2, డిసెంబర్ 2021, గురువారం

నిద్రలేని రాత్రులు...(సీరియల్)...PART-17

 

                                                                            నిద్రలేని రాత్రులు...(సీరియల్)                                                                                                                                                                PART-17

సోఫియా యొక్క పిలుపును గౌరవించి ఆదివారం మధ్యాహ్నం ఆమె ఇంటికి వెళ్ళాడు అనిల్. కాలింగ్ బెల్ కొట్టినప్పుడు తలుపు తీసింది సోఫియా భర్త పీటర్ సన్.

వెల్కం మిస్టర్. అనిల్...వెల్ కం టు అవర్ హోం -- స్నేహితుని లాగా సేక్ హ్యాండ్ ఇచ్చి లోపలకు తీసుకు వెళ్ళాడు.

సోఫీ కూడా అతన్ని ప్రేమతో స్వాగతించింది. ముగ్గురూ కలిసి మాట్లాడుకోవటం మొదలు పెట్టారు.

నువ్వు చెప్పిన హీరో ఈయనేనా? నమలేకపోతున్నా?”

అనిల్ ను కవ్వించాడు పీటర్ సన్. చాలా రోజుల స్నేహితుడిలా కలిసిపోయాడు.

తరువాత వాళ్ళ మాటలు ఇండియా గురించి మొదలయ్యింది.

ముఖ్యంగా చాలా మంది భారతీయులు చివరి వరకు భార్యా-భర్తలుగానే జీవిస్తున్నారు అనేది ఒక ఆశ్చర్యంగానే భావించారు.

వాళ్ళు భారత దేశానికి రావాలని ఆశపడి ఆహ్వానించాడు. వాళ్ళూ వస్తామని ప్రామిస్ చేశారు.

మధ్యలో అడిగాడు మీ పిల్లలు...?”

అప్పుడే జ్ఞాపకం వచ్చిన దాని లాగ వెనక్కి తిరిగి పిలిచింది సోఫియా.

సుమారు ఎనిమిదేళ్ళ అబ్బాయి, నాలు ఏళ్ల అమ్మాయి పరిగెత్తుకుని వచ్చారు.

వాళ్ళకు అనిల్ ను పరిచయం చేసింది.దిస్ ఈజ్ అంకుల్ అనిల్

పిల్లలిద్దరూ భవ్యంగా అనిల్ ముందుకు వచ్చి నిలబడి నమస్తే చెప్ప...

వీడు మా కొడుకు విలియంస్. కూతురు మెలిండా

తాను తీసుకు వచ్చిన చాక్లెట్లను వాళ్లకు ఇచ్చాడు అనిల్.

ధ్యాంక్స్ అని చెప్పి వాళ్ళు తమ గదికి తిరిగి వెళ్లటానికి రెడీ అవిగా మీరూ మా మాటలలో కలుసుకోవచ్చు అన్నది సోఫీ.

మెలిండా, పీటర్ ఒడిలో కూర్చుంది. విలియంస్ సోఫాలో కూర్చుని తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి ఆడటం మొదలు పెట్టాడు.

విలియంస్...సైలెంటుగా ఉండు ఖండించి చెప్పింది సోఫీ.

వదులు. వాడు ఇష్టపడేటట్టు ఉండనీ కొడుకును సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు పీటర్.

అప్పుడు సోఫీ తో అన్నాడు అనిల్ మీ పిల్లలు మీ మీద కంటే తండ్రి దగ్గరే చనువు ఎక్కువ అనుకుంటా

గుసగుసలు చెప్పినట్టు సోఫీ చెప్పింది. మిస్టర్ అనిల్ ఒక విషయం. విలియంస్ పీటర్ కొడుకు కాదు

ఏమిటీ?”--ఆశ్చర్యపోయాడు అనిల్.

వాడు నా మొదటి భర్తకు పుట్టాడు

అలాగా?” అంటూ మరోసారి ఆశ్చర్యపోతూ పీటర్ మొహం వైపు చూశాడు అనిల్.

వాళ్ళు ఏం మాట్లాడుకుని ఉంటరో అర్ధం చేసుకున్నట్టు అనిల్ ను చూసి చిన్న నవ్వుతో అవును అన్నట్టు తల ఊపాడు పీటర్.

సోఫీ మళ్ళీ చెప్పింది నా మొదటి భర్తకూ, నాకూ జీవితం సాఫీగా సాగలేదు. ఇద్దరం  కూర్చుని మాట్లాడుకుని, ఒప్పుకుని విడిపోయాము. తరువాత పీటర్ ను కలిసాను. అయనే నన్ను ఇష్టపడుతున్నట్టు మొదటిగా చెప్పారు.

మేము చాలా సార్లు కలుసుకుని మా అభిప్రాయాలు పంచుకున్నాం. పెళ్ళి గురించిన నా ఆశను ఆయన అర్ధం చేసుకుని నన్ను అంగీరించారు. ముఖ్యంగా నా కొడుకు విలియంస్ కు మంచి తండ్రిగా ఉండటానికి ఒప్పుకున్నారు.

అదేలాగనే ఆయన ఆశలను నేనూ ఒప్పుకున్నాను. మేము సంతోషంగా జీవిస్తున్నామనేదానికి బహుమతిగా మెలిండా పుట్టింది. తరువాత కూడా పిల్ల మధ్య ఎటువంటి తేడాలు చూపకుండా ఇద్దర్నీ ఒకే విధంగా చూసుకుంటూ వస్తున్నారు పీటర్. ఇప్పుడు విలియంస్ లేకుండా ఆయన లేరు. వాళిద్దరి మధ్య అంత ప్రేమ

విలియంస్ కు ఇది తెలుసా?”

ఇంతవరకుతెలియదు. మేమూ చెప్పబోయేది లేదు. వాడుగా తెలుసుకోవటానికి ఇష్టపడితే తెలుసుకోని అని వదిలేశాము

అనిల్ చూపుల్లో పీటర్ గొప్ప మనిషిగా పెరిగి నిలబడ్డాడు.

నిజ జీవితంలో సాధ్యమే కాదుఅని తాను చెప్పిన దానికి పెద్దగా హడావిడి చెయ్యకుండా నిజ జీవితంలో కూడా సాధించవచ్చు అనేది చూపించటానికే తనని ఇంటికి పిలిచింది సోఫీ అనేది అర్ధం చేసుకున్నాడు అనిల్.

అనిల్ కు సౌందర్య మంచి భార్యగా ఉంటుందనేది తనని చూపించే చెప్పకుండా చెప్పింది అనేది అర్ధం చేసుకున్నాడు.

సోఫీ నే మళ్ళీ మాట్లాడింది. మనం ఒక విషయాన్ని తప్పు అని నిర్ణయించుకుంటే, అది తప్పుగానే అనిపిస్తుంది. దానిని మనం కరెక్ట్ అని నిర్ణయించుకుంటే అది కరెక్టుగానే అనిపిస్తుంది. తప్పు-కరెక్టులు అనేది ఒక విషయాన్ని మనం చూసే విధంలోనే ఉంటుంది.

ప్రారంభ జీవితం సౌందర్య కీ, నాకూ ఒకే లాగా అమరింది. నన్ను బాగా అర్ధం చేసుకున్న పీటర్ దొరకటంతో నా జీవిత ప్రయాణం సాఫీగా సాగిపోతోంది. ఇప్పుడు సౌందర్య ను బాగా అర్ధం చేసుకున్నది నువ్వొక్కడివే. నీ వలన మాత్రమే ఆమె జీవితాన్ని సరిచేయటం కుదురుతుంది. 

చేతిలో బిడ్డతో - ఎవరి ఆదరణ లేకుండా జీవించటం ఎంత దురదృష్టమో తెలుసా! కష్టాన్ని నేనూ కొంతకాలం అనుభవించి ఉన్నాను. నాకైనా చదువుంది. ఉద్యోగం ఉంది. నెల నెలా జీతం వస్తోంది. అందువలన జీవిత పోరాటాలను ధైర్యంగా ఎదుర్కోగలిగాను.

పాపం సౌందర్య! ఇందులొ ఏదీ లేక, ఆదరించటానికి ఎవరూ లేకుండా. అబ్బబ్బా...ఆమె ఎంత కష్టపడుంటుందో? ఇప్పుడు అర్ధమవుతోందా...? నేను ఎందుకు ఆమెకు సపోర్టుగా మాట్లాడానో?" ఎమోషన్ ఎక్కువ అవగా, తడుస్తున కళ్లతో చెప్పింది సోఫీ.

ఎటువంటి జవాబూ చెప్పలేక తడబడ్డాడు అనిల్.

ఆమె మళ్ళీ కొనసాగించింది "నాకు నా మొదటి భర్త, సౌందర్య కు మోహన్, నీకు కవిత మన జీవితంలో మనకు ఏర్పడ్డ అడ్డంకులు. అడ్డంకులను దాటి మన జీవిత ప్రయాణం కొనసాగించాలి.

ఎలా ఒక నది, అది పయనించే దోవలో అడ్డంకులు ఎదురైతే, కొత్త దోవను ఏర్పరుచుకుని పయనాన్ని కొనసాగిస్తుందో...అదేలాగ మనమూ అడ్డంకులను, ఇబ్బందులను దాటి జీవితాన్ని కొనసాగిస్తూనే ఉండాలి.

తిన్నగా అడుగుతున్నా. సౌందర్య పైన నీకు నిజంగానే ఇష్టం ఉంది. మీ కుటుంబ  పరిస్థితులు, పెళ్ళి మీద మీ సమాజం విధించే కట్టుబాట్లు కారణంగా దాన్ని బయటపెట్టలేకపోతున్నావు. ఇంతకంటే సౌందర్య ను పెళ్ళి చేసుకోవటానికి నీకు ఇంకేమీ అడ్డంకులు లేవని నా ఉద్దేశం.

ఆమెకు కూడా నీ మీద ఇష్టం ఉంటుంది. దాన్ని ఆమె బయట పెట్టదు. నేనూ, పీటరూ మనసు విప్పి మాట్లాడుకున్నట్టు మీరిద్దరూ ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకుంటేనే  తప్ప మీ ప్రేమ బయటకు తెలిసే అవకాశమే లేదు. నువ్వే దీని గురించి మొదట సౌందర్య దగ్గర మాట్లాడాలి. మీ ఇద్దరూ కలిసి జీవిస్తే అది ఖచ్చితంగా అద్భుతమైన జీవితంగా ఉంటుంది.

జీవితంలో దెబ్బతిని మెచ్యూర్ అయిన నేను ఇప్పుడు పీటర్ కు తగిన భార్యగా ఉన్నాను. ఇదే నమ్మకంతో చెబుతున్నా...ఆమె కూడా నీకు తగిన భార్యగానే ఉంటుంది

అనిల్ సొఫాలో వెనక్కి వాలి రిలాక్స్ గా కూర్చుని ఆలొచించటం మొదలు పెట్టాడు.

సోఫీ యొక్క మానవత్వపు ఆలొచనలు అతని మనసును ఒక పక్క  అభినందిస్తూనే ఉన్నది.

బాగా ఆలొచించి నిర్ణయం తీసుకో అనిల్ అని చెప్పి ముగించింది సోఫీ.

వాళ్ళ మాటలు ముగింపుకు వచ్చినై అనేది నిర్ధారణ చేసుకున్న పీటర్ రండి మనం మాట్లాడుకుంటూనే  భోజనం చేద్దాం?” అన్నాడు.

....సారీ! మాటల స్వారస్యంతో మర్చిపోయాను. రండి లంచ్ చేద్దాం అని అందరినీ పిలిచింది సోఫీ.

ఆమె తయారు చేసి పెట్టిన వంట రకాలూ, వాటిని వడ్డించిన విధం అతనిపైన ఆమెకున్న అభిమానాన్ని తెలుపుతోంది. తనకొక సహోదరి లేదే అనే అతని కోరికను రోజు సోఫీ తీర్చి పెట్టిన ఫీలింగ్ వచ్చి ఆనందించాడు.

                                                                                                                      Continued...PART-18

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి