మిణుగురు పురుగులు…(సీరియల్) (PART-8)
సినిమా ముగిసి
తిరిగి శృతికాను వీధి చివర దింపేసి తిరిగినప్పుడు ఎక్కువగా అలసిపోయున్నాడు అశ్వినీకుమార్.
అన్నీ అయిష్టంగానూ, సూన్యంగానూ ఉన్నట్టున్న భావనలో ఉన్నాడు. లోపల ఏర్పడ్డ
మరోప్రదేశంలో మునిగి శ్వాస ఆడక కొట్టుకున్నట్టు అనిపించింది.
‘నువ్వు ఏది చేసినా నా దగ్గర నుండి తప్పించుకోలేవు!’
అంటూ లోతైన మనసులో
నుండి ఏదో నవ్వి, ఎగతాలి చేసి అతన్ని తరుముకుని వస్తున్నట్టు అనిపించింది.
అమ్మ రూపంలో...ఆలొచనల రూపంలో...ఇంకా దీర్ఘంగా చూస్తే అతని రూపం కూడా అతన్ని
తరుముతోంది.
‘ఏదీ నన్ను వదిలిపెట్టి తరుము చూస్తాను?’
-- ఛాలెంజ్ గా చెప్పి,
‘ఓహో...హో’
అంటూ ఘోరంగా నవ్వి,
ఎగిరి గంతులేసి,
“ఓ...స్టాప్
ఇట్!”
అతను నోరు తెరిచి
పెద్దగా అరవటంతో భయపడి పోయి గబుక్కున కారు ‘బ్రేక్’ వేసి ఆపాడు రమణ. తిరిగి చూసినప్పుడు అశ్విన్ ఎక్కువ చెమటతో
తడిసున్నాడు. మొహమంతా ఎర్రబడి కందిపోయుంది. చూపు కత్తి చివర షార్ప్ నేస్ లా
మెరిసింది. ఎక్కడో ఇంకో లోకంలో ఉన్న అతన్ని ముట్టుకుని,
ఊపి చెయ్యి ఎత్తి,
తరువాత వద్దనుకున్న రమణ
“ఏమైంది అశ్విన్?”
అని అడిగాడు.
అప్పుడే నిద్రలో
నుండి మేల్కొన్న వాడిలాగా కళ్ళను నలుపుకుంటూ రమణ ను చూసిన అశ్వినీకుమార్ “ఏమిటి?”
అన్నాడు.
“ఎందుకు
ఇప్పుడలా అరిచావు?”
“అరిచానా...నేనా? నేనెక్కడ అరిచాను?”
ఇంకాస్త భయం
ఎక్కువైన రమణ అతన్ని జాలిగా చూశాడు. “వాట్స్ రాంగ్ విత్ యూ అశ్విన్?”
“నతింగ్!”
“ఆర్
యు ఆల్ రైట్?”
“అఫ్ కోర్స్ ఐయాం ఆల్ రైట్”
“సరే” అంటూ నమ్మకం లేని వాడిలాగా తల ఊపాడు రమణ. ఆ తరువాత భయపడుతూ అడిగాడు.
“ఇప్పుడు
తిన్నగా ఇంటికి వెళ్లనా?”
“ఇంటికా?" అన్నప్పుడు అతని నరాలు బిగుసుకున్నాయి. చూపుల్లో కోపం
ఎక్కింది. పళ్ళు కొరుక్కున్నాడు.
అతనిలోని మార్పులను
గమనించిన రమణ “ఈజీ...ఈజీ
మ్యాన్...” అంటూ తొడ మీద చేయి వేసి అతన్ని శాంత పరుస్తున్న
వాడిలాగా మాట్లాడాడు.
“ఇంటికి
వెళ్ళి నీ బెడ్ రూములో బాల్కనీలో కూర్చుని రెండు పెగ్గులు విస్కీ కొడదామని చూసాను”
“ఊహూ...ఇప్పుడు
నాకున్న గజిబిజి మనసుకు రెండు పెగ్గులు సరిపోవు”
“అలా
ఏమిట్రా నీకు మనోబాధ?”
“చెప్పినా నువ్వు అర్ధం చేసుకోలేవు రమణ”
రమణ ఒక్క క్షణం
ఆలొచించి, తరువాత నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టాడు.
“నిజంగానే
నాకు నిన్ను అర్ధం చేసుకునేది కష్టంగానే ఉన్నది అశ్విన్. ఒక్క క్షణం ఉన్నట్టు,
మరు క్షణం ఉండవు.
మొహాన హద్దులు లేని కోపం తెలుస్తోంది. అది చూస్తుంటే నాకే భయంగా ఉంది.
కాసేపటి ముందు కూడా
నీ మొహం అలాగే ఉన్నది. శరీరంలోని నెత్తురంతా మొహానికి చేరుకున్నట్టు మొహమంతా
ఎర్రని ఎరుపెక్కింది. నీ చూపులు సాన పట్టిన కత్తిలాగా షార్పుగా ఉన్నది. పొత్తి
కడుపులో కెలికినట్లు అయి ఒక భయం ఏర్పడింది. నువ్వెందుకెలా అయిపోతున్నావు అశ్విన్?
కారణమేమైనా
తెలుస్తోందా నీకు?”
“నేను ఎలాగూ అవలేదు! సాధారణంగానే ఉన్నాను. నువ్వుగా ఏదేదో
కల్పించుకుని కారణం అడిగితే ఎలా చెప్పగలను...?”
దాని తరువాత రమణ ఏమీ
అడగలేదు. అడిగినా అతని దగ్గర నుండి సరైన జవాబు రాదు. చిటపటలాడుతాడు,
విసుక్కుంటాడు,
కోపగించుకుంటాడు --
లేకపోతే పిచ్చి పట్టిన వాడిలాగా అరుస్తాడు.
కొద్ది రోజులుగానే అశ్వినీకుమార్
ఒకే రకంగా ఉండటం లేదు. వ్యత్యాసంగా నడుచుకుంటున్నాడు. విపరీతంగా కోపం
తెచ్చుకుంటున్నాడు. హఠత్తుగా మనో పరిస్తితి బాగలేని వాడిలాగా కనబడుతున్నాడు.
ఏర్పాటు చేసి తీసుకు వచ్చే ఎక్కువ ఆడపిల్లలను కూడా ముట్టుకున్నది కూడా లేదు.
కొన్ని సమయాలలో
మూర్ఖత్వంగా గొంతు పట్టుకుని బయటకు తోస్తున్నాడు. కొందరి ఆడపిల్లలతో వాళ్ళ కుటుంబాల
గురించి విచారించాడు.
“నీకు
పెళ్ళి అయిందా...?”
ఆ అమ్మాయి మౌనంగా
నిలబడుతుంది.
“అలాంటప్పుడు
నువ్వెందుకు ఈ వృత్తికి వచ్చావు?”
“..........................”
“మీ ఆయన ఏం చేస్తున్నాడు?”
“నాతోపాటూ లేరండీ! ఎక్కడికో పారిపోయారు”
“అందుకే
ఈ వృత్తికి వచ్చావా?”
“.............................”
“ఏం...వేరే పనేమీ దొరకలేదా?”
“....................”
“సరి...నీకు పిల్లలు ఉన్నారా?”
“ఉన్నారు”
“ఎంతమంది?”
“ఒకే అబ్బాయి”
“నిజమా!
అబ్బాయికి ఎంత వయసు?”
“పది”
“నువ్వు
చేస్తున్న వృత్తి గురించి వాడికి తెలుసా?”
“తెలియదండీ!”
“నిజంగానే
తెలియదా?”
“ప్రామిస్ గా తెలియదండీ. ఇంట్లో ఈ వృత్తి చేయను. ఎవరినీ ఇంటి
పక్కకే రానివ్వను”
“మా
అమ్మకంటే నువ్వు బెటరే?”
అతను అన్నది ఆమె
చెవులకు వినబడకపోవటంతో, “ఏమిటండీ...?” అన్నది.
“ఏమీ
లేదు. ఇదిగో డబ్బు. నీ రేటు కంటే పైన రెండు రెట్లు ఇచ్చాను-పెట్టుకో. ఇక ఈ వృత్తి
చేయకు. అందులోనూ నీ కొడుక్కు తెలిసేటట్టు ఎప్పుడూ చేయకు...పో. ఇక మీదట ఈ ఇంటి వైపు
తల చూపకు” అంటాడు.
ఆమె వెళ్ళిన తరువాత రమణ
అడిగాడు. “ఏరా
రేయ్...ఆమె ఈ రోజుతో ఈ వృత్తి వదిలేస్తుందని అనుకుంటున్నావా?”
“వదిలిపెడుతుందో, లేదో...ఆమెను ముట్టుకున్న పాపం నాకు వద్దు”
“ఇందులో
పాపం ఎక్కడ్నుంచి వచ్చింది?”
“నువ్వు వాగుతావురా! అలాంటి అమ్మకు కొడుకుగా ఉంటే
అర్ధమవుతుంది. ఇక మీదట ఇలాంటి అమ్మాయలను తీసుకురాకు. ఆ కొడుక్కి తల్లి నడవడిక
గురించి తెలిసినప్పుడు వాడి మనసు చాలా నొప్పి పుడుతుంది. నలిగి పోతుంది. హింస
పడుతుంది. అలాంటి ఒక పిల్లాడు హింసపడటానికి నేను కారణంగా ఉండటం నాకు ఇష్టం లేదు!”
కొన్ని సమయాలలో
తల్లి కాని ఆడపిల్లలను...అంటే ఇరవై ఏళ్ళు దాటని యుక్త వయసు అమ్మాయిని కూడా తన వేలు
తగలకుండా, డబ్బులిచ్చి తిరిగి పంపించాడు. "ఏమిట్రా...?"
అని అడిగితే జవాబు
రాదు.
ఆ తరువాత రమణ కూడా
అడగటం ఆపుకున్నాడు. అశ్వినికుమార్ ఇక ఇలాంటి అమ్మాయిలను పిలుచుకురావద్దని రమణ
దగ్గర చెప్పాడు. అశ్విన్ కి ఆడపిల్లల మీద వ్యామోహం,
బలహీనం లేదు అనేది రమణ
అప్పుడు అర్ధం చేసుకున్నాడు.
‘అశ్వినికుమార్ వేరే దేనికోసమో అలా నడుచుకుంటున్నాడు. దేన్నో
వెతుక్కుని వెళుతున్నాడు. ఖచ్చితంగా ఇది
అమ్మాయల పిచ్చి, ఆశ కాదు. అనుభవించాలనే తపన లేదు. పిచ్చి లేదు. వీటి వెనుక ఇంకేదో
లోతుగా ఒక కారణం ఉందీ. అదే అతని ఒత్తిడికి కూడా కారణం అని ఊహించుకున్నాడు.
ఆ కారణం ఏమయ్యి
ఉంటుంది... దాని వెనుక ఉన్న కథో ఏమిటో తెలుసుకోవటానికి రమణ ఇష్టపడలేదు.
అతని ఎమోషన్స్ అర్ధం చేసుకోలేదు. దీని
ద్వారా తన ఆదాయాన్ని మాత్రం చూసుకుంటూ పోవడం వలన అశ్వినికుమార్ మనో వికారంతో
ఎక్కువ బాధకు గురి అవుతున్నాడని అర్ధం చేసుకున్నాడు. ప్రశ్నలు అడగటం మానేసి...అతన్నిఅతని ఇష్టానికి
వదిలేశాడు.
ఇప్పుడు కూడా అతని ఇష్టప్రకారమే జరుగుతున్నది
ఆన్నట్టు, “ఎక్కడికి వెళ్ళను...ఇంటికి వెళ్ళిపోనా?”
అంటూ మళ్ళీ అడిగాడు.
అశ్వినికుమార్ అసరీర వాణిలాగా “సరే” అంటూ తల ఊప...తరువాతి ఐదు నిమిషాలలో ఇంటి
పోర్టికోలో కారు నిలబడ్డది. అశ్వినికుమార్ కిందకు దిగాడు. పోర్టికో తప్ప మిగిలిన
ప్రాంతమంతా చీకటిగా ఉండటం గమనించాడు.
ఇతను వచ్చి ఐదు నిమిషాలు
అయిన తరువాత కూడా తలుపులు తెరవబడలేదు. పనివాళ్ళందరూ వెనుక వైపు గుమికూడి బాతాకానీ
కొడుతున్నారు. వాదనలు చేసుకుంటున్నారు. ఇతను వచ్చిన కారు శబ్ధం చెవులకు వినిపించకుండా,
లైట్లు వేయకుండా,
తలుపు కూడా
తెరవకుండా మాట్లాడుకుంటున్నారు.
ఇతనిలో గుప్పుమని
మంటలు అంటుకున్నాయి. కాలింగ్ బెల్లుపైవేలుపెట్టి నొక్కే ఉంచాడు. ఆ శబ్ధానికి
పనివాడు వచ్చి తలుపు తెరిచేలోపు తలుపును ఒక తన్ను తన్నాడు. తలుపు తెరుచుకుంది.
లోపలకు వెళ్ళిన
వెంటనే టీపా మీద ఉన్న పూలతొట్టెను తీసి కిందపడేసి విరక్కొట్టాడు. అంతకుపైన అక్కడ
నిలబడటం ఇష్టం లేక వేగంగా మెట్లు ఎక్కి తన గదికి వెళ్ళాడు. రమణ లోపలకు వచ్చిన
వెంటనే గది తలుపును ధబేలుమని తోసి మూసి, డ్రస్సు మార్చుకుంటున్నప్పుడు,
అతను మెల్లగా
అడిగాడు.
“నీకెందుకిలా
కోపం వస్తోంది అశ్విన్?”
“వస్తుంది ! ఇల్లు ఎలా ఉందో చూశావా?
లైట్లు వేయటానికి
మనుషులు లేరు. తలుపులు తెరవటానికి మనుషులు లేరు. తింటావా అని అడగటానికి,
తోడు ఉండి భోజనం
పెట్టటానికి, ఆరోగ్యం బాగుండకపోతే గమనించుకోవటానికి...దేనికీ మనిషి లేరు.
ఇల్లా ఇది? దీంట్లోకి వస్తున్నప్పుడు కోపం రాకుండా వేరే ఇంకేం వస్తుంది?”
“సరే...వదులు! ఏం కావాలి?
బీరు తాగుతావా...లేక
విస్కీనా?”
“ఎప్పుడూలాగానే విస్కీనే కలుపు...”
మొదటి రెండు
పెగ్గులు తాగిన తరువాత...మూడో పెగ్గు ముగిస్తున్నప్పుడు అడిగాడు అశ్వినికుమార్.
“ఏరా రమణా...ఇంతవరకు
నువ్వు తీసుకువచ్చిన అమ్మాయిలందరూ ఆ వ్యాపారంలో ఉన్నవారేనా?”
ఇంతలొ ఎక్కువ
మత్తులో ఉన్న రమణా, "ఏమిట్రా అడిగావు?" అని గొణిగాడు.
"ఇంతవరకు
నువ్వు పిలుచుకు వచ్చిన అమ్మాయిలందరూ దీన్నే ప్రొఫెషన్ గా పెట్టుకున్న వారే కదా
అని అడిగాను”
“అవునురా!”
“ఎవరినీ
మనం బలవంతం చేయలేదే”
“లేదురా!”
“ఎవరి
ఇష్టానికి విరుద్దంగా మనం నడుచుకోలేదే?”
“ఊహూ”
“ఒకర్ని
కూడా మోసం చేయలేదే?”
“లేనే లేదు”
“ఇప్పుడు
ఈ అమ్మాయిని మోసం చేయాలని అనుకుంటే కష్టంగా ఉందిరా”
“ఏ
అమ్మాయినిరా?”
“అదే...ఆ శృతికాను!"
“ఛీ...దీనికంతా
మనసు కష్టపెట్టుకోవచ్చా?”
“పోరా...నీకు దేనికీ కష్టం లేదు. ఈ అమ్మాయిని మోసం చేసి మనం
చెయ్య బోయేది ‘రేపింగ్’ కు సమం రా”
“దేనికి
సమమో...మనం చేస్తున్నాం”
“వద్దురా...నాకెందుకో
ఆ అమ్మాయిని వదిలేయాలని అనిపిస్తోంది”
“పోరా
పిరికివాడా. నువ్వు కావాలంటే వదిలేయ్. నేను వదిలిపెట్టను. ఐ వాంటు ఎంజాయ్ హర్!”
--చెప్పుకుంటూ అతను
మరో పెగ్గు విస్కీ కలిపినప్పుడు...నుదిటి మీద మడతలు పడ,
తీవ్రంగా ఆలోచించటం
ప్రారంభించాడు అశ్వినికుమార్!
Continued...PART-9
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి