8, డిసెంబర్ 2021, బుధవారం

నిద్రలేని రాత్రులు...(సీరియల్)...PART-20

 

                                                                         నిద్రలేని రాత్రులు...(సీరియల్)                                                                                                                                                                PART-20

హైదరబాద్ విమానాశ్రయం.

అనిల్ ను స్వాగతించటానికి అందరూ కాచుకోనున్నారు. స్వప్నను ఎత్తుకుని నిలబడున్నది సౌందర్య.

చెకింగులు ముగించుకుని -- సూట్ కేసులు తీసుకుని అనిల్ బయటకు రావటానికి గంట పడుతుంది అని వరున్ చెప్పాడు. కాచుకోవటం తనని అత్యంత కష్టానికి గురిచేసిందని గుర్తించింది సౌందర్య.  ఒక్కొక్క క్షణమూ గడవటానికి ఒక్కొక్క గంట అవుతున్నట్టు అనిపించింది.

అక్కడ గుమికూడి, వాళ్ళ సొంతవాళ్ల కోసం కాచుకోనున్న బంధువులు, వాళ్ళ రాకతో ఉత్సాహంగా అరుస్తూ స్వాగతించారు. దగ్గరకు వచ్చిన వెంటనే పూల మాలలు వేయటం, పూల చెండులు ఇచ్చి-ముద్దులు పెట్టి ఆనందించారు.

ఎవరనేదే తెలియని ప్రయాణీకులను స్వాగతించటానికి, వచ్చే ప్రయాణీకుల పేరు రాసిన అట్టలను పైకెత్తి పట్టుకుని నిలబడున్నారు కొందరు.

అదిగో అనిల్ వచ్చాశాడు....

అతన్ని చూసిన వెంటనే సౌందర్య గుండె వేగంగా కొట్టుకుంది.

తల్లి-తండ్రులను, మిగిలిన వాళ్ళనూ చూసిన వెంటనే ఆనందంతో చెయ్యి ఊపాడు అనిల్. అందరూ ఉత్సాహంగా అతన్ని చేరుకున్నారు.

అప్పుడు....

నాన్నా... అంటూ పెద్ద అరుపుతో స్వప్నా సౌందర్య చేతిని విదిలించుకుని, వేగంగా పరిగెత్తి అనిల్ కాళ్లను చుట్టుకుంది.

ఎప్పుడో ఒక రోజు పిల్ల దగ్గర అనిల్ ఫోటోను చూపించి నాన్నాఅని చెప్పటం, ‘నాన్నా...నాన్నాఅంటూ అరుస్తూ ఫోటోతో స్వప్నా పరిగెత్తి వెళ్లటం, జ్ఞాపకం వచ్చింది సౌందర్య కు.

స్కూల్ వదిలిన తరువాత పిల్లలందరూ తమ తల్లి-తండ్రుల చేతి వేళ్లను పుచ్చుకుని వచ్చినప్పుడు స్వప్నా మాత్రం తన తాతయ్య చెయ్యి పుచ్చుకుని వచ్చినప్పుడు, అనిల్ ఫోటోను చూపించి నాన్న విమానంలో తిరిగి వస్తారుఅని తల్లి చెప్పటంతో -- లేత మనసులో అది లోతుగా పాతుకుపోయింది అంతవరకు ఎవరూ తెలుసుకోలేదు.

పిల్ల చేష్టతో అదిరిపడి శిలలాగా నిలబడిన అందరూ కొంచం కొంచంగా స్ప్రుహలోకి వచ్చారు.

అనిల్ స్వప్నాను ఎత్తుకుని ముద్దుల వర్షం కురిపించాడు.

ఇంకోసారి అలా పిలవరా బుజ్జీఅన్నాడు.

స్వప్న మళ్ళీ నాన్నా అంటూ అతని మెడను తన చేతులతో పూల మాలగా చుట్టుకుంది.

అందరూ ఆశ్చర్యంతో వాళ్ళిద్దర్నీ చూస్తూ ఉండిపోయారు?

స్వప్న ఏర్పరిచి ఇచ్చిన మంచి సందర్భాన్ని, పూర్తిగా ఉపయోగించ దలుచుకున్నాడు అనిల్.

తన ఆలొచనను అందరూ క్లియర్ గా తెలుసుకోవాలని అనుకుని వరున్ దగ్గరున్న సెల్ ఫోన్ అడిగి తీసుకుని మాట్లాడాడు.

సోఫీ, మీరు వినదలుచుకున్న మంచి న్యూస్ ను వెంటనే చెప్పేయాలని విమాన ప్రయాణంలోనే నిర్ణయించుకున్నాను. కానీ, ఇంత త్వరగా హైదరాబాద్ విమానాశ్రయం నుంచే మంచి న్యూస్ ను మీకు చెబుతానని నేను ఎదురు చూడలేదు. మా అమ్మాయి స్వప్న మా అందరి పనులనూ ఈజీ చేసేసింది. మిగతా విషయాలు ఇంటికి వెళ్ళిన తరువాత మాట్లాడతాను"అని కావాలనే గట్టిగా చెప్పి తన సంభాషణ ముగించాడు.

ఎవరూ ఎదురు చూడని సంఘటనలు ఒక్కొక్కరి దగ్గరా ఒక్కొక్క విధంగా షాక్ ఏర్పరిచింది.

సౌందర్య ముందు తన కుడి చేతిని జాపాడు.

మిగిలిన వాళ్ళందరూ ఏదో ఒక సినిమాలో సీను చూసినట్టు సౌందర్య ఏం చెయ్యబోతోందీఅని ఆశ్చర్యంతో చూస్తున్నారు.

ఆమె బుర్రలో వెయ్యి సీతాకోక చిలుకలు ఎగురుతున్నాయి. సిగ్గుతో మొహం కందిపోయింది. వణుకుతోనూ, తడబడుతూనూ మెల్లగా కుడిచేతిని పైకెత్తటానికి ప్రయత్నించింది. కానీ, అది కూడా ఆమె చెయ్యలేకపోయింది.

అప్పుడు వేగంగా వచ్చిన వరున్, ఎవరూ ఏమీ చెప్పటానికి ముందే ఆమె చెయ్యి పుచ్చుకుని అనిల్ చేతిలో ఉంచాడు.

ఇప్పుడు కూడా నువ్వు తడబడటంలో అర్ధంలేదు సౌందర్యా! ఇది దేవుడు వేసిన ముడి. ఆలొచించకుండా అంగీకరించు అన్నాడు.

సౌందర్య చేతిని గట్టిగా పుచ్చుకున్నాడు అనిల్.

అందరూ చూస్తున్నప్పుడే తాను తీసుకు వచ్చిన వజ్రపు ఉంగరాన్ని ఆమె వెళ్లకు తొడిగాడు.

ఆమెను కొంచం బలవంతంగా లాగినట్టే తన తల్లి-తండ్రుల దగ్గరకు వెళ్ళి నాన్నా అన్నాడు ఒక విధ భయంతో. అతని వలన అంతకు మించి నోట మాట రాలేదు.

కానీ, అతని కంటే ముందుగా  అతని తండ్రి మాట్లాడాడు.

నువ్వేమీ మాట్లాడక్కర్లేదు. పిల్లలూ, దైవమూ ఒకటే నని చెబుతారు. పిల్లే దైవ వాక్కు ఇచ్చిన తరువాత మేము దాన్ని కాదని మాట్లాడం?”

ప్రాణం పోయి తిరిగి వచ్చినట్టు అయ్యింది అనిల్ కు. తండ్రి ఇచ్చిన ధైర్యంతో --దాంతో పాటూ కొంచం బిడియంతో తల్లివైపు తిరిగాడు.

తన భర్త మాటల్లోని న్యాయాన్ని అర్ధం చేసుకున్న దానిగా నువ్వు ఆశపడిన అమ్మాయినే, నువ్వు ఇష్టపడి చేసుకో. నీ సంతోషమే మా సంతోషం  అని మనసారా  చెప్పింది.

కొండలాగా అనిపించిన అడ్డులన్నీ, మంచులాగా వెళ్ళిపోవటం చూసిన అనిల్ అతి సంతోష పడ్డాడు.

జరిగిందంతా నిజమా అని సౌందర్య నమ్మలేకపోయింది. కళ్ళల్లో కన్నీరు పొంగుకు వస్తుంటే వాళ్ళ కాళ్ళ మీద పడి నమస్కరించింది. అనిల్ తల్లి సౌందర్య భుజాలు పట్టుకుని పైకి లేపి కౌగలించుకుంది. ఎందుకంటే వాళ్లకు ఇదివరకే సౌందర్య పైన ఒక  మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆమెను వద్దని చెప్పటానికి మనసు రాలేదు.

ఇక ఎటువంటి అడ్డూ రాదని నమ్మిన అనిల్, తరువాత సౌందర్య యొక్క చెయ్యి పుచ్చుకుని ఆమె తల్లి-తండ్రుల వైపు వెళ్ళాడు.

ఆమె తండ్రి వేగంగా ముందుకు వచ్చి అనిల్ చేతులు పుచ్చుకున్నాడు. తమ్ముడూ, నువ్వు వయసులో చిన్నవాడివి. లేకపోతే మేము నీ కాళ్ల మీద పడి ఉండేవాళ్ళం" అంటూ భావొద్వేగంతో మాట్లాడాడు.

అప్పుడు దగ్గరకు వచ్చాడు వరున్.

అతన్ని చూసిన సౌందర్య తండ్రి, “తమ్ముడూ, మేము జీవితాంతం మీకు రుణపడి ఉంటాము. సౌందర్య కి తోడ బుట్టిన అన్నయ్య ఉండి ఉన్నా, ఈమె మీద ఇంత అభిమానం చూపి ఉండేవాడా అనేది సందేహమే---అన్నాడు వినయంగా. 

సౌందర్య తల్లి కూడా దాన్ని అమోదిస్తూ కన్నీటితో నిలబడున్నది.

తాను ఇంత ధైర్యంగా నడుచుకోవటానికి మూల కారణంగా ఉన్న సోఫీ కి మానసికంగా ధన్యవాదాలు తెలుపుకున్నాడు.

ఏదో స్వర్గంలో తేలుతున్నట్టు అనిపించింది సౌందర్య కి. అర్ధం కాని బ్రమ లాంటి ఫీలింగ్ లో నుండి బయట పడలేకపోయింది.

కష్టమొచ్చినా...సుఖం వచ్చినా తన వలన భరించలేనంతగా వస్తున్నదే అని తలుచుకుని ఆశ్చర్యపడింది.

ఇక్కడ జరిగే విషయాలన్నిటికీ తానే మూల కారణం అనేది అర్ధం చేసుకోలేని స్వప్నా, వాళ్లను వేడుక చూస్తోంది.

విమానాశ్రయం నుండి బయటకు వచ్చిన అందరూ ఇంటికి వెళ్ళటానికి రెండు కార్లు బుక్ చేసుకున్నారు.

సౌందర్య ని తన దగ్గరే కూర్చునేటట్టు చూసుకున్నాడు అనిల్. కారు బయలుదేరి వెడుతూ వేగం పుంజుకున్నప్పుడు అతని మరీ దగ్గరతనం, కారు ఆడుతున్నప్పుడు అతని శరీరం తనని రాసుకోవటం వలన ఏర్పడ్డ సిగ్గు ఆమెను పీక్కుని తిన్నది.

తనలాంటి అమ్మాయిలలో ఎంతమందికి మళ్ళీ ఇలాంటి ఒక కొత్త జీవితం దొరుకుతుంది అని ఆలొచించినప్పుడే తను ఎంత పెట్టి పుట్టుకుందో అని అనుకున్న వెంటనే అన్ని దైవాలకూ ధన్యవాదాలు తెలిపింది.

తన కష్టాలన్నీ ముగిసిపోయి, రోజు తన జీవితంలో కొత్త వసంతం పూయటాన్ని తలుచుకుని పూరించిపోయింది. అనిల్ చేతిని తన చేతితో గట్టిగా పట్టుకుంది. అది అందించిన శాంతమైన సుఖం  మెల్ల మెల్లగా అతని భుజాలపై వాలిపోయింది.

పలు నెలలుగా నిద్రలేని రోజులను చవి చూసిన ఆమె కళ్ళు, పగలు లోనూ...అంతమంది మధ్యలోనూ ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాయి.

                                                                         ***********************************

మౌలాలి రైలు స్టేషన్. ప్లాట్ ఫారం చివరగా ఉన్న బెంచ్.

అనిల్, సౌందర్య కూర్చుని ఆనందంగా మాట్లాడుకుంటున్నారు.

స్వప్నా వాళ్ళిద్దరి చుట్టూ తిరుగుతూ ఆడుకోగా...

అప్పుడు ఒక రైలు వచ్చింది.

అది చూసిన అనిల్ సౌందర్య దగ్గర అడిగాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటావా?”

...హాపీగా! నన్ను కాపాడటానికి మీరు నాతోనే ఉన్నప్పుడు, నేను ఎన్నిసార్లు అయినా రైలు ముందు దూకటానికి రెడిగా ఉన్నాను అని చెప్పిన ఆమె అదేలాగా నిలబడ్డది.

పడి పడి నవ్వాడు అనిల్. సౌందర్య కూడా నవ్వులో కలుసుకుంది. తమని మర్చిపోయి నవ్వుతున్న జంటను రైలులో ప్రయాణం చేస్తున్న పలు దంపతుల కళ్ళు వేడుక చూసుకుంటూ వెళ్ళినై.

కానీ, అందులో ఒక జంట కళ్ళు మాత్రం వాళ్ళను, వాళ్ళపై విరక్తితోనూ, కడుపు మంటతోనూ చూసినై.

అవి... కవిత యొక్క కళ్ళు!

నేను అనుకున్నది నిజమే. మంచికాలం...తప్పించుకున్నాను అని తృప్తిగా వెళ్ళిపోయినై.

పాపం కవిత...

ఆరోజూ సరి, రోజూ సరి...ప్రేమ గురించిన గొప్పతనాన్ని ఆమె అర్ధం చేసుకోలేదు!!

మీరు ఏమిటి అర్ధం చేసుకున్నారా?

పెళ్ళిళ్ళు రైల్వే స్టేషన్లలో కూడా రాసిపెట్టున్నాయి అనే కదా?

చాలా కరెక్ట్!

                                                                                        (సమాప్తం)

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి