4, డిసెంబర్ 2021, శనివారం

నిద్రలేని రాత్రులు...(సీరియల్)...PART-18

 

                                                                               నిద్రలేని రాత్రులు...(సీరియల్)                                                                                                                                                                PART-18 

మనోభారం కొంచంగా తగ్గటంతో పనుల మీద పూర్తిగా శ్రద్ద పెట్టాడు. అందరితో ఆనందంగా కలిసిపోయాడు. ఇలాంటి మార్పులను క్షుణ్ణంగా గమనిస్తూ వచ్చింది సోఫీ.

అదే సమయం హైదరాబాదులో సౌందర్య రెండు పరీక్షలను ఎదుర్కోవలసి వచ్చింది.

మొదటి పరీక్ష ఆమె తండ్రి తీసుకు వచ్చాడు.  ఆమెకు వరుడ్ని చూశాడు. హైదరాబాద్ అమీర్ పేట ప్రాంతంలో స్కూల్ టీచర్ అతను. మంచి జీతం. చిన్న వయసే. అన్ని రకాలుగా సౌందర్య కు సరిపోయేలాగా కనబడ్డాడు.

కానీ...స్వప్నాను తీసుకువెళ్ళటానికి ఒప్పుకోలేదు.

సౌందర్య తల్లి తండ్రులు ఒక నిర్ణయానికి వచ్చారు. స్వప్నాను వాళ్ళే పెంచేటట్టు., సౌందర్య ని పెళ్ళి చేసి పంపిద్దామని ప్లాను వేసుకున్నారు. తల్లడిలిపోయింది సౌందర్య. నిర్ణయాన్ని పూర్తిగా ఎదిరించింది.

స్వప్నానే నా లోకం. దాన్ని వద్దని చెప్పేవారు ఎవరినా సరే నాకు వద్దు అంటూ పోరాడింది.

తరువాత పరీక్ష అనిల్ తల్లి-తండ్రుల దగ్గర నుండి వచ్చింది.

అనిల్ ను కంప్యూటర్లో చూడటం, మాట్లాడటం కుదురుతోందని వరున్ ద్వారా తెలుసుకున్న వాళ్ళు, అబ్బాయిని చూడటానికి, మాట్లాడటానికీ గ్రామం నుండి బయలుదేరి వచ్చారు. వాళ్లను ప్రేమతో స్వాగతించి, మంచిగా గమనించింది సౌందర్య.

కానీ, వాళ్ళు వచ్చిన దగ్గర నుండి వాళ్ళబ్బాయి తిరిగి వచ్చిన వెంటనే గౌరి తో ఎలా ఘనంగా పెళ్లి జరపాలో మళ్ళీ, మళ్ళీ మాట్లాడారు.

పుండు మీద కారం జల్లినట్లు సౌందర్య యొక్క తల్లి-తండ్రులు సంభాషణలో కలుగజేసుకుని, తమ అభిప్రాయాలను పంచారు. అనిల్ పెళ్ళిలో వాళ్ళు ఎటువంటి పనులు చేయగలరో అనేది స్వారశ్యంగా కూర్చుని మాట్లాడుకున్నారు.   

సౌందర్య ప్రశాంతత కోల్పోయిందని ఎవరూ అర్ధం చేసుకోలేదు. వాళ్ళకు అర్ధమయ్యేటట్టు ఎలా చెప్పాలో తెలియక ఆమె కొట్టుమిట్టాడింది.

తన ప్రేమను మొదట అనిల్ కే తెలుపాలి అని నిర్ణయం తీసుకుంది కాబట్టి, అతను వచ్చేంత వరకు పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో అని చింతించింది.

ముందే ప్లాన్ వేసుకున్నట్టు అందరూ ఇంట్లో ఉన్నప్పుడే అనిల్ ను కంప్యూటర్ లో పిలిచారు. అప్పుడు ఒక్కొక్కర్నీ పిలిచి మాట్లాడాడు.

సౌందర్య తో మాట్లాడేటప్పుడు మాత్రం ఎప్పుడూ లాగానే ఆమెకు మాటలు రాలేదు. ఎంతో మాట్లాడాలి అని ఉన్నా మాట్లాడలేకపోయింది.

చివరగా మాట్లాడటానికి కూర్చున్నాడు వరున్. మిగిలిన వాళ్ళందరూ చుట్టూ కూర్చుని గమనిస్తూ ఉన్నారు.

మొదట్లో సౌందర్య తండ్రి ఆమెకు చూసుంచిన వరుడ్ని గురించి చెప్పాడు. దానికి అనిల్ ఏం సమాధానం చెప్పబోతాడో అనేది ఆందోళన పడుతూ గమనించింది సౌందర్య. 

అతను ఖచ్చితంగా చెప్పాడు. స్వప్నాను కూతురుగా అంగీకరించని వరుడూ సౌందర్య కి వద్దు. కూతుర్ని విడిచి ఆమె జీవించలేదు అనేది మనకు తెలియదా?”

అనిల్ మాటలు ఆమె మనసులో పూల వర్షం కురిపించింది. ఆమె మనసు అతన్ని ధన్యవాదాలతో చేతులెత్తి నమస్కరించింది. తనకు కొండలాగా అనిపించిన సమస్యను అనిల్ ఈజీగా పరిష్కరించటాన్ని చూసి ఆశ్చర్యపోయింది. 

ఆయన నన్ను అర్ధం చేసుకున్నంతగా తన తల్లి-తండ్రులు అర్ధం చేసుకోలేదేఅని బాధపడ్డది.

అనిల్ కొనసాగించాడు.  తొందరపడి ఎటువంటి నిర్ణయమూ తీసుకోకండి. ఇంకో రెండు నెలలలో ఇండియా వచ్చేస్తాను. తరువాత మనందరం కలిసి సౌందర్య కి ఇంకా మంచి వరుడ్ని వెతుకుదాం

సూచనను, సలహానూ ఆమె తల్లి-తండ్రులు అంగీకరించారు. అనిల్ కు సౌందర్య మీద ఎంత శ్రద్ధ" అని అనుకుని పొంగిపోయారు.

కానీ, సౌందర్య లోలోపల గొణుక్కుంది. ఈయన నాకు వరుడ్ని వెతికిపెడతారట. ఏం కర్మరా నాయినా

తరువాత గౌరి క పెళ్ళి గురించిన సంభాషణ వచ్చింది.

రెండు నెలలు ఓర్పుగా ఉండండి. లోపు అది చేశానూ, ఇది చేశాను అంటూ ఏదీ చెయ్యకండి -- కాస్త కఠినంగానే చెప్పాడు.

అతని తల్లి-తండ్రులకు అతను చెప్పేది అంగీకరించటం తప్ప వేరు దారి లేదు.

మరోపక్క, ఎక్కువ తృప్తి చెందింది సౌందర్య.

అనిల్ తిరిగి వచ్చేంత వరకు ఇక పెళ్ళి గురించి మాటలు ఉండవు. ఆయన వచ్చిన వెంటనే తిన్నగా మాట్లాడి నా ప్రేమను అర్ధం చేసుకునేటట్టు చేయాలీ అని నిర్ణయించుకుంది.   

                                                                                                                Continued....PART-19

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి