22, మే 2021, శనివారం

ప్రేమ ఎంత కఠినమో!…(పూర్తి నవల)

 

                                                                              ప్రేమ ఎంత కఠినమో!                                                                                                                                                                     (పూర్తి నవల)

ప్రేమ ఎన్నో రూపాల్లో అభివ్యక్తం అవుతుంది. చాలామందికి, ఈ ప్రపంచంలో ప్రేమ అంటే ఒక మ్యూచువల్ బెనిఫిట్ స్కీమ్ లాంటిది. ప్రజలకి, ఎన్నో రకాల అవసరాలుంటాయి. శారీరికం, మానసికం, భావపరమైనవి, సామాజికం, ఆర్ధికపరమైనవి ఇలా ఎన్నో రకాల అవసరాలు. 

ఈ అవసరాలన్నీ నెరవేర్చుకోవడానికి “నిన్ను ప్రేమిస్తున్నాను” - అనేది ఒక మంచి మంత్రం. ఈ మంత్రాన్ని ఎలా వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలి, ఎవరు వాడుకోవలొ తెలుసుకోవటమే కష్టం, కఠినం...కానీ తెలుసుకోగలిగితే మ్యూచువల్ బెనిఫిట్ అందుతుంది. 

అందుకున్న వారి జీవితం సాఫీగా సాగిపోతుంది.

ఈ నవలలో ఈ మంత్రాన్ని ఒక సారి విని మోసపోయిన హీరోయిన్ లత, జీవితంలో ఇక ఈ మంత్రాన్నే వినకూడదని నిర్ణయించుకుంది. 

కానీ, తన జీవిత ప్రయాణంలో ఈ మంత్రం తనకే ఎంతో అవసరం ఉన్నదని గ్రహించింది. చివరికి ఆ మంత్రాన్ని చెప్పించుకోవటానికీ, చెప్పటానికీ ఏంత కష్టపడిందో, ఎంత కఠినమైన అవమానాలను ఎదుర్కోవలసి వచ్చిందో ఈ నవల చదివి తెలుసుకోండి.

 నవలలో ఎన్నో టర్నింగ్ పాయింట్స్, ఎమోషనల్ సీక్వెన్స్ మిమ్మల్ని అలరిస్తుంది...నవలను డౌన్ లోడ్ చేసుకుని ఖాలీ దొరికినప్పుడల్లా చదువుకోవటానికి ఈ క్రింద లింకు క్లిక్ చేసి PDF ను డౌన్ లోడ్ చేసుకుని చదవండి: 

https://drive.google.com/file/d/1FhBmBQXWO9d8QGd5l2fP_3_gelkpGKx3/view?usp=sharing

మీకు సమయం ఉండి ఈ నవలను పూర్తిగా ఒకేసారి ఆన్ లైన్ లోనే చదవాలనుకుంటే ఈ క్రింది లింకును క్లిక్ చేసి చదవండి:

ప్రేమ ఎంత కఠినమో!...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2.

************************************************************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి