మానవత్వం (సీరియల్/నవల)
PART-11
ప్రాణం ఇచ్చిన తల్లీ - నీకు నా శరీరం, అందులోని వస్తువులు, ఆత్మ...అన్నిటినీ నీకు కానుకగా సమర్పించుకుంటాను.
తన ముందు నిలబడ్డ యువతిని ఆశ్చర్యంగా చూశాడు చీఫ్ డాక్టర్.
"ఏంటమ్మా చెబుతున్నావు...కిడ్నీ దానం చెయ్యబోతావా?"
"అవును డాక్టర్! మా తాతయ్య రామారావు గారు ఇక్కడ అడ్మిట్ అయ్యున్నారు! ఆయన బ్లడ్ గ్రూపూ, నా బ్లడ్ గ్రూపూ ఒకటే. నా కిడ్నిని తాతయ్యకు పెట్టండి"
"చూడటానికి చిన్న పిల్లలాగా ఉన్నావే? ఒక్క దానివే వచ్చావు! కిడ్నీలను అలా హఠాత్తుగా తీయలేమమ్మా. దానికి కొన్ని నియమ నిభందనలూ, పరీక్షలూ, పరిశోధనలూ ఉన్నాయి"
"ఏమేమి పరీక్షలు చేయాలో చేసుకోండి. నేను రెడీగానే ఉన్నాను. ఎలాగైనా తాతయ్యను కాపాడండి డాక్టర్"
"ఉండమ్మాయ్! టెస్టులు తీయటానికి ముందు కిడ్నీ ఇచ్చే వాళ్ళ బంధువుల సంతకాలు కావాలి. మీ అమ్మా-నాన్నలను తీసుకొచ్చావా?"
"లేదు డాక్టర్!"
"ఏం?"
"నాకు నాన్న లేరు"
"సారీ....అయితే మీ అమ్మను తీసుకురా?"
"సారి డాక్టర్. ఆమె ఇప్పుడు ఊర్లో లేదే"
"నో...నో...వాళ్ళ అనుమతి లేకుండా మేము ఏమీ చెయ్యలేము"
"డాక్టర్ ప్లీజ్...మొదట తాతయ్య ప్రాణం కాపాడండి. ఆ తరువాత..."
"చూడమ్మాయి...ఇదేమీ నువ్వు ఆడుకునే ఆట కాదు. శరీరంలో ఉండే ముఖ్యమైన అవయవం తీసి ఇస్తున్నావు. ఇది ఎవరికీ తెలియకుండా ఎలా చేయగలవు? నువ్వేమో చిన్న పిల్లవు. రేపే సమస్య వస్తే....?"
"డాక్టర్....... పరిస్తితిని కొంచం అర్ధం చేసుకోండి. అమ్మమ్మ మా మీద కోపంగా ఉన్నది. నేను కిడ్నీని ఇస్తున్నానని తెలుసుకుందా కచ్చితంగా ఆవిడ వొప్పుకోదు. అందుకనే ఎవరికీ తెలియకుండా వచ్చాను. ప్లీజ్ డాక్టర్...ఆలశ్యం చెయ్యకండి"
“నీ ఆరాటం అర్ధం అవుతోంది. కానీ, మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓక పని చెయ్యి. మీ అమ్మను వెంటనే బయలుదేరి రమ్మను. ఆవిడ ‘ఓకె’ అంటే పరీక్షలు మొదలు పెడదాం"
"డాక్టర్..."
"సారీ...మీ అమ్మగారు వస్తేనే...లేకపోతే నేనేమీ చెయ్యలేను"
"ఎక్స్ క్యూస్ మి డాక్టర్" అన్న గొంతువిని అధిరిపడి వెనక్కి తిరిగి చూసింది జయ.
"కమిన్" అన్న అనుమతి పిలుపుతో లోపలకు వచ్చిన యామిని అక్కడ జయ ఉండటం చూసి ఆశ్చర్యపోయింది.
" జయా! నువ్వేమిటి ఇక్కడ? ఎప్పుడొచ్చావు?"
"అది...అది...ఇప్పుడే వచ్చానమ్మా తాతయ్య ఆరొగ్యం గురించి అడిగి తెలుసు కుంటున్నా"
జయ తడబడటంతో డాక్టర్ చూపులు ఒకసారి జయా వైపుకు వెళ్ళి తిరిగి యామిని వైపుకు వచ్చాయి.
"మీరు....ఈ అమ్మాయికి బంధువులా?"
"ఈ అమ్మాయి మా అమ్మాయి డాక్టర్"
"ఓ...మీ అమ్మాయా! ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా?”
"దేనికి?"
"తన కిడ్నీని దానం చేయడానికి"
"ఏమిటీ?" ఆశ్చర్యంతో కూతురు వైపు చూసింది.
జయ మౌనంగా నిలబడింది
"ఏమిట్రా ఇదంతా?"
"మీరు ప్రయత్నించిన చోట వెంటనే కిడ్నీ దొరికే చాన్సే లేదని చెప్పారటగా. నాదీ, తాతయ్యదీ ఒకటే బ్లడ్ గ్రూప్ కదా? అందుకని నేనే కిడ్నీ ఇద్దామని వచ్చాను. ఈ శరీరం మీరు పెట్టిన బిక్ష. ఇందులోని ఒక్కొక్క అవయవం మీ నాన్నకు సరిపోతుందంటే...అమ్మమ్మ మాంగల్యాన్ని కాపాడుతుందంటే నా హృదయాం ఇవ్వటానికైనా నేను సిద్దంగా ఉన్నాను"
" జయా...!"
“ఈ హృద్యయాన్ని ఇవ్వటానికి నా ప్రాణం అడ్డుగా ఉంటే ఆ ప్రాణాన్ని వదలాడినికైనా నేను సిద్దమే"--అంటున్న కూతురు నొరు మూసింది.
"ఎందుకే అంత పెద్ద మాటలు?"
"డాక్టర్ మీ అనుమతి కావాలని అడుగుతున్నారు. మీరు అనుమతి ఇస్తే ఇప్పుడే అన్ని పనులూ మొదలు పెడతారు. సరేనని చెప్పమ్మా...ప్లీజ్"
"అవసర పడొద్దు! కొంచం వైట్ చేద్దాం"
"మనం వైట్ చెయ్యచ్చు. కానీ తాత ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందే? ఆలొచించకమ్మా! ఒక కిడ్నీ ఇచ్చినందువలన నాకు ఏ ఆపద రాదు. డాక్టర్...అమ్మతో కొంచం మాట్లాడండి" జయా బ్రతిమాలాడుతున్నట్టు చెప్పటంతో డాక్టర్ యామినితో మాట్లాడటం మొదలు పెట్టాడు.
కూతురు వెనుకే వచ్చిన సరోజ, అక్కడ జయ ఉండటం చూసి కోపంతో బయటే నిలబడిపోయింది...లోపల మాట్లాడుకుంటున్న మాటలు బలంగా వినబడ్డాయి. జయ మాట్లాడుతున్న ఒక్కొక్క మాట ముళ్ళ కొరడాగా మారి ఆమె హృదయ్యాన్ని తాకింది.
“పుట్టిన కొన్ని గంటల నుండి, ఇదిగో ఈ రోజు ప్రొద్దున వరకు ఈ చిన్న పిల్లను ఎంత అవమానించాను, ఆమె పుట్టుక గురించి ఎన్ని మాటలు అన్నాను, అమ్మమ్మా అనే ఒక పిలుపును కూడా సహించుకోలేక నా మాటలతో ఎంత వధించాను!
ఆమె నా మాంగల్యాన్ని కాపడటానికి...తన ప్రాణమైనా ఇస్తానంటోందే! అయ్యో...ఎంత గొప్ప మనసు కలిగున్నదో! కానీ, నేను...? ఛ ఛ..." మొట్టమొదటి సారిగా తన మీద తనకే విరక్తి కలిగింది.
జయా మీద జాలి, గౌరవం వచ్చింది. లోపల యామినిని, డాక్టర్నూ తన చాకచక్య మాటలతో మొండిగా నిలబడి ఆమోదించేటట్టు చేసింది జయ. మరు క్షణమే అన్ని పరిశోధనలూ ప్రారంభించటంతో, డాక్టర్ గది నుండి మౌనంగా బయటకు వచ్చింది యామిని.
ఆమె మనసు ఎక్కువగా నలిగిపోయుంది. దాని కంటే జయను తలచుకుంటే ఆశ్చర్యం ఎక్కువైంది. సదా ఎల్లప్పుడూ తేలు లాగా తన మాటలతో కాటువేసే తన తల్లి మాంగల్యం కాపాడటం కోసం...తన కిడ్నీని ఇవ్వటానికి ఎంతో సరళంగా ముందుకు వచ్చింది. ఇలాంటి మనసు ఎలా వచ్చింది?
"జయ నా కూతురు. నా పెంపకంలో పెరిగింది. నేను బాగానే పెంచాను"--మనసు గర్వపడగా, కళ్ళల్లో నీళ్ళు ఉబికినై.
"యామినీ...!" తల్లి పిలిచిన తరువాతే తల్లి అక్కడున్నది జ్ఞాపకానికి వచ్చంది యామినీకి.
"అమ్మా...నువ్వు ఇక్కడే ఉన్నావా? లోపల నా కూతురు మాట్లాడింది విన్నావా?"
"విన్నానమ్మా! ఈ పాపాత్మురాలికి నీ బిడ్డ వేసిన బిచ్చం సాధారణ బిచ్చం కాదమ్మా. మాంగల్య బిచ్చం. నా కఠంలో ప్రాణం ఉన్నంతవరకూ దీన్ని మర్చిపోను. నన్ను క్షమించు యామినీ. జయ ను ఎన్ని సార్లు విధిలించి పారేశాను. కానీ...నా పిల్లలు చేయలేని పనిని అది చేస్తోందే! అది చాలా గొప్పది. నేనే మరీ దిగజారిపోయాను"
”అమ్మా...అలాగంతా మాట్లాడకు.ఇప్పుడైనా నా కూతుర్ను మీ మనుమరాలుగా అంగీకరిస్తారా?”
"ఖచ్చితంగా"
"అయితే నాతో రండి. జయతో మాట్లాడండి. అది చాలా సంతోష పడుతుంది..."
"ఇప్పుడొద్దు యామినీ"
"ఎందుకమ్మా?"
"దాని మొహం చూసి మాట్లాడటానికే నాకు సిగ్గుగా ఉంది… ఎందుకంటే దాని దగ్గర నేను
మరీ దిగజారి నడుచుకున్నాను...అందుకని..."
"అదంతా అప్పుడే మరిచిపోయుంటుందిలే అమ్మా"
“కానీ నా మనసు వొప్పుకోవట్లేదే! మొదట దానికి పరిశోధనలు అయిపోనీ. తరువాత ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడుతా. ఇప్పుడు నాన్న వార్డులో ఒంటరిగా ఉంటారు. నేను వెళ్ళనా?"......
"సరేనమ్మా"
"నువ్వు జయాతో ఉండి దాన్ని చూసుకో. జాగ్రత్త!" అని చెప్పి నడిచి వెడుతున్న తల్లిని తృప్తిగా చూసింది యామిని. 'జయా తన విశాల హౄదయంతో అమ్మమ్మ మనసును గెలుచుకుంది’ అని యామిని మనసు కుతూహల పడ్డది. కానీ, పుట్టుకతో వచ్చిన గుణం అంత శులభంగా మారిపోదు అనే విషయాన్ని త్వరలోనే గ్రహించింది యామిని.
Continued...PART-12
**********************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి