంలోనే పెళ్ళీ”

“అక్కా...ఏమిటి నువ్వు? నా దగ్గర ఒక్క మాట కూడా చెప్పకుండా...పెళ్ళి దాకా వెళ్ళిపోయావు?”

“ఏరా...నీ దగ్గర అడిగిన తరువాతే కదా చేస్తున్నాం?”

“అది కాదక్కా...ఇలా రెండు రోజుల్లో...అన్నీ మాట్లాడుకున్నాం అంటే ఏట్లా?”

“పాపం రా ఆ అమ్మాయి...ఎన్నో రోజులుగా కాచుకోనుంది. ఇంతకంటే ఎక్కువ రోజులు కాచుకో నివ్వకూడదని”

“అక్కా...ఎవర్ని చెబుతున్నావు?” -- మనో పడుతున్న ఆందోళనను చూసి ఆనందించింది పవిత్ర.

“అదేరా...అమ్మ చూసుంచిదే! ఆ అమ్మాయినే చెబుతున్నా”

“......................”

“ఎందుకురా మౌనం అయిపోయావు”

“నాకు నచ్చలేదు”

“ఏం నచ్చలేదు”

“ఏదీ నచ్చలేదు...” ---గబుక్కున చెప్పేసి వెళ్ళిపోవాలనుకున్న తమ్ముడి చేయి పుచ్చుకుని ఆపింది.

“ఏదీ నచ్చలేదంటే?”

“అన్నీనూ...ఈ పెళ్ళి చూపులూ...పెళ్ళి”

“ఎందుకురా?”

“అదంతే...నచ్చలేదంటే నచ్చలేదు. అంతే”

“ఇలా చెబితే ఎలా? నాకు కారణం చెప్పు”

“అక్కా...సారీ. నన్ను కొంచం ప్రశాంతంగా ఉండనివ్వు" విసుగ్గా చెప్పినతని ముందు చేతులు కట్టుకుని నిలబడి అతన్నే నిదానంగా చూస్తోంది.

“నువ్వూ, నేనూ అక్కా-తమ్ముడు కాదు. ఫ్రెండ్స్ అని చెప్పేవే! అదంతా అబద్దమా?”

“లేదక్కా...”---గబుక్కున తల ఎత్తాడు.

“నన్ను నీ స్నేహితురాలిగా అనుకుంటే అన్నీ నా దగ్గర చెప్పేవాడివి కదా?”

“............................”

“నా తమ్ముడి మనసులో ఒక అమ్మాయి ఉందని ఎవరో చెప్పి నేను తెలుసుకోవాలా?”--- పవిత్ర ప్రశ్నతో ఆందోళన పడి -- తల్లిని కొంచం భయంతో చూసాడు.

“అటువైపు ఏమిట్రా చూస్తావు? నాకు జవాబు చెప్పు”

“అక్కా...”

“ఆ స్వాతిని నువ్వు ఇష్టపడుతున్నావా...లేదా?”

“అది...అప్పుడు...ఇష్టపడ్డాను...”

“ఇప్పుడు?”

“ఇప్పుడు...ఇప్పుడు” -- తడబడుతున్న తమ్ముడి మొహాన్ని పైకెత్తింది.

“ఎందుకురా తడబడుతున్నావు? ‘అవును...ఇష్టపడుతున్నానూ అని ధైర్యంగా చెప్పు”

“లేదక్కా...ఆమె...ఆ...”

“ఎవరి బంధువైతే ఏమిటి? నీ మీద ప్రాణమే పెట్టుకుందిరా. నీకొసం ఇన్ని రోజులుగా ఓర్పుగా కాచుకోనుందిరా. పాపం కాదా ఆమె?”

“అ...ది...అక్కా...నీకు ఇదంతా ఎలా తెలుసు? ఎవరు చెప్పేరు?”

“హు...నా తమ్ముడి కంటే వాడి ప్రేమికురాలు ధైర్యవంతురాలు, తిన్నగా నన్ను కలిసి అన్నీ చెప్పింది”

“ఏమిటీ... స్వాతి మన ఆఫీసుకు వచ్చిందా? ఎప్పుడు...ఎలా వచ్చింది?” -- అని ఆందోళనపడిన తమ్ముడి బుగ్గను గిల్లిన పవిత్ర...

“ఏదీ నచ్చలేదని చెప్పావు! ఇప్పుడెందుకు ఇంత ఆందోళన, హడావిడి? మేము స్వాతికి ఫోన్ చేసి చెప్పేస్తాము”

“ఏమని...?”

“పెళ్ళి కొడుక్కి ఏదీ నచ్చలేదని...”

“అయ్యో...అలాగంతా చెప్పద్దు అక్కా”

“ఏం?”

“నాకు నచ్చింది...ఆ అమ్మాయినీ, ఈ ఏర్పాటు చేసిన నిన్నూ, దీనికి ఒకే అంటున్న అమ్మను” -- అన్నాడు.

ఉత్సాహంగా తల్లినీ, సహోదరినీ కౌగలించుకున్నాడు.

                                                                                                    Continued...PART-8

************************************************************************************************