చిన్నారి చిన్న కోరిక (కథ)
వాస్తవం కంటే ఊహే గొప్పది...నిజ ప్రపంచం కంటే మనసు సృష్టించుకునే ప్రపంచమే గొప్పది.
అనాధ బాలుడైన పిచ్చాయికి ఒక చిన్న కోరిక. ఆ కోరిక కూడా వాడికి, వాడ్ని దగ్గరకు చేర్చుకుని ఆదరణ చూపిన బొమ్మల బామ్మ వలన కలిగింది. రోజూ బొమ్మల బామ్మ తో కలిసి ఆమె బొమ్మలమ్ముకునే చోట ఆమెతో పాటూ కూర్చుంటాడు. కానీ మద్యాహ్నం ఒంటిగంట అయ్యేసరికి పక్కనున్న స్కూలు దగ్గరకు వెడతాడు.
అక్కడ లంచ్ టైములో తల్లులు తమ పిల్లలకు లంచ్ పెడుతున్న దృశ్యం చూడటానికి. లంచ్ టైము అయిపోయిన తరువాత, బామ్మ దగ్గరకు తిరిగి వస్తూ మార్కెట్ వీధిలో ఉన్న బట్టలకొట్టు లోని అలంకారపు బొమ్మను కాసేపు చూస్తూ నిలబడతాడు.
పిచ్చాయి రోజూ లంచ్ టైముకు ఆ స్కూల్ గేటు దగ్గరకు ఎందుకు వెల్తున్నాడు? అడుక్కోవడం నచ్చని పిచ్చాయి, పిల్లలు మిగిల్చిన ఆహారాన్ని వారి తల్లులు ఇస్తుంటే ఎందుకు తింటున్నాడు? బట్టల కొట్టు దగ్గర నిలబడి అలంకార బొమ్మను ఎందుకు తదేకంగా చూస్తాడు?... వీటన్నిటికీ సమాధానం కోరిక!
ఆరేళ్ళ పిచ్చాయికి ఉన్న ఆ కోరిక ఏమిటో? తెలుసుకోవటానికి ఈ కథను చదవండి.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకును క్లిక్ చేయండి:
చిన్నారి చిన్న కోరిక...(కథ)@ కథా కాలక్షేపం-1
************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి