'పవిత్ర'...(సీరియల్) PART-5
పౌర్ణమి చంద్రుడు
వెన్నెలను
విరజిమ్ముతున్నాడు.
మేడపైన
అటూ
ఇటూ
నడుస్తూ
ఏదో
ఆలొచిస్తున్నాడు
మనో.
అతని
మనసు
ఎన్నో
రకాల
ఆలొచనలతో
గందరగోళ
పడుతుంటే, ఆలొచిస్తూ
తమ్ముడ్ని
వెతుక్కుంటూ
వచ్చింది
పవిత్ర.
“మనో”
“అక్కా...”
“ఏమిట్రా...టైము
పదకుండు
అవుతోంది.
నువ్వింకా
భోజనం
చెయ్యకుండా
ఇక్కడ
ఏం
చేస్తున్నావురా?”
“ఆకలి లేదక్కా”
“ఎందుకని”
“తెలియటం లేదు”----నీరసంగా చెప్పి
నడిచి
వెళ్ళటానికి
ప్రయత్నించిన
అతని
భుజం
పట్టుకుని
ఆపింది.
“మనో”
“ఊ...”
“ఏమిట్రా...ఎందుకలా
మూడ్
-- అవుట్ గా
ఉన్నావు?”
“అ...అలాగంతా
ఏమీ
లేదక్కా
–
ఏమీలేదు”
“అబద్దం చెప్పకు!
నీ
మొహం
చూసే
నీ
మనసును
కనిపెట్టగలను”
“అక్కా”-- ఆశ్చర్యపోయాడు
తమ్ముడు.
“చెప్పు...ఏమిటి
నీ
సమస్య?”
“సమస్య అంటూ
ఏమీ
లేదక్కా...నాకు...నాకు
ఇప్పుడు
పెళ్ళి
అవసరమా?”
“ఎందుకురా అలా
అడుగుతున్నావు?”
“వద్దక్కా. నేను
కూడా
నీలాగా
ఉండిపోతాను” బాధ పడుతూ
చెప్పిన
అతని
గడ్డం
పుచ్చుకుని
తలపైకెత్తింది.
అతని
కళ్ళల్లో
నీళ్ళు.
ఆందోళన
పడ్డది.
“రేయ్...”
“చేసుకోలేనక్కా...నిన్ను
ఈ
పరిస్థితిలో
వదిలేసి
నేను
ఎలా?”
“నువ్వూ అమ్మలాగా
మాట్లాడకు.
నేను
జీవించిన
దానిని. నాకోసం నువ్వెందుకు
నీ
యౌవనాన్ని, జీవితాన్నీ
పాడుచేసుకుంటావు?”
“లేదక్కా, నేను...”
“మాట్లాడకు! ఈ
నిర్ణయం
ఎప్పుడో
తీసుకోనుండాలి.
పాపం...మన
వలన
అమ్మకు
ఎంత
మనో
కష్టం?”
“లేదక్కా. గుడిలో
ఎవరో
మన
గురించి
అడిగుంటారు.
అందుకే
అమ్మ
అలా
మాట్లాడుంటుంది.
రెండు
రోజుల్లో
నార్మల్
అయిపోతుంది.
అంతలో
నువ్వు
తొందరపడి
మాట
ఇచ్చావు?”
“లేదురా. ఇది
తొందరపడి
తీసుకున్న
నిర్ణయం
కాదురా.
నీకూ
వయసు
అవుతోంది!
నీకొక
పెళ్ళి
చేయాలే? ఇన్ని
రోజులు
నా
కోసమే
జీవించావు.
ఇక
నీ
కొసం
కూడా
జీవించాలి
కదా?”
“ఏంటక్కా...వేరు
చేసి
మాట్లాడుతున్నావు?”
“లేదు మనో.
ఇన్నిరోజులు
నేను
స్వార్ధంగా
ఉండిపోయాను
అనిపిస్తోంది”
“అక్కా”
“నా గురించి
మాత్రమే
నేనూ, నువ్వు
ఆలొచిస్తూ
ఉండి
పోయుంటాము. అమ్మ
యొక్క
ఆవేధన, బాధలూ
చూసావా...నీ
జీవితం
గురించి
ఆలొచించనే
లేదే?”
“అవునక్కా...ఆలొచించకుండానే
వదిలేసాము”
“ఆ తప్పు
మళ్ళీ
చేయకూడదనే
నీ
పెళ్ళి
మాటలు
ఎత్తేను.
నువ్వు
దేని
గురించి
ఆలొచించకుండా
భొజనం
చేసి
పడుకో.
జరగవలసినదంతా
బాగానే
జరుగుతుంది”
“లేదు...నేను...”
“ఏమీ మాట్లాడకు!
మొదట
వచ్చి
భొజనం
చెయ్యి”
“వెళ్ళక్కా...తరువాత
తింటాను”
“రేయ్...ఇప్పుడు
టైమెంతో
తెలుసా? మధ్యరాత్రా
తింటావు? రారా”
“అక్కా”
“ఏమిట్రా?”
“నువ్వు చివరిదాకా
ఇలాగే
ఉండబోతావా?”----తడబడుతూ
అడిగిన
మనో
వైపు ఆశ్చర్యంగా చూసింది
పవిత్ర.
“....................”
“అతనే ఇంకొకత్తిని
పెళ్ళి
చేసుకుని
వెళ్ళిపోయాడు.
ఏ
తప్పూ
చేయని
నువ్వు
ఎందుకక్కా
ఒంటరిగా
నిలబడాలి? నీకేమైనా
వయసైపోయిందా? ఇప్పుడు
చెప్పక్కా
‘ఊ' అని
ఒక్క
మాట.
నీకు
ఎలాంటి
పార్ట్
నర్
ను
తీసుకు
వచ్చి
నిలబెడతానో
చూడు” అన్న మనోని
చూసి
వద్దు
అని
తల
ఊపి
చెప్పింది.
“లేదురా...అది
సరి
రాదురా”
“ఎందుకని...ఈ
ఊరుని
చూసి
భయపడుతున్నావా?”
“ఛఛ...ఊరేమిట్రా
పెద్ద
ఊరు? బాగా
బ్రతికితే
మనల్ని
చూసి
ఈర్ష్య
పడుతుంది.
కష్టపడితే
పరిహాసం
చేస్తుంది.
ఊరుకోసమో...బంధువులకోసమో
నేను
ఏ
రోజూ
భయపడింది
లేదు”
“మరి ఇంకేంటక్కా”
“నీకు తెలుసు.
మనం
ఎలా
పెంచబడ్డమో...ఎలా
పెరిగామో?”
“అ...క్కా...”
“మన ఇల్లు...అమ్మమ్మ
ఇల్లు...ఇవి
రెండూ
లేకపోతే
గుడి
అంటూ
మన
ప్రపంచం
చాలా
చిన్నాదిరా.
అలాగే
కదా
మనం
పెరిగాము.
రంగు
రంగుల
బట్టలు
వేసుకుని, ఊరంతా
తిరిగింది
లేదే.
నాటకం, సినిమా, పార్టీలు, పబ్బులు
అంటూ
దేనికీ
వెళ్ళింది
లేదు.
రంగు
రంగుల
సినిమా
పుస్తకం
గూడా
చూసింది
లేదు.
మనకు
తెలిసిందంతా
నాన్న
పెట్టుకున్న
రామాయణం, మహాభారతం
లాంటి
పుస్తకాలు
చదివే
కదా
పెరిగాము.
సావిత్రి, నలాయణీ, సీత
పతివ్రతలను
దేవతలుగా
ఆరాధించాము!
అలాంటి
దారిలో
వచ్చిన
నేను
ఎలారా
ఇంకో
పెళ్ళి
గురించి
ఆలొచించను?”-- పవిత్ర నిదానంగా
అడగటంతో, విరిగిపోయాడు
మనోహర్.
పిల్లలను వెతుక్కుంటూ
వచ్చిన
తల్లి-తండ్రులు
కూడా
శిలలాగా
నిలబడిపోగా, పవిత్ర
నవ్వుతూ
మళ్ళీ
మాట్లాడింది.
“అందుకని ఆడది
రెండో
పెళ్ళి
చేసుకోవటం
తప్పు
అని
నేను
చెప్పటం
లేదు.
అది
వారి
వారి
మనస్థత్వాలకు
చెందింది.
చేతిలోనో--కడుపులోనో
బిడ్డలతో
ఎంతో
మంది
అనాధలుగా, విధవ
మహిళలను
చూస్తున్నప్పుడు
మనసు
అల్లాడిపోతోంది.
వాళ్ళకు
మరు
జీవితం
ఇచ్చే
మగవాళ్లకు
చేతులెత్తి
దన్నం
పెట్టాలని
అనిపిస్తోంది.
కానీ
నేను
విధవను
కాదే? నా
మెడలో
తాళి
కట్టినవాడు
బ్రతికే
ఉన్నాడే.
అలా
ఉన్నప్పుడు
ఎలా
ఇంకొక
తాళి
కట్టించుకోను? అది
అసహ్యం
కాదా?”
“అయితే...అతను
చేసింది
మాత్రం
కరక్టా?”
“లేదురా. తప్పు
చేసిన
ప్రతి
ఒక్కరూ
ఏదో
ఒక
విధంగా
శిక్ష
అనుభవిస్తారు.
అతను
కూడా
అనుభవిస్తాడు”
“నాకు ఆ
నమ్మకం
లేదు”
“దాని గురించి
మనం
బాధపడక్కర్లేదు.
నా
పెళ్ళప్పుడు
అగ్ని
సాక్షిగా
ప్రమాణం
చేశాను.
సంతోషం
లోనూ, బాధల్లోనూ
మనసును
దృఢంగా
ఉంచుకుని
ఆయనతో
కలిసే
ఉంటానని
. ఇంకొకరికి మనసులో
కూడా
తావు
ఇవ్వను
అని.
నేను పతివ్రతను.
ఎలాంటి
సందర్భాలలొనూ
మాట
జారిపోనివ్వను.
గెలుపో...ఓటమో...నా
జీవితంలో
పెళ్ళి
అనే
సంఘటన
జరిగి
పూర్తి
అయ్యింది.
ఇక
దేని
గురించి
మాట్లాడొద్దు”
“......................”
“దేవుని యొక్క
ప్రతి
ఒక్క
పనికి
ఒక
కారణం
ఉంటుందని
నాన్నగారు
చెప్పేరే!
అలాంటిదే
ఇది
అని
అనుకుంటాను.
ఆ
మనిషి
నన్ను
వదిలి
వెళ్ళబట్టే
కదా
ఇంత
చదువు
చదివి, జీవితంలో
పైకెదిగాను? లేకపోతే
కన్నీరు, వేదనతో
ముడుచుకుపోయుంటానే?
ఇప్పుడు నాకు
ఎలాంటి
వేదన...ఏ
బాధా
లేదు.
చాలా
సంతోషంగా
ఉన్నాను.
ఆత్మ
తృప్తితో
జీవిస్తున్నాను.
నాకు
ఇది
చాలు.
అమ్మలాగానే
నువ్వు
కూడా
మాట్లాడి
నన్ను
పిరికిదాన్ని
చేయకు!
నేను
ఎప్పుడు
తల
ఎత్తుకునే
నిలబడాలని
ఇష్టపడుతున్నాను”
“లేదక్కా. ఇక
మీదట
నీతో
ఇలా
మాట్లాడను.
సారీ
అక్కా”
“ఇప్పుడే నువ్వు
నా
తమ్ముడివిరా”---అతని చేతులు
పుచ్చుకుని
తనతో
తీసుకు
వెళ్ళటానికి
వెనక్కి
తిరిగినప్పుడు, తల్లీ-తండ్రులు
అక్కడ
నిలబడటం
అప్పుడే
గమనించారు.
“అమ్మా...నాన్నా...మీరింకా
నిద్రపోలేదా?”
“నా బంగారు
తల్లీ...ఎంత
మాటలు
మాట్లాడావు.
నేను
కూడా
ఇలా
లోకజ్ఞానమే
తెలుసుకోలేని
పిల్లను
కన్నానే? అని
తలచుకుని
బాధపడ్డాను.
భర్తను
అనుసరించి
వెళ్ళటం
తెలియలేదే
అంటూ
నీ
దగ్గర
కోపగించుకున్నాను.
కానీ నా
బిడ్డ...ఎంత
పెద్ద
మనిషో? ఏమండీ...మన
అమ్మాయిని
మనం
బాగానే
పెంచాము.
ఇది
బంగారం...ప్యూర్
బంగారం”
“అది నీకు
ఈ
రోజే
తెలిసిందనుకుంటా?”---ఓర్పు
కలిసిన
స్వరంతో
గోపాలకృష్ణ
అడుగగా, నవ్వింది
స్వరాజ్యం.
“అవును. నేనే
మూర్ఖంగా
ఉండిపోయాను.ఆ
వెధవ
కొసం
ఎన్ని
రోజులు
నేను...”
“అమ్మా, అయిపోయిందాని
గురించి
మాట్లాడ
కూడదు.
ఇక
మీదట
జరగబోయే
మంచి
విషయాల
గురించే
మాట్లాడాలి” ---ఖచ్చితమైన స్వరంతో
పవిత్ర
చెప్పగా, నోరు
మూసుకున్నారు
కన్నవాళ్ళు.
“మాట్లాడనమ్మా మాట్లాడను.
జరగవలసిన
కార్యాలన్నిటినీ
తండ్రీ, కొడుకులు
చూసుకోండి”
"అది
మేము
చూసుకుంటాం.
ముందు
మీరిద్దరూ
వెళ్ళి
పడుకోండి.
నువ్వు
రా
మనో
"
-- తమ్ముడితో కిందకు
దిగింది.
మనో మొహం ఇంకా ఆందోళనగా ఉండటం చూసిన పవిత్ర బాగా కన్ ఫ్యూజ్ అయ్యింది. ఆమె కన్ ఫ్యూజన్ కు మరునాడే సమాధానం దొరికింది.
Continued...PART-6
ఈ 'పవిత్ర ' సీరియల్ ను పూర్తి నవలగా ఒకేసారి చదవాలనుకుంటే: 'పవిత్ర '...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2
*************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి