9, మే 2021, ఆదివారం

భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ అంకెలకు జనభా లెక్క కూడా కారణమేమో?... (ఆర్టికల్)

 

                        భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ అంకెలకు  జనభా లెక్క కూడా కారణమేమో?                                                                                                            (ఆర్టికల్)

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు కరోనా మహమ్మారి విజృంభణ తగ్గడం లేదు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక..బెడ్లు దొరకక నానా కష్టాలు పడుతున్నారు. దేశంలో గడిచిన 24 గంటల్లో వరుసగా నాలుగో రోజు కొత్తగా 4,03,738 కరోనా కేసులు నమోదు కాగా, 4,092 మంది కరోనాతో మృతి చెందారు.

కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవాన్ని అరికట్టడానికి అమెరికా దేశంతో సహా, మన దేశ రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు దేశ వ్యాప్త లాక్ డౌన్ ఒకటే పరిష్కారం అని చెబుతున్నారు. లాక్ డౌన్ వలన కరోనా విలయతాండవాన్ని అరికడతారో లేదో తెలియదు గానీ, భారత ఆర్ధీక అభివ్రుద్దిని అరికట్టగలరు. ఎందుకంటే అక్టోబర్ నెలలో తర్డ్ వేవ్ వస్తుందని చెబుతున్నారు. తర్డ్ వేవ్ ను అరికట్టటానికి కూడా దేశవ్యాప్త లాక్ డౌన్ మాత్రమే పరిష్కారమా?......ఇలా ఎన్ని సార్లు చేయగలరు? కరోనా ఫలాన రోజుతో పూర్తిగా కనిపించకుండా పోతుందని, ఎవరైనా ఖచ్చితంగా చెప్పగలరా? చెప్పలేరు...అగ్ర రాజ్యాలు కూడా చెప్పలేవు? ప్రపంచ జనాభా మొత్తంలో చివరి మనిషికి కూడా వాక్సిన్ వేశేసేమని చెప్పగలిన రోజున మాత్రమే కరోనాతో ఇక ప్రపంచానికి భయం లేదని చెప్పగలరు. ఇది ఎప్పటికి జరుగుతుంది? తెలియదు

అందువలన కరొనాను ప్రజలే అడ్డుకోవాలి. తమ దగ్గరకు అది రాకుండా చూసుకోవాలి. చూసుకుంటూ తమ తమ పనులు చేసుకుంటూ పోవాలి. ఆర్ధీకంగా నిలదొక్కుకోవాలి. అప్పుడే కరోనా ఉన్నా, మనం గెలువగలం. కరోనాకు మందుగాని(ట్యాబ్లెట్ లేక కాప్స్యుల్)లేక ఇంజెక్షన్ గాని కనిపెట్టేంతవరకు, అవి మనకు అందుబాటులోకి వచ్చినప్పుడు కరోనాకు మనం పూర్తిగా భయపడ కుండా ఉండొచ్చు.

ఇవన్నీ ఇప్పట్లో చోటు చేసుకునేవి కాదు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి దానికీ కేంద్రాన్ని తప్పు పట్టకుండా, రాజకీయాలకు అతీతంగా కేంద్రంతో కలిసి పనిచేస్తే చాలా వరకు మనం కరోనాను కట్టడి చేయగలం.

నిజానికి గణాంకల ప్రకారం చూస్తే అన్ని దేశాల కంటే మన దేశమే కరోనాను ధైర్యంగా ఎదుర్కొంటూ, దాని తీవ్రతను తగ్గించిందని చెప్పవచ్చు.

ఒక్క సారి గణాంకాలు చూద్దామా:

జనాభా లెక్కలు ఇలాగున్నాయి:

అమెరికా  - 33.1 కోట్లు.....రష్యా -14.6 కోట్లు…. జర్మనీ  - 8.5 కోట్లు….తుర్కీ - 8.4 కోట్లు….. యూ.కే - 6.8 కోట్లు….ఫ్రాన్స్ - 6.5 కోట్లు….ఇటాలీ  - 6.1 కోట్లు….. స్పన్ - 4.7 కోట్లు…..పోలండ్ - 3.8 కోట్లు…. రొమేనియా - 1.9 కోట్లు…. నెదర్లాండ్ - 1.7 కోట్లు…..గ్రీస్ - 1.7 కోట్లు….. బెల్జియం…. -1.2 కోట్లు….. జెక్ రిపబ్లిక్ - 1.1 కోట్లు ….పోర్చుగల్ - 1.1 కోట్లు…. స్వీడెన్ - 1 కోటి…. హంగేరీ - 1 కోటి….స్విజర్లాండ్ - 0.9 కోట్లు…..బల్గేరియా - 0.7 కోట్లు…..డెన్మార్క్ - 0.6 కోట్లు……….మొత్తం - 105. 3 కోట్లు.  

మిగిలిన 25 చిన్న యూరోపియన్(యూరోపియన్ దేశాలు మొత్తం 44) దేశాలలో కలిపి ఉన్న జనాభా: 6 కోట్లు….యూరోప్: - 105.3 + 6 = 111.3 కోట్లు.

బ్రెజిల్(21.2 కోట్లు) మరియూ అర్జెంటీనా(కోట్లు )దేశ జనాభాను కలిపితే….111.3 కోట్లు + 25.65 కోట్లు = 136.95 కోట్లు.

అలా, చివరకు మనం మన భారత దేశ జనాభా సంఖ్య వద్దకు వచ్చాము: 136 - 138 కోట్లు.

భారత దేశంలో కోవిడ్ 19 ను మేనేజ్ చేయటం యొక్క చిక్కు మొత్తం యూరప్,యుఎస్ఎ, బ్రెజిల్ మరియు అర్జెంటీనాలో మేనేజ్ చేయటం అపారమైన పని.

భారత దేశంలో ఒక్కసారి విజృంభణ చేస్తే అది పెద్దగానే ఉంటుంది, దీనిని మేనేజ్ చేయటం చాలా పెద్ద సవాలు.

కరొనా మహమ్మారిని అరికట్టాలంటే, అది ప్రజల చేతుల్లోనే ఎక్కువగా ఉంది.

మాస్కులు తప్పని సరిగా వేసుకోవటం, అది కూడా సరిగ్గా వేసుకోవటం, భౌతిక దూరం పాటించటం, అవసరమైతేనే బయటకు వెళ్లటం, గుంపుకు దూరంగా ఉండటం, గుంపు చేరకపోవడం, సబ్బుతో చేతులు కడుక్కోవడం(వీలుంటే సానిటైజర్ తో తుడుచుకొవడం), భయపడకుండా వాక్సిన్ వేసుకోవటం...ఇవి ప్రతి మనిషీ చేస్తేనే మనం కరోనా మహమ్మరిని అరికట్టగలం.

Images Credit: To those who took the original photos.

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి