మిణుగురు పురుగులు…(సీరియల్) (PART-10)
“ఎప్పుడురా
ఓపనింగ్ సెర్మనీ?”
“ఓపెనింగ్
సెర్మీనీనా...ఏమిట్రా చెబుతున్నావు?”
“మరేమిట్రా...?
ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ప్రేమిస్తున్నట్టు నటిస్తూ ఉంటావు? బోరు కొట్టటం లేదూ? ఆమెతో పరిచయమయ్యి, తిరగటం మొదలుపెట్టి దగ్గర దగ్గర యాభై రోజులు అవుతోంది. ఇంకో పదిరోజులైతే
రెండు నెలలు నిండుతాయి. ఒక్క రోజు కూడా వదలకుండా స్టార్ హోటల్లో తిన్నందువలన ఐదు
కిలోలు బరవు ఎక్కాను. అంతకు తప్ప లాభమేమీ లేదు...! ఇంకా చాలా రోజులు దాటు కుంటూ
వెళ్లకూడదు. చాలురా ప్రేమిస్తునట్టు నటించటం. టక్కుమని విషయానికి వచ్చాయి...”
అశ్వినీకుమార్
ఆలొచంచాడు. ఇంకా అతని లోతైన మనసు అతనికే నచ్చలేదు. ఏది కావాలో అన్నది తెలియటం లేదు. దేనికోసం
కాచుకున్నాడో అనేది అతనికే అర్ధం కాలేదు. శృతికాను అనిభవించే తీరాలి అనే తీవ్రత, వెర్రి ఇతనికి లేవు.
“ఏమిట్రా
అలా ఆశ్చర్యంతో చూస్తున్నావు...?” -- మళ్ళీ రమణానే ప్రశ్న
అడగగా...ఇతను తల ఊపుకుంటూ “ఏమీ లేదు...” అన్నాడు.
“అయితే
రేపే పెట్టుకుందామా?”
“రేపా...?”
“ఏరా...ఏదైనా
అడ్డా?”
"ఊహూ...అదంతా ఏమీ లేదు..."
“ఏమీ లేదంటే
రేపే ముగించేద్దాం”
“స...రీ...”
“ఏమిటి
సరీ అంటూ లాగుతున్నావు? ఏమిటి ఆలొచన?”
“లేదు.
ఈ బలాత్కారం అవసరమా...కావాలా అని ఆలొచిస్తున్నాను”
“ఈ
పిల్ల...అమ్మా రామ్మా అంటే వచ్చే పిల్ల కాదు!”
ఒక్క క్షణం మౌనంగా
దీర్ఘంగా ఆలొచించిన అశ్వినీకుమార్ విరక్తిగా అడిగాడు.
“ఏరా...ఎందుకురా
మనం ఇలా ఒక్కొక్క అమ్మాయిని అనుభవిస్తూ వస్తున్నాం...? ఇందులో
మనం ఏం సాధించాము...?”
“ఏమిట్రా
ఇది...?" అంటూ ఆశ్చర్యపోయిన రమణ, “హఠాత్తుగా ఎందుకురా ఇలా వేదాంతం మాట్లాడటం మొదలు పెట్టావు...?”
“లేదు
రమణా. నాకు రాను రాను దేనిమీదా ఇష్టం లేకుండా పోతోంది. అన్ని విసుగెత్తి పోయినై.
ఎవరినీ చూడటానికి నచ్చలా. ఏదీ నచ్చలేదు”
“అమ్మాయలు
కూడా నచ్చలేదా?”
“వాళ్లే
ముఖ్యంగా నచ్చలేదు”
“పోరా...నువ్వేదో
ఒత్తిడితో మాట్లాడుతున్నావు!”
“అది
నాకు ఎప్పుడూ ఉందిరా”
“ఎందుకోసం
ఆ ఒత్తిడి అని ఆలొచించి చూసావా...?”
“అదే
తెలియటం లేదు! ఏదో జుస్ట్ ఒత్తిడి కాదు. మనసులో ఏదో ఒక కచ్చె, ఆక్రోషం ఏర్పడుతోంది. లోపల నుండి ఏదో నన్ను కంట్రోల్ చేస్తోంది.
హింసిస్తోంది. రాను రానూ ఆ హింస ఎక్కువవుతోంది. తట్టుకోలేకపోతున్నాను. ఈ హింస
తట్టుకోలేక ఏదైనా చేసేస్తానేమోనని భయంగా ఉంది”
“ఏమీ
చెయ్యవురా! మనసును ఇలా ఇష్టం వచ్చినట్టు తిరగనివ్వకు. ఆ తరువాత ‘సైకో’ అయిపోతావు. నేను చెప్పినట్టు విను. రేపు ఆ శృతికాను
పిలుచుకు వచ్చి...”
గబుక్కున మధ్యలో
అడ్డుపడి అడిగాడు అశ్వినీకుమార్.
“ఎక్కడికి?”
“వేరే
ఎక్కడికి...ఇక్కడికే! ఈ ఇంట్లోనే...ఇదిగో నీ గదిలోనే”
“లేదు...ఇక్కడికి
వద్దురా. ఈ చోట నేను ఎవర్నీ బలవంతం చేసి, మొసం చేసి సాధించ
దలుచుకోలేదు. అది నాకు ఇష్టం లేదు”
“మరి
ఇంకెక్కడ పెట్టుకుందాం?”
“ఖచ్చితంగా
పెట్టుకోవాలా?”
“చాలా
ఖచ్చితంగా పెట్టుకోవాలి. నాకు కావాలి. నేను వదిలిపెట్ట దలుచుకోలేదు”
రమణ స్వరంలో ఉన్న
తీవ్రత అశ్వినీకుమార్ను ఒక్క క్షణం షాకులో ఉంచింది. నేను వద్దన్నా, వాడు శృతికాను వదిలి పెట్టడు అని
అనిపించింది...కొంచంసేపు లోతుగా ఆలొచించి చెప్పాడు.
“సరే...ఎక్కడైనా
రూము బుక్ చెయ్యి...”
“ఎక్కడైనా
అంటే...హోటల్లోనా?”
అశ్వినీకుమార్ నోరు
తెరిచి మాట్లాడేలోపు గూర్కా తలుపు తట్టాడు.
ఏమిటన్నట్టు చూసాడు అశ్వినీకుమార్.
“జీ...మిమ్మల్ని
చూడటానికి ఎవరో ఒకాయన సైకిల్లో వచ్చున్నారు. ఖచ్చితంగా, తప్పక
మిమ్మల్ని చూసేకావాలంటున్నారు”
“పేరు
అడిగావా...?”
“అడిగాను.
కామేష్ అని చెప్పారు"
కామేష్ అనే పేరును
తన జ్ఞాపకాలతో వెతికి ఓడిపోయిన అశ్వినీకుమార్, “ఎవర్రా...నీకు తెలుస్తోందా...?” అని రమణ ను అడుగ...అతనూ పెదాలు విరిచాడు.
ఎవరనేది తెలుసుకోవాలనే ఆతురతతో కామేష్ని రమ్మని చెప్ప... కామేష్ గడ్డి నేల మీద
నడుస్తూ వస్తున్నది చూసిన రమణ చిన్నటి స్వరంతో చెప్పాడు.
“అశ్విన్...వచ్చేదెవరో
తెలుసా? శృతికా అత్తయ్య కొడుకో...మావయ్య కొడుకో ఒకడు
ఉన్నాడని చెప్పానే...వాడేరా...”
‘అతను
ఎందుకు ఇల్లు వెతుక్కుని వస్తున్నాడు?’ అంటూ అశ్వినీకుమార్
ఆలొచిస్తున్నప్పుడే కామేష్ ఒక బిడియంతో ‘హాలులో’కి వచ్చాడు. కొంచం కూడా అర్హత లేని చోట, సంధర్భంలోనూ
నిలబడి సిగ్గు పడుతూ ఎమోషన్ తో మెల్లగా తనని పరిచయం చేసుకున్నాడు.
"నా పేరు కామేష్.
శృతికా యొక్క బంధువును"
అశ్వినీకుమార్
మౌనంగా కామేష్ నే చూస్తూ ఉంటే... రమణ నిర్లక్ష్యంగా అడిగాడు.
“బంధువు
అని తలాతోకా లేకుండా చెబితే ఎలా? ఏం బంధుత్వం అని
తెలుసుకోవచ్చా...?”
“దానికి
ముందు మీరెవరో నేను తెలుసుకోవచ్చా...?”
“నేను
ఎవరైతే నీకేమిటయ్యా...? నా గురించి నువ్వు తెలుసుకోవలసింది
అనవసరం”
గబుక్కున చెయ్యెత్తిన
అతన్ని అడ్డుకుని,
“నువ్వు
కొంచం మాట్లాడకుండా ఉండు రమణా " అన్నాడు అశ్వినీకుమార్. ఆ తరువాత కామేష్ ను
చూసి,“కూర్చోండి...” అన్నాడు.
సోఫా చివర్లో
అతుకున్నట్టు కూర్చున్న కామేష్ 'చెప్పటానికి వచ్చిన విషయాన్ని ఎక్కడ...ఎలా ప్రారంభించాలి?’ అనేది అర్ధంకాక ఒక క్షణం కన్ ఫ్యూజ్ అయ్యాడు. ఆలొచించుకుంటూ వచ్చినదంతా మర్చిపోయినట్లు
అనిపించ...మెల్లగా అశ్వినీకుమార్ ను చూశాడు.
ఆ ఇంకొకని కంటే వీడు
మేలు అనే భావనతో, ఇతన్నేశృతికా
ప్రేమిస్తున్నట్టు చెప్పింది గుర్తుకురాగా, తృప్తిగా
అనిపించినా భయం భయంగా చెప్పాడు.
“మీ దగ్గర
ఒంటరిగా మాట్లాడాలి”
“మాట్లాడండి”
అతను ఆలోచనతో రమణ ను
చూడ, ఆ చూపును అర్ధం
చేసుకున్న అశ్వినీకుమార్, “అతను నా స్నేహితుడే! అతనికి తెలియని
రహస్యం ఒకటి కూడా లేదు. అందువలన మీరు దారాళంగా చెప్పవచ్చు”
అన్నాడు.
ఆ తరువాత బిడియంతో, సంకట పడుతూ ప్రారంభించాడు కామేష్.
“నేను
శృతికా యొక్క మావయ్య కొడుకును. ఆమె తండ్రి చనిపోయినప్పటి నుండి ఆ కుటుంబానికి ‘గార్డియన్’ లాగా ఉంటూ కాపాడుతూ వస్తున్నా. డిపార్ట్
మెంట్ షాపు చూసుకుంటున్నాను. ఏదో సుమారైన సంపాదన వస్తోంది. అందులోనే పరువు,
మర్యాదతో ఇంతవరకు జీవితాన్ని నడుపుతున్నాను.
ఇక మీదట కూడా అలాగే
నడపాలనే ఆలొచనతోనూ, ఆ
కుటుంబం బాగుండాలనే అక్కర ఉన్నవాడిని...కష్ట నష్టాలలో పాలు పంచుకునే వాడిగా
ఇక్కడకు వచ్చాను..."
అతను కొంచం
ఆపినప్పుడు ‘మీ
మాటలకూ, నాకూ ఏమిటి సంబంధం?’ అన్నట్టు
అతన్ని చూశాడు అశ్వినీకుమార్. ఆ చూపులు ఏర్పరచిన వేగంతో మళ్ళీ మొదలుపెట్టాడు కామేష్.
“ఏమిటలా
చూస్తున్నారు...? మీకు తెలియంది ఏదీ నేను చెప్పటానికి
ఇష్టపడటం లేదు. సంబంధం లేని విషయమూ మాట్లాడటానికీ రాలేదు!
నేనేం మాట్లాడబోతానో
మీకు కొంత తెలిసే ఉంటుంది. దగ్గర దగ్గర రెండు నెలలుగా శృతికా కాలేజీకి సరిగ్గా
వెళ్ళలేదు. సరిగ్గా వెళ్ళలేదు ఏమిటి...వెళ్లనే లేదు. ఆమె మీతోనే తిరుగుతోంది.
పెద్ద పెద్ద హోటల్స్, సినిమా, మాల్స్ అంటూ
వెళ్లని చోటు బాకీలేదు. చుట్టు పక్కలున్న వాళ్ళు మాట్లాడేంత విషయంగా ఇది
మారిపోయింది. అందరూ నవ్వుకునేంత పరిస్థితికి వచ్చింది. శృతికా తమ్ముడు, పదమూడేళ్ల కుర్రాడు నాతో ఒంటరిగా మాట్లాడాడు. కన్నీరు కార ఏడుస్తున్నాడు.
‘దీని
ఎలాగైనా ఆపండి బావా! అని బ్రతిమిలాడుతున్నాడు. అమ్మ చెవికి వినబడితే ఆత్మహత్య
చేసుకుంటుందీ అని చెబుతున్నాడు. ఇది నిజం...ఈ విషయం అత్తయ్యకు తెలిస్తే నిజంగానే
ప్రాణం వదిలేస్తుంది...”
మళ్ళీ
ఆపి...ఎండిపోయిన పెదాలను నాలికతో తడుపుకుని రాసుకుంటునప్పుడు మధ్యలో అడ్డుపడి
కోపమూ, ఆత్రము తో
అరిచాడు రమణ.
“అవునూ...ఈ
కథంతా చెప్పటానికా అక్కడ్నుంచి మమ్మల్ని వెతుక్కుంటూ పరిగెత్తుకు వచ్చావు...”
చటుక్కున తిరిగి
అతన్ని చూసిన కామేష్ కళ్ళు విరుచుకున్నాయి. మాటలు వేగంగా వచ్చినై.
“ఇదంతా
మీకు కథలాగానే అనిపించవచ్చు. కాలక్షేపంగా తెలియవచ్చు. కానీ మాకు అలా కాదు. ఇది
మాకు జీవిత సమస్య. గౌరవ సమస్య. పరువు సమస్య. జీవితానికీ, చావుకూ
మధ్యలో ఊగుతున్న సమస్య. శృతికాకు ఏదైనా ఒకటి జరిగితే ఆ కుటుంబమే ముక్కలైపోయి నాశనం
అయిపోతుంది...?”
“దానికి
మేము ఏం చేయగలం అనుకుంటున్నారు? మీ అమ్మాయిని ఖండించండి.
మాతో తిరగకూడదని అడ్దుపడి ఆపండి...”
“అది
కుదురుతుందంటే నేనెందుకు ఇక్కడదాకా వస్తాను? చెబితే వినే
మనిషిగా ఆమె ఉండుంటే...ఎందుకు ఇంత కష్టం? మీరు ఆమెతో
మాట్లాడి మట్లాడి ఆమె బుర్రను మరింత మొండిగా చేశారు! మధ్యవర్తుల కాళ్లమీద పడటం
కంటే, గొడవపడే వాళ్ల కాళ్ళ మీద పడటం మేలు అనుకునే ఇక్కడికి
వచ్చాను...”
“దానికి
మా దగ్గరకు వస్తే మేము ఏం చేయగలం?”
కామేష్ ఇప్పుడు రమణ
ను వదిలిపెట్టి తిరిగి అశ్వినీకుమార్ ను చూశాడు. “లేదు...ఇంత అయిన తరువాత పెళ్ళి పోస్ట్ పోన్
చేయడం మంచిది కాదు అని చెప్పటానికే వచ్చాను...”
"పెళ్ళా?" అంటూ షాకై చూశాడు అశ్వినీకుమార్.
“ఎవరికి
పెళ్ళి?”
“మీకూ,
శృతికాకూనే"
“అరే...ఛీ!” అంటూ విపరీతమైన కోపంతో అరిచాడు అశ్వినీకుమార్.
“ఏమిటీ
మూర్ఖత్వం! ఎప్పుడైనా నేను పెళ్ళి గురించి మాట్లాడేనా అని మీ ఇంటి అమ్మాయిని
అడగండి...”
“ఆమే...మేము
ఒకర్ని ఒకరం మనసారా ప్రేమించుకుంటున్నాము. పెళ్ళి చేసుకోబోతామూ అని చెప్పిందే”
“అనవసరంగా
కలలు కనడం, ఊహించుకోవటం ఆమెగా చేసుకోనుంటే దానికి నేనా
బాధ్యుడ్ని?”
“అలాగంటే
మీరు ఏం చెబుతున్నారు? ఆమెను పెళ్ళి చేసుకోబోయేది లేదు
అంటున్నారా?”
“ఆమెను
మాత్రమే కాదు...వేరే ఏ అమ్మాయినీ నేను పెళ్ళి చేసుకోలేను. కారణం, నేను అమ్మాయలను మనసారా ద్వేషిస్తున్నాను”
“ఆడపిల్లలను
ద్వేషిస్తున్నారంటే ఎందుకు మా ఇంటి అమ్మాయితో స్నేహం చేస్తున్నారు?”
“అది....అదొచ్చి...” -- అశ్వినీకుమార్ తడబడ -- రమణ అతని సహాయానికి వచ్చాడు.
"నువ్వు
శాంతంగా ఉండు అశ్విన్. నేను ఇతన్ని చూసుకుంటాను. ఇలా చూడయ్యా...అమ్మాయలతో తిరగటం
మా సరదా, మా ఇష్టం. మాకు
అదొక ఆటలాగా! అందరమ్మాయలనూ పిలుచుకు వెళ్ళినట్టే మీ ఇంటి అమ్మాయినీ పిలిచాము.
వచ్చింది...తీసుకు వెళ్లాము. అంతే!
ఇన్ని రోజులు ఆమెపై
మా వేలిగోరు కూడా పడకుండా నడుచుకున్నాం. కానీ, ఇక మీదట అలా నడుచుకునేది లేదు. రేపే ఆమెను
తీసుకు పోయి...మిగిలిన అమ్మాయలను ఎలా వాడుకున్నామో ఈమెనూ అలాగే వాడుకోబోతాము.
ఆ తరువాత మిగిలిన
అమ్మాయలకు ఇచ్చినట్టు ఈమెకూ డబ్బులు ఇస్తాము. కావాలంటే ఏదో చెప్పావే...కుటుంబం, గౌరవం...దానికొసం డబ్బులు కొంచం ఎక్కువే
ఇస్తాం. తీసుకుని వెళ్లమను. ఇప్పుడే ఆ డబ్బును నీ దగ్గర ఇవ్వాలన్నా కూడా మాకు ఎటువంటి
అభ్యంతరమూ లేదు”
కామేష్ కు ఒళ్లంతా
వణక, రక్తం వేగంగా
బుర్ర వైపుకు వెళ్ళింది.
“రేయ్...ఏమిట్రా
చెప్పావు?” అంటూ ఏకవచనంతో అతను ప్రారంభించ,
“అరే
పోరా...” అనే విధంగా జవాబుగా అరిచాడు. “పెద్ద న్యాయస్తుడిలాగా మాట్లాడటానికి వచ్చాడు. నువ్వు చాలా మంచి
వాడిలాగానూ, మీ ఇంటి అమ్మాయి కన్య లాగా మాట్లాడుతున్నావు...”
“ఏమిటి...ఏమిటి
చెప్పావు?”
“నిజం
చెబితే కోపం ముంచుకు వస్తోందో? అంత అందమైన అమ్మాయి ఇంట్లో
ఉంటే బావ వరస, కుటుంబ గార్డియన్ అని నిన్ను వేరే
చెప్పుకుంటున్నావు...ఇన్ని రోజులు ఆమెను వదిలిపెట్టుంటావా?”
ముగించేలోపు అతనే
ఎదురు చూడని విధంగా కామేష్ అతని మీద ఎగిరి, అతన్ని కిందకు తోసి మొహం, చెంపలు,
ఛాతి అంటూ మార్చి, మార్చి కొట్ట...జవాబుగా రమణ
అతనిపై దాడి మొదలుపెట్టాడు.
ఇద్దర్నీ
విడదీయటానికి ప్రయత్నించి ఓడిపోయిన అశ్వినీకుమార్...గూర్కానీ, తోటమాలిని సహాయానికి పిలిచి కామేష్ ను బయటకు
తోసేయమన్నాడు.
తరువాతి నిమిషం ఇంటి
వాకిలిలో ఉన్న గడ్డినేల మీద విసిరివేయబడ్డ కామేష్ లేచి,
కట్టుకున్న పంచెను
సరిచేసుకుంటూ, ఆగ్రహం, ఏడుపు, ఏమీచేయలేని తనం కలవ,
“బాగుపడరురా
దుర్మార్గుల్లారా! నాశనం అయిపోతారు...” అంటూ శాపం ఇచ్చిన అదే
సమయం,
ఇంట్లో నుండి
ఉరిమేడు రమణ.
“ఇంత
జరిగిన తరువాత ఆ అమ్మాయిని వదలకూడదు అశ్విన్. ఇప్పుడే వెళ్ళి రూము బుక్ చేస్తాను.
రేపు ప్రొద్దున మొదటి పనిగా ఆమెను తీసుకువెళ్దాం!”
Continued...PART-11
***************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి